అపొస్తలుల కార్యాలు

26/59

25—థెస్సలొనీకయులకు ఉత్తరాలు

కొరింథులో పౌలు తాత్కాలిక నివాస కొలంలో సీల తిమోతిలు మాసిదోనియ నుంచి రావటం పౌలుకి ఉత్సాహానందాలు కలిగించింది. ఆ సువార్త సేవకులు మొదటిసారిగా థెస్సలొనీకను సందర్శించిన తరుణంలో సత్యాన్ని అంగీకరించిన వారి “విశ్వాసమును గూర్చియు ప్రేమను గూర్చియు” వారు “సంతోషకరమైన సమాచారము” తెచ్చారు. శ్రమల్లోను ఆపదల్లోను దేవునికి నమ్మకంగా నిలిచిన ఈ విశ్వాసుల పట్ల పౌలు హృదయం దయ సానుభూతులతో నిండింది. వీరిని వ్యక్తిగతంగా సందర్శించాలని ఆశించాడు. కాని అప్పట్లో అది సాధ్యపడలేదు. అందుచేత వారికి ఉత్తరం రాశాడు. AATel 180.1

థెస్సలొనీకలోని ఈ సంఘానికి రాసిన ఉత్తరంలో ఆ సభ్యుల విశ్వాసం పెరుగుదలను గూర్చిన సంతోషకరమైన వార్తను గూర్చి పౌలు దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాడు. పౌలు ఇలా రాశాడు. ” సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను ఈ విశ్వాసమును చూచి ఈ విషయములో ఆదరణ పొందితిమి. ఏలయనగా, వారు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే. మేము మీ ముఖము చూచి నా విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొను చుండగా మన దేవుని యెదుట నిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృష్ణతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?” AATel 180.2

“విశ్వాసముతో కూడిన ఈ పనిని, ప్రేమతో కూడిన ఈ ప్రయాసమును, మన ప్రభువువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో న మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్ధనల యందు ఈ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.” AATel 180.3

థెస్సలొనీకలోని అనేకులు ” విగ్రహములను విడిచి పెట్టి జీవముగల... దేవునికి దాసులు” అయ్యారు. వారు ” గొప్ప ఉపద్రవ మందు... వాక్యము” అంగీకరించారు. వారి హృదయాలు ” పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో ” నిండాయి. ప్రభువును నమ్మకంగా వెంబడించటంలో వారు ” మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి” అని పౌలు వెల్లడి చేశాడు. ఇవి వట్టి ప్రశంసలు కావు. “ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమేగాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న ఈ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.” అని రాశాడు అపొస్తలుడు. AATel 181.1

థెస్సలొనీక విశ్వాసులు నిజాయితీగల మిషనెరీలు. ” రానున్న ఉగ్రత” భయం నుంచి తమను రక్షించిన యేసుపట్ల ఉత్సాహోద్రేకాలతో వారి హృదయాలు భగభగమండాయి. క్రీస్తు కృపద్వారా వారి జీవితాల్లో అద్భుతమైన మార్పు చోటు చేసుకొంది. వారినోట ప్రకటితమైన దైవవాక్యం శక్తిమంతమై కార్యసిద్ధి పొందింది. వారు ప్రకటించిన సత్యంవల్ల ఎందరో సత్యాన్ని అంగీకరించారు. విశ్వాసుల సంఖ్య పెరిగింది. AATel 181.2

థెస్సలొనీకయుల మధ్య తన సేవావిధానాన్ని గూర్చి పౌలు ప్రస్తావించాడు. మోసంద్వారా లేక కపటం ద్వారా విశ్వాసుల్ని సంపాదించటానికి తాను ప్రయత్నించ లేదని పౌలు వెల్లడించాడు. “ఈ రెరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనా పేక్షను కప్పి పెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి, మరియు మేము క్రీస్తు యొక్క అపొస్తలులమైయున్నందున అధికారము చేయుటకు సమర్ధులమైయున్నను, మీ వలననే గాని యితరుల వలననేగాని, మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహుప్రియులైయుంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములు కూడ మీకిచ్చుటకు సిద్ధపడి యుంటిమి.” AATel 181.3

