స్వస్థత పరిచర్య
39—దైవ వాక్యం ద్వారా పొందే జ్ఞానం
బైబిలు మొత్తం క్రీస్తు ద్వారా ప్రత్యక్షమైన దేవుని మహిమ. దాన్ని స్వీకరించి విశ్వసించి ఆచరిసుత అది ప్రవర్తనలో మార్పు కలిగించే గొప్ప సాధనమౌతుంది.శరీరాన్ని మనసును,ఆధ్మాత్మిక శక్తులను చైతన్యపర్చి జీవి తాన్ని సరియైన మార్గాల్లో నడిపించుటలో అదిగొప్ప ఉత్తేజక, నిరోధక శక్తి, MHTel 403.1
యువత, పరిణత వయసు గలవారు సయితం శోధనకులోనై పాపంలో పడటానికి కారణం వారు పఠించవలసినంతగా దైవ వాక్యాన్ని పఠించి ధ్యానించకపోవటమే. జీవితంలోను ప్రవర్తనలోను ప్రదర్శితమయ్యే ధృడమైన నిర్ణయాత్మకమైన మనశ్శక్తి లోపం దైవ వాక్య పవిత్ర ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితం. అపవిత్రమైన దాని నుండి అవాస్తవమైన దాని నుండి మనసును మళ్ళించి పవిత్రమకైన పరిశుద్ధమైన ఆలోచనలకు హృదయపూర్వక కృషితో వారు మనసును నడిపించరు. మేలైనదాన్ని ఎంచుకునేవారు కొద్దిమంది ఉన్నారు. వారు మరియు నేర్చుకోవటానికి ఆ దివ్య బోధకుని పాదాల వద్ద కూర్చునేవారు. కొద్దిమంది ఆయన మాటల్ని హృదయంలో దాచుకొని జీవితంలో ఆచరిస్తారు. MHTel 403.2
బైబిలులోని సత్యాలను స్వీకరిస్తే అవి మనసుకు ఆత్మకు ఉన్నతి నిస్తాయి. పొందాల్సినంతగా దైవ వాక్యం ఆదరణ పొందితే శోధనను ప్రతిఘటించటానికి తోడ్పడే అంతరంగిక శక్తి, నియమ శక్తి చిన్నవారికి పెద్దవారికి ఉంటాయి. MHTel 403.3
ప్రశస్తమైన పరిళ్లు లేఖన విషయాల్ని మనషులు భోధించాలి వాటి గురించి రాయాలి. మనసు ఆలోచనను, అభిరుచిని, శక్తిని దేవుని ఆలోచనలను అధ్యయనం చెయ్యటానికి వినియోగిచండి. మనుషుడి ఊహల తత్వాన్ని కాక ఎవరు సత్యమో ఆ ప్రభువు తత్వాన్ని అధ్యయనం చెయ్యండి. విలువలో దేనికి ఏదీ సరిసాటి కాదు. MHTel 403.4
ఐహికమైన మనసుకు దేవుని వాక్య ధ్యానం రుచించదు. కాని పరిశు ద్దాత్మ వలన నవీకరించబడ్డ మనసుకు ఆ గ్రంధ పరిశుద్ద పుటల్లో నుంచి దివ్య సౌందర్యం పారలౌకికమైన వెలుగు గోచరిస్తాయి. ఐహిక మనసును నిర్జన అరణ్యంగా కనిపించేది ఆధ్యాత్మిక మనసుకు జీవనదులు ప్రవహించే దేశంలా కనిపిస్తుంది. MHTel 403.5
తన వాక్యంలో ప్రకటితమైన దేవుని గూర్చిన జ్ఞానం మన పిల్లలకు అందించాల్సిన జ్ఞానం. ఊహ తెలిసినప్పటి నుండి వారికి యేసును గూర్చి ఆయన జీవితాన్ని గూర్చి నేర్పించాలి. వారి మొట్టమొదటి పాఠం దేవుడు తమ తండ్రి అని బోధించాలి. వారి మొదటి శిక్షణ ప్రేమాప్యాయతలతో కూడిన విధేయత, భయభక్తులతో, అప్యాయంగా దైవ వాక్యాన్ని పిల్లలకు అర్ధమయ్యేటట్టు వారి ఆసక్తిని రేకెత్తించేటట్లు అంచెలంచెంలుగా చదివి పునర్చురించాలి. మరీ ముఖ్యంగా క్రీస్తు ద్వారా వెల్లడైన ఆయన ప్రేమను గూర్చి దాని పాఠాన్ని గూర్చి వారికి నేర్పించండి. MHTel 404.1
“దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్దులమైయున్నాము”. 1 యోహాను 4:11 MHTel 404.2
యువత దేవుని వాక్యాన్ని మనసుకు ఆత్మకు ఆహారం చేసుకోవాలి. క్రీస్తు సిలువ సమస్త విద్యకూ విజ్ఞాన శాస్త్రం, సమస్త బోధనకు అధ్యయనానికి కేంద్ర బిందువు కావాలి. దిన దిన వ్యావహరిక జీవితా నుభవం లోకి దాన్ని తీసుకురావాలి. రక్షకుడు యువతకు అలా దిన దిన వ్యావహరిక జీవితానుభవంలోకి దాన్ని తీసుకురావాలి. రక్షకుడు యువతకు అలా దిన దిన మిత్రుడు నేస్తం అవుతాడు. ప్రతీ ఆలోచనను క్రీస్తుకు విధేయులమయ్యేటుట్ల స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు పౌలుతో గొంతు కలిపి వారు ఇలా చెప్పగలరు. MHTel 404.3
“మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందు ను అతిశయించుట నాకు దూరమౌనుగాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయడియున్నాము”. గలతీ 6:14 MHTel 404.4
