క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

33/61

19—క్షమాపణ పరిమాణం

ఆధారం మత్తయి 18:21-35

పేతురు క్రీస్తు వద్దకు వచ్చి “ప్రభువా, నా సహోదరుడు, నా యెడల తప్పిదము చేసిన యెడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? ఏడు మారులు మట్టుకా”? అని ప్రశ్నించాడు. క్షమాపణ ప్రక్రియను రబ్బీలు మూడు తప్పిదాల మట్టుకు పరిమితం చేసారు. క్రీస్తు బోధనను ఆచరిస్తున్నట్లు తాను తలంచిన దాని ప్రకారం పరిపూర్ణతను సూచిస్తూ క్షమాపణను ఏడు మారుల మట్టుకు పొడిగించాడు పేతురు. కాని మనం క్షమించటలో ఎన్నడూ అసలిపోకూడదని క్రీస్తు బోధించాడు. “ఏడు మారుల ముట్టుకే కాదు. డెబ్బది ఏడు మారుల ముట్టుకు” అని ఆయన సమాధానం ఇచ్చాడు. COLTel 197.1

అంతట క్షమాపణ వాస్తవంగా దేనిపై ఆధారపడాలో సూచించి, క్షమించన స్వాభావం ప్రమాదకరమని ఆయన వివరించాడు. ఒక ఉ పమానంలో తన ప్రభువు పాలన విషయాల్ని నిర్వహిస్తున్న అంధికారాలతో వ్యవహరించిన రాజును గురించి ఆయన చెప్పాడు. ఈ అధికారుల్లో కొందరికి దేశానికి సంబంధించిన నిధులు పెద్ద మొత్తంలో అప్పగించటం జరిగింది. ఈ నిధుల నిర్వహణను గూర్చి రాజు దర్యాప్తు జరుపుతుండగా అతడి ముందుకి ఒక వ్యక్తిని తీసుకువచ్చారు. అతడు రాజుకి పదివేల తలాంతులు అప్పు ఉన్నట్లు పద్దు చూపించాయి. చెల్లించటానికి అతడి వద్ద ఏమి లేదు. సంప్రాదాయ ప్రకారం అప్పును తీర్చటానికి అతన్ని అతడికున్న సమస్తాన్ని అమ్మివేయవలసినదిగా రాజు ఆజ్ఞాపించాడు,. అయితే భయభ్రాంతుడైన ఆ వ్యక్తి రాజు కాళ్ళపై పడి ఇలా వేడుకున్నాడు. COLTel 197.2

“నా యెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యాజమానుడి కనికరపడి, వానిని విడిచి పెట్టి, వాని అప్పు క్షమించెను. COLTel 197.3

“అయితే ఆ దాసుడు బయటకి వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోటి దాసులలో ఒకని చూసి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమెననె. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి. నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వాని వేడుకొనెను కాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దు:ఖపడి వచ్చి జరిగనదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి., అప్పుడు వాని యాజమానుడు వానిని పిలిపించి చెడ్డ దాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వాని అప్పగించెను”. COLTel 198.1

ఈ ఉపమానం ఆ చిత్రాన్ని పూరిచంటానికి అవసరమైన వివరాల్ని సమర్పింస్తుంది. కాని అవి దాని ఆధ్మాత్మిక ప్రాముఖ్య విషయాన్ని సూచించే వివరాలు కావు. వాటి పైకి దృష్టి మళ్ళించకూడదు. ఒకన్ని గొప్ప సత్యాల్ని ఉదహరించటం జరిగింది,. వీటిపై మనం దృష్టి పెట్టడం అవసరం. COLTel 198.2

రాజిచ్చిన క్షమాపణ దేవుడు సమస్త పాపాన్ని క్షమించటాన్ని సూచిస్తుంది. దయతో చలించుపోయి, తన సేవకుడి రుణాన్ని క్షమించిన రాజు క్రీస్తుని సూచిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి మానవడు శిక్షకు గురి అయ్యాడు. అతడు తన్ను తాను రక్షించుకోలేడు. ఈ కారణం వల్ల క్రీస్తు తన దైవత్వాన్ని మానత్వంతో మరుగుపర్చుకొని ఈ లోకానికి వచ్చి నీతిమంతుడైన ఆయన ఆ నీతిమంతుల కోసం ప్రాణాన్ని అర్పించాడు. మన పాపాల నిమిత్తం ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు తన రక్తం చిందించి దానిని బట్టి క్షమాపణను ప్రతీ ఆత్మకు ఇస్తున్నాడు. ” యెహోవా వద్ద కృప దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును”. కీర్త 130:7 COLTel 198.3

