సంఘమునకు ఉపదేశములు

32/329

ఆలస్యమందలి అపాయము

రాత్రి దర్శనములలో అతి గంభీర దృశ్యము నాకు చూపబడెను. సుందరభవనములపై బ్రహ్మాండమైన అగ్నిగోళము పడి వానిని నాశనము చేయుట నేను చూచితిని. కొందరిట్లు చెప్పుట నేను వింటిని: “దేవుని న్యాయ విమర్శ ప్రపంచముపైబడ నున్నదని మాకు తెలియును; అయితే ఇంత త్వరలో నది సంభవించునని మేమెరుగము. “భయకంపిత స్వరములతో కొందరు ఇట్లనిరి, మీకు తెలిసియుండగా మీరు మాకెందుకు చెప్పలేదు? మాకు తెలియదు” అన్ని ప్రక్కల ఇట్టి నిందా వాక్యములనే నేను వింటిని. CChTel 98.1

గొప్ప వేదనతో నేను మేల్కొని మరల నిద్రించితిని. ఒక్క పెద్ద కూటములో నేనున్నట్లు కనుపించెను. ఒక అధికారి ఆ కూటమందు ప్రసంగించుచుండెను. ఆయన ముందు ప్రపంచపటము విప్పబడియున్నది. ఆ పటము దేవుని ద్రాక్షతోటను సూచించు చున్నదనియు, ఆ తోట సాగుచేయబడవలెననియు ఆయన చెప్పెను. పరలోకమునుండి వెలుగుపొందువారు దానిని ఇతరులకు ప్రతిఫలింపజేయవలెను. అనేక స్థలములలో దీపములు ముట్టించబడవలెను. ఈ దీపముల నుండి యింకను ఇతర దీపమలు వెలిగించబడవలెను. CChTel 98.2

ఈ మాటలు పునరుద్ఘాటించబడినవి: “మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకేగాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపముల వెలిగించి కుంచము క్రింద పెట్టరు. కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్థంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్‌క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.” మత్తయి 5:13`16. CChTel 98.3

గతించు ప్రతి దినము మనలను అంతయు సమీపమునకు చేర్చుచున్నది; అది మనలను దేవుని సమీపమునకుకూడ చేర్చుచున్నదా? మనము మెళుకువగా నుండి ప్రార్థించుచున్నామా? అనుదినము మనతో సహవాసము చేయు వారికి మన సహాయము, నడుపుదల అవసరము. కామితస్తలమునకు దించబడు మేకు వలె పరిశుద్దాత్మ సహాయ్యము వలన సమయానుకూలముగా మనము చెప్పుమాటను గ్రహించగల మనఃప్రవృత్తి వారి కుండవచ్చును. మరొకసారి మనము చేరలేని స్థానములో రేపేయాత్మలు కొన్ని యుండవచ్చును. ఈ సహ ప్రయాణీ కులపట్ల మన పలుకుబి యేమై యున్నది? క్రీస్తు చెంతకు వీరిని చేర్చుటకు మనము చేయు ప్రయత్నమేమి?9 CChTel 98.4

దూతలు నాలుగు గాలులను ఆపుచేయుచున్నప్పుడే శక్తి సామర్థ్యములతో మనము పనిచేయవలెను. నిరాలస్యముగా మనము మన వర్తమానము నందించవలెను. మన మతము క్రీస్తు కర్తగాను, ఆయన వాక్యము దైవసత్యముగాను గల ఒక విశ్వాసమును శక్తియునని నరలోకమునకు క్షీణదశందున్న యీ యుగ ప్రజలకును మనము రూఢపిరచవలెను. మానవులు గొప్ప ప్రమాదమునకు గురియైయున్నారు. వారు దైవరాజ్య పౌరులుగానో సాతాను నిరంకుశపాలన క్రింద దాసులుగానోయుందురు సువార్తద్వారా వారి ముందుంచబడిన నిరీక్షణను చేపట్టు నవకాశము అందరికి కల్పించబడవలెను. బోధకుడు లేకుండ దానిని వారెట్లు వినగలరు? దైవ సాన్నిథ్యమున నిలుచుటకుగాను మానవ కుటుంబమును సిద్ధము చేయుటయును నైతిక పునస్స ృష్టి అవసరము. సువార్తకు వ్యతిరేకముగా పనిచేయు నిమిత్తము రూపొందించబడిన శాస్త్రీయ దోషముల వలన ఆత్మలు మరణించ సిద్ధముగా నున్నవి. దేవునితోసహా సేవకులగుటకు ఎవరిప్పుడు తమ్మునుతాము సమగ్రముగా సమర్పించు కొనెదరు?10 CChTel 99.1

