స్వస్థత పరిచర్య
ఒకే ఉద్దేశం
క్రీస్తు తన జీవితంలో తాను ఏ పనికి వచ్చాడో ఆ విమోచన కార్యసాధనాలకు ప్రతీ విషయాన్ని కింద ఉంచాడు. అదే కార్యదీక్ష. అదే ఆత్మత్యాగం, అదే విధముగా దేవుని వాక్య విధులకు తన్ను తాను సమర్పించుకోవటం ఆయన శిష్యుల్లో ప్రదర్శితం కావాలి. క్రీస్తును తన స్వరక్షకుడుగా స్వీకరించిన ప్రతీ వ్యక్తి దేవుని సేవ చెయ్యటానికి ఆశతో ఎదురుచూస్తుంటాడు. తన కోసం దేవుడు ఏమి చేసాడో దాన్ని గురించి ధ్యానించినప్పుడు అతడి హృదయం విస్తారమైన ప్రేమ కృతజ్ఞతలతో నిండి ఆయన్ని ఆరాధిస్తుంది. దేవుని సేవకు తనసామార్థ్యాలను ఉపయోగించటం ద్వారా తన కృతజ్ఞతను ఓ సంకేతంగా చెయ్యటానికి అతడు ఆతురంగా ఉంటాడు. క్రీస్తు పట్ల ఆయనకున్న ఆత్మల పట్ల తన ప్రేమను చూపించటానికి ఆశిస్తాడు. శ్రమను, కష్టాన్ని త్యాగాన్ని కోరుకుంటాడు. MHTel 445.3
యధార్ధమైన దైవ సేవకుడు తన శక్తి వంచన లేకుండా పని చేసేస్తాడు. ఎందుకంటే అలా పని చెయ్యటం ద్వారా అతడు తన ప్రభువును మహిమపర్చగలుగుతాడు. తన మానసిక శక్తులన్నింటికి వృద్ధిపర్చు కోవాటానికి కృషి చేస్తాడు. తను చేసే ప్రతీ విధినీ దేవుని కోసం చేసినట్లు నిర్వరిస్తాడు. క్రీస్తుకి పరిపూర్ణ ఘనతనిచ్చి సేవ చెయ్యటమే అతడి ఒక ఒక కోరిక. MHTel 446.1
ఓ బొమ్మలో ఓ ఎద్దు నాగలికి బలిపీఠానికి మధ్య నిలబడి ఉన్నట్లు చిత్రించారు. “దేనికైనా దానికైనా సిద్ధం” అన్న మాటలు ఆ చిత్రం మీద రాశారు. అంటే దుక్కి దున్నే పనికి సిద్దం లేదా బలి పీఠం పై బలికి సిద్ధం అన్నమాట.నిజాయితీ గల దేవుని బిడ్డ ఈ స్థానంలో ఉంటాడు. విధి నిర్వహణ ఎక్కడకు పిలస్తే అక్కడకు వెళ్ళటానికి తనను తాను ఉపే క్షించుకోవటానికి, విమోచకుని సేవ నిమిత్తం త్యాగం చెయ్యటానికి సంసిద్ధంగా ఉంటాడు. MHTel 446.2
*****