క్రైస్తవ పరిచర్య

184/278

పురాతన ఇశ్రాయేలు వైఫల్యం నుంచి పాఠం

ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించినప్పుడు ఆ దేశమంతటినీ స్వాధీన పర్చుకోటం ద్వారా నెరవేర్చాల్సి ఉన్న దైవ సంకల్పాన్ని వారు నెరవేర్చలేదు. ఆ దేశాన్ని పాక్షికంగా జయించిన తర్వాత తమ విజయ ఫలాన్ని అనుభించటానికి స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నారు. అపనమ్మకంతో నిండి, సుఖాన్ని ప్రేమిస్తూ, కొత్త భూభాగాన్ని ఆక్రమించే బదులు అప్పటికే తాము స్వాధీన పర్చుకున్న భాగాల్లో గుమికూడారు. ఈ రకంగా వారు దేవునికి దూరమౌతూ వచ్చారు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చటంలో వైఫల్యం వల్ల తమకు ఆయన వాగ్దానం చేసిన దీవెనల్ని ఇవ్వటం అసాధ్యపర్చారు. ఈనాటి సంఘం అదే పని చెయ్యటం లేదా? సువార్త అవసరమైన లోకం తమ ముందుండగా క్రైస్తవులమని చెప్పుకునేవారు సువార్త ఆధిక్యతల్ని ఆనందించటానికి ఆలయాల్లో సమావేశమౌతారు. నూతన భూభాగాల్ని ఆక్రమించటానికి, సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి రక్షణ వర్తమానం అందించటానికి ఉన్న అవసరాన్ని గుర్తించరు. “మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” అన్న క్రీస్తు ఆజ్ఞను వారు నిరాకరిస్తారు. వారు యూదు సంఘం కన్నా తక్కువ అపరాధులా? టెస్టిమొనీస్, సం. 8, పు. 119. ChSTel 216.2