క్రైస్తవ పరిచర్య

197/278

అధ్యాయం 19
స్వదేశ, విదేశ సేవారంగం

విదేశ సేవతో సమాన ప్రాముఖ్యం గల సేవ

నా సోదర సోదరీలారా, మేల్కోండి. మేల్కొని అమెరికాలో ఎన్నడూ సువార్త సేవ జరగని ప్రాంతాల్లో ప్రవేశించండి. విదేశాల్లో కొంత సేవ చేసిన తర్వాత మా విధిని నిర్వర్తించామని భావించకండి. ఇతర దేశాల్లో చేయాల్సిన సేవ ఉంది కాని అమెరికాలో చేయాల్సి ఉన్న సేవ కూడా అంతే ప్రాముఖ్యమైంది. అమెరికా నగరాల్లో దాదాపు అన్ని భాషల ప్రజలున్నారు. దేవుడు తన సంఘానికిచ్చిన వెలుగు వీరికి అవసరం. టెస్టిమొనీస్, సం. 8, పు. 36. ChSTel 232.1

దూర దేశాల్లో నివసిస్తున్న వివిధ జాతుల ప్రజలకు హెచ్చరికను అందించటానికి ప్రణాళికల్ని అమలు చేస్తుండగా, మన దేశానికి వచ్చిన విదేశీయుల నడుమ చేయ్యాల్సిన పని చాలా ఉంది. మన ఇంటి తలుపు నీడలో ఉన్న ప్రశస్త ఆత్మల కన్నా చైనాలోని ఆత్మలు ఎక్కువ విలువైనవి కావు. ఆయన కృప మార్గం తెరచేకోద్దీ దేవుని ప్రజలు దూరదేశాల్లో సేవ చెయ్యాల్సి ఉన్నారు. అంతేకాదు, నగరాల్లోను, గ్రామాల్లోను, నగర శివార్లలోను నివసిస్తున్న వివిధ జాతుల విదేశీయుల పట్ల తమ విధిని కూడా వారు నిర్వహించాల్సి ఉంది. రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో. 29, 1914. ChSTel 232.2

న్యూయార్కు నగరంలో, షికాగోనగరంలో, ఇంకా జనాభా గల ఇతర కేంద్రాల్లో చాలామంది విదేశీయులున్నారు. వారు ఆయా జాతుల నుంచి వచ్చినవారు. వారందరూ హెచ్చరికా వర్తమానం విననివారు. సెవెంతుడే ఎడ్వెంఇస్టుల్లో ఇతర దేశాల్లో సేవ చెయ్యాలన్న ఉత్సాహం చాలా ఉంది. అది అతిగా ఉన్నదని నేనటం లేదు సుమా. కాని అలాంటి ఉత్సాహమే దగ్గరలో ఉన్న నగరాల్లో సేవ చెయ్యటానికి ఉంటే దేవుడు ఆనందిస్తాడు. దైవ ప్రజలు తెలివి కలిగి కదలాలి. నగరాల్లోని ఈ సేవకు వారు పట్టుదలతో పూనుకోవాలి. సమర్పణ సమర్థత గల మనుషులు ప్రజలని హెచ్చరించటానికి ఈ సువార్త ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో. 29, 1914. ChSTel 232.3