స్వస్థత పరిచర్య

12/173

5—ఆత్మకు స్వస్థత

క్రీస్తు వద్దకు సహాయం కోసం వచ్చినవారిలో అనేకులు తమ మీదికి తామే వ్యాధిని తెచ్చుకున్నారు. అయినా వారిని బాగుపర్చటానికి ఆయన నిరాకరించలేదు. ఆయన నుండి ప్రభావం ఈ ఆత్మల్లోకి ప్రవేశించినపుడు తాము పాపులమన్న గుర్తింపు వారికి కలిగింది. అనేకమంది ఆధ్మాత్మిక వ్యాధుల నుండి శారీరక వ్యాధుల నుండి స్వస్థత పొందారు. MHTel 50.1

వీరిలో ఒకడు కప్నెహూములోని పక్షవాత బాధితుడు. ఆ కుష్టురోగి వలె ఈ పక్షవాత బాధితుడూ స్వస్థతను గూర్చిన నిరీక్షణను కోల్పోయాడు. అతడి వ్యాధి పాప జీవిత ఫలితంగా వచ్చింది, పశ్చాత్తాపం అతడి భాదల్ని మరింత బాధాకరం చేసింది. ఉపశమనానికి పరిసయ్యులికి వైద్యులికి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది, అది స్వస్ధత లేని వ్యాధిగా తేల్చి చెప్పారు. నీవు పాపివి అంటూ ఖండించారు. దేవుని అనుగ్రహం క్రింద అతడు మరణిస్తాడని ప్రకటించారు. MHTel 50.2

ఆ పక్షవాత రోగి నిరాశతో కుంగిపోయాడు. అప్పుడు యేసు పరిచర్యను గురించి విన్నాడు. అతడిలాగే పాపులైనవారు నిస్సహాయులు స్వస్థత పొందారు. రక్షకుని వద్దకు ఎవరైనా తనను మోసుకు వెళ్తే తాను కూడా స్వస్థత పొందవచ్చునని నమ్మటానికి ప్రోత్సహం కలిగింది. కాని తన వ్యాధికి కారణం గుర్తుకు వచ్చినప్పుడు అతడి నిరీక్షణ దిగజారిపోయింది,. అయినా స్వస్థత సాధ్యమేమోనన్న ఆశాభావాన్ని వదులుకోలేకపోయాడు. MHTel 50.3

పాప భారం నుండి ఉపశమనం పొందాలన్నదే అతడి కోరిక. యేసును చూసి ఆయన నుంచి పాప క్షమాపణ దేవుని సమాధాన హామీ పొందాలని ఆకాంక్షించాడు. ఆ తరువాత దేవుని చిత్తం ప్రకారం జీవించటానికో మరణించటానికో సిద్ధంగా ఉన్నాడు. MHTel 50.4

ఇక సమయంలేదు. అప్పటికే క్షీణిస్తున్న తన శరీరంలో మరణ ఛాయలు కనిపిస్తున్నాయి. తనను తన పడకపై యేసు వద్దకు మోసుకు వెళ్ళాల్సిందిగా తన మిత్రుల్ని బతిమాలాడు. ఈ పనిని వారు సంతోషంగా చేపట్టారు. రక్షకుడు బస చేసిన గృహంలోను దాని చుట్టును జనులు మూగటంతో వ్యాధిగ్రతస్తుడు అతడి మిత్రులు యేసును చేరటం లేక వినగలిగినంత దగ్గరగా వెళ్ళటం ఆసాధ్యమనిపించింది. యేసు పేతురు గృహంలో బోధిస్తున్నాడు. తమ ఆచారం ప్రకారం ఆయన శిష్యులు ఆయన చుట్టు ఆయను దగ్గరగా కూర్చున్నారు. “గలిలయ యూదయ దేశములు ప్రతి గ్రామము నుండియు యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్తోపదేశకులును” ఉన్నారు. లూకా 5:17 వీరిలో చాలమంది ఆయన మీద నింద మోపటానికి గూఢచారులుగా వచ్చారు. గుమిగూడిన ఈ జనాలే గాక, అతురత, భక్తి బావం గల వారు, వింత చూడాలని వచ్చినవారు అవిశ్వాసులు ఇలా వివిధ రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. వివిధ జాతులు, సామాజిక స్థాయిలు గల ప్రజలు అక్కడున్నారు. “ఆయన స్వస్థపర్చునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను” 17వ వచనం. ఆ సభపై జీవాత్మ నిలిచి ఉన్నది. కాని ఆయన సముఖాన్ని పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు గుర్తించలేకపోయారు. వారు తమ అవసరాన్ని గుర్తించలేదు. కనుక స్వస్థత వారికి ఉద్దేశించబడలేదు. “ఆకలిగొనినవారిని మంచి పదార్ధములతో నింపి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను.” లూకా 1:53. MHTel 50.5