“ఆ హేతువు చేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.” ” ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను ఆతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరేగదా! నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు. AATel 181.4

తన మొదటి ఉత్తరంలో, మరణించిన వారి యథార్థ స్థితిని గూర్చి థెస్సలొనీక విశ్వాసులకు ఉపదేశించటానికి పౌలు ప్రయత్నించాడు. మరణించే వారిని నిద్రించే వారిగా, ఏమి ఎరుగని స్థితిలో ఉన్నవారిగా పౌలు ప్రస్తావించాడు. “సహోదరులారా, నిరీక్షణలేని యితరులనలే మారు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును... ఆర్బాటముతోను, ప్రధాన మాత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైనవారు మొదటలేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీదకొని పొబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.” AATel 182.1

జీవించి ఉన్న నమ్మకస్తులైన విశ్వాసుల్ని అమర్త్యులుగా మార్చి తనతో ఉండటానికి తీసుకువెళ్లేందుకు క్రీస్తు వస్తున్నాడన్న అభిప్రాయాన్ని థెస్సలొనీకయులు ఆ సక్తితో అంగీకరించారు. తమ సన్నిహితులు మరణించి, క్రీస్తు రాకడ సమయంలో అందుకొనేందుకు తాము ఎదురుచూస్తున్న ఈవిని పోగొట్టుకొంటారేమోనన్న భయంతో వారిని భద్రంగా కాపాడారు. అయినా ఒకరి వెనక ఒకరుగా వారి ఆపులు కాలంచేశారు. భవిష్యత్ జీవితంలో వారిని కలుసుకోగలం అన్న నిరీక్షణ లేకుండా థెస్సలొనీకయులు వేదనతో తమ ఆత్మీయుల్ని ఆఖరిసారిగా చూసుకొటం జరిగేది. AATel 182.2

పౌలు రాసిన పత్రిక మరణించినవారి వాస్తవ పరిస్థితిని వివరించటం ద్వారా సంఘానికి అమితానందాన్ని ఓదార్పును అందించింది. క్రీస్తు వచ్చే సమయంలో మరణించిన భక్తుల కంటే జీవించి ఉన్న భక్తులు ముందుగా ఆయనను కలుసుకొనేందుకు వెళ్లరని పౌలు సూచించాడు. ప్రధాన దూత శబ్దం దేవుని బూర మరణ నిద్రలో ఉన్నవారికి వినిపిస్తాయి. అంతట క్రీస్తు విశ్వాసంలో నిద్రించినవారు ముందులేస్తారు. ఆ తర్వాతనే జీవించి ఉన్న భక్తులు అమర్త్యతను పొందుతారు. “ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.” AATel 182.3

థెస్సలొనీక లోని చిన్నారి సంఘానికి ఈ నిశ్చయత వలన కలిగిన నిరీక్షణ ఉత్సాహాలు బహు గొప్పవి. గతంలో ఈ విషయాల్ని వారికి పౌలు బోధించాడు. కాకపోతే అప్పుడు వారి మనసులు విచిత్రమైన నూతన సిద్ధాంతాల్ని గ్రహించటానికి ప్రయాస పడుండటంతో కొన్ని సంగతుల ప్రాధాన్యాన్ని వారు గుర్తించలేకపోయారు. కాని సత్యం పట్ల వారికి అమితాసక్తి ఉంది. పౌలురాసిన పత్రిక నూతన ఆశాభావాన్ని నూతన శక్తిని వారికిచ్చింది. ఎవరి మరణం తమకు జీవాన్ని అమర్త్యతను ప్రసాదించిందిందో ఆ ప్రభువుపై వారి విశ్వాసాన్ని ప్రేమను పటిష్టం చేసింది. AATel 182.4

