సంఘమునకు ఉపదేశములు

27/329

కొత్త ప్రదేశములకు వలస పోవుట ద్వారా సాక్షమిచ్చుట

తన ప్రజలు పెద్ద సమాజములకు వలసపోయి అచ్చట స్థిర నివాసము లేర్పరచుకొనవలెనని దేవుని ఉద్దేశ్యము కాదు. క్రీస్తు శిష్యులు ఈ భూమిపై ఆయనకు ప్రతినిధులు. వారు అంధకార ప్రపంచములో దీపములవలె లోకములోని పట్టణములయందును, నగరముల యందును పల్లె సీమలయందును చెదరియుండవలెనని దేవుని సంకల్పము. రానై యున్న రక్షకుడు సమీపమునకు వచ్చెనని తమ విశ్వాసము ద్వారాను క్రియల ద్వారాను సాక్షమిచ్చుచు వారు దేవుని సేవకులై ఉండవలసి యున్నారు. CChTel 89.2

మన సంఘమందలి సభ్యులు ఇంకను తాము ప్రారంభమే చేయని ఒక కార్యమును సాధించగలరు. లోక సంబంధమగు లాభము కొరకు మాత్రమే ఎవరును క్రొత్త స్థలములకు పోరాదు. కాని జీవనోపాధికి మార్గములున్న చోటులలో సత్యమందు బలపడిన కుటుంబములు, ఒక్కొక్క స్థలములో ఒకటి రెండు చొప్పున సువార్త సేవకులుగాపనిచేయుటకు ప్రవేశించ వచ్చును. ఆత్మల విషయమయిన ప్రేమను, వారి కొరకు పనిచేయవలెనను భారమును కలిగి వారు ప్రజలను సత్యము లోనికి తెచ్చు మార్గములను యోజించవలెను. వారు పత్రికలు పంచిపెట్టవచ్చును. తమ గృహములలో కూటములు పెట్టవచ్చును. తమ పొరుగు వారితో పరిచయము కలిగించుకొని వారిని ఈ కూటములకు ఆహ్వానించవచ్చును. సత్క్రియలద్వారా వారిట్లు తమ జ్యోతిని ప్రకాశింపనీయవచ్చును. CChTel 89.3

పనివారు తమ తోటి మానవుల రక్షణార్థము పనిచేయుచు, ప్రార్థించును, దుఃఖించుచు దేవునితో ఒంటరిగా నిలువబడ వలెను. మీరు అమర్త్యకిరీటము కొరకు ఒక పందెమందు పరుగిడుచున్నారని జ్ఞాపకముంచుకొనుడి. దైవాను గ్రహముకంటే మానవ ప్రశంసల నెక్కువ ఆసించువారు పెక్కు మంది ఉండగా మీరు మాత్రము సాత్వికము కలిగి పని చేయుడి. మీ పొరుగువారి హృదయములను మార్చుమని దేవునితో విజ్ఞాపన చేయుచు ప్రార్థించునపడు విశ్వాసమును ప్రదర్శించ నేర్చుకొనుడి. ఈ విధముగా ఫలప్రదమకైన సువార్త సేవ చేయవచ్చును. బోధకునికిగాని క్రైస్తవ గ్రంథ విక్రేతకు గాని లొంగని కొందరిని మీరు సంధించవచ్చును. కొత్త స్థలములో నిట్లు పనిచేయువారు ప్రజలను సంధించుటలో క్రొత్త పద్ధతులను నేర్చుకొని ముందు వచ్చు పనివారికి మార్గము సరాళము చేయవచ్చును. 16 CChTel 90.1

మీ పొరుగు వారిని సందర్శించుడి. వారి యాత్మల రక్షణార్థమైన యాసక్తిని ప్రదర్శించుడి. ఆధ్యాత్మికమగుప్రతి శక్తిని మేల్కొల్పుడి. మీరు సందర్శించు వారితో లోకాంతము సమీపముగా నున్నదని చెప్పుడి. ప్రభువగు యేసుక్రీస్తు వారి హృదయ ద్వారములు తెరచి తన ప్రభావమును వారి మనసులపై ముద్రించును. CChTel 90.2

దైవ ప్రజలు తమ దినదిన కార్యకలాపములలో నున్నపుడు కూడా నితరులను క్రీస్తు చెంతకు నడిపించవచ్చును. ఇట్లు చేయునపుడు రక్షకుడు తమ సరసనే యుండును అను ప్రవస్త వాగ్దత్తము వారికుండనే యున్నది. తమ స్వకీయ దుర్భల యత్నములపై ఆధారపడవలెనని వారు తలంచనవసరము లేదు. చీకటిలోపడి కొట్టుమిట్టులాడుచున్న పాపులను ధైర్యపరచి, బలపరచి, తెప్పరిల్ల జేయుటకు క్రీస్తు వారికి మాటలనిచ్చును. విమోచకుని వాగ్ధత్తము సఫలమగుచున్నట్లు గుర్తించగా వారి విశ్వాసము బలపడును. వారు ఇతరులకు ఆశీర్వాదముగా నుండుటయే గాక క్రీస్తు కొరకు వారు చేయు పని వారికి ఆశీర్వాదదాయకముగ నుండును. 17 CChTel 90.3

బైబిలును యథాతథముగ ప్రజలకు బోధించుటద్వారా గొప్ప పని చేయవచ్చును. ప్రతి మానవుని గృహమునకు దైవ వాక్యమును కొనిపోయి దాని తేటమాటలను ప్రతి మనుష్యుని మనస్సాక్షి స్పష్టపరచును. “లేఖనములను పరిశోధించుడి” అను రక్షకుని యాజ్ఞను పునరుద్దరించుడి. యెహాను 5:39. దైవాజ్ఞానము కొరకు బైబిలును యథాతథముగ పరిగ్రహించుడని వారిని హెచ్చరించుడి. పిమ్మట వెలుగు ప్రకాశించినపుడు ప్రతి ప్రశస్త కిరణమును సంతోషముతో అంగీకరించి తన్మూలముగా వచ్చు ఫలితములను నిర్భయముగా నెదుర్కొనుడని హెచ్చరించుడి. 18 CChTel 90.4

మన సంఘ సభ్యులు వేదపాఠములు బోధించుటద్వారాను క్రైస్తవ పత్రికలును పంచి పెట్టుటద్వారాను ఇతోధికముగా ఇంటింట సువార్త చేయవలసియున్నారు. సత్యమును స్వలాభాపేక్ష లేకుండ ప్రకటించుటయు, దేవుని సేవ కొరకు ద్రవ్యము నిచ్చుటయు ఒక తరుణమని మానవులు గుర్తించినప్పుడే క్రైస్తవ ప్రవర్తన సౌమ్మముగను సమగ్రముగను ఏర్పడగలదు. పగలున్నంతసేపు దైవ ప్రేమలో మన ఆత్మలను నిల్పుకొనుచు ప్రభువు మనకిచ్చిన ద్రవ్యమును తరువాతి కర్తవ్యమును వినియోగించుచు మనము సమస్త జలముల ప్రక్క విత్తనములు విత్తవలెను. చేతికివచ్చిన పనిని మనము నమ్మకముగా చేయవలెను. ఏది సమర్పించవలెనని కోరబడితిమో దానిని మనము సంతోషముతో సమర్పించవలెను. సమస్త జలముల ప్రక్క మనము విత్తనములు విత్తునపుడు “సమృద్దిగా విత్తువాడు సమృద్దిగా పంటకోయును” అని గుర్తింతుము. 2 కొరింథి. 9:6. 19 CChTel 91.1