స్వస్థత పరిచర్య

91/173

26—ఉత్తేజకాలు, మత్తుపదర్ధాలు

ఉత్తేజకాలు, మత్తు పదార్థాల అంశం కింద వర్గీకరించబడ్డ పదార్థాల్ని ఆహారంగా లేక పానీయంగా ఉపయోగిస్తే జీర్ణకోశాన్ని వేడెక్కించి రక్తాన్ని విషంతో నింపి నరాల్ని ఉద్రేకపర్చుతాయి. వాటి వాడకం గొప్ప హానీ కలిగిస్తుంది. మనుషులు ఉత్తేజకాల ఉద్రేకాన్ని కోరతారు. ఎందుకంటే ఆ కాసేపు అవిచ్చే ఫలితాలు హాయినిస్తాయి. కాని దానికి ఎల్లప్పుడూ ప్రతిస్పందన ఉంటుంది. అస్వాభావిక ఉత్తేజాకాల వినియోగంలో అతిగా పోయే గుణముంది. శారీరక భ్రష్టతను క్షీణతను కలిగించటంలో అది క్రియాశీల పాత్ర పోషిస్తుంది. MHTel 278.1