యేసును విశ్వసించిన తమ మిత్రులు నిరంతరం దేవుని రాజ్యంలో నివసించటానికి సమాధినుంచి పునరుత్థానం పొందుతారన్న జ్ఞానాన్ని కలిగి ఇప్పుడు వారు ఆనందించారు. మృతుల సమాధులచుట్టూ ముసురుతున్న చీకట్లు విడిపోయాయి. క్రైస్తవ విశ్వాసం నూతనోత్తేజాన్ని సంతరించుకొంది. క్రీస్తు జీవితం మరణం పునరుత్థానంలో వారు నూతన మహిమను వీక్షించారు. AATel 183.1

“అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును” అని పౌలురాశాడు. మరణించినవారిని పరలోకం నుంచి క్రీస్తు తీసుకువస్తాడని అనేకులు దీనికి భాష్యం చెబుతారు. అయితే మరణం నుంచి క్రీస్తును లేపినరీతిగానే నిద్రిస్తున్న భక్తుల్ని తమ సమాధుల్లో నుంచి లేపి వారిని పరలోకానికి దేవుడు తీసుకు వెళ్తాడన్నది పౌలు ఉద్దేశం. ఎంత గొప్ప ఆదరణ! ఎంత మహిమకరమైన నిరీక్షణ! థెస్సలొనీక సంఘానికే కాదు, క్రైస్తవులు ఎక్కడున్నా వారందరికీ ఇది ఆదరణ, నిరీక్షణల్ని కలుగజేస్తుంది. AATel 183.2

తాను థెస్సలొనీకలో సేవచేసిన కొలంలో అంత్యకాలాన్ని తెలిపే సూచనల్ని గురించి పౌలు కూలంకషంగా బోధించాడు. మనుష్య కుమారుని ప్రత్యక్షతకు ముందు ఏఏ ఘటనలు చోటుచేసుకొంటాయో వివరించాడు. అందుచేత ఈ అంశం పై ఎక్కువగా రాయలేదు. కాని లోగడ తాను బోధించిన విషయాల్సి పరిశీలించాల్సింగా గుచ్చిగుచ్చి చెప్పాడు. ” ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఏలాగువచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగ తెలియును. లోకులు - నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవము వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థంచును” అన్నాడు. AATel 183.3

తన రాకను గూర్చి హెచ్చరించేందుకు క్రీస్తు ఇచ్చిన నిదర్శనాల్ని విస్మరించేవారు ఈ నాడు లోకంలో ఎందరో ఉన్నారు. లోకాంతాన్ని సూచించే గుర్తులు ఎన్నో సంభవిస్తూ ఉన్న తరుణంలోనే మనుష కుమారుడు మేఘారూడుడై ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమయ్యిందన్న సూచనలు త్వరితగతిని నెరవేర్తున్న సమయంలోనే తమ భయాందోళనల్ని అణచుకోటానికి వారు ప్రయత్నిస్తారు. క్రీస్తు రెండో రాకకుముందు సంభవించే సూచనల్ని పట్టించుకోకపోవటం పాపమని పౌలు అంటుంన్నాడు. ఈ నిర్లక్ష్యానికి పాల్చడే వారిని చీకటి సంబంధమైనవారిగా అభివర్ణిస్తున్నాడు. మెలకువకలిగి జాగ్రత్తగా ఉన్న వారిని ఈ మాటలతో ఉత్సాహపర్చుతున్నాడు: “సహోదరులారా, ఆదినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. వారందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు, మనము రాత్రి వారముకాము, చీకటివారము కాము కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.” AATel 183.4