మనం సాటి పాపుల పట్ల కనికరం చూపించటానికి ప్రాతిపదిక ఇది “దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్దులమైయున్నాము” 1 యోహా 4:11 ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అని క్రీస్తు అంటున్నాడు. మత్త 10:8 COLTel 199.1

ఉపమానంలో “నా యెడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతును” అంటాడు. ఆ రుణస్తుడు కొంత వ్యవధి కోసం వేడుకునప్పుడు అతడిపై తీర్పును రద్దుపర్చటం జరిగింది. అతడి రుణం మొత్తం రద్దుచెయ్యటం జరిగింది. తనను క్షమించిన తన యజమానుడి ఆదర్శాన్ని అవలంబించటానికి అతడికి త్వరలోనే ఒక తరుణం వచ్చింది. అక్కడినుండి వెళ్ళిపోతున్నప్పుడు అతడు తనతోటి సేవకుడొకణి కలిసాడు. అతడు ఇతడికి చిన్న మొత్తంలో అప్పున్నాడు. అతడికున్న పదివేల తలాంతుల అప్పు మాఫీ చెయ్యబడింది. తన రుణస్తుడు అతడికి వంద దేనారాలు అప్పున్నాడు. అయితే ఎంతో కరుణను దయను అందుకున్న ఆ వ్యక్తి తోటి సేవకుడి పట్ల కఠినంగా నిర్దయగా ప్రవర్తించాడు. రాజు ముందు తాను ఎలా విజ్ఞాపన చేసాడో అలాగే తనకు అప్పున్న తోటి సేవకుడు కూడా విజ్ఞాపన చేసాడు. కాని అతడు రాజు స్పందించినట్లు స్పందించలేదు. కొద్ది కాలం క్రితమే క్షమాపణ పొందిన అతడు దయాదాక్షిణ్యాలతో వ్యవహరంచలేదు. తాను పొందిన కనికరాన్ని తోటి సేవకుల పట్ల కనపర్చలేదు. తన పట్ల సహనం చూపమంటూ చేసిన వినతిని లెక్కచెయ్యలేదు. కృతఘ్నుడైన ఆ సేవకుడు తలస్తున్నదంతా తనకు రావలసిన ఆ చిన్న మొత్తం గురించే తనకు రావలసిన ఆ చిన్న మొత్తంమంతా డిమాండు చేసి తన పై వెలిబుచ్చి కృపతో కొట్టివేసిన తీర్పువంటి తీర్పును అమలుపర్చాడు. COLTel 199.2

ఈ స్వభావాన్నే నేడు ఎంతమంది ప్రదర్శిస్తున్నారు! రుణస్తుడు కృప చూపమంటూ తన యాజమానుడితో విజ్ఞాపన చేసినప్పుడు తన రుణం విస్తారతను గూర్చి అతడికి యదార్ధమైన అభిప్రాయం లేదు. తన నిస్సహయస్తితిని అతడు గుర్తిచంలేదు. అప్పు నుండి విడిపించుకోవాలని మాత్రమే తాపత్రయపడ్డాడు. “నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదను” అన్నాడు అదే విధముగా తమ సొంత క్రియల వలన దేవుని అనుగ్రహాన్ని పొందజూ సేవారు అనేకమంది వారు తమ నిస్సహాయతను గుర్తించారు. దేవుని కృపను ఉచితముగా అంగీకరించరు. కాని స్వనీతిలో తమ్ముని తాము వృద్ధిపర్చుకోజూస్తారు. పాపం విషయమై వారి హృదయాలు పశ్చాత్పాపపడవు. వారు దీనులై ప్రభువు ముందు నిలబడరు. ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తారు. క్షమాగుణాన్ని ప్రదర్శించరు. తమ యెడల తమ సహోదరులు చేసిన పాపాలతో పోల్చినపుడు దేవునికి వ్యతిరేకంగా తాము చేసే పాపాలు వంద దేనారాలతో పదివేల తలాంతుల్ని పోల్చినట్లుటుంద. పదిలక్షల్ని ఒకటితో పోల్చినట్లంటుంది.అయినా వారు క్షమించకుండా మొండిగా ఉంటారు. COLTel 199.3

ఉపమానంలో యాజమానుడు కనికరంలేని దుషున్ని పిలిచి “చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటిని గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను క్షమించిన ప్రకారము నీవును నీ తోటిదాసుని కరుణింప వలన ° యుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజామానుడు కోపపడి తనకు అచ్చియున్నదందతయు చెల్లించు వరకు బాధపరువారికి వానినప్పగించెను”. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయ పూర్వకముగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రియు ఆప్రకారమే మీ యెడల చేయును” అని యేసన్నాడు. క్షమించటానికి నిరకరించే వ్యక్తి ఆ క్రియ వలన తన క్షమాపణ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు. COLTel 200.1

