స్వస్థత పరిచర్య

163/173

అన్యాయం జరిగినప్పుడు సహనం

మనకు జరిగిన లేక జరిగిందని ఊహించిన అన్యాయం గురించి మనం అగ్రహవేశాలతో ఊగిపోకూడదు. మనం భయపడాల్సి శత్రువు మనమే. పరిశుద్దాత్మ నియంత్రణ కిందలేని మానవ ఆవేశ ప్రభావం ప్రవర్తనకు చేసే హాని ఏ రకమైన దుర్మార్గము చెయ్యలేదు. MHTel 428.1

మనం సాధించే ఏ విజయమూ మనపై మనం సాధించే విజయవంత ప్రశస్తమైనది కాదు. మన మనోభావాలు సులువుగా దెబ్బతినటానికి మనం అనుమతించ కూడదు. మన మనోభావాల్ని గాని మన పలుకుబడినికాక ఆత్మలను రక్షించటానికి మనం జీవించాలి. ఆత్మలను రక్షించటంలో ఆసక్తి కలిగి ఉండే కొద్ది ఒకరితో ఒకరి సంబంధాల్లో చోటుచేసుకునే చిన్న చిన్న బేధాలను పట్టించుకోవటం మానతాం. మనల్ని గురించి ఇతరులు ఏమి తలంచిన లేక ఇతరులు మనకు ఏమి చేసినా, క్రీస్తుతో మన ఏకత్వాన్ని, ఆత్మ సహవాసాన్ని అది పాడు చెయ్యకూడదు. “తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలుబడితిరి”. 1 పేతురు 2:20 MHTel 428.2

ప్రతీకారం తీర్చుకోవద్దు. మీశక్తి మేరకు, అపార్ధానికి కారణాన్ని తొలగించండి. దుష్టతగా కనిపించేదాన్ని సయితం నివారించండి. నియమాన్ని త్యాగం చేయకుండా ఇతరులను సమాధానపర్చటానికి శాయక్తులా కృషి చెయ్యండి “నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచి పెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ యర్పణము సర్పింపుము”. మత్తయి 5:23,24 MHTel 428.3

సహనం కోల్పోయి మీతో మాటలాడిన వ్యక్తికి అలాటి మాటలతోనే జావాబివ్వకండి. “మృదునైన మాట క్రోధమన చల్లార్చును” అని జ్ఞాపక ముంచుకోండి. సామెతలు 15:1 మౌనంలో అద్భుతమైన శక్తి ఉంది. కోపంగా ఉన్న వ్యక్తి పలికిన మాటలకు సమాధానంగా చెప్పే మాటలు రెచ్చగొట్ట టానికి తోడ్పడతాయి. కాని కోపాన్ని సున్నితమైన సహనంతో కూడిన మౌనంతో ఎదుర్కుంటే అది త్వరగా పోతుంది. గుచ్చుకునే, తప్పులెన్నో మాటల తుపానులో మనసును దేవుని వాక్యం పై స్థిరంగా నిలపండి. మనసును హృదయాన్ని దేవుని వాగ్దానాలతో నింపండి. మీరు అమర్యాదకు, తప్పుడు నిందలకు గురి అయితే కోపంతో జవాబిచ్చే బదులు ఈ వాగ్దానాల్ని పునరుచ్చరణ చేసుకోండి. “కీడు వలన జయింపబడక, మేలు చేత కీడును జియంచుము”. రోమా 12:21 MHTel 429.1

“నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్ళలోను నడిచితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మును రప్పించియున్నావు.” కీర్తనలు 66:12 MHTel 429.2

సానుభూతి కోసం పైకిలేవటానికి చేయూత కోసం యేసు వంక చూసే బదులు మనం సాటి మానవుల వంక చూస్తుంటాం. మనుషుల్ని నమ్ముకోవంట రక్త మాంసాల్ని మన బలం చేసుకోవటం బుద్దిహీనత అని మనకు నేర్పించటానికి మనం ఎవరిని నమ్ముకుంటామో దేవుడు కృపావాత్సల్యాల్లో వారు మనల్ని నిరాశపర్చేటట్లు చేస్తాడు. సంపూర్ణంగా దీన మనసుతో, స్వార్ధరహితంగా దేవున్ని నమ్ముకుందాం. మన హృదయాల నిండా ఉన్న, కాని మనం వెలిబుచ్చలేకుండా ఉన్న దు:ఖం ఆయన ఎరుగును, సమస్తం చీకటిగాను, వివరించలేనట్లుగాను ఉన్నప్పుడు, యేసు చెప్పిన ఈ మాటల్ని గుర్తు చేసుకోండి. “నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలిసికొందువు”. యోహాను 13:7. MHTel 429.3