పక్షవాత రోగిని మోసుకు వెళ్తున్న వారు జనసమూహాన్ని ఒత్తిగించుకొని లోపలికి వెళ్లటానికి పదే పదే ప్రయత్నించారు. కాని ఫలితం దక్కలేదు. వ్యాధిగ్రస్తుడు ఆవేధనతో తన చుట్టూ చూసాడు. తాను ఆశిస్తూ వచ్చిన సహాయం అంత సమీపంలో ఉండగా తన నిరీక్షణను అతడు ఎలా వదులుకోగలడు? అతడి సలహా మేరకు తన మిత్రులు అతణ్ణి ఇంటి కప్పు మీదికి తీసుకువెళ్ళి కప్పు పెంకులు విప్పి అతణ్ణి యేసు పాదాల వద్దకు దింపారు. MHTel 51.1

జరగుతున్న చర్చకకు అంతరాయం కలిగింది. రక్షకుడు అతడి దు:ఖ ముఖం, ఆర్థిస్తున్న కళ్ళు చూసాడు. భారం మోస్తున్న ఆ ఆత్మ వాంచ ఏమిటో ఆయన గ్రహించాడు. అతడు ఇంకా తన ఇంటిలో ఉండగానే అతడి అంతరాత్మలో విశ్వాసాన్ని పుట్టించింది క్రీస్తే. అతడు తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి, తనను స్వస్థపర్చటానికి క్రీస్తు శక్తిని విశ్వసించి నప్పుడు రక్షకుని కృప అతడి హృదయాన్ని ఆశీర్వదించింది. విశ్వాసం తొలిమెరపు. తాను మాత్రమే పాపికి సహాయకుడన్నది నమ్మకంగా ఎదగటం. ఆయన సముఖంలోకి రావటానికి ప్రతి ప్రయత్నంతో అది బలో పేతమ వ్వటం యేసు చూసాడు. ఆ బాధితుణ్ణి తనకు ఆకర్షితుణ్ణి చేసుకున్నది క్రీస్తే. ఇప్పుడు వింటున్న అతడి చెవికి సంగీతంల మధురంగా వినిపిస్తున్న ఈ మాటలతో రక్షకుడంటున్నాడు. “కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవి”. మత్తయి 9:2 MHTel 51.2

ఆ వ్యాధిగ్రస్తుడి హృదయంలో నుంచి పాప భారం తొలగిపోయింది. అతడు సందేహపడలేదు. హృదయం చదవటానికి ఆయనకు శక్తి ఉన్న దని క్రీస్తు మాటలు వెల్లడి చేసాయి. పాపం క్షమించటానికి ఆయన అధికారిన్ని ఎవరు కాదనగలరు? నిరాశ స్థానంలో నిరీక్షణ, బాధాకరమైన దు:ఖం స్థానములో సంతోషం నెలకొన్నాయి. అతడి శరీరంలోని బాధ మాయమయ్యింది. అతడు సంపూర్తిగా మార్పు చెందాడు. ఇక విన్నపమేమి చెయ్యకుండా అతడు నిశ్శబ్దంగా సమాధానంగా పండుకొని ఉన్నాడు. అమితానందంతో అతడి నోటివెంట మాటలు పెగలడం లేదు. ఈ విచిత్ర వ్యవహారంలోని ప్రతీ కదలికను అనేక మంది అమితా సక్తితో గమనిస్తున్నారు. క్రీస్తు మాటల్ని అనేకులు తమకు ఆహ్వానంగా భావించారు. ఆత్మపరంగా పాపం వల్ల వారు వ్యాధిగ్రస్తులు కారా? ఈ బారం నుండి విముక్తి పొందటానికి వారు అతురంగా లేరా? MHTel 52.1

