స్వస్థత పరిచర్య
6—సేవ చెయ్యటానికి రక్షించబడ్డాం
గలిలయ సముద్రం పై అది ఉదయం తుఫానులో రాత్రంతా సముద్రం పై నడిచి తరువాత యేసు ఆయన శిష్యులు ఒడ్డుకు వచ్చారు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు సమద్రాన్ని భూమిని తాకుతూ ప్రశాంతతా దీవెనలు కుమ్మరిస్తున్నాయి. అయితే తీరం పై అడుగు పెడుతుండగానే ఆ రాత్రి తుఫాను తాకిడికి ఉగ్రరూపం దాల్చిన సముద్రం కంటే భయానక దృశ్యం వారికి ఎదురయ్యింది, సమాధుల్లో ఎక్కడో తాము దాక్కుంటున్న స్థలం నుండి పిచ్చివాళ్ళు వారిని ముక్కలు ముక్కలుగా చీల్చి వెయ్యటాని కన్నట్లు వారి మీదికి దూసుకు వచ్చారు. తమను బంధించి ఉంచిన గొలుసులు తెంపుకొని వచ్చిన వారి ఒంటిమీద ఇంకా కొన్ని ముక్కలు వేళాడుతున్నాయి. కోసుకు పోయిన శరీరం నుండి రక్తం కారుతున్నది. జడలు అల్లుకొని వేళాడుతున్న వారి తలవెంట్రుకల్లో నుంచి వారి కళ్ళు తేరి చూస్తున్నాయి. వారిలో మానవాకారం తుడుచుకు పోయినట్లు కనిపించింది. వారు మనుషుల కన్నా ఎక్కువగా మృగాల్లా కనిపిస్తున్నారు. MHTel 68.1
శిష్యులు వారి మిత్రులు భయంతో పరుగులు తీశారు. యేసు తమతో లేడని కాసేపటికి గుర్తించారు ఆయన్ని వెదకటానిక పూనుకున్నారు. వారు ఆయన్ని ఎక్కడ విడిచి పెట్టారో ఆయన అక్కడే ఉన్నాడు. తుఫానును సద్దణచిన ఆయన క్రితంలో సాతునుని కలిపి అతణ్ణి జయించిన ఆయన ఈ దయ్యాల్ని చూసి పారిపోడు. పళ్ళు కొరుకూత నోటివెంట నురుగు కార్చుకుంటూ ఈ మనుషులు ఆయన్ని సమీపించినపుడు శాంతించంటూ కెరటాలకు సైగ చేస్తూ ఎత్తిన ఆ హస్తాన్ని యేసు ఎత్తాడు. ఆమనుషులు ఇక ముందుకి రాలేకపోయారు. ఉగ్రులై ఆయన ముందు నిలబడ్డారు కాని ఏమి చెయ్యలేకపోయారు. MHTel 68.2
వారిని విడిచి బయటికి రావలసినదిగా ఆ పవిత్రాత్మల్ని అధికారంతో ఆయన ఆదేశించాడు. తమను హింసింస్తున్న దయ్యాల నుంచి తమను రక్షించగల మహానీయుడు తమకు సమీపంగా ఉన్నాడని ఆ మనుషులు గుర్తించారు. వారు కృపను యాచించటానికి రక్షకుని పాదాల పై పడ్డారు. వారు నోరు తెరచినపుడు దయ్యాలు వారి ద్వారా మాట్లాడుతూ ఇలా ఆరిచాయి. “ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి|| కాలము రాక మునుపే మమ్మును బాధించుటక ఇక్కడికి వచ్చితివా? మత్తయి 8:29 MHTel 68.3
ఈ దురాత్మలు తమ బాధితుల్ని విడిచి పెట్టక తప్పలేదు. ఆ బాధితుల్లో అద్భుతమైన మార్పు వచ్చింది. మారినవారి మనసుల్లో వెలుగు ప్రకాశించింది. తెలివితేటలతో వారి నేత్రాలు వికసించాయి. ఎంతో కాలం సాతాను రూపంలో ఉండి కురూపులైన వారి ముఖాలు హఠాత్తుగా శాంతరూపాలు ధరించాయి రక్తపు మరకలు గల చేతులు నెమ్మదిగా ఉ న్నాయి. వారు తమ స్వరాలెత్తి దేవున్ని స్తుతించారు. MHTel 69.1
