క్రైస్తవ పరిచర్య

183/278

ఫలితాలు నిశ్చయం

సంఘ సభ్యులు మేల్కొని, తమ సొంతంగా యుద్ధానికి బయలుదేరి, ప్రతీ ఒక్కరూ తాము యేసుకి ఆత్మల్ని రక్షించటంలో ఎంత చెయ్యగలరో అంచనా వేసుకుంటూ తమ పనిని చేస్తే అనేకులు సాతాను జట్టు విడిచి పెట్టి, క్రీస్తు ధ్వజం కింద నిలబడటం చూస్తాం. ఈ కొద్ది మాటల్లో వచ్చిన వెలుగు ప్రకారం మన ప్రజలు నడుచుకుంటే, వాస్తవంగా మనం దేవుని రక్షణను చూస్తాం. అద్భుతమైన ఉజ్జీవనం చోటు చేసుకుంటుంది. పాపులు మారుమనస్సు పొంది క్రీస్తుని విశ్వసిస్తారు. అనేకులు సంఘంలో చేరతారు. టెస్టిమొనీస్, సం. 8, పు. 246. ChSTel 215.2

మన సంఘ సభ్యులు స్వదేశంలోను విదేశాల్లోను మిషనెరీ సేవల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. నూతన ప్రదేశాల్లో సత్య ధ్వజం పాతటంలో త్యాగాలు చేస్తుంటే వారికి గొప్ప దీవెనలు కలుగుతాయి. ఈ సేవలో పెట్టుబడి పెట్టిన డబ్బు గొప్ప లాభాలు తెస్తుంది. వాక్యం ద్వారా పొందిన వెలుగులో ఆనందించే నూతన విశ్వాసులు సత్యాన్ని ఇతరులకు చేరవేసేందుకు తిరిగి తమవంతుగా తమ ద్రవ్యాన్ని ఇస్తారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 49. ChSTel 215.3

అనేకమంది పనివారు పరిస్థితులు అభ్యంతరకరంగా, నిరాశాజనకంగా ఉన్నందుకు వెళ్లటానికి నిరాకరించే స్థలాల్లో, ఆత్మ త్యాగ స్పూర్తితో పని చేసే స్వచ్చంద సువార్త సేవకుల సేవ ద్వారా అద్భుతమైన మార్పు చోటు చేసుకోవచ్చు. ఈ సాదాసీదా సేవకులు ఓర్పు, పట్టుదలతో, మానవ సహాయం పై గాక తన ప్రసన్నతను తమకు చూపే దేవుని పై ఆధారపడి, కృషి చేస్తారు గనుక ఎక్కువ సాధిస్తారు. ఈ సేవకులు చేసే మేలెంత గొప్పదో ఈ లోకంలో ఎవరికీ అవగాహన కాదు. టెస్టిమొనీస్, సం.7, పులు. 22,23. ChSTel 216.1