క్రైస్తవ పరిచర్య

72/278

అధ్యాయం-8
క్రైస్తవ గుంపులవ్యవస్థీకరణ

వ్యవస్థీకరణ అవసరం

సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకా విస్తృత సేవచెయ్యటానికి మన బలగాల్ని వ్యవస్థీకరించటం అవసరం. టెస్టిమొనీస్, సం.9, పు. 27. ChSTel 81.1

క్రైస్తవ కృషికి ప్రాతిపదిక చిన్నచిన్న గుంపుల ఏర్పాటని ఎన్నడూ పొరపాటు చెయ్యని ఓ మహనీయుడు నాకు తెలిపాడు. టెస్టిమొనీస్, సం.7, పులు. 21,22. ChSTel 81.2

ప్రతీ సంఘంలోను ఆ సంఘపరిసరాల్లో సేవ చెయ్యటానికి చక్కగా వ్యవస్థీకృతమైన చిన్న గుంపులుండాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టె. 29, 1891. ChSTel 81.3

ప్రతీ నగరంలోను మంచి క్రమ శిక్షణ గల పనివారి దళం వ్యవస్కీరించబడాలి. కేవలం ఒకటి రెండు కాదు అనేకమైన దళాల్ని వ్యవస్థీకరించి వాటికి పని నియమించాలి. జెనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, 1893, పు. 37. ChSTel 81.4

మన సంఘాల్లో సేవ నిమిత్తం చిన్నచిన్న గుంపుల్ని ఏర్పాటు చెయ్యాలి. వేర్వేరు వ్యక్తులు మనుషుల్ని పట్టే జాలరులుగా పని చెయ్యటానికి ఏకమవ్వాలి. లోకంలోని దుర్నీతి నుంచి క్రీస్తు పవిత్ర ప్రేమలోకి ఆత్మల్ని రక్షించటానికి వారు ప్రయత్నించాలి. టెస్టిమొనీస్, సం.7, పు. 21. భువిలో దేవుని సంఘం మిషనెరీ సేవకు వ్యవస్థీకృతమయ్యింది. అధికులు అధములు, ధనికులు దరిద్రుల సత్యాన్ని గూర్చిన వర్తమానం వినే మార్గాల్ని సాధనాల్ని రూపొందించుకోటంలో సంఘం మొత్తం కలిసి పని చెయ్యాలని ప్రభువు కోరుతున్నాడు. టెస్టిమొనీస్, సం.6, పు. 29. ChSTel 81.5

ఓ సంఘంలో ఎక్కువమంది సభ్యులుంటే, సంఘసభ్యులకోసమే గాక అవిశ్వాసులకోసం పని చెయ్యటానికి సభ్యులు చిన్నచిన్న గుంపులగా ఏర్పడాలి. ఒక స్థలంలో సత్యం తెలసినవారు ఇద్దరో ముగ్గురో ఉంటే వారు ఓ చిన్న పనివారి గుంపుగా ఏర్పడాలి. టెస్టిమొనీస్, సం.7, పు. 22. ChSTel 81.6

యుద్ధ రంగంలో విజయవంతమైన చర్యకు క్రమశిక్షణ, క్రమం అవసరమైతే, యుద్ధ భూమిలో తమ శత్రువుతో పోరాడేవారు సాధించగోరే గురికన్నా మనం సాధించాల్సిన ధ్యేయం మరింత విలువైంది, సమున్నత స్వభావంగలది. మనం పోరాడున్న పోరాటంలో నిత్యజీవితానికి సంబంధించిన ఆసక్తులు ప్రమాదంలో ఉన్నాయి. టెస్టిమొనీస్, సం.1, పు. 649. ChSTel 82.1

దేవుడు క్రమానికి కర్త. పరలోకానికి సంబంధించిన ప్రతీ విషయం క్రమబద్ధంగా ఉంటుంది. దూతగణాల కదలికలు విధేయత, క్రమశిక్షణతో కూడి ఉంటాయి. క్రమబద్ధమైన సమైక్య చర్య మాత్రమే విజయానికి దారి తీస్తుంది. ఇశ్రాయేలీయుల కాలంలో కోరిన రీతిగానే నేడు కూడా దేవుడు తన సేవలో క్రమం, పద్దతి ఉండాలని కోరుతన్నాడు. ఆయన సేవ చేసే వారందరు అజాగ్రత్తగా, అస్తవ్యస్తంగా కాక జ్ఞానయుక్తంగా పనిచెయ్యాలి. దానిపై తన ఆమోద ముద్ర వేసేందుకు, తన పనిని విశ్వాసంతో, ఖచ్చితత్వంతో చెయ్యాలని ఆయన కోరుతున్నాడు. పేట్రియార్క్స్ అండ్ ప్రోఫెట్స్, పు. 376. ChSTel 82.2

సభ్యులు ఇతరులుకి వెలుగు ఎలా అందించారో తెలుసుకుని ఆవిధంగా తమ విశ్వాసాన్ని పటిష్ఠపర్చుకుని తమ జ్ఞానాన్ని వృద్ధిపర్చుకునేందుకు సంఘంలో వ్యవస్థీకృతమైన పని జరగాలి. తాము దేవుని వద్ద నుంచి పొందిన సత్యాన్ని వారు ఇతరులకి అందించే కొద్దీ వారి విశ్వాసం దృఢమౌతుంది. క్రియలుగల సంఘం జీవంగల సంఘం. మనం జీవం గల రాళ్లుగా నిర్మితమౌతున్నాం. ప్రతీరాయి వెలుగును వివరజిమ్మాలి. ప్రతి క్రైస్తవుడు దేవుని మహిమను పొంది దాన్ని ప్రతి ఫలింపజేసే ప్రశస్తమైన రాయికి పోల్చబడుతున్నాడు. టెస్టిమొనీస్, సం.6, పు. 135. ChSTel 82.3