“నీ శాసనములు నాకుసంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలైయున్నవి” కీర్తనలు 119:24 ఈవిధముగా వారు ప్రయోగాత్మక జ్ఞానంతో దేవుని కనుగొంటారు. దేవుని వాక్యం, ఆయన వాగ్దానాలు యాదార్ధమైనవి వారు పరిశోధించి తెలుసుకున్నారు. రుచిచూసి దేవుడు దయాళుడని తెలుసుకున్నారు. MHTel 404.5
ప్రియుడైన యోహానుకి తన అనుభవం ద్వారా సంపాదించిన జ్ఞానం ఉంది. అందుకే ఇలా సాక్ష్యమివ్వగలిగాడు. MHTel 405.1
“జీవ వాక్యమును గూర్చినది, అది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఈ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు. దానిని మీకు తెలియపర్చుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయు చున్నాము. మన సహవాసమైతే, తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడను ఉన్నది”. 1 యోహాను 1:1-3 MHTel 405.2
తన సొంత అనుభవం ద్వారా ప్రతీ వ్యక్తి “దేవుడు సత్యవంతడను మాటకు ముద్ర” వేసుకోవాలి. యోహాను 3:33 క్రీస్తు శక్తిని గురించి తాను చూచిన దానికి, విన్నదానిక అనుభవించిన దానికి అతడు సాక్ష్యమివ్వగలడు. అతడు ఇలా సాక్ష్యమివ్వవచ్చు. MHTel 405.3
“నాకు సహాయం అవసరమయ్యింది. అది నాకు క్రీస్తులో దొరికింది ప్రతీ లేమి సరఫరా అయ్యింది. నా ఆత్మ ఆకలి తీరింది. బైబిలు నాకు క్రీస్తును గూర్చిన ఎల్లడి. నేను యేసును నమ్ముతాను ఎందుకంటే ఆయన నాకు దివ్య రక్షకుడు. బైబిలు నా ఆత్మకు స్వరం వంటిది అందుకు దాన్ని నమ్ముతాను”. MHTel 405.4
వ్యక్తిగతానుభవం ద్వారా దేవున్ని తెలుసుకున్న వ్యక్తి ప్రకృతి విజ్ఞానశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యటానికి సిద్ధంగా ఉంటాడు. క్రీస్తును గురించి లేఖనం ఇలా చెబుతున్నది “ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను”. యోహాను 1:4 పాపం పవేశించకముందు ఏదెనులో ఆదామవ్వల చుట్టూ వెలుగు ఉంది. అది దేవుని వెలుగు. వారు దేన్ని సమీపిస్తే అది వెలుగుతో ప్రకాశించింది. ప్రవర్తనను గురించి లేక దేవుని కార్యాల్ని గురించి వారి గ్రహణ శక్తిని మసకబార్చేది ఏది లేదు. కాని వారు శోధకుడికి లొంగినప్పుడు వెలుగు వారిని విడిచి వెళ్లి పోయింది. పరిశుద్ధతా వస్త్రాల్ని పొగట్టుకోవటంలో వారు ప్రకృతిని వెలుగుతో నింపిన వెలుగును కోల్పోయారు. వారు ప్రకృతిని సరిగా చదవటం ఇక సాధ్యపడలేదు. ఆయన పనుల్లో దేవుని ప్రవర్తనను గ్రహించలేక పోయారు. అలాగే ఈనాడు మానవడు తనంటతాను ప్రకృతి బోధనను సరిగా చదవలేడు. దేవుని వివేకం నడుపుదల ఉంటే తప్ప అతడు ప్రకృతిని చేసిన దేవునికి, ప్రకృతి చట్టాల్ని ఘనపర్చుతాడు. ఈ కారణం వల్లనే విజ్ఞాన శాస్త్రం గురించి మానవ అభిప్రాయాలు దేవుని వాక్య బోధనల్ని నిరాకరిస్తు న్నాయి. కాని క్రీస్తు జీవితమును స్వీకరించిన వారికి ప్రకృతి మళ్లీ వెలుగుతో ప్రకాశిస్తుంది. సిలువనుంచి ప్రకాశిస్తున్న వెలుగులో ప్రకృతి ప్రభోదాన్ని మనం సరిగా గ్రహించగలుగుతాం. MHTel 405.5
దేవుని గురించి ఆయన వాక్యం గురించి గతానుభవం ద్వారా జ్ఞానం సంపాదించిన వ్యక్తి పరిశుద్ధ లేఖనాలలో దేవం గురించి స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాడు. దేవుని వాక్యం సత్యమని పరిశోదించి తెలుసుకుంటాడు. సత్యం ఎన్నడూ ఆత్మ ఖండన చేసుకోదని అతడికి తెలుసు. మానవుడి విజ్ఞాన శాస్త్ర అభిప్రాయాలతో అతడు బైబిలుని పరీక్షంచడు. తప్పు చెయ్యని ప్రమాణంతో ఈ అభిప్రాయాలతో అతడు బైబిలు పరీక్షిస్తాడు. నిజమైన విజ్ఞాన శాస్త్రంలో వాక్యానికి విరుద్ధమైనది ఏదీ ఉండదని అతడికి తెలుసు. విజ్ఞాన శాస్త్రానికి బైబిలుకి కర్త ఒక్కడే గనుక ఈ రెండింటి సరియైన అవగాహన ఆ రెంటికి మధ్య సామరస్యమున్నది నిరూపిస్తుంది. శాస్త్ర బోధ నలో దేవుని వాక్య సాక్ష్యన్ని ఏది ఖండిస్తుందో అది కేవలం ఊహజనితం. MHTel 406.1
