స్వస్థత పరిచర్య
సహోదర ప్రేమ
జాతి లేక హోదా లేక మత బేధాల్ని క్రీస్తు గుర్తించలేదు. దేవుడిచ్చన వరాల్ని స్థానికంగాను జాతీయంగాను సొమ్ము చేసుకోవడానికి లోకంలో ఉన్న తక్కిన దైవ కుటుంబాన్ని మినహాయించాలని సదూకయ్యిలు పరిసయ్యులు భావించారు. కాని వేరు చేసే ప్రతి అడ్డుగోడను విరగగొట్టటానికి క్రీస్తు వచ్చాడు. తన వరాలైన కరుణ ప్రేమలు, భూమిని తెప్పరిల్లజేసే గాలి, వెలుగు, వర్షాధారల వలె అందరికి చెందినవని చూపించటానికి ఆయన వచ్చాడు. MHTel 12.1
ఏ మనిషిని అనర్హుడిగా ఎంచి ఆయన దాటిపోలేదు. ప్రతీ ఆత్మనూ స్వస్థ పర్చటానికి ప్రయత్నించాడు. ఆయన ఎవరి సహవాసంలో ఉన్నా సమయానికి పరిస్థితులకు ఉచితమైన పాఠాలు సమర్పించాడు. మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే ఆలక్ష్యం లేక అవమానం వారికి దైవ మాన వుడి సానుభూతి అవసరమన్న విషయాన్ని ఆయనకు మరెక్కవగా గుర్తు చేసింది. మిక్కిలి దుర్మార్గులు, భవిష్యత్తు లేనివారిగా కనిపించేవారు. తాము నిరపరాధులు, నిరపాయులు దేవుని బిడ్డలు అయ్యే ప్రవర్తనను కలిగి ఉండవచ్చు అన్న నిరీక్షణను ప్రజల్లో కలిగించటానికి ఆయన కృషి చేసాడు. MHTel 12.2
సాతాను నియంత్రణ కింద ఉండి మార్గం తొలగి, అతడి ఉచ్చుల్లో నుండి బయట పడటానికి శక్తిలేని వారిని ఆయన తరుచుగా కలిసేవాడు. నిరాశ,వ్యాధి శోధనలకు గురి అయి పతనమైన అలాంటి వ్యక్తితో యేసు మిక్కిలి దయగల మాటలు, అతడికి అవసరమైనవి అతడు గ్రహించగల మాటలు మాట్లాడేవాడు. ఆయన కలిసిన ఇతరుల, ఆత్మల విరోధి, సాతానుతో బాహాబాహీ పోరాడుతున్న వ్యక్తులనుమీకు తప్పక జయం కలుగుతుంది. సహింపు కలిగి పోరాడండి, దేవ దూతలు మీ పక్షాన ఉన్నారు. వారు మీకు జయం చేకూర్చుతారు అంటూ ప్రోత్సహించేవాడు. MHTel 12.3
సుంకరుడి భోజన బల్ల వద్ద ఆయన అతిధిగా కూర్చున్నాడు తన సానుభూతి సాంఘిక సౌజన్యం వలన మానవ గౌరవాన్ని గుర్తిస్తున్నట్లు సూచించాడు. మనుషులు ఆయన విశ్వాసాన్ని పొందటానికి తహతహ లాడరు. దప్పి గొన్నవారి హృదయాలకు ఆయన మాటలు జీవింపజేసే శక్తిలా మారాయి. నూనత ఉద్వేగాలు మేల్కొన్నాయి. సమాజం దూరంగా ఉంచుతున్న వీరికి ఓ నూతన జీవన మార్గం సాద్యపడింది. MHTel 13.1
యేసు యూదుడైనా తన జాతి పరిసయ్యుల ఆచారాన్ని తోసిపుచ్చి సమరయులతో కలసి మెలసి తిరిగాడు. వారి పూర్వ దురభిప్రాయాల్ని లెక్క చేయకుండా ఈ పీడిత ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించాడు. వారితో కలసి వారి గృహాల్లో నిద్రించాడు., వారిచేతులతో వడ్డించిన భోజనాన్ని వారితో కలసి తిన్నాడు. వారి వీధుల్లో బోధించాడు. వారి పట్ల మిక్కిలి దయగా, మర్యాదగాను మెలగాడు. మానవ సానుభూతి బంధంతో వారి హృదయాల్ని ఆకర్షిస్తున్న తరుణంలో దైవ కృప యూదులు తోసిపుచ్చిన రక్షణను వారికి అందించింది. MHTel 13.2