క్రైస్తవ పరిచర్య

20/278

అధ్యాయం-3
దైవప్రజల నడుమ పరిస్థితులు

కొరవడ్డ మిషనెరీ స్ఫూర్తి

సబ్బాతును ఆచరిస్తున్న ఎడ్వంటిస్టుల నడుమ మిషనెరీ స్పూర్తి కొరవడుతున్నది. వాక్యపరిచారకులు ప్రజలు పూర్తిగా మేల్కొని ఉంటే, దేవుడు తమని తన ధర్మశాస్త్రానికి ట్రస్టీలుగా నియమించి, దాన్ని తమ మనసుల్లో ముద్రించి, తమ హృదయాల పై రాయటం ద్వారా గౌరవిస్తుండగా వారు ఇలా ఉదాసీనంగా విశ్రమించలేరు. టెస్టిమొనీస్, సం.3, పు. 202. ChSTel 34.1

గొప్ప విశ్వాసులమని చెప్పుకునే సంఘాల్లో మిషనెరీ స్ఫూర్తి పూర్తిగా మాయమయ్యింది. వారి హృదయాల్లో ఆత్మల పట్ల ప్రేమ, వారిని క్రీస్తు మందలోకి నడిపించాలన్న తపన లేవు. మనకు చిత్తశుద్ధి పట్టుదల గల పనివారు అవసరం. “రండి సహాయం చెయ్యండి” అంటూ ప్రతీ ప్రాంతం నుంచి వచ్చే మొరకు సానుభూతితో స్పందించేవారు ఎవరూలేరా? టెస్టిమొనీస్, సం.4, పు. 156. ChSTel 34.2

ఓ జనాంగంగా మనకు లోటులున్నట్లు ప్రభువు నాకు దర్శనంలో చూపించాడు. మన పని వారు మన విశ్వాసాన్ని అనుసరించి నివసించటంలేదు. మనం మానవులకు ఇవ్వబడిన అతి గంభీరం, ప్రాముఖ్యం అయిన వర్తమాన ప్రకటన కింద నివసిస్తున్నామని మన విశ్వాసం సాక్ష్యమిస్తున్నది. ఈ దృష్ట్యా మన ప్రయత్నాలు, మన ఉత్సాహం, మన ఆత్మ త్యాగస్పూర్తి ఆ పని స్వభావానికి సరిపోలటం లేదు. మనం మృతుల్లో నుంచి మేల్కోవాలి. క్రీస్తు మనకు జీవాన్నిస్తాడు. టెస్టిమొనీస్, సం.2, పు. 114. ChSTel 34.3

మన సంఘాలు దేవునికి తమ జవాబుదారీతనం గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తున్నాయో అన్నదాన్ని గురించి తలంచినప్పుడు నాకు తీవ్ర వేదన కలుగుతున్నది. వాక్యపరిచారకులు మాత్రమే యోధులు కారు. క్రీస్తు సైన్యంలో చేరిన ప్రతీ పురుషుడు ప్రతి స్త్రీ అందరూ క్రీస్తు యోధులే. తన ఆత్మోపేక్ష ఆత్మత్యాగ పూరిత జీవితంలో క్రీస్తు చూపించిన ఆదర్శాన్ని అనుసరించి యోధుడి జీతాన్ని అంగీకరించటానికి వారు సమ్మతంగా ఉన్నారా? మన సంఘాలు మొత్తంగా ఎలాంటి ఆత్మోపేక్షను ప్రదర్శిస్తు న్నాయి? అవి ద్రవ్యరూపంలో విరాళాలిచ్చి ఉండవచ్చుగాని తమని తాము సమర్పించుకోకుండా నిలిచిఉండవచ్చు. జెనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, 1893, పు.131. ChSTel 35.1

క్రీస్తు అనుచరులుగా చెప్పుకునే అనేకమందికి ఆత్మల విషయంలో లౌకికులకన్నా ఎక్కువ హృదయభారంలేదు. నేత్రాశ, జీవపుడంబం, ప్రదర్శన పట్ల మక్కువ, సుఖలాలసత్వం నామమాత్ర క్రైస్తవుల్ని దేవుని నుంచి వేరుచేస్తున్నాయి. వాస్తవంలో మిషనెరీ స్పూర్తి బహుకొద్దిమందిలోనే ఉంది. సీయోనులోని ఈ పాపులకళ్లు తెరవటానికి వేషధారుల్ని వణికేటట్లు చెయ్యటానికి ఏమి చెయ్యాలి? జెనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, 1893, పు. 132. ChSTel 35.2

మేరోజు ఒక తరగతిని సూచిస్తున్నాడు. మిషనెరీ స్పూర్తి వారి హృదయాల్ని ఎన్నడూ ఆకట్టుకోలేదు. విదేశ మిషనెరీ సేవకు పిలుపులు వారిని ఉత్సాహపర్చి కార్యోన్ముఖుల్ని చేయలేదు. ఆయనకు ఎలాంటి సేవా చెయ్యని నిష్క్రియాపరులు - క్రీస్తుకి ఆత్మల్ని సంపాదించటానికి ఏమి చెయ్యనివారు - దేవునికి ఏమి జవాబు చెబుతారు? అట్టివారు “సోమరివైన చెడ్డ దాసుడా” అన్న ఖండనను పొందుతారు. హిస్టారికల్ స్కెచ్చేస్, పు. 290. ChSTel 35.3

మీకు ఓ ఆధిక్యత అయిన దేవుని సేవ చెయ్యటంలో మీ వైఫల్యానికి ఓసాదృశ్యంగా ఈ మాటల్ని నాకు సూచించటం జరిగింది, “మేరోజును శపించుడి దాని నివాసులమిద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిషులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.” టెస్టిమొనీస్, సం.2, పు. 247. ChSTel 35.4