సంఘమునకు ఉపదేశములు

31/329

దేవుడు పరిశుద్ధాత్మ వరమునకు దయచేయ గోరుచున్నాడు.

అనుభవశాలులైన పనివారు మన ప్రజలు నివశించు సమాజమందు ఒక ప్రత్యేక సువార్త యత్నము సల్పుచున్నచో ఆ పొలమందలి విశ్వాసులు ప్రభువు పనిచేయుటకుగాను మార్గము తెరచు నిమిత్తము తాము చేయుగలిగినదంతయు చేయ నిత్యబద్దులై యున్నారు. ప్రార్థనా పూర్వకముగా వారు తమ హృదయములను పరిశోధించుకొని దేవునితోను తమ సహోదరులతోను సహకరించుకుండ తమ్మును ఆటంకపరచు ప్రతి పాపమును ఒప్పుకొని ప్రభువు మార్గమును సరళము చేయవలెను. CChTel 96.3

రాత్రి దర్శనములలో దైవ జనుల మధ్య చేయబడు దృశ్యములు నాకు కనబడెను. అనేకులు దేవుని స్తుతించుచుండిరి. వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడిరి. ఇంక ఇతర సూచకక్రియలు చేయబడెను. పెంతుకోస్తు దినమునకు ముందు కనపర్చబడినట్లు, విజ్ఞాపనా స్వభావము గోచరమాయెను. వందలు వేల కొలది ప్రజలు కుటుంబములను సందర్శించుచు దైవ వాక్యమును వారికి బోధించుట చూచితిని. పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రజలు పశ్చాత్తాపపడిరి; అందుమూలమున యధార్థమగు మారుమనస్సు గోచరించెను. సత్యప్రచారము వినుటకు అన్ని ప్రక్కల ద్వారములు తెరువబడెను. పరలోక ప్రభావముతో ప్రపంచము వెలిగించబడినట్లగపడెను. యధార్థత సాత్వీకముగల దైవ ప్రజలు గొప్ప ఆశీస్సులు పొందిరి కృతజ్ఞతా స్తుతులు చెల్లించనున్న స్వరములను నేను వింటిని. 1844 సం॥లో మేము చూచినదిద్దుబాటు వంటిది మరియొకటి ఉన్నట్లు అగపడెను. 6 CChTel 96.4

నూతనముగా తన ప్రజలకు తన ప్రేమయందు బాప్తిస్మమిచ్చుచు పరిశుద్దాత్మ వరముచే వారిని తెప్పరిల్ల చేయవలెనని దేవుడు కాంక్షించుచున్నాడు. సంఘమందు పరిశుద్ధాత్మ విషయమైన కొరత ఏర్పడవలసిన అగత్యము లేదు. క్రీస్తు ఆరోహణమైన పిదప ప్రతి హృదయమును చేరగలిగినంత సమృద్ధిగాను, శక్తితోను పరిశుద్ధాత్మ కనిపెట్టుచు ప్రార్థించుచు, విశ్వసించుచున్న శిష్యులపైకి దిగి వచ్చెను. భవిష్యత్తులో భూమి దైవ మహిమతో శోభాయమానము కానున్నది. సత్యముచే పరిశుద్ధ పరచబడిన ప్రజ నుండి ప్రపంచమునకు ఒక పవిత్ర ప్రభావము బయలువెళ్ళ వలసి యున్నది. కృపావాతావరణముచే భూతలము ఆవరించబడనున్నది. దైవ సంగతులను మానవులకు చూపుట ద్వారా పరిశుద్దాత్ముడు మానవ హృదయముపై పనిచేయుచున్నాడు. 7 CChTel 97.1

ఆయనయందు వాస్తవముగా విశ్వాసముంచువారి నిమత్తము ప్రభువు గొప్ప పని చేయ నిచ్చగించుచున్నాడు. యేసు కొరకు ఆత్మలను సంపాదించుటలో తాము నిర్వహించగల పాత్రను గుర్తించుచు తమ సొంత ఖర్చులపై దండయాత్రకు బయలుదేరి తాము చేయగలిగిన పనిని చేయుటకు సంఘ సభ్యులు మేల్కొనినచచో, క్రీస్తు ధ్వజము క్రింద జేరుటకు అనేకులు సైతాను పటాలమును విడిచి వచ్చుట మనము చూతుము. ఈ మాటలలో నీయబడిన ఉపదేశమందలి (యోహాను 15:8) వెలుగు ప్రకారము మన ప్రజలు మెలగుచో దైవ రక్షణను మనము చూడగలము. విశేష ఉజ్జీవము సంధిల్లును. పాపులు మారుమనసు పొందెదరు. అనేక ఆత్మలు సంఘమున జేర్చబడును. క్రీస్తుతో మన హృదయములను సమైక్యపరచి ఆయన పనిలో మన జీవితములను లీనము చేసినచో పెంతెకొస్తు దినమున శిష్యులపైకి వచ్చిన ఆత్మ మనపైకి కూడ వచ్చును. 8 CChTel 97.2