సంఘమునకు ఉపదేశములు

22/329

లోక వ్యవహారముల నుండి విశ్రమించు ఒక దినము

మానవుడు తన స్వల్పాల్ప ఐహికాసక్తులను సాధించుకొనుటకు సర్వశక్తునితో రాజీకుదుర్చుకొన జూచుట చాలా తుచ్ఛాలోచనయగును. సబ్బాతును సంపూర్ణముగా ఎంత నిర్దాక్షిణ్యమగు అతిక్రమణయో అప్పుడప్పుడు ఆ దినమును ప్రాపంచిక వ్యవహారములకు వినియోగించు కొనుట కూడ అంతటిదే; కారణమేమనగా ఇది దైవాజ్ఞలను సదుపాయ విషయములుగా చేయుటయగును. “నీ దేవుడైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.” అని సీనాయి పర్వతమునుండి ఆయన నొక్కి వక్కాణించెను. తనను ద్వేషించినవారికి మూడు నాలుగు తరముల పర్యంతము తండ్రుల దోషము కుమారులమీదికి రప్పింతుననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను గైకొను వారికి వెయ్యి తరముల పర్యంతము కృపజూపెదననియు వచించు ఆ ప్రభువు సగము విధేయతనుగాని, విభజింపబడిన ఆసక్తిగాని అంగీకరించడు. పొరుగు వాని సొత్తును అపహరించుట స్వల్ప విష యము కాదు. అట్టి కార్యకర్తలపై విధింపబడు శిక్షయు పెద్దదే. అయినను పరలోక జనకుడు ఆశీర్వదించి ప్రత్యేక కార్యము కొరకు కేటాయించిన సమయమును కొందరు దొంగలించుచున్నారు. ` తన సహమానవుని సొత్తును దొంగలించుటను అసహ్యించు కొనువాడు సహితము. 15 CChTel 79.3

మాటలు ఆలోచనలు అదుపు చేయబడవలెను. విశ్రాంతి దినమున లోక వ్యవహారములను చర్చించి కార్యసన్నాహములు చేయువారు ఆ పనులు చేసినట్లే దేవుని వలన పరిగణించబడెదరు. సబ్బాతును పరిశుద్ధముగాఆచరించవలెనన్న లోక విషయము లపై తలంచుట కైనను మనస్సులను పోనీయరాదు. 16 CChTel 80.1

దేవుడు ఆజ్ఞాపించిన దానికి మనుష్యులు లోబడవలెనని ఆయన ఉద్ధేశ్యము. మానవులు దానిని చేయుటకు వీలున్నదో లేదో అని దేవుడు బోగట్టా చేయడు. జీవమునకును మహిమకును దగు యేసు అవిధేయతా ఫలితము నుండి మానవుని రక్షించుటకు దుఃఖభాగిగాను, విచారగ్రస్తునిగాను తన్నుతాను చేసికొని అవహేళనను, మరణమును పొందుటకు ఉన్నత స్థాయిని ఠీవిని విడిచినపుడు అనుకూలతను వినోదములను గూర్చి పరిగణించినవాడు కాడు. మానవుని తన పాపములలో రక్షించుటకుగాను పాపముల నుండి రక్షించుటకు యేసు మరణించెను. ఏమి సంభవించినను మానవుడు తన్ను తాను ఉపేక్షించుకొని దేవునికి విధేయుడై తన పాప మార్గమును విడిచి క్రీస్తు మాదిరి ననుసరించుచు తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడిరచవలెను. CChTel 80.2

లోకసంబంధమగు లాభము కొరకు సబ్బాతు దినమున ఏ పరిస్థితులలోను పనిచేయుట న్యాయము కాదు. ఒకరిని క్షమించినచో దేవుడు అందరిని క్షమించవచ్చును, నిరుపేదయగు సహోదరుడు సబ్బాతు దినమున పనిచేసి ఎందుకు తన కుటుంబ మును ఇతోధికముగా పోషించుకొనరాదు? తక్కిన సహోదరులందరు లేక మనమందరము వీలుగా ఉన్నప్పుడు మాత్రమే సబ్బాతును ఎందుకు ఆచరించరాదు? సీనాయి పర్వతమునుండి వచ్చు స్వరము ఇట్లు ఉత్తరమిచ్చుచున్నది: “ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.” నిర్గమ 20:9, 10. CChTel 80.3

దైవాజ్ఞలను కాపాడు విధిని వయస్సు తొలగింపజాలదు. అబ్రహాము తన అవసానకాలమందే కఠోరముగా పరీక్షించబడెను. ప్రభువు పలికిన వచనములు భయంకరములుగాను, అవాంఛనీయములుగాను ఈ వృద్ధునికి అగపడెను. అయినను వాని యధార్థతను అతడు శంకించలేదు; లేక తన విధేయతయందు చాంచల్యము చూపినవాడు కాడయ్యె. తాను ముసలివాడననియు ఆ కారణముగా తన జీవితానంద సర్వస్వమగు కుమారుని అర్పింపజాలమనియు నతడు బ్రతిమాల నవకాశము కలదు. తన కుమారుని విషయము చేయబడిన వాగ్దాత్తములకీ యానతి విరోధముగా నున్నదని యతడు ప్రభువుకు జ్ఞాపకము చేయ వీలున్నది. కాని అట్లు గాక అబ్రహాము సణుగక నిందించక విధేయత చూపెను. దేవుని యందతని నమ్మకము ఎదురాడనిదై యుండెను. 17 CChTel 80.4