యోసేపు దానియేలు చరిత్ర చదవండి. వారికి హాని చెయ్యటానికి మనుషులు చేస్తున్న కుట్రల్ని ఆయన ఆపలేదు. కాని శ్రమలు సంఘర్షణల నడుమ తమ విశ్వాసాన్ని ప్రభు భక్తిని కాపాడుకున్న తన సేవకులకు మేలు జరగటానికి ఈ కుట్రలు కుతంత్రాలు తోడ్పడటట్లు చేసాడు. MHTel 429.4

మనం లోకంలో ఉన్నంతకాలం ప్రతికూల ప్రభావాలు ఎదుర వుతాయి. స్వభావాన్ని పరీక్షింటానికి కోపకారణాలుంటాయి. వీటిని మంచి మనసుతో ఎదుర్కొవటం ద్వారా క్రైస్తవ సద్గుణాలు వృద్ధి పొందుతాయి. క్రీస్తు మనలో ఉన్నట్లయితే క్రోధాలు ఉద్విగ్నాల మధ్య శాంతంగా, దయగా, సహనం కలిగి, సంతోషంగా ఉంటాం. రోజుకు రోజు ఏటికేడాది మనం ఆహాన్ని జయిస్తూ ఉదాత్తమైన శౌర్యంతో పెరుగుతాం. ఇది మనకు నియమించబడ్డ పని. కాని యేసు సహాయం ధృడ సంకల్పం, స్థిరమైన ఉద్దేశం, నిరంతర అప్రమత్తత, ఎడతెగని ర్ధన లేకుండా దీన్ని సాధించలేం. ప్రతీ వ్యక్తి వ్యక్తిగత పోరాటం సల్పాలి. మనం ఆయనతో కలసి పనిచేసే పనివారం కాకపోతే దేవుడు కూడా మన ప్రవర్తనలను ఉదాత్తం మన జీవితాలను ప్రయోజనకరం చెయ్యలేడు. పోరాటాన్ని నిరాకరించేవారు విజయం తాలూకు శక్తిని ఆనందాన్ని పోగొట్టుకుంటారు. MHTel 430.1

మన కష్టాలు శ్రమలు విచారాలు దు:ఖాల దాఖలాలు మనం ఉంచుకోనవసంరలేదు. ఇవన్నీ గ్రంథాల్లో దాఖలై ఉన్నాయి. వాటి సంగతి పరలోకం చూసుకుంటుంది. మనకు కీడు చేసిన విషయాల్ని లెక్క పెట్టు కునేటప్పుడు, ధ్యానించాల్సిన అనేక సంతోషకరమైన విషయాలు , అనగా ప్రతీ నిమిషం మనల్ని చుట్టుముట్టి ఉండే దేవుని కృప, మన కోసం మరణించటానికి దేవుడు తన కుమారుణ్ణి అర్పించిన, దేవదూతలు ఆశ్చర్య పడుతున్న దేవుని ప్రేమ, మన జ్ఞాపకాలనుంచి మరుగైపోతున్నాయి. MHTel 430.2

క్రీస్తు సేవలో పాటుపడే పనివాడిగా మీరు ఇతరులకన్నా ఎక్కువ చింతలు శ్రమలు భరిస్తున్నట్లు భావిస్తుంటే ఈ భారాలను విసర్జించిన వారికి లేని సమాధానం మీకున్నదని జ్ఞాపకముంచుకోండి. క్రీస్తు సేవలో ఆదరణ ఆనందం ఉన్నాయి. ఆయనతో జీవితం పరాజయం కాదని ప్రపంచం చూడన్వివండి. MHTel 430.3

హృదయం తేలికగా ఉల్లాసంగా లేకపోతే మీ మనోభావాల్ని గురించి మాట్లాడకండి, ఇతరుల జీవితాల పై నీడలు పరచకండి. వెచ్చదనం సూర్యకాంతి లేని మతం ఆత్మల్ని క్రీస్తు వద్దకు ఆకర్షించలేదు. తప్పిపోయిన తిరుగుతున్న వారి పాదాలకు సాతాను అమర్చిన ఉచ్చుల్లోకి వారిని ఆయన్నుంచి తరిమివేస్తుంది. మీ ఆశాభంగాల గురించి ఆలోచించే బదులు క్రీస్తు నామంలో మీరు పొందగల శక్తిని గురించి ఆలోచించండి. మీ ఆలోచనను అదృశ్యమైన వాటిని అందుకోనివ్వండి. మీ పట్ల దేవుని గొప్ప ప్రేమ పైకి మీ ఆలోచనల్ని నడిపించండి. విశ్వాసం శ్రమలను సహించగలుగుతుంది. శోధనలకు ప్రతిఘటించగలుగుతుంది శోధనలను ఆశాభంగం కింద కొనసాగుతుంది. యేసు మన ఉత్తరవాదిగా జీవిస్తున్నాడు. ఆయన విజ్ఞాపన సంపాదించేదంతా మనదే. MHTel 430.4

