క్రైస్తవ పరిచర్య

2/278

తొలి పలుకు

చిత్తశుద్ది అంకితభావంతో చేసే ఆత్మల రక్షణ కృషి ఆవశ్యకత ప్రాముఖ్యత పద్ధతులు ప్రతిఫలాల పై ఎలెన్ వైట్ రచనల్లో ఉత్తమ సలహాలు కార్యాచరణ నియమాలు ఉన్నాయి. ఆవేశ పూరితమైన ఈ రచనల నుంచి ప్రస్తుత గ్రంథాన్ని సంకలనం చెయ్యటం జరిగింది. సమగ్ర గ్రంథం కాకపోయినా దీన్ని క్రైస్తవ సేవా విజ్ఞాన సర్వస్వం అనటం సముచితంగా ఉంటుంది. ChSTel .0

ప్రచురితమైన వివిధ మూలాలనుంచి ఉల్లేఖనల్ని ఎంపిక చెయ్యటంలో రచయిత వ్యక్తం చేసిన భావ వాతావరణాన్ని కాపాడటానికి అమిత శ్రద్ధ తీసుకున్నాం. సంకలనం చేసి సమకూర్చిన విషయం సంఘ సేవలో ఉన్న వాక్యపరిచారకులకు, నాయకులకు ఎంతో ఉపకరిస్తుందని, ఆ అపూర్వ ఆత్మల రక్షకుని ఆత్మ ఎవరిని స్పృశిస్తుందో ఆ పురుషులు స్త్రీలలో ప్రతీవారు ఈ సంకలన గ్రంథాన్ని అభినందిస్తారని మా విశ్వాసం ChSTel .0

్రితంలో జెనరల్ కాన్ఫరెన్స్ హోమ్ మిషనరి శాఖగా పిలిచిన కార్యాలయ కార్యదర్శక సిబ్బందికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ గ్రంథ సంకలనం ఆదికృషిని చాలా మట్టుకు వారే నిర్వహించారు. ఈ గ్రంథం కూర్పుకి విషయాన్ని చదవటం, వివిధ పుస్తకాల్ని గుర్తించటంలో తోడ్పడుతూ ఇతర క్రైస్తవ పనివారు విలువైన సేవలందించారు. వారి సలహాలు, సూచనలు ఈ కార్యసాఫల్యానికి సంపూర్ణత్వానికి ఎంతగానో దోహదపడ్డాయి. ChSTel .0

ఆత్మల రరక్షణ శాస్త్రజ్ఞానానికి ప్రధాన మూలంగా ఈ గ్రంథ పఠనాన్ని అధ్యయనాన్ని హృదయపూర్వకంగా సిఫారసు చేస్తున్నాం. ChSTel .0

- జెనరల్ కాన్ఫరెన్స్ సేబల్ స్కూల్ అండ్
పర్సనల్ మినిస్ట్రీస్ డిపార్ట్ మెంట్