అపొస్తలుల కార్యాలు

11/59

10—ప్రథమ క్రైస్తవ హతసాక్షి

పరిచారకులలో ప్రథముడైన సైఫను దైవ భక్తిపరుడు, విశ్వాసపూర్ణుడు, జన్మతః యూదుడైనా గ్రీకు భాష వచ్చినవాడు. గ్రీకుల ఆచారాలు మట్టు మర్యాదలు ఎరిగినవాడు. కనుక సైఫను గ్రీకు యూదుల సమాజమందిరాల్లో సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. క్రీస్తు సేవలో అతడు చురుకుగా పనిచేస్తూ ఆయనపై తన విశ్వాసాన్ని నిర్భయంగా ప్రకటించాడు. అతని పై సులభంగా విజయం సాధించవచ్చునన్న అభిప్రాయంతో రబ్బీలు ధర్మశాస్త్ర కోవిదులు అతనితో బహిరంగ చర్చకు దిగారు. కాని “మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.” అతను పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడటమేగాక ప్రవచనాలు పఠించిన విద్యార్తి అని ధర్మశాస్త్ర విషయాలు బాగా తెలిసినవాడని స్పష్టమయ్యింది. తాను బోధిస్తున్న సత్యాల్ని సమర్థంగా సమర్థించి సైఫను తన ప్రత్యర్థుల్ని ఓడించాడు. “కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని నా మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కులను జ్ఞానమును మీకు అనుగ్రహింతును.” లూకా 21:14,15. AATel 70.1

సైఫను బోధలోని శక్తిని చూసి యాజకులు అధికారులు కోపోద్రిక్తులయ్యారు. అతను అందిస్తున్న సత్యాన్ని అంగీకరించే బదులు అతన్ని హతమార్చాలని తీర్మానించుకొన్నారు. యూదులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని రోమా ఆధికారులను లంచాలతో వశపర్చుకొని తమ జాతీయాచారాన్ని అనుసరించి ఖైదీల్ని అపరాధులుగా తీర్చి హతమార్చిన సందర్భాలెన్నోవున్నాయి. తమకేహానీ లేకుండా అదే మార్గాన్ని అనుసరించాలని స్తెఫను ప్రత్యర్థులు కృతనిశ్చయులై ఉన్నారు. పర్యవసానాల్ని లెక్కచేయకుండా సైఫన్ను బందించి సన్ హెడ్రైన్ సభముందు విచారణకు నిలబెట్టారు. AATel 70.2

ఖైదీ వాదనల్ని తిప్పికొట్టడానికి చుట్టుపక్కల దేశాలనుంచి ప్రజ్ఞావంతులైన యూదుల్ని తీసుకువచ్చారు. తార్సువాడైన పౌలు కూడా అక్కడున్నాడు. సైఫనుకు వ్యతిరేకంగా ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. సైఫను మోసకరమైన అపాయకరమైన సిద్ధాంతాలు బోధిస్తున్నాడని ప్రజల్ని నమ్మించడానికి పౌలు తన వాగ్దాటిని తర్కచాతుర్యాన్ని వినియోగించుకొన్నాడు. అయితే స్తెఫనులో సువార్తను ప్రజలకు ప్రకటించాలన్న దైవ సంకల్పాన్ని పూర్తిగా అవగాహన చేసుకొన్న వ్యక్తిని పౌలు చూశాడు. AATel 70.3

సైఫను ప్రదర్శించిన స్పష్టమైన విశ్చలమైన జ్ఞానాన్ని యాజకులు అధికారులు ప్రతిఘటించలేకపోయారు కాబట్టి వారు సైఫనుని ఒక గుణపాఠంగా చేయాలని నిశ్చయించుకొన్నారు. రగులుతున్న తమ ద్వేషాన్ని కక్షసాధించడం ద్వారా చల్లార్చుకోడంతో పాటు బెదురు పెట్టడం ద్వారా ఇతరులు స్తెఫను విశ్వాసాన్ని అనుసరించకుండా చేయాలని వారు భావించారు. దేవాలయం గురించి ధర్మశాస్త్రం గురించి ఆలయం మీద ధర్మశాస్త్రం మీద సైఫను దూషణ వాక్యాలు పలకడం తాము విన్నామని చెప్పడానికి లంచమిచ్చి తప్పుడు సాక్షుల్ని తెచ్చారు. ” ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా వేము వింటిమి” అని ఈ అబద్ధ సాక్షులు చెప్పారు. AATel 71.1

