స్వస్థత పరిచర్య
4—విశ్వాస స్పర్శ
“నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముట్టితే... బాగుపడుదును” మత్తయి 9:21 ఈ మాటలన్నది ఓ పేదరాలు పన్నెండు సంవత్సరాలుగా తనను పీడించి తన జీవితాన్న పెను భారంగా మార్చిన ఓ వ్యాధి బాధితరాలు ఆమె. తన ద్రవ్యమంతా వైద్యులకు నివారణలకు పోసింది. అది నయం కాని వ్యాధి అని వైద్యులు వెల్లడించారు. అయితే స్వస్థత కూర్చే మహా వైద్యుణ్ని గురించి విన్నప్పుడు ఆమెలో ఆశ చిగురించింది. “ఆయనతో మాట్లాడటానికి దగ్గరగా వెళ్ళగిలిగే నేను స్వస్తత పొందవచ్చు” అని తలపోసింది. MHTel 36.1
తన కుమార్తెను స్వస్థపర్చటానికి రావలసినదిగా కోరిన యూదు రబ్బీ అయిన యాయూరు ఇంటికి క్రీస్తు వెళ్తున్నాడు. ‘నా చిన్న కుమార్తె చావనైయున్నది, ఆది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెను”బతిమాలు తున్నాను అంటూ గుండె చెదరి అతడు చేసిన దీన విన్నిపం(మార్కు 5:23)కనికరం సానుభూతి గల క్రీస్తు హృద యాన్ని కదిలించింది. వెంటనే ఆ అధికారితో అతడి ఇంటికి బయలుదేరాడు. MHTel 36.2
ప్రయాణం నెమ్మదిగా సాగింది. ఎందుకంటే అన్ని పక్కలా జనసమూ హాలు ఆయన వద్దకు తోసుకువస్తున్నాయి. ఆ జనుల మధ్యలో నుండి ముందుకి వెళ్తూ ఈ బాధిత స్త్రీ నిలబడి ఉన్న చోటుకి దగ్గరగా రక్షకుడు వచ్చాడు. ఆయనకు దగ్గరగా వెళ్ళటానికి ఆమె మళ్లీ మళ్లీ ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు ఆమెకు తరుణం వచ్చింది. ఆయనతో మాట్లాడే మార్గమేమి ఆమెకు కనిపించలేదు. నెమ్మదిగా సాగుతున్న ఆయన ప్రయాణానికి అటంకం కలిగించకూడ దనుకున్నది. ఆయన వస్త్రం ముట్టుకుంటే స్వస్థత కలిగిందని బహుస విన్నది. స్వస్థత పొందటానికి తనకు కలిగిన ఒకే ఒక తరుణాన్ని పోగొట్టు కుంటానేమోనని భయపడూ “ఆయన వస్త్రములు మాత్రమ ముట్టిన బాగుపడుదుననుకొని ముందుకు వెళ్ళింది. MHTel 36.3
ఆమె మనసులోని ప్రతీ తలంపు క్రీస్తు ఎరుగును. ఆమె ఎక్కడ నిలబడిందో ఆక్కడికి వెళ్తున్నాడు. ఆమెకున్న గొప్ప అవసరాన్ని ఆయన గుర్తించాడు. కనుక ఆమె తన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టటానికి తోడ్పడుతన్నాడు. MHTel 37.1
తనను దాటి వెళ్తుండగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆ క్షణంలోనే తాను స్వస్థత పొందినట్లు ఆమె గ్రహించింది. ఆ ఒక్క స్పర్శలో ఆమె జీవితంలోని విశ్వాసంమంతా కేంద్రీకృతమయ్యింది. తక్షణమే ఆమె బాధ బలహీనత మాయమయ్యాయి. తక్షణమే విద్యుచ్ఛక్తి ప్రవహిస్తున్నట్లు ప్రతీతంతువు జలదరించింది. పరిపూర్ణ ఆరోగ్యం చేకూరిన ఆనుభూతి ఆమెకు కలిగింది. “తన శరీరములోని ఆ బాధ నివారణ యైనదని గ్రహించుకొనెను. 29 వ వచనం. MHTel 37.2
పన్నెండు దీర్ఘ సంవత్సరాల్లో వైద్యులు చేయ్యగలిగిన దానికన్నా ఒక్క స్పర్శలో ఎంతో చేసిన ఆపూర్వ వైద్యునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఆశించింది కాని ధైర్యం చాలలేదు....... కృతజ్ఞతతో నిండిన హృదయంతో అక్కడ నుండి నెమ్మదిగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. క్రీస్తు అర్ధాంతంగా ఆగి అటూ, ఇటూ చూసి “నన్ను ముట్టినది ఎవరు?”అని అడిగాడు. MHTel 37.3
ఆయన వంక ఆశ్చర్యంగా చూస్తూ పేతురన్నాడు. “ఏలినవాడా జనసమూహాలు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారు”. లూకా 8:45 MHTel 37.4
“యేసు - ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను.” 46వ వచనం. విశ్వాసంతో ముట్టడానికి జనసమూహాలు అజాగ్రత్తగా ముట్టడానికి మధ్య తేడా ఆయనకు తెలుసు. ఎవరో ఆయనను బలమైన ఉద్దేశంతో ముట్టు కొని లబ్ధిపొందారు. MHTel 37.5