ఈ అంశంపై అపొస్తలుడు పౌలు బోధనలు మనకాలంలోని సంఘానికి అత్యంత ప్రాముఖ్యాలు. రక్షణ మహాకార్యం సిద్ధించనున్న సమయానికి ఎంతో దగ్గరలో నివసిస్తున్నవారికి పౌలు చెబుతున్న ఈ మాటలు మహాశక్తితో కూడిన మాటలు: ” మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమైయుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెనుగాని ఉగ్రత పొందుటకు నియమింపలేదు. మనము మేలుకొని యున్నను నిద్రపోవుచున్నను తనతో కూడ జీవించునిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. AATel 184.1

క్రియాశీల క్రైస్తవుడే మేల్కొని ఉన్న క్రైస్తవుడు! సువార్త పురోగతికి అతడు శాయశక్తుల కృషిచేస్తాడు. రక్షకుని పట్ల అతని ప్రేమ పెరిగే కొద్దీ సహోదరులపట్ల అతని ప్రేమ అధికమౌతుంది. తన రక్షకుడిలా అతను తీవ్రశ్రమలకు గురి అవుతాడు. అయితే ఆ శ్రమలు అతని సేవాస్ఫూర్తిని పాడుచేయలేవు; అతని మనశ్శాంతిని నాశనం చెయ్యలేవు. శ్రమల్ని సవ్యంగా భరించినట్లయితే అవి తనను శుద్ధిచేసి మెరుగుపర్చి క్రీస్తుతో సన్నిహిత సంబంధాన్ని నెలకొల్పుతాయని అతను గుర్తిస్తాడు. క్రీస్తు శ్రమల్లో పాలుపొందేవారు ఆయన ఆదరణలోను అంతిమంగా ఆయన మహిమలోను పాలుపంచుకొనేవారవుతారు. AATel 184.2

థెస్సలొనీకయులకు రాసిన ఉత్తరంలో పౌలు ఇంకా ఇలా అంటున్నాడు, “మరియు సహోదరులారా, మీతో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టివారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకొనవలెనని వేడుకొనుచున్నాము.” AATel 184.3

వింత అభిప్రాయాలు సిద్ధాంతాలతో తమ మధ్యకు వచ్చి హైరానా పెట్టటాన్ని థెస్సలొనీక విశ్వాసులు నిరసించారు. కొందరు “ఏ పనియుచేయక..... అక్రమముగా నడుచుకొనుచున్నారు.” సంఘం క్రమబద్ధంగా ఏర్పాటయ్యింది. బోధకులుగాను సంఘ పరిచారకులుగాను అధికారులు నియుక్తులయ్యారు. అయితే సంఘబాధ్యతలు వహించేవారికి లోబడని అహంకారులు ఆవేశపరులు కొందరున్నారు. సొంత తీర్మానాలు తీసుకొటానికే గాక వాటిని బహిరంగంగా సంఘంలో ప్రబోధించటానికి తమకు హక్కున్నదని వారు వాదించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే సంఘంలో అధికార హోదాలకు ఎన్నికైన వారిపట్ల గౌరవాదరాలు చూపించాల్సిందిగా థెస్సలొనీకయులకు పౌలు హితవుపలికాడు. AATel 184.4

థెస్సలొనీక లోని విశ్వాసులు దేవుని భయభక్తుల్లో నడుచుకోవాలన్న ఉద్దేశంతో వారు తమ దినదిన జీవితాల్లో ఆచరణాత్మకమైన దైవభక్తి ప్రదర్శించాలని అపొస్తులుడు వారికి విజ్ఞప్తి చేశాడు. పౌలు ఇలా రాశాడు, ” కాగా మిరేలాగు నడుచుకొని దేవుని సంతోషిపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మారు నడుచుకొనుచున్నారు. ఈ విషయములలో మీరు అంత కంత కు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.” ” పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.” AATel 185.1

