స్వస్థత పరిచర్య
పురాణ కథలు ఆద్భుత గాధలు
పిల్లలకు యువతకు విద్యాబోధనలో అద్భుత గాధలు, పురాణ కథలు, కల్పిత కథలు ఇప్పుడు ప్రముఖ స్థానాన్ని పొందుతున్నాయి. ఈ రకమైన పుస్తకాలు పాఠశాలల్లో ఉపయుక్తమౌతున్నాయి. అవి అనేక గృహాల్లో ధర్మనమిస్తున్నాయి. అబద్దాలతో నిండిన పుస్తకాలన్ని తమ బిడ్డలు ఉ పయోగించటాన్ని క్రైస్తవ తల్లితండ్రులు ఎలా అనుమతించగలరు? తమకు తల్లితండ్రులు బోధించేదానికి అంతవిరుద్ధంగా ఉన్న కథల భావాన్ని గురించి పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడు ఆ కథలు నిజం కావు అన్నది వారి జవాబు. కాని వాటి వినియోగం వల్ల సంభవించే దుష్పలితాలను అది తొలగించదు. ఈ పుస్తకాల్లోని అభిప్రాయాలు పిల్లల్ని తప్పుదారి పట్టిస్తాయి. అవి జీవితాన్ని గూర్చి తప్పుడు అభిప్రాయాల్ని కలిగించి ఆ వాస్తవాల పట్ల కోరికను పెంచి పోషిస్తాయి. MHTel 389.3
అటువంటి పుస్తకాల విస్తృత. వినియోగం ఈ కాలంలో సాతాను చతురంగా ఉపయోగించే సాధనం. ప్రవర్తన నిర్మాణ మహా కార్యం నుంచి పెద్దవారిని చిన్నవారిని దారి మళ్ళించటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. తాను లోకాన్ని నింపుతున్న ఆత్మను నాశనం చేసే మోసాల ద్వారా మన బిడ్డలు యువత మనకు దూరమైపోవాలన్నది అతడి భావన., అందుకు వారి మనుసుల్ని దైవ వాక్యం నుంచి మళ్ళించి తమను పరిరక్షించే సత్యాల జ్ఞానాన్ని పొందకుండా వారిని ఆవిధంగా తప్పించటానికి ప్రయత్నిస్తున్నాడు.. MHTel 390.1
సత్యాన్ని వక్రం చేసే విషయాలున్న పుస్తకాల్ని పిల్లలు యువత చేతుల్లో ఎన్నడు ఉంచకూడదు. విద్యను అభ్యసించే ప్రక్రియలోనే మన పిల్లలు పాపానికి విత్తనాలుగా పరిణమించే అభిప్రాయాల్ని పొందకుండురు గాక, పక్వ మనసులు గల వారికి అలాంటి పుస్తకాలతో పనిలేకపోతే వారే మరి క్షేమంగా ఉంటారు. యువతను శోధన నుంచి కాపాడి సరియైన మార్గంలో ఉంచటానికి వారి ఆదర్శం ప్రభావవంతమౌతుంది. సులభమౌతుంది. MHTel 390.2
వాస్తవమైనది దైవికమైనది మనకు చాలా ఉన్నది. జ్ఞానానికి తృష్ణ గలవారు మురుగు నీటి ప్రవాహాల వద్దకు వెళ్ళనవసంర లేదు. ప్రభువిలా అంటున్నారు: MHTel 390.3
“చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సునిమ్ము....... నీవు యెహోవాను ఆశ్రయించునుట్లు నీకు నీకేగదా నేను ఈ దిననమున వీటిని ఉ పదేశించి యున్నాను? నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీకొరకు రచించితిని”.“రాగలతరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లకు దానిని వివరించినట్లును వీరును దేవునియందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యెహోవాస్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లకు మేము చెప్పుదుము యధార్ధహృదయలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగుబాటు చేయు మూర్ఖ తయు తిరుగుబాటు గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనట్లును ఆయన యాకోబు సంతతికి శాసన ములను నియమించెను ఇశ్రాయేలు సంతతితికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను”. ” యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు” సామెతలు 22:17-21, కీర్తనలు 78:5, 4, 6 , 7 సామెతలు 10:22 MHTel 390.4