సంఘమునకు ఉపదేశములు

25/329

క్రీస్తుని యధార్థ అనుచరులు ఆయనను గూర్చి సాక్షమిచ్చెదరు

మీరెల్లరు క్రీస్తు సేవలో ఆసక్తి కలిగియున్నచో ప్రస్తుత కాల సందేశము మహావేగముతో అన్ని దేశములలోను,సర్వప్రజకును, సర్వ రాష్ట్రములకును, సర్వభాషలు మాటలాడువారికిని ప్రకటించబడును. 6 CChTel 85.3

పరిశుద్ధ పట్టణమందు ప్రవేశించనున్న వారందరు తమ ప్రాపంచిక జీవిత వ్యవహారములలో క్రీస్తును ప్రదర్శించవలెను. క్రీస్తుకు రాయబరులుగాను సాక్షులుగాను ఇదియే వారిని తీర్చిదిద్దును. లోక పాపములను మోయు దేవుని గొర్రెపిల్ల చెంతకు పాపులను నడుపుచు వారు దురాచారములకు వ్యతిరేకముగా సుస్పష్టమైన, నిర్ధిష్టమైన సాక్ష్యమునీయవలెను. ఆయన నంగీకరించు వారందరికి దేవకుమారులగుట కాయన శక్తి నిచ్చును. దైపట్టణమందు మనము నూతన జన్మ పథముద్వారానే చేరగలము. అది ఇరుకైన మార్గము. మనలను లోపలకు నడుపు ముఖద్వారము తిన్ననైనది. రక్షించబడుటకు నూతన హృద యము, నూతన స్వభావము ఉండవలెనని మనము స్త్రీ పురుషులను పిల్లలను ఆ మార్గములో నడిపించవలెను. పారంపర్యముగా వచ్చు ప్రాచీన గుణగణములు జయించబడవలెను. ఆత్మ యొక్క సహజవాంఛలు పరివర్తన చెందవలెను. మోసము, అబద్ధములాడుట, దుర్భాషలాడుట వర్ణించబడవలెను. స్త్రీ పురుషులు క్రీస్తువలె తీర్చిదిద్దు నూతన జీవితమును జీవించవలెను. 7 CChTel 85.4

సహోదరులారా, సహోదరీలారా, మిమ్మును చెరపట్టు తంత్రములను ఛిన్నాభిన్నము చేయ మీరిచ్చగింతురా? మరణము యొక్క జాడత్వముతో సమానమగు ఈ సోమరితనమునుండి మేల్కోందురా? మీకిష్టమున్నను లేకున్నను పనికి వెళ్లుడి. ప్రజలకు సత్యమును చాటి యేసు చెంతకు ఆత్మలను తెచ్చు వ్యక్తిగత ఉద్యమములో పాల్గొనుడి. ఇట్టి పనియే మీరు చరుకుదనమును బలవర్ధకౌషధమును ఇచ్చును. అది మీకు కనువిప్పు కలిగించి బలిమునిచ్చును. వ్యాయామమువలన మీ ఆధ్యాత్మిక శక్తులు బలపడును. తత్ఫలితముగా విజయవంతముగా మీ స్వరక్షణను సాధించుకొనగలరు. క్రీస్తును నమ్ముచున్నామని చెప్పు పెక్కుమంది జీవచ్ఛవములై యున్నారు. వారిని మేల్కొలుపుటకు సర్వ ప్రయత్నములు సల్పుడి. హెచ్చరించుడి, బ్రతిమాలుడి, మందలించుడి. కరగించుశక్తిగల దైవప్రేమ మంచువలె గడ్డకట్టిన వారి స్వభావములను గరగించగలందులకు ప్రార్థించుడి. వారు విన నిరాకరించిననుమీ పని వ్యర్థము కాదు. ఇతరులను దీవించుటకు ఉద్యమించుటలో మీ యాత్మ ఆశీర్వదించబడును. 8 CChTel 86.1

తమ అవిద్య వలన ప్రభువు పనిలో పాలుపొందజాలమని యెవరును తలంచరాదు. మీరు చేయు నిమిత్తము దేవునికొక పనికలదు. ప్రతి మనుష్యునకు తన తన పనిని ఆయన నియమించెను. మీకై మీరు లేఖనములను పరిశోధించవచ్చును. లేక చదివించుకొనవచ్చును. “నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అది తెలివిలేని వారికి తెలివి కలిగించును”. కీర్త 119:130. పని విషయము మీరు ప్రార్థింపవచ్చును. విశ్వాసముతోను నిర్మల హృదయముతోను చేయబడు ప్రార్థన పరలోకమందు వినపడును. మీ శక్తి కొలది మీరు పనిచేయవలెను. 9 CChTel 86.2

