క్రైస్తవ పరిచర్య

102/278

అధ్యాయం-10
పద్ధతులు

ఇంటింటికి

ప్రత్యేక బహిరంగ సువార్త సభలు ఎంత ప్రాముఖ్యం గలవో అంత ప్రాముఖ్యమైంది ప్రజల గృహాల్లో ప్రతీ ఇంట జరగాల్సిన సువార్త సేవ. కాపరి తప్పిపోయిన గొర్రెని వెదకేటట్టు వీరికోసం అన్వేషణ జరగాలి. వారి పక్షంగా పట్టుదలతో కూడిన వ్యక్తిగత కృషి జరగాలి. వ్యక్తిగత కృషిని అశ్రద్ధ చేసినప్పుడు, సద్వినియోగపర్చుకుని ఉంటే దైవ సేవ ప్రగతికి తప్పక తోడ్పడి ఉండే ఎన్నో విలువైన తరుణాలు దాటిపోతాయి. టెస్టిమొనీస్, సం.9. పు. 111. ChSTel 130.1

దయగల మాటలు పనులు అవసరం. తన వర్తమాన్ని అందించక ముందు క్రీస్తు ప్రేమ, ఔదార్యంతో నిండిన పనులు చేశాడు. ఈ పనివారు ఇంటింటికి వెళ్లి సహాయం అవసరమైతే సహాయం చేస్తూ తరుణాలు లభించినప్పుడు క్రీస్తు సిలువ కథను చెప్పాలి. క్రీస్తే వారి చర్చాంశం అవ్వాలి. వారు సిద్దాంతాల్ని చర్చించనవసరం లేదు. క్రీస్తు చేసిన సేవను త్యాగాన్నిగూర్చి మాట్లాడాలి. తమ జీవితాల్లో ఆయన నీతిని గౌరవించి ఆయన పవిత్రతను ప్రదర్శించాలి. టెస్టిమొనీస్, సం.7, పు. 228. ChSTel 130.2

దేవుడు పక్షపాతికాడు. వారు మరి కొందరంత విద్యావంతులు కాకపోయినా నమ్రత, భక్తిగల క్రైస్తవుల్నే ఆయన తన సేవలో ఉపయోగించుకుంటాడు. అలాంటివారు ఇంటింటికి వెళ్లి సువార్త సేవ చెయ్యటం ద్వారా ఆయనకు సేవ చెయ్యాలి. చలిమంట పక్క కూర్చుని వారు - వినయులు, విచక్షణ గలవారు, భక్తిగలవారు అయితే - ఆ కుటుంబానికున్న అవస రాల్ని తీర్చటానికి అభి షేకం పొందిన వాక్యపరిచారకుడికన్నా, ఎక్కువ సహాయం చెయ్యగలుగుతారు. టెస్టిమొనీస్, సం.7, పు. 21. మన సంఘాల్లోని సభ్యులు ఇంటింటికి వెళ్లి మరెక్కువగా వేదపఠనాలివ్వటం, సాహిత్యం పంచటం చెయ్యాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 127. ChSTel 130.3

ఇంటింటికి వెళ్లి చేసే సువార్త పరిచర్యలో నిమగ్నమయ్యేవారికి అనేక శాఖల్లో సేవకు అవకాశాలు లభిస్తాయి. వారు రోగుల నిమిత్తం ప్రార్ధన చేసి, వారి బాధ నివారణకు తమ శక్తి కొద్దీ కృషి చెయ్యాలి. వారు ధళితులు, పేదలు, బాధితుల మధ్య పరిచర్య చెయ్యాలి. ఉద్రేకం వల్ల భ్రష్టమైన శరీర వాంఛల్ని అదుపుచేసుకోటానికి శక్తిగాని ఆత్మనిగ్రహంగాని లేనందువల్ల దిగజారి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికోసం వారితో కలిసి మనం ప్రార్ధించాలి. ఎవరి హృదయాల్లో ఆసక్తి మేల్కొన్నదో వారి రక్షణకు చిత్తశుద్ధి, పట్టుదలతో కూడిన కృషి జరగాలి. అనేకుల్ని దయాకార్యాల ద్వారా మాత్రమే చేరటం సాధ్యపడుతుంది. మొదట వారి శారీరక అవసరాల్ని తీర్చాలి. వారు మన స్వార్ధరహిత ప్రేమకు నిదర్శనాల్ని చూసినప్పుడు క్రీస్తు ప్రేమను నమ్మటం వారికి సులభమౌతుంది. టెస్టిమొనీస్, సం.6, పులు. 83, 84. ChSTel 131.1

పనివారు ప్రతీ గృహం దర్శించి ప్రజలకు బైబిలు బోధించాలి. వారికి మన ప్రచురణల్ని అందించాలి. తమ సొంత ఆత్మలకి ఎంతో దీవెనకరంగా ఉన్న సత్యం గురించి ఇతరులికి చెప్పాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 123. ChSTel 131.2