ఈనాడు మన సంఘములకు చెందు వారిలో నెక్కువమంది అతిక్రమ క్రియలయందును పాపములయందును మృతులై యున్నారు. బందులపైని తలుపువలె వారు విచ్చపోయెదరు. సంవత్సరముల తరబడి పవిత్ర మనో చైతన్యకర సత్యములను సంతృప్తితో వినిరేగాని వానిని ఆచరణలో పెట్టినవారు కాదు. ఆ హేతువుచేత సత్య ప్రశస్తిని గుర్తించుశక్తి వారిలో నానాటికి క్షీణించుచున్నది. గద్దింపుతోను, హెచ్చరికతోను నిండిన గంభీర సాక్ష్యములు వారిని పశ్చాత్తాపమునకు నడిపంచుటలేదు. విశ్వాసముద్వారా నీతిమంతుడని తీర్చబడుట, క్రీస్తు నీతి ` మానవ ముఖముగా దేవుని వద్దనుండి పొందజాలకున్నవి. పరలోక వర్తకుడు ప్రేమ, విశ్వాసములనడు ప్రశస్త భూషణములను వారిముందు పెట్టి ధరించుకొను నిమత్తము “అగ్నిలో పుటము వేయబడిన బంగారమును” “తెల్లనివస్త్రమును” కంటిచూపు కొరకు “కాటుక” కొనరండని వారిని ఆహ్వానించినను వారు తమ హృదయములను గట్టి పరచుకొని తమ నులువెచ్చని తనమునకు బదులు ప్రేమను, ఆసక్తిని పుచ్చుకొనజాలకున్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకొనుచు వారు దైవశక్తిని ఉపేక్షించుచున్నారు. ఇదే స్థితి యందున్నచో వారిని దేవుడు విసర్జించును. ఆయన కుటుంబ సభికులుగా నుండుటకు వారు అనర్హులగుచున్నారు. 11 CChTel 99.2

సంఘ పుస్తకములతో తమ పేర్లు దాఖలైన హేతువుచేత తాము రక్షించబడుదుమని సంఘ సభ్యులు తలంచరాదు. వారు సిగ్గుపడనక్కరలేని పనివారై దేవుని వలన అంగీకరించబడినవారిగా తమ్మునుతాము కనబర్చుకొనవలెను. క్రీస్తు, ఆజ్ఞానుసారము దినదినము వారు తమ శీలమును నిర్మించుకొనవలెను. అనుక్షణము ఆయనయందు విశ్వాసము ప్రదర్శించుచు ఆయన యందు జీవించవలెను. ఇట్లు క్రీస్తునందు వారు సౌమ్యముగా పెరిగిన స్త్రీ పురుషులై దేవుని వలన స్పష్టతరమైన, స్పష్టతమమైన వెలుగులోనికి నడిపించబడు బలమైన, ఆనందమయులైన, కృతజ్ఞులైన క్రైస్తవులగుదురు. ఇది వారి యనుభవము కాకున్నచో ఈ విధముగా విలపించువారిలోవారు కూడా ఉందురు. CChTel 100.1

“కోతకాలము గతించియున్నది. గ్రీష్మకాలము జరిగిపోయెను. నేను రక్షణ పొందకనే యున్నాను” నేను శరణు కొరకు ఆశ్రయదుర్గమున కెందుకు పోకుంటిని? నా యాత్మ రక్షణను ఉపేక్షించి దైవకృపను నేనెందుకు తృణీకరించితిని?” 12 CChTel 100.2

సత్యమును నమ్ముచున్నామని దీర్ఘకాలమునుండి చెప్పుకొన్న సహోదరులారా, దేవుడిచ్చిన వెలుగు, అధిక్యతలు, తరుణములకనుగుణ్యముగా మీ క్రియలున్నవా? ఇది మిమ్మును వ్యక్తిగతముగానే నడుగు గంభీర ప్రశ్న. నీతి సూర్యుడు సంఘముపై ఉదయించెను. కనుక ఇక ప్రకాశించుట సంఘము యొక్క విద్యుక్తధర్మము. పురోగమించుట ప్రతి ఆత్మ యొక్క ఆధిక్యత. క్రీస్తుతో జతపరచబడినవారు కృపయందును దేవకుమారుని జ్ఞానమునందును సంపూర్ణముగా పెరుగుదల పొందిన స్త్రీ పురుషులగుదురు. సత్యమును నమ్ముచున్నామని చెప్పుకొను వారందరును తమ సామర్థ్యము, తరుణములలో నెక్కువ భాగము నేర్చుకొనుటకు, ఆచరణలో పెట్టుటకు,వినియోగించినచో వారు క్రీస్తునందు బలపడి యుందురు. వారు కర్షకులేగాని, యాంత్రికులేగాని ఉపాధ్యాయులేగాని,కాపరులేగాని ` వారేమైనను దేవునికి తమ్మును తాము సమగ్రముగా సమర్పించుకొనియున్నచో పరలోక ప్రభువు కొరకు వారు నైపుణ్యముగల పనివారై యుందురు. 13 CChTel 100.3