అపొస్తలుల కార్యాలు

2/59

1—సంఘ సంస్థాపనలో దేవుని ఉద్దేశం

మానవుల రక్షణ నిమిత్తం దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అది సేవలకు ఏర్పాటయ్యింది. ప్రపంచానికి సువార్త అందించడం దాని కర్తవ్యం. తన సంపూర్ణత సమృద్ధత తన సంఘం ద్వారా లోకానికి ప్రకటితం కావడమన్నది అనాది నుంచి దేవుని సంకల్పం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన పిలిచిన సంఘ సభ్యులు ఆయన మహిమను కనపర్చాల్సి ఉన్నారు. సంఘం దేవుని కృపా నిధులకు కోశాగారం. చివరికి సంఘం ద్వారా “ప్రధానులకును అధికారులకును దేవుని ప్రేమ సంపూర్తిగా” ప్రదర్శితం కానున్నది. ఎఫెసీ 3:10. AATel 8.1

సంఘం గురించి లేఖనాల్లో దాఖలైఉన్న వాగ్దానాలు ఎన్నెన్నో. “నా మందిరము సమస్తజనులకు ప్రార్ధన మందిరమనబడును.” యెషయా 56:7. “వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీనెనకరముగా చేయుదును” ” మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను, అన్యజనుల వలన వారికవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతి కొరకై తోట యొకటి నేర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, నా గొబైలును నేను మేపుచున్న గొట్టెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .” యెహెజ్కేలు 34:26; 29-31. AATel 8.2

“మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు నారును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏదేవుడు నుండడు. నేను నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే రక్షించువాడను నేనే దాని గ్రహింపజేసినవాడు నేనే, యే అన్వదేవతయు మీలో నుండి యుండలేదు. నేనే దేవుడను మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు.” ” గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బందింపబడినవారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించువారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీచేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను.” యెషయా 43:10-12; 42:6, 7. AATel 8.3

“యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని- బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు. చెట్లులేని మిట్టిలన్నిటి మిద వారికి మెప్పు కలుగును. వారియందు కరుణించువాడు వారిని తోడుకొనిపోవును. నీటి బుగ్గల యెద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు. ఎండ మావులైనను ఎండయైనను వారికి తగులదు. నా పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను. నా రాజమార్గములు ఎత్తుగాచేయబడును..... AATel 9.1

“ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూఘా, సంతోషించుము. పర్వతములారా, ఆనంద ధ్వని చేయుడి. అయితే సీయోను - యెహోవా నన్ను విడిచి పెట్టియున్నాడు ప్రభువునన్ను మరచియున్నాడని అనుకొను చున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురుగాని నేను నిన్ను మరువను చూడుము నాయర చేతులమీదనే నిన్ను చెక్కియున్నాను.” యెషయా 49:8-16. AATel 9.2

సంఘం దేవుని, కోట, ఆయన ఆశ్రయపురం. తిరుగుబాటు లోకంలో ఆయన దాన్ని ఉంచుతున్నాడు. సంఘం పట్ల ద్రోహం తల పెట్టడం, మానవాళిని తన ఏకైక కుమారుడి రక్తంతో కొన్న దేవునికి ద్రోహం తల పెట్టినట్లే. ఆదినుంచి భూమిపై దేవుని సంఘం నమ్మకమైన మనుషులతో నిర్మితి అవుతూవస్తున్నది. ప్రతీ యుగంలోనూ ప్రభువుకి నమ్మకమైన సేవకులు ఉంటూ ఉన్నారు. తాము నివసించిన తరంలో ప్రభువుకి విశ్వాసపాత్రులైన సాక్షులుగా వారు నివసించారు. ఈ సత్యసాక్షులు ప్రజలకు హెచ్చరికల్ని అందించారు. ఆ యోధులు మరణించినప్పుడు వారి సేవను ఇతరులు కొనసాగించారు. ఈ సాక్షులతో దేవుడు నిబంధన బాంధవ్యం ఏర్పర్చుకొని భూమి పై ఉన్న సంఘాన్ని పరలోకంలోని సంఘంతో ఐక్యపర్చాడు. సంఘానికి సేవచేయడానికి ఆయన తన దూతల్ని పంపిస్తాడు. ఆయన ప్రజల్ని అడ్డుకోడంలో పాతాళం ద్వారాలు కూడా నిరర్ధకమవుతాయి. AATel 9.3