అయితే ఈ ఉపమాన బోధనను తప్పుగా వర్తింపజేసుకోకూడదు. మన పట్ల దేవుని క్షమాపణ ఆయనకు మనం విధేయులమై ఉండాల్సిన విధని ఏరకంగాను తగ్గించదు. అలాగే మన సహోదర్ల పట్ల మన క్షమాపణ న్యాయమైన విధి నిర్వహణను తగ్గించదు. క్రీస్తు తన శిష్యులకి నేర్పించిన ప్రార్ధనలో “మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను క్షమించుము” (మత్త 6:12) అని బోధించాడు. మన పాపాలకి క్షమాపణ పొందటానికి మనకు అప్పున్నవారి నుంచి మనకు న్యాయంగా రావలసినదాన్ని కోసం కూడదని ఆయన చెబుతున్నట్లు దీని బట్టి అర్థం చేసుకోకూడదు. వారు అప్పు చెల్లించకలేకపోతే అది వారి అవివేకకర్తనం వల్లనైనా సరే వారిని చెరసారలలో వేయటం గాని, హింసంటం గాని, వారితో కఠినంగా వ్యవహరించటం గాని చెయ్యకూడదు. కాని ఈ ఉపమానం సోమరితనాన్ని ప్రోత్సహించాలని బోధంచటం లేదు. ఒక వ్యక్తి పనిచ్యెయటానికి ఇష్టపడకపోతే అతడు భోజనం కూడా చెయ్యకూడదన్నది దైవ వాక్య బోధన (2 థెస్స 3:10) కష్టపడి పనిచేసే వ్యక్తి సోమరులైన వారిని పోషించాలని దేవుడు కోరటంలేదు.. అనేకులు సమాయాన్ని వ్యర్ధం చేస్తారు. పనిచెయ్యటానకి ప్రయత్నం కూడా చెయ్యరు. వారి పేదరికానికి లేమికి ఇది కారణం. వారికి తోడ్పడేవారు ఈ తప్పిదాల్ని సరిదిద్దకపోతే, వారి పక్షంగా చేయగలిగిందంతా చిల్లు సంచిలో డబ్బు ఉంచినట్లుంటుంది. అయినా పేదరికంఉంటూనే ఉంటుంది. లేనివారిపట్ల మనం దయ కనికరాలు చూపించాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఇతరులు ఎలా చూడాలని మనం కోరుకుంటామో అలాగే మనం ఇతరుల్ని చూడాలి. COLTel 200.2

పరిశుద్దాత్మ అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు ఈ ఆదేశాన్ని ఇచ్చాడు. “కావున క్రీస్తు నందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సమైనను ఉన్న యెడల మీరు ఏకమన స్కేలగునట్లుగా ఏక ప్రేమ కలిగి, యేక భావము గలవారిగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచును నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృదాతియచైతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై యొకనినొకడు తనకంటే యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తమ సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సును మీరుని కలిగియుండుడి” ఫిలి 2:1-5., COLTel 201.1

అయితే పాపాన్ని చిన్న విషయంగా పరిగణించకూడదు. మన సహోదరుడు తప్పు చేస్తే అతణ్ణి గద్దించమని ప్రభువు ఆదేశిస్తున్నాడు. “నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని గద్దింపుము” అన్నాడు. క్రీస్తు పాపాన్ని, పాపంగా పేర్కొని దాన్ని తప్పిదస్తుడి ముందు పెట్టాలి. COLTel 201.2

తిమోతికి తన బాధ్యతను అప్పగించే సమయంలో పౌలు పరిశుద్దాత్మ ఆవేశం వల్ల రాస్తూ ఇలా అంటున్నాడు “సమయముందును అసమయముందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండిచుము గద్దించుము బుద్ది చెప్పుము” 2 తిమో 4:2 తీతుకి పౌలు ఇలా రాస్తున్నాడు. “అనేకులు .. అవిధేయులను, వదర బోతులును, మోసపుచ్చువారునైయున్నారు. విశ్వాస విషయమన స్వస్తులగు నిమ్రితము వారిని కఠినముగా గద్దింపుము. ‘తీతుకు 1:10-14 COLTel 201.3

క్రీస్తు అన్నాడు. “నీ సహోదరుడు నీ యెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నపడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన యెడల నీ సహోదరుని సంపాదించుకొంటిమి. అతడు వినని యెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము”. మత్త 18:15-17 COLTel 202.1