అయితే, పరిసయ్యులు ప్రజల్లో తమ పలుకుబడి దెబ్బతింటుందన్న భయంతో తమ హృదయాల్లో ఇలా తలపోసుకుంటున్నారు. ” ఇతడు .. దేవ దూషణ చేయుచున్నాడు గదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడు? మార్కు 2:7 MHTel 52.2

తన దృష్టి వారిపై నిలిపి ... దానితో వారు భయంతో వెనకడుగు వేశారు. యేసన్నాడు. “మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? మీ పాపములు క్షమింపబడినవిని చెప్పుటు సులభమా, లేచి నడుపుమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొన వలెనను అని చెప్పి ఆయన పక్షవాతము గలవానిని చూచి.. నీవు లేచి నీ మంచమెత్తికొని నీ ఇంటికి పొమ్ము.” మత్తయి 9:46 MHTel 52.3

అంతట, యేసు వద్దకు మంచం మీద మోసుకురాబడ్డ అతడు ఓ యువకుడు చలనంతో, బలంతో వెంటనే “లేచి పరు పెత్తుకొని వారందరి యెదుట నడచిపోయెను గనుక, వారందరు విభ్రాంతి చెంది... మన మీలాంటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.” మార్కు 2: 12 MHTel 53.1

కుళ్ళు పడుతున్న ఆ శరారానికి ఆరోగ్యాన్ని పునరుద్ధరించటానికి సృజన శక్తి అవసరమయ్యింది. భూమిలోని మన్ను నుంచి సృష్టి అయిన మానవుడిలో జీవం పోసే మాట పలికిన స్వరమే మరణిస్తున్న ఆ పక్షవా యువు గల వ్యక్తికి జీవాన్ని పోసే మాట పలికిన స్వరం. శరీరానికి జీవం ఇచ్చిన ఆ శక్తే గుండెను నవీకరించింది., సృష్టి సమయంలో ఎవరు “సెలవియ్యగా దాని ప్రకారమాయె”నో (కీర్తనలు 33:9) ఆయన అతిక్రమాలు పాపాలతో మృతమైన ఆత్మకు జీవం పోసే మాట సెలవిచ్చాడు. శరీరానికి స్వస్థత కూర్చటం హృదయాన్ని నూతనపర్చిన శక్తికి నిదర్శనం. “పాపములు క్షమించుటకు... అధికారము కలదని మీరు తెలిసికొను” నట్లు నీవు లేచి నడుపుమని క్రీస్తు పక్షవాత రోగిని ఆదేశించాడు. MHTel 53.2

ఆ పక్షవాతం గలవాడు క్రీస్తులో ఆత్మకు శరీరానికి స్వస్థతను కనుగొన్నాడు. శరీరారోగ్యాన్ని అభినందించటానికి గాను అతడికి ఆత్మ పరమైన ఆరోగ్యం అవసరం. శారీరక వ్యాధి నయం చెయ్యటానికి ఇక ముందు క్రీస్తు మనసుకి ఉపశమనం కలిగించి ఆత్మను పాపం నుంచి శుద్ది చెయ్యాల్సి ఉంది. ఈ పాఠాన్ని విస్మరించకూడదు. నేడు వేలాది ప్రజలు శారీరక వ్యాధితో బాధపడుతున్నారు., పక్షవాత రోగిలా వారు ” నీ పాపములు క్షమింపబడి యున్నవి” అన్న వర్తమానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆత్మను స్వస్థపర్చే ప్రభువు వద్దకు వచ్చేవరకు వారికి ఉపశమనం ఉండదు. ఆయన మాత్రమే ఇవ్వగల శాంతి మనసుకు శక్తిని శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు. MHTel 53.3