పూర్తిగా తనకోసమే జీవించేవారిని క్రీస్తు విలువ గలవారిగా పరిగ ణిస్తాడని మీరనుకోరా?ఎవరు తన నిమిత్తం కఠినమైన శ్రమలతో నిండిన స్థానలలో ఉంటారో వారిని ఖైదులో ఉన్న యోహానును సందర్శించినట్లు ఆయన సందర్శిస్తాడని మీరు అనుకొరా? తనకు నమ్మకంగా పనిచేసే సవేకులో ఒకరిని కష్టాల్లో ఉంటూ అణిచివేతకు గురి కానివ్వడు ఆయన. క్రీస్తుతో కూడ ఎవరి జీవము తనలో దాచడబడ్డదో వారిలో ప్రతి ఒక్కరిని ఓ ప్రశస్త ఆభరణాన్ని దాచి ఉంచినట్లు ఆయన కాపాడతాడు. అటువంటి వారి గురించి ఆయన ఇలా అంటున్నాడు. “నేను నిన్ను ఏర్పర్చుకొని యున్నాను. గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును”.హగ్గయు 2:23 MHTel 431.1

కనుక వాగ్దానాల్ని గురించి మాట్లాడండి దీవించటానికి యేసు సంస్జిద్ధతను గూర్చి మాట్లాడండి. ఒక్క నిమిషం కూడా ఆయన మనల్ని మర్చిపోడు. అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికి ఆయన ప్రేమలో ధైర్యంగా విశ్రమించి మనల్ని మనం ఆయనతో ముద్రించుకుంటే ఆయన సముఖాన్ని గూర్చిన స్పృహ, గాఢమై, శాంతికరమైన ఆనందాన్ని మనసులో నింపుతుంది. తనను గురించి తాను క్రీస్తు ఇలా అన్నాడు. ‘నా అంతట నేను ఏమియు చేయక తండ్రి తనకు నేర్పినట్లు. ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినాడు నాకు తోడైయున్నాడు. ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు”. యోహాను 8:28,29. MHTel 431.2

తండ్రి సముఖం క్రీస్తును పరిపూర్ణం చేసింది. లోక హితానికి అనంతుని ప్రేమ అనుమతించింది తప్ప ఆయనకు ఏమి సంభవించలేదు. ఆయన ఆదరణకు మూలం ఇక్కడ ఉంది. అది మనకును, క్రీస్తు స్వభావం గలవాడు క్రీస్తులో నిలబడతారు. అతడికి ఏమి వస్తుందో అది అతడి చుట్టు తన సముఖాన్ని ఉంచే రక్షకుని వద్ద నుండి వస్తుంది. ప్రభువు అనుమతి లేకుండా అతణ్ణి ఏది ముట్టులేదు. మన బాధలు దు:ఖాలు మన శోధనలు శ్రమలు, మన విచారాలు దు:ఖాలు మన హింసలు లేములు అన్ని మన మేలు కోసం సమకూరుతాయి. అన్ని అనుభవాలు పరిస్థితులు మనకు మేలును తెచ్చే దేవుని కార్యకర్తలు. MHTel 432.1

మన పట్ల దేవుని దీర్ఘశాంతాన్ని గూర్చిన స్పృహ మనకుంటే మనం ఇతరులకు తీర్పు తీర్చటం లేక ఇతరుల పై నిందలు మోపటం చెయ్యం . క్రీస్తు లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన సహచరులు ఆయనతో పరిచయం ఏర్పడ్డ తరువాత ఆయన నోటి నుండి ఒక్క నిందా వాక్యం లేక ఒక్క సహనం కోల్పోయిన మాట విన్నట్లయితే ఎంతగా ఆశ్చర్యపడి ఉండేవారు! ఆయన్ని ప్రేమించ వారు ప్రవర్తనలో ఆయన్ని సూచించాల్సి ఉన్నారని ఎన్నడూ మర్చిపోకూడదు. “సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒక నినొకడు గొప్పుగా ఎంచుకొనుడి”? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతీకీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి”. రోమా 12:10;1 పేతురు 3:9 MHTel 432.2