హింస, పోరాటం, అంధకారం ప్రబలిన శతాబ్దాల పోడుగునా దేవుడు తన సంఘాన్ని బలో పెతం చేశాడు. సంఘానికి వచ్చిన ప్రతీ ఆపదకూ దేవుడు దాన్ని సన్నద్ధం చేశాడు. తన సేవకు ప్రతికూలంగా లేచే ప్రతీశక్తినీ ఆయన ముందే చూసి సంఘాన్ని దానికి సిద్ధం చేశాడు. ఆయన ముందుగా చెప్పిన రీతిగానే సమస్తం జరుగుతున్నవి. తన సంఘాన్ని ఆయన వదిలి పెట్టిలేదు. ఏమి సంభవించనుందో ప్రవచనాల ద్వారా తెలియజేసి ఏవైతే ప్రవచించటానికి పరిశుద్ధాత్మ ప్రవక్తల్ని ఆవేశపర్చాడో వాటిని నెరవేర్చుతూవచ్చాడు. ఆయన సంకల్పించినదంతా నెరవేర్తుంది. ఆయన ధర్మశాస్త్రం ఆయన సింహాసనంతో ముడిపడి ఉంది. ఏ దుష్టశక్తి దాన్ని నాశనం చేయలేదు. సత్యం దేవుని మూలంగా కలిగింది. ఆయన కాపుదల కింద ఉంది. దాన్ని ఎలాటి వ్యతిరేకతా అడ్డుకోలేదు. AATel 10.1

ఆధ్యాత్మిక అంధకార యుగాల్లో దేవుని సంఘం కొండ మీద వెలసిన పట్టణంలా ఉంటూ వచ్చింది. యుగం తర్వాత యుగం తరం అనంతరం తరం దేవుని పవిత్ర సిద్ధాంతాలు సంఘం పొలిమేర్లలో బయలుపడూ వస్తున్నాయి. బలహీనంగాను లోపాలతోను ఉన్నట్లు కనిపించినా సంఘం పట్ల దేవుడు అమిత ఆసక్తి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. సంఘం దేవుని కృపాప్రాంగణం. హృదయాన్ని మార్చడానికి తనకున్న శక్తిని దేవుడు తన సంఘం ద్వారా బయలుపర్చుతాడు. AATel 10.2

“దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము?” అని ప్రశ్నించాడు. క్రీస్తు. మార్కు 4:30. లోక రాజ్యాల్ని పోలికగా తీసుకోలేక పోయాడు. ఆ రాజ్యంతో పోల్చడానికి సమాజంలో ఆయనకు ఏమి కనిపించలేదు. లోక రాజ్యాలు భుజబలంచేత పరిపాలన సాగిస్తాయి. కాగా క్రీస్తు రాజ్యంలో శరీర సంబంధిత ఆయుధాలు, ఒత్తిడి సంబంధిత సాధనాలు ఉండవు. అవి నిషిద్దాలు. మానవాళిని ఉన్నతంగాను ఉదాత్తంగాను తీర్చిదిద్దడం ఈ రాజ్యం పరమోద్దేశం. దేవుని సంఘం పరిశుద్ధ జీవిత ప్రాంగణం. వివిధ వరాలతో పరిశుద్ధాత్మతో సంఘం నిండి ఉంటుంది. అవసరమైన వారికి సహాయం అందించి మేలు చేయడంలో వారి ఆనందంలో పాలు పొందుతూ సభ్యులు ఆనందిస్తారు. AATel 10.3