సబ్బాతును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనని వారిని గద్దించువారిగా యేసుని బోధకులండవలెను. సబ్బాతు దినమున లోకవార్తలు చెప్పుకొనుచు మేము సబ్బాతు నాచరించువారమని చెప్పుకొనువారిని క్రీస్తు బోధనలు దయగాను గద్దించవలెను. దేవునికి ఆయన పరిశుద్ధ దినమందు భక్తి చూపుటలో వారు ప్రజలను ప్రోత్సహించవలెను. CChTel 81.1

పరిశుద్ధ ఘడియలను ఎవరును వ్యర్థపుచ్చరాదు. సబ్బాతు దినమున ఎక్కువసేపు నిద్రించు సబ్బాతీయుల విషయము దేవునికి సంతాపము. అట్లు చేయుటద్వారా వారు తమ సృష్టికర్తను అవమానపరిచి, తమ మాదిరిద్వారా తక్కిన ఆరు దినములు విశ్రాంతి పొందజాలనంత ప్రశస్తమైనవని భావించినట్లు వ్యక్తమగుచున్నది. వారములో నిద్రను కోల్పోయినను సరే వారు ద్రవ్యమును సంపాదించి, పరిశుద్ధ సమయమంతటిని నిద్రకు వినియోగించతురు. “సబ్బాతు విశ్రాంతి దినముగా ఇయ్యబడెను. కూటమునకు హాజరగుటద్వారా విశ్రాంతిని పోగొట్టుకొనజాలను. కారణమేమనగా నాకు విశ్రాంతి అవసరము” అని తమ్మును తాము సమర్థించు కొనెదరు. పవిత్ర దినమును ఇట్లు వారు దుర్వినియోగపరచుచున్నారు. ఆ దినమందు ప్రత్యేకముగా వారు తమ కుటుంబ సభ్యుల ను సబ్బాతాచరణయందు ఆసక్తులుగా జేసి ప్రార్థన మందిరమునందు ఉన్న కొద్దిమందితోనో లేక ఎక్కువమందితోనో సమకూడవ లెను. సబ్బాతుపైనున్న దైవ ప్రభావము తమతో వారమంతయు నుండులాగున వారు తమ సమయమును, బలమును ఆధ్యాత్మిక కార్యకలాపములకు సమిర్పంచవలెను. వారమందలి తక్కిన దినములు భక్తియుత ఆలోచనకు ఉద్రేకములకు సబ్బాతు దినమంత అనువైనవి కావు. 18 CChTel 81.2

“అన్ని కాలములలో సబ్బాతు పవిత్రముగా నాచరింపబడి యున్నచో నాస్తికులుగాని, విగ్రహారాధికులుగాని యుండెడివారు కారు. ఏదేను వనమందు స్థాపింపబడిన సబ్బాతు ప్రకృతి యంత పురాతన మైనది. సృష్ట్యారంభము నుండి మన పితరులు సభ్బాతును ఆచరించుచు వచ్చిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యమందు మ్రగ్గినపుడు వారి యజమానులు సబ్బాతును మీరుటకు వారిని ఒత్తిడి చేసిరి. అందుచేత వారు సబ్బాతు పరిశుద్ధతను చాలమటుకు విస్మరించిరి. సీనాయి పర్వతముపై ధర్మశాస్త్రము ప్రకటింపబడినపుడు “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా నాచరించుటకు జ్ఞాపకముంచుకొనుము’ అను మాటలతో నాల్గవ యాజ్ఞ ప్రారంభమాయెను. సబ్బాతు ఎప్పుడో స్థాపింపబడి యుండెనని ఇది చూపుతున్నది. ఇది సృష్టిలో నారంభమకైనది. మానవుల మనస్సుల నుండి దేవుని గూర్చిన జ్ఞానమును తుడిచివేయు నిమిత్తము ఈ స్మారక చిహ్నమును విచ్ఛిన్నము చేయుటకు సాతానుడు ప్రయత్నించెను. తమ సృష్టికర్తను మరచునట్లు మానవుల నతడు నడిపింపగలిగినచో వారు చెడుగును ప్రతిఘటించుటకు ప్రయత్నింపరు. అట్టి యెడ సాతానుకు వారు వశులగుట తథ్యము.” ` పేట్రియార్క్స్‌ అండ్‌ ప్రోఫెట్స్‌. పుట 336. CChTel 81.3