క్రైస్తవ పరిచర్య

198/278

దేవుడు పంపిన అవకాశం

మన సొంత దేశంలోనే అజ్ఞానం మూఢనమ్మకాలతోనిండిన వారు, బైబిలు గురించిగాని దాని పవిత్ర బోధనల గురించి గాని తెలియని వారు వేల జాతుల ప్రజలు, వేల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. తాము తన వాక్యంలో వెల్లడైన సత్య ప్రభావం కిందకువచ్చి, ఉత్తేజం పొంది, తన రక్షణ విశ్వాసంలో పాలివారయ్యేందుకు దేవుడు వారిని ఈ దేశానికి నడిపించాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 1, 1887. ChSTel 233.1

వారు సత్యాన్ని తెలుసుకుని, ఇతర భాషలు మాట్లాడే ప్రజల మధ్య మనం చెయ్యలేని పనిని చెయ్యటానికి యోగ్యత సంపాదించుకునేందుకు దేవుడు తన కృపా సంకల్పం చొప్పున వారిని మన తలుపు వద్దకు తెచ్చి లోపలికి నెట్టినట్లు ఇక్కడకు తీసుకువచ్చాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో. 29, 1914. ChSTel 233.2

ఈ సమయానికి దేవుడు ఏర్పాటు చేసిన సత్యాన్ని వారు వినటానికి, నేరుగా దేవుని సింహాసనం నుంచే వచ్చే వెలుగుకి దూతలుగా తమ సొంత దేశాలకి తిరిగి వెళ్లటానికి అవసరమైన సిద్దబాటుకి వారికి అవకాశం లభించేందుకు, దైవ కృపా సంకల్పం చొప్పున ఈ విదేశీయుల్లో చాలామంది ఇక్కడుండటం జరుగుతున్నది. పసిఫిక్ యూనియన్ రికార్డర్, ఏప్రి. 21, 1910. ChSTel 233.3

మన దేశంలోని మహా నగరాల్లో నివసిస్తున్న విదేశీయులికి సత్యాన్ని అందించటం విషయంలో నమ్మకమైన కృషి జరిగితే ఇతర దేశాల్లో దేవుని సేవ అద్బుతంగా ముందుకి సాగుతుంది. సత్యాన్ని అంగీకరించిన వెంటనే ఈ దేశంలోను ఇతర దేశాల్లోను ఉన్న తమ ప్రజల మధ్య పనిచెయ్యటానికి యోగ్యులు కాగల పురుషులు స్త్రీలు వీరిలో కొందరున్నారు. తమ మిత్రుల్ని సత్యంలోకి తీసుకువచ్చే ఆశాభావంతో అనేకులు తాము ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లవచ్చు. వారు తమ బంధువుల్ని ఇరుగు పొరుగు వారిని వెతికి వారికి మూడోదూత వర్తమాన జ్ఞానాన్ని అందించవచ్చు. రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో. 29, 1914. ChSTel 233.4