స్వస్థత పరిచర్య

145/173

38—యధార్ధ జ్ఞాన అన్వేషణ ప్రాముఖ్యం

మనం నిమగ్నమై ఉన్న మహా సంఘర్షణలో ఏ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నమో వాటిని ఇప్పటికన్నా మరింత స్పష్టంగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని వాక్యంలోని సత్యాల విలువను వాటి నుంచి మన మనసుల్ని మళ్లించటానికి ఆ మహా వంచకుణ్ణి అనుమతించటం వల్ల ఏర్పడే ప్రమాదాన్ని మనం మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. MHTel 395.1

మన విమోచనకు అవసరమైన త్యాగానికున్న చెప్పశక్యం కాని విలువ, పాపం ఎంతో దుష్టమైనదన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. పాపం ద్వారా శరీర అంగక్రమ నిర్మాణమంతా భ్రష్టమయ్యింది. బుద్ది విక్రమయ్యింది. ఆలోచన దుర్నీతి మయమయ్యింది. ఆత్మ తాలూకు మానసిక శక్తుల్ని పాపం భ్రష్టపర్చింది. బయట నుండి వచ్చే శోధనలు హృదయంలో సానుకూల స్పందనను పొందుతాయి. అడుగులు దుర్మార్గత దిశగా పడతాయి. MHTel 395.2

మన తరుపున త్యాగం సంపూర్తి అయినట్లే పాపం అపవిత్రత నుంచి మన పునరుద్ధరణ సంపూర్తి కావలసి ఉన్నది. ఏ దుష్ట క్రియనూ దైవ ధర్మ శాస్త్రం క్షమించదు. ఏ అవినీతిని ధర్మశాస్త్రం ఖండించకుండా విడిచి పెట్టదు. సువార్త నీతి ప్రామణం దేవుని సంపూర్ణ ప్రవర్తన ప్రామాణిక తను తప్ప మరి దేన్నీ అంగీకరించదు. క్రీసు జీవితం ధర్మశాస్త్రం ప్రతీ సూత్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చింది. ఆయన ఇలా అన్నాడు “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను”. విధేయతకు సేవకు ఆయన జీవితం మనకు మాదిరి. దేవుడు మాత్రమే హృధయాన్ని నవీకరించగలడు. “మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును... మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే”. కాని మనం మన “సొంత రక్షణను కొనసాగించుకో” వలసిందిగా దేవుడు కోరుతున్నాడు. యోహాను 15:10, ఫిలిప్పీ 2:13, 12 MHTel 395.3