స్వస్థత పరిచర్య

159/173

జీతం

తన శిష్యులుకి తనను వెంబడించమని క్రీస్తు పిలుపునిచ్చినప్పుడు ఈ జీవితంలో వారికి గొప్ప భవిష్యత్తును వాగ్దానం చెయ్యలేదు. లాభాలను గాని లోకసంబంధమైన ప్రతిష్ట గాని వాగ్దానం చెయ్యలేదు. వారు కూడా రావలసిన వాటి గురించి షరతులు విధించలేదు. MHTel 422.3

పన్ను వసూలుకు కూర్చున్న మత్తయిలో రక్షకుడు, “నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచి పెట్టి లేచి ఆయనను వెంబడించెను.”లూకా 5:28 తన పనిని మొదలు పెట్టక ముందు మత్తయి తనకు వస్తున్న జీతానికి సమానమైన జీతం డిమాండు చెయ్యటానికి ఆగలేదు. ప్రశ్నించకుండా లేక సందేహించకుండా యేసును వెంబడించాడు. రక్షకునితో ఉండటం . MHTel 422.4

“కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడ వైయున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొను చున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా”? రోమా 2:1 MHTel 422.5

ఆయన మాటలు వినటం, ఆయన పనిలో ఆయనతో కలసి పని చెయ్యటం అతడికి సరిపోయింది. దీనికి ముందు ఆయన పిలిచిన శిష్యుల విషయంలోను ఇదే జరిగింది. పేతురుని అతడి సహచరుల్ని తనను వెంబడించమని యేసు పిలిచినప్పుడు వారు వెంటనే తమ పడవల్ని వలల్ని విడిచి పెట్టి ఆయన్ని వెంబడించారు. ఈ శిష్యుల్లో కొందరికి పోషణ నిమిత్తం తమ మీద ఆధారపడిన మిత్రులున్నారు. అయినా రక్షకుని ఆహ్వానాన్ని విన్నప్పుడు వారు “నేను ఎలా బతకాలి? నాకుటుంబాన్ని ఎలా పోషించాలి?” అని సందేహించలేదు. తమకు వచ్చిన పిలుపుకు వారు విధేయులయ్యారు. అనంతరము యేసు వారిని “సంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయెనా? అని అడిగినప్పుడు వారు “ఏమియు తక్కువ కాలేదు” అని బదులు పలికారు. లూకా 22:35 MHTel 423.1

మత్తయి యోహాను, పేతురులను పిలిచినట్లు నేడు తన పనికి రక్షకుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ మన మనసుల్ని ప్రశ్నిస్తే నష్ట పరిహార సమస్య మన మనసుల్లో ప్రధానంగా ఉండదు. క్రీస్తుతో జతపనివారుగా ఉండటానికి మనం సంతోషిస్తాం. ఆయన సంరక్షణను నమ్మటానికి భయపడం. దేవున్ని మన బలంగా చేసుకుంటే మనం మన విధి విషయంలోను స్వార్ధరహిత కోరికల విషయంలోను స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఓ ఉదాత్తమైన ఉద్దేశం మన జీవితాన్ని నడిపిస్తుంది. అది మనల్ని నీచమైన తలంపులనుంచి పైకి లేపుతుంది. MHTel 423.2