స్వస్థత పరిచర్య
తల్లితండ్రుల బాధ్యత
తన రక్తంతో కొన్న ఆత్మల్ని రక్షకుడు అమూల్య కరుణాకాటాక్షాలతో పరిగణిస్తాడు. వారు తన ప్రేమ వల్ల ఆయనకు కలిగిన ఆస్తి. వారి పట్ల ఆయనకు చెప్పశక్యంకాని ఆసక్తి. మంచి శిక్షణ కలిగిన అకర్షణీయంగా ఉన్న చిన్నా రులకే గాక, పారంపర్యంగాను నిర్లక్ష్యం వల్లను వచ్చిన గుణ దోషాలు గల బిడ్డలకు కూడా ఆయన హృదయం ఆకర్షితమౌతుంది. ఈ గుణ లక్షణాలక తాము ఎంత బాధ్యులో చాలామంది తల్లితండ్రులు గుర్తించరు. అయితే ఈ పిల్లల పట్ల యేసు అమితమైన జాలి కలిగి ఉంటాడు. కార్యం నుండికారణాన్ని తెలుసుకుంటాడు. MHTel 25.3
తప్పులు చేస్తూ ఉన్న ఈ బిడ్డలను రక్షకుని వద్దకు ఆకర్షించటానికి క్రైస్తవ పనివాడు క్రీస్తుకు ఓ ప్రతినిధి కావచ్చు. జ్ఞానం వల్ల చాతుర్యం వల్ల వారిని దగ్గర చేసుకొని వారికి ధైర్యాన్ని నిరీక్షణను అందించవచ్చు. క్రీస్తు కృప ద్వారా వారు తమ ప్రవర్తనలో మార్పు చేసుకోవడం “దేవుని రాజ్యము ఈలాటి వారిదే” అని వారిని గూర్చి చెప్పటం వారు చూడవచ్చు. MHTel 25.4