స్వస్థత పరిచర్య

148/173

ఎక్కువ సమయం లేదు

మనకు ఎక్కువ సమయం లేదు. మన కృపకాలం ఎప్పుడు సమాప్తమౌతుందో మనకు తెలియదు. మాహ ఉంటే మనకు ఇక్కడ స్వల్ప జీవితకాలమే. ఎంత త్వరలో మరణమనే బాణం మన గుండెల్లో దిగబడు తుందో మనకు తెలియదు. ఈ లోకాన్ని దానిలోని ఆసక్తుల్ని విడిచి పెట్టాలన్న పిలుపు ఎంత త్వరగా వస్తుందో మనకు తెలియదు. కొన్ని సంవత్సరాలు మాత్రమే ముందు నిత్యత్వం విస్తరించి ఉంది. తెర పైకి లేవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు జీవించి ఉన్నవారి విషయంలో ఈ ఆజ్ఞ జారీ కాబోతున్నది. MHTel 398.2

“అన్యాయము చేయువాడింకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము నీతిమంతుడు ఇకంను నీతిమంతుడుగానే యుండనిమ్ము పరిశద్ధుడు ఇంకను పరిశద్ధుడు గానే యుండనిమ్ము” ప్రకటన 22:11 MHTel 398.3

మనం సిద్ధంగా ఉన్నామా ? పరలోక పరిపాలకుడు, ధర్మశాస్త్ర కర్త అయిన దేవునితోను లోకంలో తన ప్రతినిధిగా ఆయన పంపిన యేసు క్రీస్తు తోను మనకు పరిచయం ఉందా? ఈ జీవితంలో మన పని అంత మైనప్పుడు మన ఆరద్శనీయుడు క్రీస్తు ఇలా చెప్పినట్లు మనం చెప్పగలమా! MHTel 398.4

“చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని”. యోహాను 17:4 MHTel 399.1

“దేవుని దూతలు మనల్ని స్వార్ధాశక్తుల నుంచి ఐహిక వాంఛలు ఆశలు నుంచి ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు వర్ధం కాకుండను గాక. MHTel 399.2

అవి నీతికరమైన ఆలోచనలు చేసే మనసులు మారాలి.“మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కృప విషయమై సంపూర్ణ నీరీక్షణ కలిగియుండుడి. నేను పరిశుద్ధుడనైయున్నాను. గనుక మీరును పరిశుద్దులైయుండుడని వ్రాయబడియున్నది కాగా మీరు విధేయులగుపిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను గురించి ప్రవర్తింపక మిమ్మును పలిచినవాడు పరిశుద్ధడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశు ద్దలైయుండుడి” 1 పేతురు 1:13-16 MHTel 399.3

తలంపులు దేవుని పై కేంద్రీకృతం కావాలి. స్వాభావిక హృదయ దుష్ట కోరికలను అధిగమంచటానికి మనఃపూర్వక కృషి చెయ్యాలి. మన ప్రయత్నాలు మన ఆత్మ త్యాగం, పట్టుదల మనం సాధించటానికి ప్రయత్నిస్తున్న లక్ష్యం విలువ నిష్పత్తిలో ఉండాలి. మనం క్రీస్తు జయించినట్లు జయిస్తేనే జీవకిరీటం పొందగలం, MHTel 399.4