తన సేవద్వారా యేసును విశ్వసించినవారి ఆధ్యాత్మిక సంక్షేమానికి చాలామట్టుకు తానే బాధ్యుణ్నని పౌలు భావించాడు. వారి విషయంలో పౌలుకి ఒకే ఒక కోరిక వారు నిజమైన ఒకే ఒక దేవున్ని గూర్చిన ఆయన పంపిన యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానంలో దినదినాభివృద్ధి చెందాలన్నదే. యేసును విశ్వసించిన చిన్నచిన్న బృందాల్ని తరచు కలుసుకొని వారితో కలిసి తనతో తమకు సజీవ సంబంధం నెలకొల్పవలసిందిగా దేవునికి ప్రార్థన చేసేవాడు. ఇతరులకు సువార్త సత్యాన్ని అందించటానికి ఉత్తమ పద్దతులేమిటని తరచువారి సలహాలు సూచనల్ని కోరేవాడు. తాను ఎవరిమధ్య సువార్త సేవ చేస్తున్నాడో వారిని విడిచి వెళ్లినప్పుడు వారిని దుష్టిని నుంచి కాపాడి నమ్మకమైన మిషనెరీలుగా పనిచెయ్యటానికి వారికి దోహదం చెయ్యవలసిందిగా తరచు ప్రార్థించేవాడు. AATel 185.2

దేవునిపట్ల మానవులపట్ల ప్రేమకలిగి నివసించటమే యధార్థ పరివర్తనకు బలమైన నిదర్శనం. యేసును తమ విమోచకుడుగా స్వీకరించేవారు తమలాంటి విశ్వాసుల్ని వాస్తవంగా గాఢంగా ప్రేమిస్తారు. థెస్సలోనిక లోని విశ్వాసులు అలాంటివారు. పౌలు ఇలా రాస్తున్నాడు “సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవునిచేతనే నేర్పెబడితిరి. అలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులను మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియెక్కువగా అభివృద్ధిచెందు చుండవలెననియు, సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక, మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును నా చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.” AATel 185.3

“మరియు మన ప్రభువైన యేసు తనపరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీ యెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్దిల్లుచున్నామో, అలాగే మీరును ఒకనియెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక.” AATel 186.1

“సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా - అక్రమముగా నడుచుకొనువారికి బుద్ది చెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారైయుండుడి. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడు సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు ఈ విషయములో దేవుని చిత్తము.” AATel 186.2

ప్రవచనవరాన్ని తృణీకరించకూడదని పౌలు థెస్సలొనీకయుల్ని హెచ్చరించాడు. “ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి” అన్నమాటల్లో నిజానిజాలు గుర్తించి వ్యవహరించాల్సిందిగా వారిని అదేశించాడు. “ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి” అని వారికి విజ్ఞప్తి చేశాడు. దేవుడు వారిని సంపూర్తిగా పరిశుద్ధపర్చాల్సిందని వారి “ఆత్మయు, జీవమును శరీరమును నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు” కాపాడవలసిందనీ అర్ధిస్తున్న ప్రార్థనతో పౌలు తన ఉత్తరాన్ని ముగించాడు. “మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును” అన్నాడు. AATel 186.3

