స్వస్థత పరిచర్య

93/173

టీ కాఫీలు

టీ ఉత్తేజంగా పనిచేస్తుంది. కొంత మేరకు మత్తును కూడా కలిగిస్తుంది కాఫీ, అనేక ఇతర పానీయాల చర్య కూడా ఇలాంటిదే. దీని మొదటి ప్రభావం ఉల్లాసం కలిగించటం. జీర్ణకోశపు నరాలు ఉద్రేకానికి గురి అవుతాయి. ఇవి మెదడుకు మంటను అందిస్తుంది. ఇది కూడా ఉత్తేజం పొంది గుండెకు అధికమైన చర్యను, దేహ వ్యస్థ అంతటికి స్వల్పాకాలిక శక్తిని ఇస్తుంది. అలసట అనిపించదు. శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. మేధ వికసిస్తుంది. ఊహ మరింత స్పష్టమౌతుంది. MHTel 278.3

ఈ ఫలితాల్ని బట్టి తమ టీ లేక కాపీ తమకు ఎంతో మేలు చేస్తున్నదని భావిస్తారు. ఇది పొరపాటు. టీ కాఫీలు శరీరానికి పోషణనివ్వవు. అది అరగటానికి శరీర వ్యవస్థ దాన్ని ఇముడ్చుకోవటానికి సమయనికి ముందే వాటి ప్రభావం ఉత్పత్తి అయ్యింది. శక్తిగా కనిపించింది. కేవలం నరాల ఉద్రేకం మాత్రమే. ఆ ఉత్తేజకం ప్రభావం పోయినప్పుడు ఆ అస్వాభావిక శక్తి చల్లారుతుంది. ఫలితంగా వ్యక్తి దానికి సమానమైన ఆలసటను ఆశక్తతను అనుభవిస్తాడు. MHTel 279.1

నరాలను ఉత్తేజపర్చే వీటిని నిత్యం ఉపయోగించటం వల్ల తలనొప్పి, నిద్రలేమి, గుండె, దడ, ఆజీర్తి వణుకు మొదలైన అనారోగ్యాలు వస్తాయి. ఎందుకంటే ఆ ఉత్తేజకాలు జీవ శక్తిని క్షీణింపజేస్తాయి. అలసిన నరాలకు ఉత్తేజం, అధిక శ్రమ కన్నా విశ్రాంతి, ప్రశాంతత అవసరం. తాను నష్ట పోయిన శక్తులను తిరిగి పొందటానికి ప్రకృతికి శక్తులు ప్రోత్సహించబడడ్డప్పుడు కొంత సేపు ఎక్కువ సాధించటం జరుగుతుంది. అయితే వాటిని నిత్యం ఉపయోగించటం వలన శరీర వ్యవస్థ బలహీన పడుతుంది. ఆశించి మేరకు శక్తులను ఉత్తేజపర్చటం కేమణా కష్టమౌతుంది. చివరికి చిత్తం శక్తిహీనమై ఆ స్వాభావిక వాంఛను కాదనలేకపోతుంది. అలసిన ప్రకృతి స్పందించలేక పోయేంతవరకు శక్తిమంతమైన ఉత్తేజకాల్ని డిమాండ్ చెయ్యటం జరగుతుంది. MHTel 279.2