ప్రతి మనిషి హక్కులను మనం గుర్తించాలని యేసు ప్రభువు డిమాండ్ చేస్తున్నాడు. మనుషుల సాంఘిక హక్కులను, క్రైస్తవులుగా వారి హక్కులను పరిగణలోనికి తీసుకోవాలి, దేవుని కుమారులు కుమార్తెలుగా, అందరితో నాగరికంగా సున్నితంగా వ్యవహరించాలి. MHTel 432.3

క్రైస్తవం మనిషిని పెద్ద మనిషిని చేస్తుంది. క్రీస్తు తన హింసకుల పట్ల సయితం మర్యాద చూపించాడు. ఆయన యదార్ధ అనుచరులు అదే స్పూర్తిన్ని ప్రదర్శిస్తారు. అధికారుల ముందుకు తీసుకురాబడ్డ పౌలును చూడండి.అగ్రిప్ప ముందు అతడి మాటలు వాస్తవమైన మర్యాదకు ఒప్పింప చేసే వాగ్దాటికి ఉదాహరణ. సువార్త ప్రస్తుత లోకంలో చలామణి అవుతున్న మర్యాదను ప్రోత్సహించటం లేదు. హృదయంలో నుంచి పుట్టుకు వచ్చే మర్యాదను ప్రోత్సహిస్తుంది. MHTel 432.4

అతి శ్రద్ధగా వృద్ధిపర్చుకున్న వెలపటి జీవిత మర్యాదలు అంసతోషాన్ని కాఠిన్యాన్ని, కఠోర విమర్శల్ని, అనుచితమైన మాటల్ని అంతం చెయ్యటానికి చాలవు. స్వార్ధాన్ని అతి ముఖ్యమైన ప్రయోజనంగా పరిగనించినంతకాలం యధార్ధమైన సంస్కారం ప్రదరితం కాదు. ప్రేమ హృదయంలో నివసించాలి. నిజమైన క్రైస్తవుడు తన క్రియలకు లక్ష్యాన్ని రక్షకుని పట్ల తనకు గల గాఢమైన ప్రేమనుంచి రూపొందించుకుంటాడు. క్రీస్తు పట్ల తన ప్రేమ వేరుల్లో నుంచి తన సోదరుల పట్ల స్వార్ధ రహిత ఆసక్తి పుడుతుంది. దాన్ని కలిగి ఉన్న వ్యక్తికి ప్రేమసౌమ్యతను, మార్యాదను, నడవడిలో రమ్యతను ఇస్తుంది. అది ముఖానికి ప్రకాశాన్ని స్వరానికి మృదుత్వాన్ని ఇస్తుంది. మొత్తం వ్యక్తిని నాగరికం చేసి ఔన్నత్యాన్నిస్తుంది. MHTel 433.1

జీవితాన్ని ఆనందమయం చేసేవి పెద్ద పెద్ద త్యాగలు అద్భుతమైన సాధనలే కాదు. చిన్న చిన్న విషయాలు కూడా. గుర్తింపునకు యోగ్యం కానివాటిగా తరుచుగా, కనిపించే చిన్న చిన్న విషయాల ద్వారానే తరుచు మన జీవితాల్లోకి గొప్ప మేలో గొప్ప కీడో వస్తుంటుంది. MHTel 433.2

చిన్న చిన్న విషయాల్లో మనకు వచ్చే పరీక్షల్లో మన అపజయం ద్వారా మన అలవాట్లు ఏర్పడతాయి. మన ప్రవర్తన వికృతమౌతుంది. ఇంకా పెద్ద పరీక్షలు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండటం. దిన దిన పరీక్షల్లో నియమం ప్రకారం నడుచుకోవటం ద్వారా మాత్రమే అతి ప్రమాదకరమైన అతి కష్టమైన స్థానాల్లో మనం దృడంగా నమ్మకంగా నిలబడగలుగుతాం. MHTel 433.3

మనం ఎన్నడూ ఒంటరి వారంకాం. మనం ఆయన్ని ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా మనకో మిత్రుడున్నాడు. మీరు ఎక్కడున్నా , ఏమి చేస్తున్నా అక్కడ దేవుడున్నాడని గుర్తుంచుకోండి మనం చెప్పేది చేసేది లేక తలంచేది ఆయన గమనించకుండా జరగదు. మీ ప్రతి మాటకు ప్రతీ క్రియకు ఓ సాక్ష్యం ఉంది. పరిశుద్ధుడైన, పాపాన్ని ద్వేషించే దేవుడు, మీరు మాటలాడకముందు లేక ఏ పని చెయ్య ముందు ఎప్పుడు దీన్ని గురించి ఆలోచించండి. క్రైస్తవుడిగా మీరు రాజకుటుంబ సభ్యులు,పరలోక రాజు బిడ్డ “మీరు పెట్టబడిన శ్రేష్టమైన నామమునకు “చెడ్డ పేరు తెచ్చే మాట మాట్లాడకండి, కార్యం చెయ్యకండి. యాకోబు 2:7. MHTel 433.4