క్రీస్తు రెండో రాకను గూర్చి పౌలు తన మొదటి పత్రికలో థెస్సలొనీకయులకు పంపిన ఉపదేశం తాను క్రితంలో చేసిన బోధలకు అనుగుణంగా ఉన్నది. అయినా థెస్సలొనీక లోని కొందరు సహోదరులు పౌలుమాటల్ని అపార్థం చేసుకొన్నారు. రక్షకుని రాక వరకు తాను జీవించి ఉంటానన్ని నిరీక్షణను పౌలు వెలిబుచ్చినట్లు వారు అర్థంచేసుకొన్నారు. ఈ విశ్వాసం వారి ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని సమధికం చేసింది. గతంలో తమ బాధ్యతల్ని అశ్రద్ధచేసినవారు ఇప్పుడు తమ తప్పుడు అభిప్రాయల్ని ప్రచురించుటంలో ఇంకా పట్టుదలగా పనిచేశారు. తన బోధనపై థెస్సలొనీకయుల్లో ఏర్పడ్డ తప్పుడు అవగాహనను సరిదిద్ది తన వాస్తవికాభిప్రాయాన్ని వారి ముందుంచటానికి పౌలు ప్రయత్నించాడు. వారి భక్తి ప్రపత్తుల పట్ల తన విశ్వాసాన్ని మరోసారి వ్యక్తంచేశాడు. వారి విశ్వాసం పటిష్ఠంగా ఉన్నందుకు, వారి మధ్య పరస్పర ప్రేమానురాగాలు ప్రబలుతున్నందుకు, ప్రభువు సేవ విషయంలో వారి శ్రద్ధాసక్తుల నిమిత్తం ప్రగాడ కృతజ్ఞతలు వెలిబుచ్చాడు. హింసను తీవ్ర శ్రమల్ని దీనతతో సహించగల సహనశీలానికి దృఢ విశ్వాసానికి ఆదర్శంగా తమను ఇతర సంఘాలకు సూచించానని పౌలు వారికి రాస్తూ దేవుని ప్రజలు తమ చింతలు ఆందోళనల నుంచి విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్న క్రీస్తు రెండో రాకడ సమయానికి వారి గమనాన్ని తిప్పాడు. AATel 186.4

” మోహింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడు చున్నాము..... ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమ పరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్నమికు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.... అందువలన మనదేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పువ మీ యందు మన ప్రభువైన యేసు నామమును, ఆయన యందు మీరును మహిమనొందునట్లు, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతియాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడు ప్రార్ధించుచున్నాము.” AATel 187.1

ప్రవచనం ముందే చెప్పిన రీతిగా క్రీస్తు రాకకు ముందు మత ప్రపంచంలో ప్రాముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకోవలసి ఉన్నాయి. అపొస్తలుడిలా అంటున్నాడు, “మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు, చెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు మనము ఆయన యొద్దకూడుకొని యుండుటనుబట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలు పడితేనేగాని ఆ దినమురాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్నుకనపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగా నైనను మిమ్మును మోసపరచనియ్యకుడి.” AATel 187.2

పౌలు మాటలకు అపార్థం చెప్పకూడదు. క్రీస్తు వెంటనే వస్తున్నాడని ప్రత్యేక దర్శనంవల్ల తెలుసుకొని పౌలు థెస్సలొనీకయుల్ని హెచ్చరించాడని బోధించకూడదు. అది విశ్వాస సంబంధమైన గందరగోళం సృష్టిస్తుంది. ఎందుకంటే తరచు ఆశాభంగం అవిశ్వాసానికి దారితీస్తుంది. తాను అలాంటి వర్తమానాన్ని వారికివ్వలేదని సహోదరులకు పౌలు స్పష్టంచేశాడు. ప్రవక్త దానియేలు ఎంతో స్పష్టంగా వర్ణించిన పోపుల అధికారం ప్రారంభంకావటం, అది దేవుని ప్రజలతో పోరాటం జరగటం జరగవలసి ఉందనిపౌలు నొక్కి చెప్పాడు. ఈ అధికారం దేవదూషణకరమైన తన దుష్కృతిని జరిగించేవరకు సంఘం ప్రభువురాకడ కోసం ఎదురుచూడటం వ్యర్థమే. ” మేమింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది నాకు జ్ఞాపకములేదా?” AATel 187.3

యధార్థ సంఘం ఎదుర్కోనున్న శ్రమలు భయంకరమైనవి. అపొస్తలుడు ఈ పత్రికరాస్తున్న తరుణంలోనే “ధర్మవిరోధ సంబంధమైన మర్మము” తన పనిని ప్రారంభించింది. భవిష్యత్తులో జరిగే పరిణామాలు ” నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్వవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వానిరాక అబద్ద విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచక క్రియలతోను చమత్కార కార్యములతోను ” కూడుకొని ఉంటాయి. AATel 188.1

