క్రైస్తవ పరిచర్య

71/278

మంచి ఆదర్శం

ఈ అపోస్తలుడు (పౌలు) తన సేవల వలన విశ్వాసులైనవారి ఆధ్యాత్మిక సంక్షేమానికి తాను చాలామట్టుకు బాధ్యుణ్నని భావించాడు. ఏకైక నిజదేవుని గూర్చిన జ్ఞానంలోను ఆయన పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంలోను వారు వృద్ధి పొందాలని ఆకాంక్షించాడు. తన సువార్త పరిచర్యలో అతడు తరచు యేసుని ప్రేమించే చిన్నచిన్న విశ్వాసుల గుంపుల్ని కలవటం జరిగేది. అతడు వారితో కలిసి ప్రార్ధించేవాడు. వారికి తనతో సజీవ సంబంధం ఉండగలందులకు దేవున్ని వేడుకుంటూ ప్రార్థించాడు. సువార్త సత్యాన్ని ఇతరులకు అందించటానికి ఉత్తమ పద్దతుల్ని పౌలు తరచుగా వారితో చర్చించే వాడు. తాను ఎవరి మారు మనసుకోసం శ్రమించాడో ఆ సభ్యుల్ని విడిచి పెట్టి దూరంగా వెళ్ళినప్పుడు, వారిని దుష్టినుంచి తప్పించి, పట్టుదలగల, క్రియాశీలురైన మిషనెరీలుగా సేవచేసేటట్లు వారికి తోడ్పడాల్సిందిగా దేవునికి ప్రార్థించేవాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 262. ChSTel 79.3