మన రక్షకుడు వ్యాధిగ్రస్తుల్ని బాగుచేస్తూ, దుఃఖిస్తున్నవారిని బాధల్లో ఉన్న వారిని ఓదార్చుతూ, నిరాశ నిస్పృహలకు గురి అయినవారితో సమాధానకరమైన మాటలు చెబుతూ ఇంటింటికీ వెళ్లాడు. చిన్నపిల్లల్ని చేతుల్లోకి తీసుకుని దీవించి, కష్టాలుపడుతున్న తల్లులతో నిరీక్షణ ఓదార్పు పుట్టించే మాటలు పలికాడు. ప్రతీ విధమైన మానవ దుఃఖాన్ని, బాధను ఆయన నిత్యం దయతో సున్నితంగా ఎదుర్కున్నాడు. ఆయన తనకోసం కాదు ఇతరులకోసం శ్రమించాడు. ఆయన అందరికీ సేవ చేశాడు. తాను కలిసిన వారందరికీ నిరీక్షణను శక్తిని కలిగించటమే ఆయనకు అన్నపానాలు. గాస్ఫుల్ వర్కర్స్, పు.188. ChSTel 131.3

సత్యాన్ని ప్రేమతో సామాన్యంగా ఇంటింట సమర్పించటమన్నది. శిష్యుల్ని తమ మొదటి మిషనెరీ ప్రయాణంపై పంపినప్పుడు క్రీస్తు ఆయన ఇచ్చిన ఉపదేశానికి అనుగుణంగా ఉంది. స్తుతి కీర్తనలు, వినయ, హృదయపూర్వక ప్రార్థనల ద్వారా అనేకమంది సత్యానికి ఆకర్షితులవుతారు. హృదయాల్లో మార్పు కలిగించటానికి ఆ దివ్యకార్యకర్త సంసిద్ధంగా ఉంటాడు. “నేను... సదాకాలము హితోకూడ ఉన్నాను” అన్నది ఆయన వాగ్దానం. అట్టి సహాయకుని నిత్యసమక్ష హామీతో విశ్వాసం నిరీక్షణ ధైర్యంతో మనం పనిచెయ్యవచ్చు. టెస్టిమొనీస్, సం.9, పు. 34. ChSTel 131.4

ఇంటింటికి వెళ్లి సువార్త సేవ చేసే పనివారు అవసరం. బైబిలు సత్యం బొత్తిగా తెలియని ప్రజలున్న స్థలాల్లో నిర్ణయాత్మకమైన కృషి చేయాల్సిందిగా దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రజల గృహాల్లో పాటలు పాటటం, ప్రార్ధన చెయ్యటం, బైబిలు చదివి వినిపించటం అవసరం. “నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితనో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అన్న ప్రభువు ఆదేశాన్ని ఆచరించటానికి సమయం ఇదే. ఈ కార్యాచరణకు పూనుకొనేవారికి లేఖన జ్ఞానం అవసరం. “అని వ్రాయబడియున్నది” వారి ఆయుధం కావాలి. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పు. 540. ChSTel 132.1

సోదర సోదరీలారా, మీ దగ్గరలో ఉన్నవారిని సందర్శించండి. సానుభూతితో దయతో వారి హృదయాల్ని స్పృశించండి. దురభిప్రాయాన్ని తొలగించటానికేగాని సృష్టించటానికి తోడ్పడని రీతిగా పనిచెయ్యండి. ఈ సమయానికి దేవుడుద్దేశించిన సత్యం తెలిసినవారు తమ సంఘాలకే పరిమిత్తమై మారుమనసులేని తమ ఇరుగుపొరుగువారికి సువార్త అందించటానికి నిరాకరించేవారు తమ విధిని నిర్వహించనందుకు జవాబుదారులవ్వుతారు. టెస్టిమొనీస్, సం.9,పు. 34. ChSTel 132.2

ఈ మొదటి ప్రయాణంలో, ముందు క్రీస్తు ఎక్కడికి వెళ్లి ప్రజలతో స్నేహం చేశాడో శిష్యులు అక్కడికి వెళ్లాల్సిఉంది. ఆ ప్రయాణానికి వారు మిక్కిలి సామాన్యంగా సిద్ధపడాల్సి ఉంది. తమ విశిష్ట సేవనుంచి తమ మనసుల్ని పక్కదారి పట్టించటానికి లేదా వ్యతిరేకతను సృష్టించి ఇంకా జరగాల్సి ఉన్న సేవకు తలుపులు ముయ్యటానికి దారి తీసే ఏ పనీ వారు చెయ్యకూడదు. వారు మతగురువులనవలే ప్రత్యేక వస్త్రాలు ధరించకూడదు. లేక సామాన్య గ్రామీణుల నుంచి తమను వేరుగా ఉంచే ఏ రకమైన వస్త్రాలు ధరించకూడదు. సమాజ మందిరాల్లోకి వెళ్లి వారు ప్రజల్ని బహిరంగ సేవకు ఆహ్వానించకూడదు. వారు ఇంటింటికి వెళ్లి సేవ చెయ్యాల్సి ఉంది. అనవర కుశల ప్రశ్నల్లోగాని, ఇంటింట ఆతిథ్యంలోగాని వారు సమయాన్ని వ్యర్ధపుచ్చకూడదు. కాని ప్రతీ చోట ఆతిథ్యాన్ని వారు స్వీకరించాలి. వారు ఆ గృహంలోకి “ఈ యింటికి సమాధానమగుగాక” అన్న అభివాదంతో ప్రవేశించాలి. వారి ప్రార్ధనలు స్తుతిగానాలు లేఖనోపదేశం వల్ల ఆ కుటుంబానికి ఎంతో మేలు చేకూర్చుతాయి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పులు 351, 352. ChSTel 132.3

