క్రైస్తవ పరిచర్య

103/278

ఏక శ్రోత సమావేశం

క్రీస్తు సేవ చాలామట్టుకు వ్యక్తిగత సమావేశాల ద్వారా జరిగింది. ఏకశ్రోత సమావేశం పై ఆయనకు నమ్మకం. ఆ ఒక్క ఆత్మ ద్వారా అందిన సమాచారం వేల ప్రజలకు చేరవేయటం జరిగేది. టెస్టిమొనీస్, సం.6, పు. 115. ChSTel 134.2

ఆయన బలహీనంగా ఉన్నాడు, అలసిపోయాడు. అయినా అపరిచితురాలు, పరాయిదేశ స్త్రీ, బహిరంగ పాపంలో నివసిస్తున్న స్త్రీతో మాట్లాడటానికి వచ్చిన తరుణాన్ని అలక్ష్యం చెయ్యలేదు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 194. ChSTel 134.3

ప్రజలు సమావేశమయ్యే వరకు రక్షకుడు ఆగలేదు. తన చుట్టూ ఉన్న కొద్ది మందితోనే తన పాఠాలు ప్రారంభించేవాడు. వచ్చేవారు పోయేవారు ఒక్కొక్కరు ఆగి పెద్ద జన సమూహమై పరలోకం నుంచి వచ్చిన ఆ మహోపాధ్యాయుని మాటలు విని విస్మయం చెందేవారు. పెద్ద సభతో మాట్లాడినంత ఉత్సాహోద్రేకాలతో తక్కువ మందితో మాట్లాడలేనని క్రీస్తు సేవ చేసే ఏ పని వాడు భావించకూడదు. వర్తమానం వినటానికి ఒకేవ్యక్తి ఉండవచ్చు. అయితే దాని ప్రభావం ఎంత దూరం వ్యాపిస్తుందో ఎవరు చెప్పగలరు? ఓ సమరయ స్త్రీతో మాట్లాడటానికి రక్షకుడు సమయం గడపాల్సినంత పెద్ద విషయం కాదని ఆయన శిష్యులు సయితం భావించారు. కాని ఆయన రాజులతోగాని చట్ట సభల సభ్యులతోగాని లేక ప్రధాన యాజకులతోగాని తర్కించిన దానికన్నా ఎక్కువ పట్టుదలగా ఎక్కువ వాడిగా ఈమెతో తర్కించాడు. ఆయన ఆ స్త్రీకి నేర్పించిన పాఠాలు లోకంలోని మారుమూల ప్రాంతాల్లో సయితం పునరుక్తి అవుతున్నాయి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 194. ChSTel 134.4