ఇంతలో మానవ నివాసాన్ని కోల్పోయిన ఆ దయ్యాలు ఓ పందుల మందలో ప్రవేశించి వాటికి నాశనం కలిగించాయి. ఆ వార్తను తెలపటానికి మంద కాపురులు వడివడిగా వెళ్ళారు. ఆ గ్రామంలోని జనులందరూ యేసును కలవటానికి తరలివచ్చారు. ఆగ్రామానికి ఆ ఇద్దరు సింహస్వప్నంలా ఉన్నారు. ఇప్పుడు వారు బట్టలు వేసుకొని, బుద్దిగా యేసు పాదల వద్ద కూర్చుని ఆయన మాటలు వింటూ, తమకు స్వస్థత కలిగించిన ఆయన నామాన్ని మహిమపర్చుతున్నారు. కాగా ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన వారు సంతోషించడంలేదు. ఈ సాతాను బందీల విడుదల గడియకన్నా వారికి పందుల నష్టపు గడియ గొప్పదిగా ఉన్నది. భయభ్రాం తులై యేసు చుట్టు మూగి తమను విడిచి వెళ్ళిపొమ్ముని బతిమాలారు. అందుకు యేసు సమ్మతించి వెంటనే దోనే ఎక్కి అద్దరికి పయనమ య్యాడు. MHTel 69.2
“ఆయనలో జీవముండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహించకుండెను. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామముందు విశ్వాసముం చువారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను”. యెహాను 1:4-12 “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీకు దేశస్తునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది”. MHTel 69.3
రోమా 1:16 దయ్యాలు పట్టిన, పునరుద్దరణ పొందిన వీరి మనోభావన వేరుగా ఉన్నది. తమ విమోచకుని సహచర్యంలో ఉండాలని వారు ఆకాంక్షించారు. తమను హింసించి తమ బతుకులను వ్యక్తం చేసిన దయ్యాల నుండి ఆయన సముఖంలో భద్రత ఉంటుందని వారు భావించారు. పడవ ఎక్కటానికి యేసు సిద్ధపడుతున్నప్పుడు ఆయన పక్కనే ఉండి ఆయన పాదాల వద్ద మోకరిల్లి తన మాటలు వినటానికి తన దగ్గరే ఉంటామని ఆయన్ని బ్రతిమిలాడరు. మీరు ఇంటికి వెళ్ళి ప్రభువు మీకు ఏ గొప్ప కార్యాలు చేశాడో వాటిని గురించి చెప్పండి అని ఆయన ఆదేశించాడు. MHTel 70.1
వారు చెయ్యాల్సిన పని ఒకట్నున్నది. ఓ అన్యగృహానికి వెళ్ళి యేసు నుండి తాము పొందిన దీవెనల గురించి వారికి చెప్పటం. రక్షకుని నుంచి వేరవ్వటం వారికి కష్టం. అన్యులైన తమ తోటి ప్రజలతో సహవాసంలో కష్టాలు ఎదురౌతాయి. సమాజానికి దీర్ఘకాలంగా వేరుగా ఉండటం ఈ సేవకు తమను అయోగ్యుల్ని చేస్తుంది. కాని తమ విధి ఏమిటో ఆయన సూచించిన వెంటనే వారు విధేయులవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. MHTel 70.2
తమ కుటుంబీకులకు ఇరుగుపొరుగువారికి మాత్రమే గాక రక్షిం చటానికి ఆయన శక్తిని గురించి దెకపోలి అంతటా ప్రకటిస్తూ దయ్యాల నుండి తమను ఆయన ఎలా విడిపించాడో వివరించారు. MHTel 70.3