తన నామానికి మహిమ కలిగేందుకు తన సంఘం ద్వారా అద్భుతమైన కార్యాలు చోటు చేసుకోడానికి ప్రభువు ఏర్పాటు చేస్తాడు. యెహెజ్కేలు దర్శనంలో సంఘం తాలూకు సేవ స్వస్తతకూర్చే నదిగా వర్ణిత మయ్యింది. “ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబా లోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈనది వచ్చుచోట్ల నెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్లగును గనుక చేపలు బహువిస్తారమగును; ఈనది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును. మరియు దాని యొద్ద ఏవైది పట్టణము మొదలుకొని ఏవెగాయీము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు, మహా సముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహువిస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములును ఊబిస్థలములును ఉప్పుగలవై యుండి బాగుకొక యుండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు వాటికాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలనెలకు కాయలు కాయును, వాటి వండ్లు ఆహారమునకును వాటి ఆ కులు ఔషధము నకును వినియోగించును.” యెహెజ్కేలు 47 : 8-12. AATel 10.4

తన ప్రజలద్వారా లోకానికి హితం చేకూర్చడానికి దేవుడు ఆది నుంచి కృషి చేస్తున్నాడు. ప్రాచీన ఐగుప్తు దేశానికి యోసేపును జీవపు ఊటగా చేశాడు. యోసేపు నిష్కపట జీవితం వల్ల ఆ దేశ ప్రజల జీవితాలు సురక్షితంగా సాగాయి. దానియేలు ద్వారా దేవుడు బబులోను లోని జ్ఞానుల ప్రాణాల్ని కాపాడాడు. ఈ కాపుదలలు గుణపాఠాలు. యోసేపు దానియేలు పూజించిన దేవునితో అనుబంధం ద్వారా కలిగే ఆధ్యాత్మిక దీవెనలకు అవి సాదృశ్యాలు. ఎవరి హృదయంలో క్రీస్తు నివసిస్తాడో, ఎవరు క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపిస్తారో అట్టివారిలో ప్రతీ ఒక్కరూ లోకహితానికి దేవునితో జతపనివారు. అలాటి క్రైస్తవుడు తాను ఇతరులకు పంచటానికి రక్షకుని కృపను అందుకొనే కొద్దీ అతని ప్రతీ అణువు నుంచి ఆధ్యాత్మిక జీవితం వరదలా ప్రవహిస్తుంది. AATel 11.1

తన గుణశీలాన్ని మనుషులకు ప్రదర్శించడానికిగాను దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంపిక చేసుకొన్నాడు. లోకంలో వారు రక్షణాధారాలైన బావులుగా ఉండాలని దేవుడు ఆకాంక్షించాడు. వారికి తన పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యంలోనే ఆయన చిత్తమేంటో తెలియపర్చాడు. ఇశ్రాయేలీయుల ఆరంభదినాల్లో లోక రాజ్యాలు దుర్మార్గపు ఆచారాలు ఆచరణల ద్వారా దేవుని గూర్చిన జ్ఞానాన్ని కోల్పోయాయి. వారు ఒకప్పుడు ఆయనను ఎరిగిన వారే కాని వారు ” ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు... తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకార మయమాయెను” రోమా 1:21. అయినా దయగల దేవుడు వారిని నాశనం చేయలేదు. తనను తెలుసుకొనేందుకు తన ప్రజల ద్వారా వారికి మరో అవకాశం ఇవ్వాలని ఆయన ఇద్దేశించాడు. బలి అర్పణ బోధన ప్రకారం సర్వజాతుల ముందు క్రీస్తును పైకెత్తడం ఆయన వంక చూసేవారందరూ జీవించడం జరగాల్సి ఉంది. యూదు జాతి వ్యవస్థకు క్రీస్తు పునాది. ఛాయారూపకాలు గుర్తుల వ్యవస్థ సువార్తను గూర్చిన సంక్షిప్త ప్రవచనం. ఈ రూపకాల్లో విమోచన వాగ్దానాలున్నాయి. AATel 11.2