మీ ఇరుగు పొరుగువారిని స్నేహపూర్వకంగా సందర్శించి వారితో పరిచయం ఏర్పర్చుకోండి... ఈ సేవ చెయ్యనివారు కొందరు ప్రదర్శిస్తున్న అలక్ష్యధోరణిని ప్రదర్శిస్తే, తమ మొదటి ప్రేమను త్వరలో కోల్పోయి సహోదరుల్ని నిందించటం, విమర్శించటం, ఖండించటం మొదలు పెడ్తారు. రివ్యూ అండ్ హెరాల్డ్, మే 13, 1902. ChSTel 133.1

ఈ అపొస్తలుడి కృషి బహిరంగ ప్రసంగాలకే పరిమితం కాలేదు. ఆ విధంగా చేరటానికి సాధ్యపడి ఉండని వారు చాలా మంది ఉన్నారు. ఇంటింటిని దర్శించి సేవ చెయ్యటంలో అతడు చాలా సమయం గడిపాడు. ఈ రకంగా కుటుంబాలతో పరిచయం ఏర్పర్చుకుని పనిచేశాడు. జబ్బుగా ఉన్నవారిని దుఃఖంలో ఉన్న వారిని సందర్శించాడు. శ్రమలనుభవిస్తున్న వారిని ఓదార్చాడు. హింసించబడుతున్న వారిని పైకి లేపాడు. తాను పలికిన మాటల్లోను చేసిన పనుల్లోను యేసు నామాన్ని ఘనపర్చాడు. ఇలా అతడు “బలహీనతల్లోను, భయంతోను, వణకుతోను” సేవ చేశాడు. తన బోధ దైవ ముద్రతో గాక మానవ ముద్రతో వెల్లడవుతుందేమో నని భయంతో వణికాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 250. ChSTel 133.2

మీ ఇరుగు పొరుగువారు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి, మి స్వార్ధరహిత ఆసక్తి ప్రేమ వారిని ఆకట్టుకునేందతవరకు వారితో సన్నిహితంగా మెలగడండి. వారిపట్ల సానుభూతి ప్రదర్శించండి. వారితో ప్రార్ధించండి. అవకాశం వచ్చినప్పుడు వారికి మేలు చెయ్యండి. ఇంకా కొందరిని పోగుజేసి వారి చీకటి మనసులుకి దైవవాక్యాన్ని తెరవండి. మానవాత్మలకు లెక్క అప్పజెప్పాల్సినవారిగా అప్రమత్తంగా ఉండి, ప్రభువుతో తన నైతిక ద్రాక్షతోటలో పని చెయ్యటానికి దేవుడు మాకిచ్చిన ఆధిక్యతల్ని సద్వినియోగపర్చుకోండి. మీ ఇరుగుపొరుగువారితో మాట్లాడటం అశ్రద్ధ చెయ్యకండి. “ఏ విధము చేతనైనను కొందిరిని” రక్షించేందుకు వారికి మీరు చూపించగలిగిన దయను చూపించండి. “పాపం నిమిత్తం దేవుని ముందు పశ్చాత్తాపపడి మన ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వసించండి” అంటూ ఇంటింటికి వెళ్లి కన్నీటితో విజ్ఞాపన చెయ్యటానికి అపొస్తలుడైన పౌలుని ఏ స్పూర్తి బలవంతం చేసిందో దాన్ని పొందటానికి మనం ప్రయత్నించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 13, 1888. ChSTel 133.3

మన నగరాల్లో చేయాల్సి ఉన్న పనిని ప్రభువు నాకు కనపర్చాడు. ఈ నగరాల్లోని మన విశ్వాసులు తమ పరిసరాల్లోని గృహాల్లో దేవుని సేవ చెయ్యాలి. వారు ఎక్కడకు వెళ్తే అక్కడకు పరలోక వాతావరణాన్ని విస్తరిస్తూ నెమ్మదిగాను వినయ మనసుతోను పని చెయ్యాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 128. ChSTel 134.1