దైవమానవ ప్రవర్తనను జాగ్రత్తగా అధ్యయనం చెయ్యండి, ” నా స్థలములో యేసు ఉంటే ఏమి చేస్తాడు”? అని నిత్య మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన విధికి ఇది కొలమానం కావాలి. న్యాయం చెయ్యెటంలో మీ ఉద్దేశాన్ని ఎవరు బలహీనపర్చుతారో లేక మీ మనస్సాక్షికి ఎవరు తమ కళ ద్వారా తీవ్ర శ్రమ కలిగిస్తారో వారి సాంగత్యంలో అనవసరంగా ఉండకండి. MHTel 434.1

దుర్మార్గంగా కనిపించే ఏ చిన్న పని కూడా పరదేశుల మధ్య వీధిలో బస్సుల్లో, గృ:హంలో చెయ్యకండి తన రక్తంతో క్రీస్తు కొన్న మీ జీవితాన్ని మెరుగుపర్చటానికి, సుందరం చెయ్యటానికి ఏదో పని అనుదినం చెయ్యండి. ఎల్లప్పుడూ ఉద్రేకాన్ని బట్టి కాక నియమాన్ని బట్టి పనులు చెయ్యండి. మీ స్వభావ సిద్ధమైన తొందరపాటుతనాన్ని సాత్వికంతో సాధుత్వంతో సరియైన స్థితికి తెండి. తేలికపాటి, వ్యర్ధమైన విషయల్లో తల దూర్చకండి. చౌకబారు హాస్యం మీ నోటి వెంట రానివ్వకండి. మీ తలంపులను కూడా అదుపు తప్పనివ్వకండి. వాటిని నిరోధించాలి. MHTel 434.2

క్రీస్తుకు విధేయంగా బందించాలి. వాటిని పరిశుద్ద విషయాలపై ఉంచండి. అప్పుడు క్రీస్తు కృప ద్వారా అవి పవిత్రంగా వాస్తవంగా ఉంటాయి. MHTel 434.3

పవిత్ర ఆలోచనలను ఉదాత్తపరిచే శక్తి మనకు అవసరం. ఏ ఆత్మకైన ఉన్న ఏకైక భద్రత సరియైన ఆలోచన, ఒకటి “తలంపులు ఎలాంటివో అతడు అలాంటివాడు”. (సామెతలు 23:7, ఎఐవి) అభ్యాసం ద్వారా ఆత్మ నిగ్రహం బలోపేతమౌతుంది. మొదట్లో కష్టంగా కనిపించినా దాన్ని మళ్ళీ మళ్ళీ చెయ్యటం ద్వారా సులభమై తుదకు సరియైన ఆలోచనలు క్రియలు అలవాటుగా మార్తాయి. మనం కోరకుంటే చౌకబారు విషయాలకు దూరంగా ఉండి ఉన్నత ప్రమాణాన్ని చేరవచ్చు. మనుషుల గౌరవాన్ని దేవుని అప్యాయతను పొందవచ్చు. MHTel 434.4

ఇతరుల గురించి మంచి మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీరు కలసి ఉండే వారిలోని మంచి గుణాల్ని గురించి తలంచి వారి పొరపాట్లు బలహీనతల్ని సాధ్యమైనంత తక్కువ చూడండి. ఓ వ్యక్తి అన్నాదాన్ని గురించి లేక చేసిన దాన్ని గురించి ఫిర్యాదు చేసేటప్పుడు ఆ వ్యక్తి జీవితంలో గాని ప్రవర్తనలో గాని ఉన్న ఓ విషయాన్ని ప్రశంసించడి. కృతజ్ఞతా స్వభావాన్ని వృద్ధిపర్చుకోండి. మన కొరకు మరణించటానికి క్రీస్తును ఇచ్చినందుకు దేవున్ని స్తుతించండి. మన ఇక్కట్లను గురించి ఫిర్యాదు చెయ్యటం మనకు మేలు చెయ్యదు. మనం స్తోత్రార్పణతో ఆవేశం పొందేందుకు తన కృపను గురించి సాటిలేని ప్రేమను గురించి మనం ఆలోచించాల్సిందిగా దేవుడు మనల్ని కోరుతున్నాడు. MHTel 435.1

