క్రైస్తవ పరిచర్య

21/278

స్వయం తృప్తిగల వర్గం

దర్శనంలో నా ముందు ఓ తరగతి ప్రజల్ని నిలపటం జరిగింది. ఉదార భావోద్రేకాలు, భక్తిభావాలు మేలు చెయ్యటంపట్ల ఆసక్తి ఉన్న స్పహ వారికుంది. అయినా వారు చేస్తున్నదేమి లేదు. వారికున్నది ఆత్మ సంతృప్తి ఉద్వేగం. తమకు అవకాశం ఉంటే లేక తాము మరింత మెరుగైన పరిస్థితుల్లో ఉంటే ఎంతో మంచి పని చేసి ఉండేవారం లేక చేస్తాం అని తమను తాము పొగడుకుంటారు. అయితే వారు అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. లేమిలో ఉన్నవారికి ముష్టిగా కొన్ని పైసలిచ్చే పిసినారిని వారు ద్వేషిస్తారు. అతడు స్వార్థపరుడని ఇతరులకి మేలు చెయ్యటానికి కలిసి రాడని, తాను దుర్వినియోగించటానికి లేక తప్పుపట్టటానికి విడిచి పెట్టటానికి లేక భూమిలో పాతి పెట్టటానికి కాక, సద్వినియోపర్చటానకి ఇతరుల మేలు కోసం దేవుడనుగ్రహించిన ప్రభావమనే తలాంతుల్ని ద్రవ్యాన్ని తనకోస మే ఉపయోగించకుంటాడని విమర్శిస్తారు. పిసినారితనంలో స్వార్థంలో తలమునకలయ్యే వారు తమ పిసినారి కార్యాలకు, తాము దుర్వినియోగపర్చే తలాంతులకు జవాబు దారులవుతారు. అయితే ఉదారభావోద్రేకాలు కలిగి, స్వభావసిద్ధంగా ఆధ్యాత్మిక విషయాల అవగాహన గలవారు నిష్క్రియాపరులుగా మిగిలిపోతే, తమకు రావలసిన అవకాశం వస్తాదని ఎదురుచూస్తూ, తమ సంసిద్దతకూ పినినారి అయిష్టతకూ మధ్య భేదంగురించి ఇంకా ఆలోచిస్తూ, తమ పరిస్థితి నీచహృదయులైన తమ ఇరుగురుపొరుగువారి పరిస్థితికంటే మెరుగ్గా ఉన్నదని భావించే వారు ఇంకా ఎక్కువ బాధ్యులవుతారు. అలాంటివారు ఆత్మవంచన చేసుకుంటారు. ఉపయోగించని మంచి గుణాలు కలిగి ఉండుటమే వారి పై అధిక బాధ్యతను మోపుతుంది. తమ యజమానుడి తలాంతుల్ని వృద్ధిపర్చకుండా ఉంచితే వారి పరిస్థితి తాము అంతగా ద్వేషిస్తున్న తమ పొరుగువారి పరిస్థితికన్నా అధ్వానంగా ఉంటుంది. మా యజమానుడి చిత్తమేంటో మీరెరుగుదురు. అయినా మీరు దాన్ని అమలు పర్చలేదు అని వారితో ఆయన చెబుతాడు. టెస్టిమొనీస్, సం.2, పులు. 250, 251. ChSTel 36.1