క్రైస్తవ పరిచర్య

264/278

క్రీస్తు వారసుడు

పరిశుద్దాత్మ క్రీస్తు ప్రతినిధి. కాని ఆయనకు మానవ వ్యక్తిత్వం లేదు. దాని నుంచి ఆయన విముక్తుడు. మానవత్వ భారంతో క్రీస్తు వ్యక్తిగతంగా ప్రతీ స్థలంలోను ఉండలేకపోయాడు. కాబట్టి ఆయన తండ్రి వద్దకు వైటం లోకంలో తన ప్రతినిధిగా ఆత్మను పంపటం మానవాళికి మేలుకరం. అప్పుడు తన నివాసం వల్ల లేక క్రీస్తుతో కలయికవల్ల ఏ వ్యక్తికీ లాభం పొందే తరుణం ఉండదు. ఆత్మ ద్వారా క్రీస్తు అందరికీ అందుబాటులో ఉండగలుగుతాడు. ఈ భావంతో ఆయన లోకంలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు మనకు మరింత సమీపంగా ఉంటాడు అనవచ్చు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 669. ChSTel 300.3