స్వస్థత పరిచర్య

73/173

5. ఆరోగ్యసూత్రాలు

20—ఆరోగ్య సూత్రాలు

సామాన్య పారిశుద్యం

మానవుడు దేవునికి ఆలయం అన్న దాన్ని గూర్చిన జ్ఞానం. అనగా దేవుని మహిమ పర్చటానికి ఆయన నివాస స్థలమై ఉండాలన్న జ్ఞానం మన శారీరక శక్తుల విషయంలో ని శ్రద్ధకు వాటి అభివృద్దకి అత్యున్నత ప్రేరకం కావాలి. మన సృష్టికర్త మానవ శరీరాన్ని నిర్మించిన విధం భయం, ఆశ్చర్యం పుట్టిస్తున్నది. దాన్ని మన అధ్యయనాంశం చేసుకొని దాని అవసరాల్ని అవగాహ చేసుకొని, ప్రమాదం నుండి అవిత్రతనుంచి దాన్ని కాపాడు కోవటానికి మన పాత్రను మనం నిర్విర్తించాలని ఆయన కోరుతున్నాడు. MHTel 229.1