స్వస్థత పరిచర్య

146/173

మన ఆలోచన అవసరమైన పని

కొన్ని బలహీనమైనవి ఆగి ఆగి చేసే, ప్రయత్నాల ద్వారా తప్పులు సరిచేయటం గాని ప్రవర్తనలో మార్పులు తేవటం గాని సాధ్యందు. ప్రవర్తన నిర్మాణానికి ఒక రోజు ఒక సంవత్సరము కాదు. ఓజీవతకాలంపడుతుంది. స్వార్ధాన్ని జయించటానికి , పరిశుద్ధతకు పరలోకానికి సంపాదించటానికి సాగే పోరాటం జీవిత కాలమంతా కొనసాగుతుంది. తెంపులేని కృషి, నిత్య క్రియాశీలత లేకుండా దైవిక జీవితంలో అభివృద్ధి విజయ కిరీట సాధన అసాధ్యం . MHTel 396.1

ఉన్నత స్తితి నుంచి మానవుడి పతనానికి బలమైన నిరద్శనం. ఏమిటంటే తిరిగి రావాటానికి ఎంతో మూల్యం చెల్లించాలన్నది తిరిగి వచ్చే మార్గం ప్రతీ అంగుళం, ప్రతీ గడియ, తీవ్ర పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. దుందుడుకు, అజాగ్రత్తతో కూడిన , ఓ క్షణంలోనే మనల్ని మనం అపవాది ఆధీనంలో ఉంచుకోవచ్చు. కాని సంకెళ్ళను విరగగొట్ట టానికి, పరిశుద్ధ జీవితాన్ని చేరుకోవటానికి ఓ క్షణం కన్నా ఎక్కువ పడు తుంది. ఉద్దేశాన్ని ఏర్పర్చుకుని పనిని మొదలు పెట్టవచ్చు. కాని దాన్ని సాధించటానికి శ్రమ, సమయం, పట్టుదల, ఓర్పు, త్యాగం అవసరం. MHTel 396.2

మనం ఉద్వేగంతో వ్యవహరించకుండా మనల్ని మనం అదుపు చేసుకోవాలి. ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. అనేక శోధనలు ఎదురవుతాయి. వాటిని ధృడంగా ప్రతిఘటించాలి లేకపోతే అవి మనల్ని జయిస్తాయి. MHTel 396.3

మనం భావోద్వేగంతో పని చెయ్యకూడదు. ఒక్క క్షణం ఏమరిచి ఉండకూడదు. అనేక శోధనలు మన చుట్టు ఉన్నాయి. వాటిని ధృడంగా ప్రతిఘటించకపోతే మనం పరాజయం పాలవుతాం. దేవుడిచ్చిన పని ముగిం పుకు రాకముందే మనం మరణిస్తే అది నిత్య నాశనం. అపొస్తలుడు పౌలు జీవితం నిత్యం స్వార్ధంతో సంఘర్షణ పడింది. “నేను దినదినము చనిపోవుచున్నాను” అని అతడంటున్నాడు. 1 కొరింధీ 15:31 అనుదినం అతడి చిత్తం అతడి కోరికలు విధితోను దేవుని చిత్తంతోను సంఘర్షణ పడ్డాయి. అతడు తన ఇష్టాన్ని గాక దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అతీ తన స్వభావానికి ఎంత బాధాకరంగా ఉన్నప్పటికి MHTel 396.4

తన సంఘర్షణాత్మక జీవితం చివరిలో తన పోరాటాల్ని విజయ వంతంగా సింహాలోలనం చేసుకుంటూ అతడు ఇలా చెప్పగలిగాడు. “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కూడా ముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇకమీదట నాకు నీతి కిరీటముంచ బడియున్నది. ఆది నమును నీతిగల న్యాయాధిపతయైన ప్రభువు అది నాకు... అను గ్రహిం చును”. 2 తిమోతి 4:7,8 MHTel 397.1

క్రైస్తవుడి జీవితం ఓ పోరాటం, ఓ యుద్ధయాత్ర ఈ యుద్ధంలో సెలవు ఉండదు. కృషి కొనసాగుతూ ఉండాలి. అది పట్టుదలతో సాగాలి, అవిశ్రాంతి కృషి ద్వారా సాతాను శోధనల పై విజయాన్ని కొనసాగించాలి. క్రైస్తవ చిత్తశుద్ధికి శ్రాయాశక్తులా పాటుపడి దాన్ని ధృడసంకల్పంతో కొనసాగించాలి MHTel 397.2

తన పక్షంగా కఠినమైన, పట్టుదలతో కూడిన కృషి లేకుండా ఎవరూ ఇంకొకర్ని పరలోకానికి మోసుకువెళ్లరు. అందరూ తమ వంతుగా ఈ యుద్ధంలో పోరాడాలి. మన పోరాటాలు మన పక్షంగా ఇతరులెవరూ చెయ్యరు. సంఘర్షణలోని సమస్యలకు వ్యక్తిపరంగా మానం బాధ్యులం నోవాహు, యోబు, దానియేలు, దేశంలో ఉన్నా తమ నీతి వల్ల కుమారుణ్ణి గాని కుమార్తెను గాని విడిపించటానికి వారికి శక్తి లేదు. MHTel 397.3