దూషణ వాక్యాల అభియోగానికి జవాబు చెప్పడానికి న్యాయాధిపతుల ముందుకు సైఫను నిలబడ్డప్పుడు అతని ముఖం పై పరిశుద్ధత ప్రకాశించింది. “సభలో కూర్చున్నవారందరు అతని వైపు చేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.” ఈ ప్రకాశాన్ని చూసిన అనేకమంది వణుకుతూ ముఖాలు కప్పుకొన్నారు. కాని అధికారుల అవిశ్వాసం దురాభిప్రాయం ఏ మాత్రం సడలలేదు. AATel 71.2

తన మీద ఉన్న ఆరోపణలు నిజమా అని ప్రశ్నించినప్పుడు తన చక్కని స్వరంతో తన సమాధానం మొదలు పెట్టాడు సైఫను. ఆ స్వరం సభాస్థలమంతా స్పష్టంగా వినిపించింది. సభను ఆశ్చర్యపర్చేమాటల్లో దైవప్రజల చరిత్రను సింహాలోకనం చేశాడు. యూదుల వ్యవస్థను గురించి ఆ వ్యవస్థ విషయంలో క్రీస్తు ద్వారా ఇప్పుడు మనకున్న అవగాహన గురించి తనకున్న జ్ఞానమెంత అపారమో కనపర్చాడు. మెస్సీయాను గూర్చి మోషే ప్రవచించిన మాటల్సి ఉటంకించాడు: “నావంటి యొక ప్రవక్తను దేవుడు నా సహోదరులలో మీకు పుట్టించును.” దేవునిపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. యూదులు నమ్ముకొన్న ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజల్ని విగ్రహారాధన నుంచి కాపాడలేకపోయిందని పలికాడు. యూదు చరిత్రతో క్రీస్తు సంబంధాన్ని స్పష్టంగా చూపించాడు. సొలొమోను ఆలయం కట్టడాన్ని ప్రస్తావించాడు. సొలొమోను మాటలు యెషయా మాటల్ని కూడా ప్రస్తావించాడు: “ఆకాశము నా సింహాసము భూమి నాపాడి పీఠము మీరు నాకు ఏలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా?” AATel 71.3

స్తెఫను ఈ అంశానికి వచ్చినప్పుడు ప్రజల్లో గందరగోళం బయలుదేరింది. ప్రవచనాలు క్రీస్తును గురించి చెబుతున్నాయని చెప్పినప్పుడు దేవాలయం గురించి స్తెఫను ఆ విధంగా మాట్లాడినప్పుడు తీవ్ర విభ్రాంతి చెందినట్లు నటిస్తూ ప్రధాన యాజకుడు తన అంగీ చింపుకొన్నాడు. తన స్వరం త్వరలో మూగపోతుందని చెప్పడానికి ఈ క్రియ ఒక సూచన. తన మాటలకు ఎదురైన వ్యతిరేకతను గుర్తించి సైఫను తన చివరి సాక్ష్యం ఇస్తున్నానని గ్రహించాడు. తన ప్రసంగం ముగించకుండానే అర్థాంతరంగా ఆపేశాడు. AATel 72.1

తాను చెపుతున్న చరిత్రను హఠాత్తుగా ఆపుచేసి కోపావేశాలతో నిండిన తీర్పరుల వంక చూస్తూ గొంతెత్తి అతను ఇలా అన్నాడు: ” ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్ఫప్పుడు పరిశుద్దాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి.” AATel 72.2

ఇది విన్న ప్రధాన యాజకులు అధికారులు ఆగ్రహంతో తమ్మును తాము మర్చిపోయారు. జంతువులల్లే ప్రవర్తిస్తూ పళ్లు నూరుతూ సైఫను మీదకి తోసుకు వెళ్లారు. తనకు సంభవించనున్నదేంటో తన చుట్టూ మూగిన ముఖాల్లో ఈ ఖైదీ గుర్తించాడు. అయినా అతని స్థయిర్యం సడలలేదు. మరణిస్తానన్న భయం అతనికి అసలేలేదు. తన ముందున్న దృశ్యం ఇక అతనికి కనిపించలేదు. పరలోకం ద్వారాల తెరుచుకొన్నాయి. మహిమతో నిండిన దేవుని ఆవరణం చూశాడు. తనను ఆదుకోడానికి క్రీస్తు తన సింహాసనం నుంచి అప్పుడే లేచి నిలబడివున్నట్లు చూశాడు. అప్పుడు “ఆకాశము తెరువబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్మ్యమందు నిలిచియుండుటయు చూచుచున్నాను” అని విజయోత్సాహంతో కేకవేశాడు సైఫను. AATel 72.3