అలాంటి విద్యార్ధికి శాస్త్రీయ పరిశోధన ఆలోచనకు సమాచారానికి విశాల క్షేత్రాలను తెరుస్తుంది. ప్రకృతి విషయాల్ని గురించి ఆలోచించే టప్పుడు అతడికి సత్యాన్ని గురించి ఓ నూతన అవగాహన వస్తుంది. ప్రకృతి గ్రంథం దేవుని లిఖిత వాక్యం ఒకదానిపై ఒకటి వెలుగును విరజిమ్ముతాయి. ఆయన ఏ చట్టాల ద్వారా పనిచేస్తాడో వాటి నుండి ఆయన ప్రవర్తనన గురించి అతడికి బోధించటం ద్వారా ఈ రెండు దేవునితో అతడికి పరిచయం కలిగిస్తాయి. ప్రకృతి ద్వారాను దైవ ప్రత్యక్షత ద్వారాను దేవుని వాక్యాన్ని స్వీకరించటం ద్వారా కీర్తన కారుడి అనుభవం అందరూ పొందగల అనుభవం, అతడంటున్నాడు. MHTel 406.2
యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను”.“యెహోవా నీ కృప ఆకాశమునంటున్నది నీ సత్యసంధవము అంతరిక్షము నంటు చున్నది నీ నీతి దేవుని పర్వములతో సమానము నీ న్యాయ విధులు మహా గాఢములు... MHTel 407.1
“దేవా, నీకప్ప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ సొంత ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచచున్నాము”? MHTel 407.2
“యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దేశముగా నడుచు కొనువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు”. MHTel 407.3
“యౌవనస్తులు దేవుని చేత తమ నడత శుద్ధిపర్చుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనేగదా?” సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయ విధులను నేను నా యెదుట పెట్టుకొనియున్నాను”“నీ యెదుట నేను పాపము చేయకుండనట్లు నా హృధయములోన నీ వాక్యము ఉంచుకొనని యున్నాను”. “నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధము లేక నడుచుకొందును. “నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరుపము “నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాక ఆలోచనకర్త లైయున్నవి”.“వేలకొలది వెండి బంగారు నాణెమలు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు”. “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.. “నీ శాసన ములు ఆశ్చర్యములు కావుననే నేనును వాటిని గైకొనుచున్నాను” “యాత్రికుడైన నేను నా బసలో పాటు పాడుటకు నీ కట్టడలు హేతవులాయెను”. “నీ మాట మిక్కిలి స్వచ్చమైనది అది నీ సేవకునికి ప్రియమైనది” MHTel 407.4
“నీ వాక్య పాఠాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధు లన్నియు నిత్యము నిలుచును”. “నీవు నన్ను బత్రికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక”. నీ ధర్మశాస్త్రము ప్రేమించువారికి ఎంతో నెమ్మదిగా కలదు వారు తూలి @టిల్లుటకు కారణమేమియు లేదు యెహోవా, MHTel 408.1
నీ రక్షణ కొరకు నేను కని పెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను అవినాకు అతిప్రియములు”. నీ వాక్య ములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును”? “నీ ఆజ్ఞలు నిత్యము నాకుతోడుగా నున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి, MHTel 408.2
నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధ కులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటే నాకు విశేష జ్ఞానము కలదు”.“నీ ఉపదశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నియూ నా కసహ్యములాయెను” “నీ శాసన ములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్య మని భావించుచున్నాను”.కీర్త 92:4, 36:5-7, 36:7-9, 119:1,2, 9,30, 119:11,45, 18,24, 72, 97, 129, 54, 140, 160, 175, 165- 167, 130, 98-100, 104, 111 MHTel 408.3