చిత్తశుద్ది గల పనివారికి ఇతరుల తప్పిదాలపై తలంచటానిక సమయం ఉండదు. మనం ఇతరుల తప్పులు పరాజయాలు ఊహను తిని బతకలేం. చెడు మాట్లాడటంలో రెండు విధాల శాపం ఉంది. వినేవాడి మీదకన్నా చెప్పేవాడి మీద అది ఎక్కువ గట్టిగా పడుతుంది. విభేదాలు జగడాల విత్తనాల్ని వెదజల్లే వ్యక్తి తన మనసులో వాటి ప్రాణాంతక ఫలాన్ని అనుభవిస్తాడు. ఇతరుల్లో దుష్టతను కనుగొనటమన్న చర్య వెదకే వారిలో దుర్మార్గతను పెంచుతుంది. ఇతరుల తప్పిదాల్ని గురించి ఆలోచించటం మాట్టాడటం ద్వారా వారు అదే రూపానికి మార్పు చెందుతారు కాని యేసును వీక్షిచంటం ద్వారా ఆయన ప్రేమ గురించి ఆయన పరిపూర్ణ ప్రవర్తనను గురించి మాట్లాటం ద్వారా మనం ఆయన స్వరూపానికి మార్చబడతాం. ఆయన మన ముందుంచిన సమున్నత ఆదర్శాన్ని గురించి ధ్యానించటం ద్వారా మనం పవిత్రమైన పరిశుద్ధమైన వాతావరణంలోకి అంటే దేవుని సముఖంలోకి ఎత్తబడతాం. మనం ఇక్కడ నివసించేటప్పుడు మన మంచి ఓ వెలుగు బయల్వెడలి మనతో సంబంధమున్న వారందరికి ఆ కాంతిని ప్రసారం చేస్తుంది. MHTel 435.2

ఇతరుల్ని విమర్శించటం ఖండించటంకన్నా మీకు మీరు ఇలా చెప్పుకోండి. “నేను నా రక్షణ కోసం పాటుపడాలి. నా ఆత్మను రక్షించటానికి ఆక్షాంక్షించే ప్రభువుతో సహకరించగోరితే నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నా జీవితం నుంచి ప్రతీ రకమైన దుర్నీతిని విడిచి పెట్టాలి. ప్రతీ పొరపాటును నేను సరిదిద్దుకోవాలి. క్రీస్తు కొరకు నేను నూతన వ్యక్తినవ్వాలి. అప్పుడు, దుర్మార్గతను జయించటానికి ప్రయత్నించే వారిని బలహీనపర్చే బదులు ఉత్సాహపర్చే మాటతో బలపర్చగలుగుతాను”. MHTel 436.1

మనం ఒకరి పట్ల ఒకరం నిర్లక్ష్య స్వభావులమై ఉన్నాం. తరుచు మనతో కలసి పనిచేసేవారిని బలపర్చి ఉత్సాహంతో నింపాల్సిన అవసరం ఉన్నదని మర్చిపోతాం . వారిలో మీకు ఆసక్తి వారి పట్ల మీకు సానుభూతి ఉన్నవని వారికి నమ్మకం కలిగించండి. మీ ప్రార్ధనలతో వారికి సహాయం చెయ్యండి మీరు ప్రార్ధిస్తున్నట్లు వారికి తెలియపర్చండి, MHTel 436.2

క్రీస్తు సేవకులమని చెప్పుకునే వారందరూ నిజమైన శిష్యులు కారు. ఆయన పేరు పెట్టుకున్న వారిలో, ఆయన పనివారిగా లెక్కించబడేవారిలో ప్రవర్తన విషయంలో ఆయనకు ప్రతినిధులు కాని వారు కొందరున్నారు. వారు ఆయన నియామల్ని పాటించరు. ఈ వ్యక్తులు తరుచు క్రైస్తవా నుభవంలో చిన్నవారైన తోటి పనివారిలో ఆందోళనకు నిరుత్సాహానికి కారణ మౌతారు. కాని వారూ తప్పుదారి పట్టనక్కరలేదు. క్రీస్తు మనకు పరిపూర్ణ ఆదర్శాన్నిచ్చాడు. తనను వెంబడించమని మనల్ని ఆదేశిస్తున్నాడు. MHTel 436.3

లోకాంతం వరకు గోధుమల నడుమ గురుగులుంటానే ఉంటాయి. తమ యజమాని పట్ల అభిమానం గల సేవకులు గురుగులను పీకి వెయ్యటానికి అతడు అనుమతి కోరినప్పుడు యాజమాని అన్నాడు. “వొద్దు, గురుగులను పెరుకుచుండగా, వాటితో కూడ ఒకవేళ గోధుమలను పెల్లగిం తురు. కోతకాలము వరకు రెంటిని కలసి యెదుగనియ్యుడి”. మత్తయి 13:29,30 MHTel 436.4