తాను చూస్తున్న మహిమాన్విత దృశ్యాన్ని అతను వర్ణిస్తున్నప్పుడు అతన్ని హింసిస్తున్నవారు సహించలేకపోయారు. ఆ మాటలు వినిపించకుండా చెవులు మూసుకొని పెద్ద కేకలు వేస్తూ దొమ్మిగా సైఫను విదపడి అతన్ని ‘పట్టణపు వెలుపలికి వెళ్ళగొట్టిరి.” “ప్రభువును గూర్చి మొర పెట్టుచు • యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని సైఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని - ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను.” AATel 72.4

సైఫను మరణం చట్టం విధించిందికాదు. పెద్దమొత్తం లంచంపట్టి రోమా అధికార్లు ఆ కేసును దర్యాప్తు చేయలేదు. AATel 72.5

సైఫను హతసాక్ష్యం, చూసిన వారిని ఎంతో ప్రభావితం చేసింది. అతని ముఖం మీద దేవుని ఆమోదముద్ర; విన్నవారి ఆత్మల్ని కుదిపివేసిన అతని మాటలు చూపరుల మనుసుల్లో నిలిచిపోయి అతను ప్రకటిస్తున్న విషయం వాస్తవమైనదని సాక్ష్యమిచ్చాయి. అతని మరణం సంఘానికి కఠిన పరీక్ష అయితే దాని ఫలితంగా సౌలులో మార్పు కలిగింది. హతసాక్షి సైఫను విశ్వాసాన్ని, అచంచల భక్తిని, అతని ముఖంపై ప్రకాశించిన మహిమను మనసులోనుంచి తీసివేసుకోలేకపోయాడు. AATel 73.1

సైఫను విచారణ మరణం ఘటంలో సౌలు ఉన్మాదంతో కూడిన ఉద్రేకం ప్రదర్శించాడు. అనంతరం మనుషులు సైఫనుని అవమానించి కించపర్చుతున్న తరుణంలో దేవుడు అతి గొప్పగా గౌరవిస్తున్నాడన్న తన అంతర్గత నమ్మకం సౌలుకి కోపం పుట్టించింది. సౌలు దేవుని సంఘాన్ని హించించడం కొనసాగించాడు. క్రైస్తవుల్ని వెంటాడి తమ ఇళ్లలో పట్టుకొని వారిని చెరసాలలో బంధించడానికి హతమార్చడానికి యాజకులకు అధికారులకు అప్పగించాడు. హింస కొనసాగించడంలో అతని ఉద్రేకం ఉత్సాహం యెరూషలేములోని క్రైస్తవుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. క్రూరమైన ఈ చర్యను ఆపుచేయడానికి రోమా అధికారులు ప్రయత్నించకపోగా యూదుల అభిమానాన్ని పొందడానికి వారికి రహస్యంగా సహాయం చేశారు. AATel 73.2

సైఫను మరణం తర్వాత ఆ తరుణంలో తాను నిర్వహించిన పాత్రను పరిగణనలోకి తీసుకొని సౌలును సెన హెడ్రైన్ సభకు సభ్యుడిగా ఎన్నుకొన్నారు. దైవ కుమారునికి వ్యతిరేకంగా సాగుతున్న తిరుగుబాటులో కొంతకాలం సాతాను చేతుల్లో సౌలు బలమైన సాధనంగా పనిచేశాడు. అయితే అలు పెరుగని ఈ హింసకుడు ప్రస్తుతం తాను ధ్వంసం చేస్తున్న సంఘాన్ని కట్టడంలో కొద్దికాలంలోనే సాధనం కానున్నాడు. సువార్త ప్రకటించడానికీ, క్రీస్తు నిమిత్తం శ్రమలనుభవించడానికీ, క్రీస్తు రక్తం ద్వారా రక్షణ కలదన్న శుభవార్త ప్రకటించడానికి హతసాక్షి సైఫను స్థానాన్ని ఆక్రమించడానికి సాతానుకన్నా అధిక శక్తిగల దేవుడు సౌలును ఎంపికచేసుకొన్నాడు. AATel 73.3