గదరేనీయులు యేసును స్వీకరించకపోయినా వారిని తామెన్నుకున్న చీకటిలో ఆయన విడిచి పెట్టలేదు. ఆయనను వెళ్లి పొమ్ముని చెప్పినప్పుడు వారు ఆయన మాటలు వినలేదు. తాము ఏమి తిరస్కరిస్తున్నారో వారు ఎరుగరు. కనుక ఎవరు చెప్పితే వినటానికి వారు నిరాకరించరో వారి వలన ఆయన వారికి వెలుగు అందజేసాడు. పందుల నాశంన కలిగించటంలో రక్షకునికి ప్రజలను దూరం చెయ్యటం, ఆప్రాంతంలో సువార్త ప్రకించకుండా అడ్డుకోవడం సాతాను ఉద్దేశం. కాని మరి దేనికన్నా MHTel 70.4
ఈ ఘటన ఆ ప్రాంతాన్ని మేలుకొలిపి ప్రజల గమనాన్ని క్రీస్తు పైకి తిప్పింది. రక్షకుడు అక్కడ నుండి వెళ్ళిపోయినా తాను స్వస్థపర్చిన మనుషులు ఆయన శక్తికి సాక్షులుగా మిగిలియున్నారు. చీకటి రాజుకు మాధ్యమాలుగా ఉన్నవారే వెలుగుసాధనాలు. దేవ కుమారుని దూతలు అయ్యారు. యేసు దెకపొలికి తిరిగి వచ్చినపుడు ప్రజలు ఆయన చుట్టు మూగారు. ఆ పరిసిర ప్రాంతాల నుండి వేలాది ప్రజలు మూడు రోజులపాటు రక్షణ వర్తమానాన్ని విన్నారు. MHTel 71.1
పునరుద్దరణ పొందిన ఈ దురాత్మల బాధితులిద్దరు దెకపోలి ప్రాంతంలో సువార్త ప్రకటనకు క్రీస్తు పంపిన మొట్టమొదటి మిషనెరీలు వీరు ఆయన మాటలు కొద్ది కాలం మాత్రమే విన్నారు. ఆయన ప్రసంగాల్లో ఒక్కటి కూడా వారు వినలేదు. రోజు ఆయనతో ఉన్న శిష్యుల వలె వారు సమర్ధంగా ప్రజలకు ఉపదేశించలేక పోయారు. కాని వారు తమకు తెలిసింది చెప్పగలిగారు. తాము ఏమి చూశారో ఏమి విన్నారో, రక్షకుని శక్తి విషయంలో ఏమి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వారు చెప్పగలిగారు. దైవ కృప స్పర్శను అనుభవించిన ప్రతీవారు చెయ్యగలిగింది ఇదే. ఈ సాక్ష్యానికే మన ప్రభువు పిలుపునిస్తున్నాడు. ఇది కొరవడిన కారణంగానే లోకం నశించిపోతున్నది. MHTel 71.2
సువార్తను ఓ నిర్జీవ సిద్ధాంతంగా గాక జీవితాన్ని మార్చే ఓ సజీవ శక్తిగా సమర్పించాలి. మనుషులు తన కృప ద్వారా క్రీస్తువంటి ప్రవర్తనను కలిగి ఆయన మహా ప్రేమ నిశ్చయతో ఆనందించవచ్చునన్న సత్యానికి తన సేవకలు సాక్షులు కావాలని దేవుడు అభిలషిస్తున్నాడు. రక్షణను అంగీకరించేవారందరు ఆయన కుమారులు కుమార్తెలుగా తమ పరిశుద్ధ ఆధిక్యతల్లో పునరుద్దరణ పునస్థాపన పొందే వరకు ఆయన తృప్తి చెందేడన్న విషయానికి మనం సాక్షులం కావాలని ఆయన ఆక్షాంక్ష. MHTel 71.3
ఎవరి జీవిత సరళి తనకు అభ్యంతరకరంగా ఉంటుందో వారిని సయితం ఆయన అంగీకరిస్తాడు. వారు పశ్చాత్తాపపడ్డప్పుడు ఆయన తన ఆత్మను అనుగ్రహించి తన కృపను ప్రకించటానికి అపనమ్మకంగా ఉ న్నవారి వద్దకు వారిని పంపుతాడు. సాతాను సాధనాలుగా దిగజారిన ఆత్మలు క్రీస్తు శక్తి ద్వారా నీతిదూతలుగా మార్పు చెంది తమకు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసి తన పట్ల కరుణ చూపాడో ఇతరులకు చెప్పటానికి పంపబడవచ్చు. MHTel 71.4