స్వస్థత పరిచర్య

84/173

23—ఆహారం, ఆరోగ్యం

మన శరీరాలు మనం తినే ఆహారం నుంచి నిర్మితమౌతాయి. శరీరంలోని ధాతువులు నిత్యం విచ్చిణ్నమౌతాయి. ప్రతీ అవయం ప్రతీ కదలికవలన వ్యర్ధం ఏర్పడుతుంది. ఈ వ్యర్ధ: మన ఆహారం నుంచి మరమ్మత్తు చెయ్యబడుతుంది. మన శీరంరలోని ప్రతీ అవయవానికి దాని వంతు పౌష్టికాహారం అవసరం. మెదడకు దాని భాగం సరాఫరా అవ్వాలి. ఎముకలు, కండరాలు, నరాలకు వాటి వాటి భాగం కావాలి. ఆహారాన్ని రక్తంగా మార్చి., ఈరక్తాన్ని శరీర వివిధ భాగాల్ని నిర్మించటానికి ఉపయోగించే ప్రక్రియ అద్భుతమైనది అయితే ప్రతీ నరానికి, కండరానికి ధాతువుగా జీవాన్నిచ్చే ఈ ప్రక్రియ నిత్యం సాగుతూనే ఉంటుంది. MHTel 252.1