విషయం తెలుసుకోవటానికి క్రీస్తు ఆ ప్రశ్న వెయ్యలేదు. ప్రజలకు తన శిష్యులకు, ఆ స్త్రీకి ఆయన అందించ వలసిన పాఠం ఒకటున్నది. బాధితుల్లో నిరీక్షణ నింపాలన్నది ఆయన ఆకాంక్ష. విశ్వాసమే స్వస్థత శక్తిని తెచ్చిందని ఆయన బోధించాడు ఆ స్త్రీ విశ్వాసం పై వ్యాఖ్య లేకుండా ఆమె వెళ్ళిపోకూడదు. ఆ స్త్రీ ఓప్పుకోలు వల్ల దేవుడు మహిమపర్చబడాలి. తన విశ్వాస క్రియను తాను అంగీకరించానని ఆమె అవగాహన చేసుకోవాలని క్రీస్తు అభిప్రాయ పడ్డాడు. ఆమె సగం దీవెనతోనే వెళ్లిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఆమె బాధపడుతున్నట్లు ఆయనకు తెలుసునన్న దాన్ని గురించిలేక ఆయన ప్రేమ గురించి లేక తన వద్దకు వచ్చే వారందరిని ఆయన పూర్తిగా రక్షిస్తాడన్న తన విశ్వాసానికి ఆయన ఆమోదం గురించి ఆమె అజ్ఞానంలో ఉండకూడదని ఆయన అభిలషించాడు. MHTel 37.6
ఆ స్త్రీ వంక చూస్తూ తనను ముట్టుకున్నది ఎవరన్నది చెప్పాలని పట్టుపట్టాడు. దాచటం వ్యర్ధమని గ్రహించి ఆమె వణుకుతూ ముందుకి వచ్చి ఆయన పాదాలపై పడింది. తాను ఆయన వస్త్రాలు ఎందుకు ముట్టుకున్నదో తాను వెంటనే ఎలా స్వస్థత పొందిందో కృతజ్ఞతతో కన్నీళ్లు కార్చతూ అందరి ముందు ఆయనకు చెప్పింది. ఆయన వస్త్రాలు ముట్టుకోవడం దురభిమానమని ఆమె భయపడింది. కాని ఆయన నోటి నుండి ఎలాంటి గద్దింపు రాలేదు. ఆయన ఆమోదాన్ని వ్యక్తం చేసే మాటలే మాట్లాడాడు. అవి ప్రేమా హృదయంలో నుంచి వచ్చిన మావన దు:ఖానికి సానుభూతి తెలిపే, మాటలు, ఆయన మృదువుగా “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదాననవై. పొమ్ము” అన్నాడు 48వ వచనం. ఆయన మనసు గాయపర్చానన్న బాధ ఇప్పుడు ఆమె ఆనం దాన్ని పాడుచెయ్యదు. MHTel 38.1
వింత చూడాలని వచ్చి యేసు చుట్టు మూగిన జన సమూహం పైకి ఎలాంటి శక్తి రాలేదు. కాని వ్యాధి బాధితురాలైన ఈ స్త్రీ విశ్వాసంతో ఆయన్ని ముట్టుకున్నప్పుడు ఆమెకు స్వస్థత కలిగింది. ఆలాగే ఆధ్మాత్మిక జీవితంలో యధాలాప స్పర్శకు విశ్వాస స్పర్శకు మధ్య తేడా ఉన్నది,..... క్రీస్తును లోక రక్షకుడుగా నమ్మటం ఆత్మకు స్వస్థత కలిగించదు. రక్షణార్థమైన విశ్వాసం సువార్తన సత్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు. ఏ విశ్వాసం క్రీస్తును వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరిస్తుందో అది నిజమైన విశ్వాసం. నేను ఆయనను విశ్వసించడం ద్వారా “నశింపక నిత్య జీవము పొందునట్లు” దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు. యెహాను 3: 16 ఆయన వాక్యప్రకారం నేను క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు ఆయన రక్షణ కృపను పొందుతానని నేను విశ్వసించాలి. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం “నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించు కొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను”. గలతి 2: 20 MHTel 38.2
అనేకులు విశ్వాసాన్ని ఓ అభిప్రాయంగా భావిస్తారు., రక్షణార్ధ మైన విశ్వాసం ద్వారా ఎవరు క్రీస్తును స్వీకరిస్తారో వారు దేవునితో నిబంధన బాంధవ్యంలో ఆయనతో ఏకమౌతారు. సజీవ విశ్వాసమంటే అధికమైన శక్తి రహస్యాల్ని చెప్పే విశ్వాసం దాని మూలంగా క్రీస్తు కృప ద్వారా ఆత్మ జయించే ఓ వక్తిగా రూపొందుతుంది. MHTel 39.1
విశ్వాసం మరణం కన్నా శక్తిమంతమైన విజేత, వ్యాధిగ్రస్తుల్ని విశ్వం ద్వారా తమ దృష్టిని మహావైద్యుడైన యేసు పై కేంద్రీకరించేటట్లు నడిపిస్తే అద్భుతాలు మన కళ్ళ ముందు చోటుచేసుకుంటాయి. అది శరీరానికి ఆత్మకు జీవాన్ని తెస్తుంది. MHTel 39.2
దురభ్యాసాలతో సతమతమౌతున్న బాధితుల కోసం పని చెయ్యటంలో వారు పయనిస్తున్న నిస్పృహ నాశనం వైపుకి వారిని పోనివ్వటం కన్న వారి దృష్టిని యేసువైపుకి తిప్పండి. వారి కన్నుల్ని పరలోక మహిమలపై నిలపండి,.. సహాయం నిరీక్షణ లేని వారు ముందు సమాధిని గూర్చిన భయాల కన్నా వారి శరీరాత్మలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. MHTel 39.3