మానవులందెట్టి మార్పు కలుగునో మరణించ సిద్ధముగానున్న ఆత్మలను రక్షించుటలో తమ పలుకుపబడి ద్వారా వారేమి సాధించగలరో ప్రపంచమునకు బయలుపరచుటకుగాను పరలోక జ్ఞానులు మానవ కార్యకర్తలతో సహకరించ వేచియున్నారు. CChTel 86.3

నిర్జన సముద్ర తీరమున కలిగిన ఓడవలె అన్ని భూభాగములలోను యథాయథలై పాపములందు మరణించుచున్న ప్రజల కొరకు ఓరిమితోను, శాంతముతోను పాటుపడు నిమిత్తము క్రీస్తు మనలను పిలుచుచున్నాడు. క్రీస్తు మహిమను పంచుకొనువారు బలహీనులకు, పేదలకు నిస్పృహ చిందిన వారికి సహాయము చేయుట ద్వారా ఆయన సేవను కూడా పంచుకొనవలెను. 10 CChTel 87.1

ప్రతి విశ్వాసియు సంఘముతో మనఃపూర్వకముగా సన్నిహితత్వము కలిగి యుండవలెను. సంఘ పురోభివృద్ధి అతని ప్రథమాసక్తియై యుండవలెను. సంఘముతోడి తన సంబంధము స్వలాభార్థము గాక సంఘ లాభము కొకకేయని యతడు మనశుద్ధితో గ్రహించవలెను. అట్లు కానిచో అతడు లేకుండానే సంఘము ఇతోధికముగా ప్రగతి చెందగలదు. దైవ సేవా వ్యాప్తి కొరకు ఏదో కొంత అందరును సాయము చేయగలరు. తుచ్ఛ భోగముల కొరకు అధిక ధనవ్యయము చేయువారు కొందరు గలరు. వారు తమ తమ ఇచ్ఛలను తీర్చుకొందురు. కాని సంఘ పోషణకు ద్రవ్యమునిచ్చుట భారమగు పన్నుగా నెంచెదరు. సంఘాధిక్యతల వలన లాభము పొందుట వారికిష్టమేగాని దాని ఖర్చులు ఇతరులు చెల్లించవలెనని కోరెదరు. 11 CChTel 87.2

క్రీస్తు సంఘమును అతి సమంజసముగా ఒక పటాలమునకు పోల్చనగును. ప్రతి సైనికుని జీవితము కాయ కష్టముతోను, శ్రమతోను, అపాయముతోను నిండియుండును. అన్ని వైపుల అప్రమత్తులగు శత్రువులుందురు. వీరు ఎన్నడును కునుకక, తన స్థానమును ఎన్నడును వితడువక యుండు అంధకార శక్తుల అధిపతిచే నడిపించబడుచున్నారు. క్రైస్తవుడు తాను కావలియుండు స్థానమును విడిచి దూరముగా వెళ్లినప్పుడెల్ల మహా బలశాలియగు ఈ శత్రువు ఆకస్మికముగాను దౌర్జన్యముగాను వారిపై బడును. సంఘ సభికుల చురుకుదనము. అప్రమత్తత కలిగియుండిననే గాని ఈ తన తంత్రాంగములచే వారు జయింపబడుట తథ్యము. CChTel 87.3

కావలి కాయుచుండవలసిన సమయమున సగము మంది సైనికులు సోమరితనముగా నుండి లేక నిద్రించినచో ఏమి సంధిల్లును? దాని పర్యవసానము అపజయము; చెర, లేక మరణము. శత్రువుల చేతి నుండి యెవరైనను తప్పించుకొన్నచో బహుమతి పొందుటకు వారు అర్హులుగా పరిగణించబడుదురా? పరిగణించబడరు; వారికి సత్వర మరణదండన తథ్యము. క్రీస్తు సంఘము అజాగ్రత్తగా అపనమ్మకముగా నున్నచో దాని పర్యవసానములు మరింత ఘోరమైనవి. నిద్రించుచున్న క్రైస్తవ యోధులు ` దీనిపట్ల భయానకమైనది మరి యొకటున్నదా? అంధకార శక్తుల అధిపతి వశం వదులమైనచో ప్రపంచమందు మన మెట్లు అభివృద్ధి చెందగలము? యుద్ధ సమయమందు ఆసక్తి శూన్యులుగను, బాధ్యతా రహితులుగను ఉండి, జయాపజయముల విషయం నిరసన స్వభావము ప్రదర్శించుచు నిలిచియుండువారు తమ వైఖరిని మార్చుకొనుట ఉత్తమము; లేదా తక్షణమే పటాలమును విడిచి పెట్టుట మంచిది. 12 CChTel 87.4