క్రైస్తవులు తమ మధ్య సమస్యలను సంఘ పరిధిలోనే పరిస్కరించు కోవాలని ప్రభువు బోధిస్తున్నాడు. అవి దేవునికి భయపడనివారి ముందకు వెళ్ళకూడదు. ఒక క్రైస్తవుడికి తన సోదర క్రైస్తవుడి వలన అన్యాయం జరిగితే దాన్ని న్యాయస్థానంలో అవిశ్వాసుల ముందు పెట్టకూడదు. క్రీస్తు ఇచ్చిన ఉపదేశాన్ని అతడు అనుసరించాలి. అతడి పై క్షక సాధించటానికి ప్రయత్నించే బదులు అతడు ఆ సోహదరుణ్ణి దిద్దుబాటుకు ప్రయత్నించాలి. ఆయనను ప్రేమించి ఆయనకు భయపడేవారిని దేవుడు కాపాడి, వారి ఆసక్తుల్లి పరిరక్షిస్తాడు. న్యాయంగా తీర్పు తీర్చే న్యాయాధిపతి అయిన ఆయనకు మన సమస్యను ధైర్యంగా విన్నవించుకోవచ్చు. COLTel 202.2

తప్పిలూలు మళ్ళీ మళ్ళీ జరగటం, తప్పిదస్తుడు తన తప్పిదాన్ని ఒప్పుకోవటం, బాధితుడు అలసిపోయి తాను క్షమించుట ఇక సరిపోతుందని భావించటం అతి తరుచుగా జరుగుతుంటుంది. అయితే తప్పిదాల విషయంలో మనం ఎలా వ్యవహరించాలో రక్షకుడు మనకు తేటతెల్లం చేసాడు. నీ సహోదరడు తప్పిదము చేసిన యెడల అతని గద్దించుము. అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము” లూకా 17:3 నమ్మి ఉంచటానికి అతడు అపాత్రుడున్నట్లు అతణ్ణి దూరంగా ఉంచకండి.“ప్రతిపవాడు తానును శోధింపబడునేమో అని తన తాను పరీక్ష చేసుకొనవలెను” కోవాలి గల 6:1 COLTel 202.3

మీ సహోదరులు తప్పు చేస్తే మీరు వారిని క్షమించాలి.వారు పశ్చాత్తాపంతో మీ వద్దకు వస్తే వార దీన స్వభావములు కాదు. వారి ఒప్పుకోలు నిజమయ్యింది కాదు అని మీరు భావించకూడదు. హృదయంలో ఉన్న దాన్ని చదవగలిగినట్లు వారికి తీర్పు తీర్చటానికి మీకు హక్కు ఎక్కడిది?” “అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడు మారులు నీ యెడల తప్పిదము చేసి ఏడు మారులు నీవైపు తిరిగి మారుమనస్సు పొందితిననిన యెడల అతని క్షమించవలెను”. అని వాక్యం చెబుతున్నది. ఏడుసార్లు మాత్రమే కాదు. డెబ్బయి ఏడుసార్లు. దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమిస్తాడో అన్నిసార్లు! COLTel 203.1

మనకున్న సమస్తం దేవుని కృప వలన కలుగుతున్నది. అందుక మనం ఆయనకు ఋణస్తులం. నిబంధనలోని కృప మన దత్తతను నిర్ధారించింది. రక్షకునిలోని కృప మన విమోచనను, మన పునరుజ్జీవనాన్ని క్రీస్తుతో మన వారసత్వాన్ని సాధించింది. ఈ కృపను మనం ఇతరులకి బయలుపర్చాలి. COLTel 203.2

తప్పిదం చేసిన వ్యక్తి అధైర్యపడటానికి అవకాశం ఇవ్వవద్దు. పరిసయ్యుల కాఠిన్యం వచ్చి మీ సహదరుడికి హాని చెయ్యనివ్వకండా మీ మనసులో లేక హృదయంలో ఎగతాళి తలెత్తనివ్వకండా. స్వరంలో ద్వేషం వ్యక్తం కానివ్వకండి. మీరు మీ సొంత మాట ఒక్కటి మాట్లాడితే ఒక్కసారి ఉదాసీన వైఖరి కనపర్చితే లేక అనుమానం లేదా అప నమ్మకం కనపర్చితే, అది ఒక ఆత్మను నాశనం చెయ్యవచ్చు. అతడి మానవతా హృదయాన్ని స్పృశించటానికి పెద్దన్న హృదయంగల సహెూదరుడు అవసరం. అతడికి సానుభూతి హస్తం కరచాలనం వసరం. అతడు ర్ధన చేద్దాము అన్న గుసగుస వినాలి. మీ ఇరువురికీ దేవుడు లోతైన ఆధ్యాత్మికానుభవం ఇస్తాడు. ప్రార్ధన మనల్ని ఐక్యపర్చుతుంది., దేవునితో మనకు ఐక్యత ఏర్పర్చుతుంది. ప్రార్ధన యేసుని మన పక్కకు తీసుకువస్తుంది. బలహీనమైన, ఆందోళన చెందిన ఆత్మకు నూతన బలం ఇచ్చి లోకశాల్ని, శరీరేచ్చల్ని సాతానుని జయించటానికి తోడ్పడుతుంది. ప్రార్ధన సాతానుదాడుల్ని పక్కకు తప్పిస్తుంది. COLTel 203.3