కృప దీర్ఘశాంతం గల దేవుడు వక్రమార్గాలు గలవారు అబద్ద హృదయాలు విషయంలో ఓర్పు ప్రదర్శిస్తారు. క్రీస్తు ఎంపిక చేసుకున్న అపొస్తలుల్లో ద్రోహి యూదా ఉన్నాడు. అలాగైనప్పుడు నేడు ఆయన పనివారిలో అబద్ద హృదయములుండు ఆశ్చర్యానికి లేక నిరుత్సాహానికి హేతువు కావాలి? హృదయాలు చదవగల ఆయన తనను పట్టి ఇవ్వనున్న వాడిని సహించగలిగితే, పొరపాటులో ఉన్నవారిని మనం ఎంత ఓర్పుతో సహించాలి.? MHTel 436.5

అందరూ -ఎంతో తప్పిదస్తులుగా కనిపించేవారు సహా... యూదా లాంటివారు కారు. దుడుకుతనం, తొందరపడే గుణం, ఆత్మ విశ్వాసం ఉన్న పేతురు యూదా కన్నా ఎక్కువ దుస్తితిలో ఉన్నట్లు కనిపించాడు. అతణ్ణి రక్షకుడు తరుచుగా గద్దించాడు కాని అతడిది ఎలాంటి సేవా జీవితం! ఎలాంటి త్యాగపూరిత జీవితం! దేవుని కృపా శక్తి గురించి అది ఎలాంటి సాక్ష్య్యమిస్తుంది! యేసు లోకంలో తన శిష్యులతో నడిచి మాట్లాడినప్పుడు తన శిస్యులకు ఎలాంటివాడై ఉన్నాడో మనం మన సామర్ధ్యం మేరకు ఇతరులకు అలా ఉండాలి. MHTel 437.1

మొట్టమొదటిగా మీ తోటి పనివారి మధ్య మిమ్మల్ని మీరు మిషనెరీ లుగా పరిగణించుకోండి. ఒక్క ఆత్మను క్రీస్తుకు సంపాదించటానికి చాలా సమయం పడుతుంది. చాలా శ్రమ అవసరమౌతుంది. MHTel 437.2

ఒక్క ఆత్మను పాప మర్గం నుంచి నీతి మర్గానికి మళ్ళినప్పుడు పరలోకంలో ఆనందం వెల్లివి రుస్తుంది. క్రైస్తవులుగా చెప్పుకునే కొందరు ఈ ఆత్మల పట్ల ప్రదర్శించే నిర్లక్ష్య స్వభావాన్ని చూసి వీరిని కావలి కాసే పరిచర్య చేసే దూతలు సంతోషిస్తారనుకుంటారా? తరుచు మనం ఒకరితో ఒకరు వ్యవహరించే విధంగా యేసు మనతో వ్యవహరిస్తే మనలో ఎవరు రక్షణ పొందగలరు? MHTel 437.3

మీరు హృదయాలు చదవలేరని గుర్తుంచుకోండి. మీకు తప్పుగా కనిపించే పనులకు దారి తీసిన ఉద్దేశాలు మీకు తెలియవు. సరియైన వ్యిద్య లేనివారు చాలామంది ఉన్నారు. వారి ప్రవర్తనలు భ్రష్టుపట్టాయి. కాఠిన్యంతో జడలు విరబోసుకున్నాయి. ప్రతీ విషయంలోను వక్రంగా కనిపిస్తున్నాయి. కాని వారిని క్రీస్తు కృప మార్చగలదు వారిని విడిచపెట్టవద్దు. “నన్ను నిరాశపర్చావు; నీకు సహాయం చెయ్యను” అంటూ వారిని తరిమి వెయ్యకండి లేక నిరాశపర్చకండి. కోపంతో ఉన్నప్పుడు దుందుడుకుగా అన్న కొన్ని మాటలు ... వారికి అవసరమని మనం భావించే మాటలు... వారిని మనకు దగ్గరగా చేసి ఉండే బంధాలను తెంచివేయచ్చు. MHTel 437.4

నిలకడగల జీవితం, ఓర్పు, సహనం, కోపం పుట్టించే పరిస్థితుల్లో తొణకకుండా నిలకడగా ఉండే స్వభావం. ఎప్పుడూ తిరుగులేని వాదన, అతి గంభీరమైన విజ్ఞాపన, ఇతరులకు లేని తరుణాలు అవకాశాలు ఉన్నవారు అది పరిగణలోనికి తీసుకొని నిత్యం వివేకం, జాగురూకత సాధుగుణం గల అధ్యాపకుడుగా వ్యవహరించాలి. MHTel 438.1

