స్వస్థత పరిచర్య

172/173

“నాయందు నిలచియుండుడి”

“తీగె ద్రాక్షా వల్లిలో నిలచియుంటేనేగాని తనంతట తానే యోలాగు ఫలింపదో, అలాగే నాయందు నలిచియుంటేనే కాని మీరును ఫలింపరు... ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియండునో వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు... నాయందు మీరును నా మాటలు మీయందును నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపర్చబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. MHTel 457.4

“తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలచియుండుడి......... MHTel 458.1

“మీరు నన్ను ఏర్పర్చుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేనే మిమ్నును ఏర్పర్చుకొని నియమించితిని”. యోహాను 15:4-16 MHTel 458.2

“ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము”. ప్రకటన 3:20 MHTel 458.3

“జయించువానికి మరుగైయున్నమన్నాను. భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిమీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును; పొందినవానికే గాని అది మరి యెవనికిని తెలియదు”. ప్రకటన 2:17 MHTel 458.4

“జయించటానికి ... వానికి... వేకువ చుక్కనిచ్చెదను ““మరియు నా దేవుని పేరును..... నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను”. 26-28 వచనాలు 3:12 MHTel 458.5