వ్యక్తి క్రీస్తుని వీక్షించటానికి మానవ అంసపూర్ణతల నుంచి వైదొలగి నప్పుడు అతడి ప్రవర్తనలో దైవికమైన పరివర్తన చోటు చేసుకుంటుంది. అతడిహృదయం పై పనిచేస్తున్న క్రీస్తు ఆత్మ దాన్ని దైవ స్వరూపంలోకి రూపుదిద్దుతుంది. అప్పుడు మీరు క్రీస్తుని హెచ్చంచటానికి కృషి చెయ్యాలి. మీ మనో నేత్రం “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొట్టె పిల్ల” పై కేంద్రీకృతమవ్వాలి (యెహ 1:29) మీరు ఈ కృషిలో నిమగ్నమైన ఉన్నప్పుడు “పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి యొక ఆత్మను రక్షించి అనేక పాప ములను కప్పివేయునని” జ్ఞాపకముంచుకోవాలి. యాకో 5:20 COLTel 204.1

“మీరు మనుష్యులు అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.” మత్త 6:15 క్షమించని స్వభావం సమర్ధనీయం కాదు. ఇతరుల పట్ల కనికరం లేనివాడు తాను దేవుని క్షమాపణ కృపలో పాలిభాగస్తుడు కాడని నిరూపించుకుంటున్నాడు. దేవుని క్షమాపణలో హృదయం అనంత ప్రేమామయుడైన దేవుని హృదయానికి ఆకర్షితమౌతుంది. పాపి ఆత్మలోకి దేవుని కరుణ ప్రభావంలా ప్రవహించి దాని నుంచి ఇతర ఆత్మల్లోకి పారుతుంది. తన జీవితంలో క్రీస్తు ప్రదర్శించిన దయ కనికరాలు ఆయన కృపను పంచుకునే వారిలోను కనిపిస్తాయి. అయితే “ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు”. రోమా 8:9 అతడు దేవుని నుంచి విడిపోతాడు. అతడు నిత్యం దేవునికి దూరంగా ఉంటాడు. COLTel 204.2

నిజమే అతడు ఒకప్పుడు క్షమాపణ పొంది ఉండవచ్చు. కాని దయలేని అతడి స్వభావం. అతడిప్పుడు దేవుని క్షమాపణను ప్రేమను నిరాకరిస్తు న్నాడని సూచిస్తుంది. అతడు దేవుని నుంచి విడిపోయాడు అతడు ఇంకా క్షమాపణ పొందని స్థితిలోనే ఉన్నాడు. తన పశ్చాత్తాపం అబద్దమని నిరూపించుకున్నాడు. అతడి పాపాలు ఇంకా తన మీదే ఉన్నాయి. COLTel 204.3

అయితే ఈ ఉపమానం బోధించే పాఠం దేవుని కరుణకు మానవుడి కాఠిన్యానికి మధ్య ఉన్న అంతరంలోను దేవుని క్షమాపూర్వక కృప మనకు ప్రామణికమన్న విషయంలోను ఉన్నది. “నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణించవలసియుండెను గదా”? COLTel 204.4

మనం క్షమిస్తున్నందుకు మనం క్షమించబటం, మనం క్షమించే ప్రకారము క్షమించబడతాం. క్షమాపణ అంతటికీ పునాది దేవుని ఉచిత ప్రేమ. అయితే ఇతరుల పట్ల మన వైఖరి మనం ఆప్రేమను సొంతం చేసుకున్నమో లేదో బయలు పెడుతుంది. అందుకే క్రీస్తు ఇలా అంటున్నాడు. “మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్ములను గూర్చియు తీర్పు తీర్చుదును. మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలవబడును'. మత్త 7:2 COLTel 205.1