సంఘమునకు ఉపదేశములు

23/329

సబ్బాతాచరణయందలి దీవెనలు

నాల్గవ ఆజ్ఞావిధులను గుర్తెరిగి రబ్బాతునాచరించువారిని ఆ దినమున పరలోకమంతయు పరిశీలనగా చూచుచున్నట్లు నాకు అగపడెను. ఈ సంస్థ పట్ల వారికున్న ఆసక్తిని గౌరవమును దేవదూతలు గుర్తించుచున్నారు. మిక్కిలి పరిశుద్ధ ఆలోచనలు గలిగి ప్రభువగు దేవుని తమ హృదయములలో పరిశుద్ధపరచును, సబ్బాతు పవిత్ర ఘడియలను తమ శక్తి కొలది కాపాడుచు, సబ్బాతును ఆనందకరమైనదని పిలచుట ద్వారా దేవుని గౌరవించు వారికిదూతలు ప్రత్యేకముగా వెలుగును ఆరోగ్యమును దీవెనలను ఇచ్చుచున్నారు; వారికి ప్రత్యేక బలము ఇయ్యబడినది. 19 CChTel 82.1

దైవ విధులను అక్షరాల గైకొనుటవలన శారీరక ఆధ్యాత్మిక ఆశీర్వాదములు సంధిల్లిను. 20 CChTel 82.2

“నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండ దానిని అనుసరించుచు ఏకీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు.” “విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యోహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షము చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వాని నానందింపజేసెదను.” యెషయా 56:2,6,7. 21 CChTel 82.3

ఆకాశమును భూమియు వుండు నంతవరకు సృష్టి కర్త యొక్క శక్తకి సూచనగా సబ్బాతు ఉండును. భూమి పై మరల ఏదేను శోభిల్లు నప్పుడు దైవ పరిశుద్ధ దినము సూర్యుని క్రింద నివసించు వారందరిచే ఘనపరచబడును. మహిమ పరచబడిన నూతన భూమినివాసులు “ఒక విశ్రాంతి దినము నుండి మరి యొక విశ్రాంతి దినమునకు” “నన్నారాధించుటకు ” పైకి వచ్చెదరని “ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” 22 CChTel 83.1