అపొస్తలుల కార్యాలు

1/59

అపొస్తలుల కార్యాలు

తొలిపలుకు

కొత్త నిబంధనలోని అయిదోపుస్తకాన్ని పూర్వం మంచీ అపొస్తలుల కార్యాలు అని పిలవడం కద్దు. అయితే ఆ పుస్తకంలో ఎక్కడా ఈ పేరు కనిపించదు. తొలి రాతప్రతుల్లో ఒకటైన కోడెక్స్ సినైటికలో ‘ అపొస్తలుల ‘ అన్నమాట లేకుండా ‘కార్యాలు’ అని మాత్రమే ఉంది. దీనికో కారణం ఉంది. అది పన్నెండు మంది శిష్యులు చేసిన సేవలనూ, పేతురు యాకోబు యోహాను పౌలు వంటి ప్రధాన పాత్రధారుల సేవలో ముఖ్య ఘటనలనూ మించి ఉండాలన్నదే ఆ పరమోద్దేశం. AATel 4.1

అపొస్తలుల కార్యాలు ప్రియతమ వైద్యుడు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అన్యుడు అయిన లూకా సర్వసంఘానికి యూదులు అన్యులకు ఉద్దేశించి రాసిన పుస్తకం. ముప్పయి ఏళ్ల పైచిలుకు కాలవ్యవధిలోని విషయాలన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ అందులో ప్రతీ యుగంలోనూ సంఘానికి ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. పెంతెకొస్తునాడు గొప్ప శక్తితో దిగివచ్చి సువార్తను అగ్నిజ్వాలగా మార్చిన పరిశుద్దాత్మ నేడు క్రైస్తవుడి అనుభవంలోకి రావచ్చునని ఈ పుస్తకంలో దేవుడు స్పష్టంగా సూచిస్తున్నాడు. పేతురు పౌలు యోహాను యాకోబు ఇంకా ఇతరుల ద్వారా పరిశుద్ధాత్మ నిర్వహించిన కార్యాలు నేటి శిష్యుల జీవితాల్లోనూ చోటు చేసుకోవచ్చు. AATel 4.2

అపొస్తలుల కార్యాల పుస్తకం అర్ధాంతరంగా సమాస్త మవటం అనాలోచితంగా జరిగిన పనికాదు. ఆసక్తికరమైన ఈ కథనం సంపూర్తి కాలేదనీ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్న ప్రతీ తరం దానికి ముందు తరంలోని అమోఘ కార్యాల జాబితాను పొడిగిస్తూ క్రైస్తవ యుగం పొడుగునా కొనసాగుతూ ఉంటాయని అది సూచిస్తున్నది. ఈ పుస్తకం పొందుపర్చుతున్న కార్యాలు వాస్తవానికి పరిశుద్ధాత్మ కార్యాలు. ఎందు చేతనంటే అపొస్తలుల కాలంలో పరిశుద్ధాత్మే క్రైస్తవ నేతలకు సలహాదారుగా వ్యవహరించాడు. పెంతెకొస్తు నాడు ప్రార్ధిస్తున్న శిష్యులు పరిశుద్ధాత్మతో నిండి గొప్ప శక్తితో సువార్తను బోధించారు. పరిచారకులుగా ఎంపికైన ఏడుగురు మనుషులు ” ఆత్మతోను జ్ఞానముతోను” నిండిన వ్యక్తులు. అ.కా. 6: 3. పౌలు అభిషేక కార్యంలో మార్గనిర్దేశం చేయడంలో (9:17), సంఘ సహవాసంలోకి అన్యుల్ని అంగీకరించడంలో (10:44-47), మిషనేరీ సేవలో బర్నబాను పౌలును వేరుచేయడంలో (13:2-4), యెరూషవేము సభ ఏర్పాటులో (15:28) పౌలు మిషనరీ ప్రయాణాల్లో (16:6,7) మార్గదర్శకుడు పరిశుద్ధాత్మే. రోము చేతుల్లోను యూదు హింసకుల చేతుల్లోను సంఘం తీవ్ర హింసకు గురి అయిన మరో సందర్భంలో AATel 4.3

విశ్వాసుల్ని బలపర్చి వారిని తప్పుడు బోధలనుంచి పరిరక్షించింది పరిశుద్దాత్మే. అపొస్తులుల కార్యాలు ఎలెన్ జి నైట్ చివరగా రాసిన పుస్తకాల్లో ఒకటి. ఆమె మరణానికి కొద్ది సంవత్సరాలు ముందు ఈ పుస్తకం ప్రచురితమయ్యింది. బహుగ్రంథ రచయిత అయిన ఆమె కలం లిఖించిన గొప్ప గ్రంథాల్లో ఇదొకటి. దీనిలో సగటు పాఠకుడు క్రైస్తవ సాక్షానికి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కనుగొంటాడనడం వాస్తవం. ఈ గ్రంథం వర్తమానం ఆధునికం. పెంతెకొస్తు నాటికన్న అత్యధిక ఆధ్యాత్మిక శక్తి ఇరవైయ్యో శతాబ్దంలో ప్రదర్శితమౌతుందన్న రచయిత మాటలు దాని ఔచిత్యాన్ని ప్రతిబింబిస్తున్నది. సువార్త ఆరంభంలో ప్రదర్శితమైన పరిశుద్ధాత్మ శక్తి సువార్త అంతంలోనూ ప్రదర్శితం కానుంది. ఆరంభ దినాల్లో సంఘానికి కలిగిన వైభవోపేతనమైన అనుభవాల సన్నివేశాల్ని అవలోకించి పాఠకుడు ఆ అనుభూతిలో పాలు పంచుకోవాలన్నది, అపవాది మోసాల్లో పడకుండా పాఠకుణ్ని దేవుడు కాపాడాలన్నది మా ప్రార్థన. AATel 5.1

ప్రకాశకులు