క్రైస్తవ పరిచర్య

265/278

ఆది నుంచి పనిలో ఉన్న పరిశుద్ధాత్మ

పతనమైన మానవ జాతి నిమిత్తం తన సంకల్పం నెరవేర్పుకు ఆది నుంచి మానవ ప్రతినిధుల ద్వారా పరిశుద్దాత్మ ద్వారా దేవుడు పని చేస్తున్నాడు. పితరుల జీవితాల్లో ఇది ప్రదర్శితమయ్యింది. మోషే కాలంలో అరణ్యంలోని సంఘానికి కూడా “ఉపదేశమివ్వటానికి” దేవుడు ఆత్మనిచ్చాడు. అపొస్తలుల దినాల్లో పరిశుద్ధాత్మ మాధ్యమం ద్వారా సంఘానికి ఆయన అద్భుత కార్యాలు చేశాడు. పితరుల్ని సంరక్షించిన శక్తే, కాలేబు యెహోషువల్ని విశ్వాసం, ధైర్యంతో నింపిన శక్తే, అపొస్తలుల సంఘాన్ని ఫలప్రదం చేసిన శక్తే, ఆ తర్వాత జరుగుతూ వచ్చిన యుగాల్లో దేవుని నమ్మకమైన బిడ్డల్ని కాపాడుతూ వస్తుంది. చీకటి యుగాల్లో నివసించిన వార్డెన్సేయ క్రైస్తవులు సంస్కరణకు మార్గం సిద్దపర్చటానికి బైబిలుని లోకంలోని వివిధ జాతుల భాషల్లోకి మాండలికాల్లోకి అనదించటానికి సౌమ్యులు ఉత్తములు అయిన పురుషులు స్త్రీలు చేసిన కృషిని జయప్రదం చేసిన శక్తీ ఇదే. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 53. ChSTel 301.1