క్రైస్తవ పరిచర్య

177/278

నవీన నెహెమ్యాలకు పిలుపు

నేడు సంఘంలో నెహెమ్యాల అవసరం ఎంతైనా ఉంది. వారు ప్రార్ధన చెయ్యగల, ప్రసంగించగల మనుషులు మాత్రమే కాదు. కాని ఎవరి ప్రార్ధనలు ప్రసంగాలు స్థిర సంకల్పంతో ఉద్దీపితమౌతాయో ఆ మనుషులు వారు. ఈ హెబ్రీ దేశభక్తుడు తన ప్రణాళికల సాకారానికి అనుసరించిన మార్గం వాక్య పరిచారకులు ప్రజానాయకులు అనుసరించాల్సిన మార్గం. తమ ప్రణాళికల్ని తయారు చేసుకున్నాక, సంఘం ఆసక్తిని సహకారాన్ని పొందే రీతిగా వాటిని సంఘానికి సమర్పించాలి. ఆ ప్రణాళికల్ని ప్రజలు అవగాహన చేసుకుని పనిలో పాలుపంచుకోవాలి. అప్పుడు దాని ప్రగతిలో వారికి ఆసక్తి ఉంటుంది. ప్రార్ధన, విశ్వాసం, వివేకవంతం శక్తిమంతం అయిన చర్యలు ఏమి సాధించగలుగుతాయో నెహెమ్యా కృషి సూచిస్తుంది. సజీవ విశ్వాసం శక్తిమంతమైన చర్యకు దారితీస్తుంది. నాయకుడు ప్రదర్శించే స్పూర్తిని చాలామట్టుకు, ప్రజలు ప్రతిబింబిస్తారు. ఈ సమయంలో లోకాన్ని పరీక్షించాల్సి ఉన్న సత్యాల్ని విశ్వసిస్తున్నట్లు చెప్పే నాయకులు దేవుని ముందు నిలబడటానికి ఓ ప్రజను సిద్ధం చెయ్యటానికి ఉత్సాహం చూపించకపోతే సంఘం అజాగ్రత్తగా, సోమరితనంగా, సుఖానుభవాన్ని ప్రేమించే దానిగా ఉండటానికి మనం ఎదురు చూడాలి. సదర్న్ వాచ్ మేన్, మార్చి 29, 1904. ChSTel 207.1