ముఖ్యంగా ” సత్యమును నమ్మక” ఉన్నవారి విషయంలో పౌలు మాటలు గంభీరంగా ఉన్నాయి. సత్నాన్ని గూర్చిన వర్తమానాన్ని బాహాటంగా విసర్జించేవారిని దృష్టిలో ఉంచుకొని పౌలు ఇలా అన్నాడు, “ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై అబద్దమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. తన కృపచేత పంపించే హెచ్చరికల్ని తోసిపుచ్చే వారి నుంచి దేవుడు తన ఆత్మను ఉపసంహరించు కొంటాడు. అంతటవారు తాము ప్రేమించే మోసాలకు ఆహుతి అయిపోతారు. AATel 188.2

ఆ దుష్ట శక్తిచేసే హానికరమైన పనిని పౌలు ఇలా వివరించాడు. క్రీస్తురాకకు ముందు దీర్ఘ శతాబ్దాల పొడవునా సాగాల్సిఉన్న హింసాకాలంలో కూడా ఈ పని కొనసాగాల్సి ఉంది. థెస్సలొనీకలోని విశ్వాసులు తక్షణ విమోచన కోసం ఎదురుచూశారు. ఇప్పుడు తమముందున్న పనిని ధైర్యంతోను దైవభీతితోను చేపట్టాల్సిందిగా వారికి ఉపదేశం వచ్చింది. తమ విధుల్ని నిర్లక్ష్యం చేయటంగాని లేదా క్రియాశూన్యులై వేచి ఉండటంగాని చేయకూడదని పౌలు హెచ్చరించాడు. తమ తక్షణ విమోచనను గూర్చికన్న చక్కని కలల అనంతరం తమ తమ దినదిన జీవనసరళి, తాము ఎదుర్కోవాల్సిన వ్యతిరేకత మరింత బాధాకరంగా ఉంటుంది. కనుక తమ విశ్వాసం విషయంలో నమ్మకంగా ఉండాల్సిందిగా వారిని ఉద్రేకపర్చాడు. AATel 188.3

“కాబట్టి సహోదరులారా! నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మాసృ్కయల వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యము ఆదరణయు, శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, నా హృదయములను ఆదరించి, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక.” “అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించువాటిని వారు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్ముగూర్చి నమ్మకము కలిగియున్నాము. దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు నా హృదయములను ప్రేరేపించునుగాక.” AATel 188.4

విశ్వాసులకు తమ కర్తవ్యాన్ని దేవుడి నియమించాడు. సత్యాన్ని నమ్మకంగా ఆచరించటం ద్వారా వారు తాము పొందిన సత్యకాంతిని ఇతరులకు చూపించాలి. అలు పెరుగకుండా పరోపకారం చేయాల్సిందిగా అర్థిస్తూ, జీవనోపాధి సాధనకు కష్టపడి పనిచేస్తూనే దైవ సేవను ఉద్రేకంతో నిర్వహించిన స్వీయ ఉదంతాన్ని పౌలు వారికి వెల్లడిచేశాడు. సోమరితనానికి, అర్ధం పర్ధంలేని ఉద్రేకానికి బానిసలైనవారిని మందలిస్తూ, “నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెనని” వారికి సూచించాడు. దైవ సేవకుల ఉపదేశాన్ని సర్వదా నిర్లక్ష్యంచేసే వ్యక్తులతో సహవాసానికి సంఘం దూరంగా ఉండాలని ఆదేశించాడు కూడా “అయినను అతనిని శత్రువుగా భావించక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి” అన్నాడు. AATel 189.1

జీవితంలో ఎదురయ్యే శ్రమలు దు:ఖాల నడుమ దేవుని సమాధానం ప్రభువైన యేసు క్రీస్తు కృపవారికి ఆదరణ ఆసరా అందించాలి అన్న ప్రార్థనతో పౌలు ఈ పత్రికను కూడా ముగించాడు. AATel 189.2