స్త్రీలు ముద్ర స్పష్టంగా బలంగా పడటానికి సీలును మైనం మీద హాడావుడిగా, దౌర్జన్యంగా పడెయ్యరు. మూసలో గట్టిగా అయ్యేవరకూ ప్లాస్టిక్కు మైనం మీద సీలును, జాగ్రత్తగా, నెమ్మదిగా నిలకడగా ఒత్తుతారు. మానవుల ఆత్మలతో అలాగే వ్యవహరించండి., క్రైస్తవ ప్రభావం శక్తి రహస్యం. దాని కొనసాగింపే. అది మీరు క్రీస్తు ప్రవర్తనను కనపర్చటంలో ప్రదర్శించే నిలక పై ఆధారపడి ఉంటుంది. తప్పు చేసినవారికి మీ అనుభవాలు చెప్పటం ద్వారా సహాయం చెయ్యండి. మీరు తీవ్రమైన తప్పిదాలు చేసినప్పుడు సహనం, కనికరం, మీతోటి పనివారికి సహాయ కారిత్వం మీకు ధైర్యాన్ని అశాభావాన్ని ఎలా ఇచ్చాయో వారికి చూపించండి. MHTel 438.2

స్థిరములేనివారి పట్ల అనుచితంగా వ్యవహించే వారి పట్ల, యోగ్యతలేని వారి పట్ల దయ పరిగణనగల వ్యవహరణ ప్రభావం తీర్పు దినం వరకూ మీకు తెలియదు. కృతజ్ఞతను నమ్మక ద్రోహాన్ని ఎదుర్కునప్పుడు మనం ధిక్కారానికి అగ్రహానికి పాల్పడతాం. అపరాధులు దీనికి ఎదరు చూస్తారు. దానికి సిద్ధపడి ఉంటారు కాని దయతో కూడిన ఓర్పు వారిని ఆశ్చర్య పర్చుతుంది. తరుచు వారిలోని మెరుగైన ఉద్వేగాల్ని ఉదాత్త జీవితానికి కోరికను మేల్కొల్పుతుంది.“సహోదరులారా,ఒకడు ఓ తప్పిదములోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడుతానును శోదింపబడుదునేమో అని తన విషయమై చూచు కొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానికి మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములనొకడు భరించి యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి”. గలతీ 6:12 MHTel 438.3

దేవుని ప్లిలమని చెప్పేవారందరు మిషనెరీలుగా తాము అన్ని తరగతుల మనసులతో సంబంధములోకి వస్తారని గుర్తుంచుకోవాలి. సంస్కారం గలవారు, మొరటుగా ఉన్నవారు, దీనులు, అహంకారులు మత వైరాగ్యం గలవారు నాస్తికులు విద్యావంతులు, అజ్ఞానులు ధనవంతులు, పేదలు ఉన్నారు. రకరకాలైన ఈ మనస్సులతో ఒకే రీతిగా వ్యవహరించలేం. ఆయినా అందరకీ దయ సానుభూతి అసవరం. పరస్పర సంబంధాల ద్వారా మన మనుసులు మెరుగుదల నాజూకుతనం పొందాలి. మానవ సహోదరత్వ బంధాలతో బంధించబడి మనం ఒకరిపై ఒకరు ఆధారపడి నివసించాలి. MHTel 439.1

“దేవుడు సృజించాడు ఒకరిపై ఒకరు ఆధారపడేందుకు
యాజమానుడు సేవకుడు మిత్రుడు
ప్రతి వారు ఒకరి చేయూత ఒకరు కోరాలని
ఒకడి బలహీనత అందరి బలంగా పెరిగేవరకు”
MHTel 439.2

క్రైస్తవమతం సాంఘిక సంబంధాల ద్వారా ప్రపంచంతో పరిచయం కలిగించుకుంటుంది. దేవుని వెలుగు పొందిన ప్రతీ పురుషుడు, ప్రతీ స్త్రీ మెరుగైన మార్గాన్ని ఎరుగనివారు నడుస్తున్న చీకటి మార్గంలో వెలుగును ప్రకాశింపజెయ్యాలి. ఆత్మలను రక్షకుని వద్దకు తేవటానికి క్రీస్తు ఆత్మచే పరిశుద్ధి పొందిన సాంఘిక శక్తిని వృద్ధిపర్చుకోవాలి. దాన్ని కలిగి ఉన్న వ్యక్తి తానే పూర్తిగా సొంతం చేసుకొని ఆనందించేందుకు ఆశించిన ఐశ్వర్యంగా క్రీస్తును దాచుకోకూడదు. క్రీస్తు మనలో నిత్య జీవాన్ని ప్రవహిస్తూ మనం కలిసే వారిని సేదదీర్చే నీటి బావిగా ఉండాలి. MHTel 439.3

*****