పక్షవాతం గలవాడి స్వస్థత ప్రజలపై చూపిన ఫలితం పరలోకం తెరుచుకొని మెరుగైన ప్రపంచ మహిమల్ని బయలుపర్చినట్లు కనిపించింది. స్వస్థత పొందిన వ్యక్తి అడుగడున దేహాన్ని మహిమపర్చుతూ అస్సలు బరువేలేనట్లు తన మంచాన్ని మోసుకుంటూ జనసమూహంలో నుండి వెళ్తుంటే అతడికి దారి ఇవ్వటానికి ప్రజలు వెనక్కి జరిగారు, విస్మయంతో అతడి వంక చూస్తే “నేడు గొప్ప వింతలు చూచితిమి” అని గుసగుసలాడు కున్నారు లూకా 5:26 MHTel 54.1

కొద్ది సమయం క్రింత అతణ్ణి తన గృహం నుండి ఏ మంచం పై నెమ్మదిగా మోసుకొని తీసుకు వెళ్లారో ఆ మంచాన్ని సునాయాసంగా మోసుకుంటూ అతడు తిరిగి ఇంటికి వచ్చినపుడు అతడి గృహంలో ఆనందం వెల్లివిరిసింది. తమ కళ్ళను వారే నమ్మలేకుండా ఆనందబాష్పాలు కార్చుతూ అతడి చుట్లు మూగారు. వారి ముందు అతడు సంపూర్ణ బలం ఆరోగ్యంతో నిలబడ్డాడు. చచ్చుపడిపోయని ఆ చేతులు అతడి చిత్తాన్ని వెంటనే నెరవేర్చుతా ఉన్నాయి. ముడుచుకుపోయి పాలిపోయి ఉన్న అతడి శరీరం ఇప్పుడు తాజాగా రక్తం కట్టి నిగనిగలాడుతున్నది. ఇప్పుడు బలంగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. MHTel 54.2

అతడి ప్రతీ ముఖ కవళికమీద ఆనందం నిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పాపం, బాధ స్థానంలో ఇప్పుడు పవిత్రత శాంతి ఉన్నాయి. ఆ గృహంలో నుంచి సంతోష కృతజ్ఞతలు పైకి లేచాయి, నిరీక్షణ లేనిబారికి నిరీక్షణను, వ్యాధి బాధితులకు బలాన్ని పునరుద్దరించిన కుమారుని ద్వారా తండ్రి మహిమపర్చబడ్డాడు. ఇతడు ఇతడి కుటుంబీకులు యేసు కోసం తమ ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. వారి విశ్వాసాన్ని ఏ సందేహం మసగబార్చలేదు. చీటిగా ఉన్న వారి గృహంలో వెలుగు నింపిన ఆయన పట్ల వారి నమ్మకాన్ని ఏ ఆవిశ్వాసం కుంటుబర్చలేదు. MHTel 54.3

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము
నా అంతరంగమున నున్న సమస్తమా,
ఆయన పరిశుద్ధ నామమున సన్నుతించుమునా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన
చేసిన ఉపకారములలో దేనిని మరువకము
ఆయన నీ దోషములన్నింటి క్షమించువాడు
నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు
కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు
పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు
మేలుతో నీ హృదయమును తృప్తిపర్చుచున్నాడు. యెహోవా
నీతి క్రియలను జరిగించుచు బాధించబడు
అందరికి న్యాయము తీర్చును ఆయన మో షేకు తన
మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు
తన క్రియలన కనుపరచెను యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు
దీర్ఘశంతుడు కృపా సమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు
వ్యాజ్యెమాడు వాడు కాడు ఆయన నిత్తము కోపించువాడు కాడు.
“మన పాపము లను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు
భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో
ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన
కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు
ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను
మనకు ఎంత దూరపర్చియున్నాడు తండ్రి తన కుమారుని
యెడల జాలిపడునట్లు యెహోవాతన యందు
భయభక్తులు గలవారి యెడల జాలిపడునుమనము
నిర్మిపబడిన రీతి ఆయనకు తెలిసే యున్నది. మనము
మంటివారమని ఆయన జ్ఞాపకమము చేసికొనుచున్నాడు”.
MHTel 54.4

కీర్తనలు 103:1-14 MHTel 55.1