అయితే దేవుని ప్రతినిధులుగా ఇశ్రాయేలు ప్రజలు తమ విశేషాధిక్యతలను ఉపేక్షించారు. దేవున్ని మర్చిపోయారు. తమ కర్తవ్యాన్ని నెరవేర్చలేక పోయారు. వారు పొందిన ఉపకారాలు లోకహితానికి తోడ్పడలేదు. తమకు కలిగిన దీవెనలను ఉపకారాలను తమ శరీరాశలు తీర్చుకోడానికే వారుపయోగించారు. శోధనల్ని ఎదుర్కోకుండా ఉండేందుకు వారు లోకానికి దూరంగా ఉన్నారు. అన్యుల ఆచారాలకు వారు ఆకర్షితులు కాకుండా నిలువరించేందుకు విగ్రహారాధకులతో స్నేహం కూడదని దేవుడు విధించిన ఆంక్షల్ని ఆసరాగా తీసుకొని ఇతర ప్రజలకూ తమకూ మధ్య అడ్డుగోడలు నిర్మించుకొన్నారు. ఇలా దేవుని పట్ల తమ విధున్ని బాధ్యతన్ని విస్మరించారు. తమ తోటి మానవులకు తామందించాల్సిన మతపరమైన మార్గదర్శకత్వాన్ని పవిత్రాదర్యాన్ని అందించలేక పోయారు. AATel 12.1

యాజకులేంటి ప్రజాపాలకులేంటి అందరూ ఆచారాల ఊబిలో కూరుకు పోయారు. వారు చట్టబద్ధ మతంతో తృప్తి చెందారు. దేవుని సజీవ సత్యాన్ని ఇతరులకు అందించలేకపోయారు. తమ విశ్వానికి కొత్త అంశాలు చేర్చుకోవాలని ఆశించలేదు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నది తమకు మాత్రమేగాక ఇతరులకు కూడా వర్తిస్తుందని అంగీకరించలేదు. తమ నీతిక్రియల వల్ల అది తమకు మాత్రమే వర్తిస్తుందని భావించారు. ప్రేమ మూలంగా పనిచేసి ఆత్మను పవిత్రపర్చే విశ్వాసం, కర్మకాండతోను మానవ కల్పిత సిద్ధాంతాలతోను నిండిన పరిసయ్యుల మతంతో అన్వయించదు. AATel 12.2

ఇశ్రాయేలు గురించి దేవుడిలా అంటున్నాడు: “శ్రేష్ఠమైన ద్రాక్షావల్లి వంటిదానిగా నేను నిన్ను నాటితిని; నాకు జాతివనపు ద్రాక్షావల్లివలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి?” యిర్మీయా 2:21. “ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలములు ఫలించిరి.” హోషేయ 10:1. “కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి? AATel 12.3

“ఆలోచించుడి, నేమ నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియ జెప్పెదను. నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది తొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దానిపాడుచేసెదను. అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్టును బలిసి యుండును. దాని మీద వర్షింప వలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మమష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెవని చూడగా బలాత్కారము కనబడెను. వీతి కావలెనని చూడగా రోదన వివబడెను” యెషయా 5:3-7. “బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముగల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమేగాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు ” యెహెజ్కేలు 34:4. AATel 12.4

తాము ఎంతో జ్ఞానులు గనుక తమకు ఉపదేశం అవసరం లేదని ఎంతో నీతిమంతులు గనుక తమకు రక్షణ అవసరం లేదని, గొప్ప ప్రతిష్ఠ ఉన్నవారు గనుక తమకు క్రీస్తుమూలంగా కలిగే ప్రతిష్ఠ అవసరంలేదని యూదు నాయకులు భావించారు. కనుక వారు దుర్వినియోగపర్చిన ఆధిక్యతలను, వారు తృణీకరించిన పరిచర్యను వారి వద్ద నుంచి తీసివేసి రక్షకుడు వాటిని ఇతరులకు అప్పగించాడు. దేవుని మహిమ వెల్లడికావాలి. అయన వాక్యం స్థిరపడాలి. లోకంలో క్రీస్తు రాజ్యం స్థాపితం కావాలి. దేవుని రక్షణ వర్తమానం అరణ్య పట్టణాల్లో ప్రకటితం కావల్సి ఉంది. యూదు నేతలు ఏ కార్యనిర్వహణలో అపజయం పొందారో దాన్ని జరిగించడానికి శిష్యులు పిలుపు పొందారు. AATel 13.1