క్రైస్తవ పరిచర్య

149/278

దేవదూతలు మార్గం సిద్ధం చేస్తారు

నేటి సత్యానికి సంబంధించిన సేవలో అందరూ ఆసక్తి చూపించాలని నేను దర్శనంలో చూశాను. ఎవరి గమనానికి ఈ మౌన, మూగ దూతలు (పుస్తకాలు) వస్తాయో వారికి హెచ్చరిక, ఓదార్పు, హితవు ఇవ్వటానికి లేదా నమ్మకం పుట్టించటానికి సత్య ప్రచురణ దేవుడు ఏర్పాటుచేసిన సాధనం. తమ ముందున్న గంభీర దృశ్యాలకి వారిని సిద్ధం చేసేందుకు ప్రచురిత సత్యాలు వారి హృదయాల్ని సిద్ధం చెయ్యటంలో దేవదూతలు పోషించే పాత్ర ఉంది. టెస్టిమొనీస్, సం. 1, పు. 590. ChSTel 180.1