క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

30/61

16—“తప్పిపోయి దొరకెను”

ఆధారం : లూకా 15:11-32

తప్పిపోయినగొర్రె పోయిన నాణెం తప్పిపోయిన కుమారుడు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయనవారిపట్ల దేవుని దయను ప్రేమను అతి స్పష్టంగా వివరిస్తున్నాయి. వారు దేవుని కాదని వెళ్ళిపోయినప్పటికి ఆయన వారిని తమ దుస్తితిలో విడిచి పెట్టడు. మోసకారి అయిన శత్రువు శోధనలకు గురి అయిన వారి పట్ల ఆయన దయ కనికరాలు అపారం. COLTel 159.1

ఒకప్పుడు తండ్రి ప్రేమను అనుభవించినా శోధకుడైన సాతానుకి బానిసలై అతడి నడుపుదలను అంగీకరించేవారితో దేవుడు వ్యవహరించే తీరును తప్పిపోయిన కుమారుడి ఉపమానం మన కళ్ళకు కడుతుంది. COLTel 159.2

“ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు - తండ్రీ ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తండ్రినడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయెను”.ఈ చిన్న కుమారుడు తండ్రి ఇంటిలోని అదుపాజ్ఞలతో విసుగు చెందాడు. తన స్వేచ్చపై ఆంక్షలున్నాయని భావించాడు. తండ్రి తన పట్ల చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధాశక్తుల్ని అపార్ధం చేసుకొని తన సొంత చిత్తాన్ని అనుసరించి నివసించటానికి నిశ్చయించుకున్నాడు. COLTel 159.3

ఆ యువకుడు తండ్రి పట్ల తనకెలాంటి విధి ఉన్నట్లు గుర్తించలేదు. అతడికి కృతజ్ఞత వెలిబుచ్చలేదు.అయినా ఒక బిడ్డగా తండ్రి ఆస్తిలో భాగం పంచుకునే హక్కు అమలులకు కోరుతున్నాడు. తండ్రి మరణాంతరము వచ్చే ఆస్తిని ఇప్పుడు కావాలంటున్నాడు. ప్రస్తుత ఆనందం గురించేగాని భవిష్యత్తు గురించి అతడు ఆలోచించటం లేదు. తండ్రి ఆస్తిలో తన భాగం పొందిన తరువాత ‘దూరదేశమునకు” ప్రయాణం కట్టాడు. చేతినిండా డబ్బుతో దాన్ని తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొనే స్వేచ్చతో అతడు తన హృదయ వాంఛ నెరవేరిందని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఇది చెయ్యకు,. అది నీకు హానికరం లేదా ఇది చెయ్యి. అది న్యాయం అని చెప్పేవారు ఎవరూ లేరు. దుష్ట స్నేహితులు అతడు ఇంకా పాపంలో కూరుకుపోవ టానిక తోడ్పడుతున్నారు. అతడు తన ఆస్తిని దుర్వ్యాపారమువలన” పాడు చేసాడు “తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్దిహీనులైన “వారి గురించి బైబిలు మాట్లాడుతన్నది(రోమా 1:22)ఈ ఉపమానం ప్రస్తావించే యువకుడి చిత్ర ఇది. తన తండ్రి నుండి స్వార్ధంతో పొందిన ఆస్తిని వేశ్యలపై ఖర్చు పెట్టేశాడు. అతడు తన నవ యౌవనశక్తి సంపదను దుర్వ్యుయం చేసాడు. జీవితంలో ప్రశస్తమైన సంవత్సరాలు, మానసిక శక్తి ఉజ్వల యౌవనాన్ని గూర్చినకలలు,ఆధ్యాత్మికఆకాంక్షలుకామజ్వాలల్లోపడి బుగ్గయిపోయాయి. COLTel 159.4

గొప్ప కరువు సంభవించింది. అతడికి లేమి ప్రారంభమయ్యింది. అతడు ఇంకొక పౌరుడితో జత కలిసాడు. అతడు ఇతన్ని పందుల్ని మేపటానికి పెట్టుకున్నాడు. ఒక యూదుడు ఈ ఉపాధి చేపట్టటం నీచాతి నీచం. తాను స్వతంత్రుణ్నుని చెప్పుకున్న యువకుడు ఇప్పుడు ఒక బానిస అయ్యాడు. అతడిది దుర్భరమైనబానిసత్వం - “వాడు తమ పాపముల వలన బంధింపబడును’ (సామె 5:22) అతణ్ణి ఆకర్షించిన తళుకుబెళు కులు హూష్ కాకి అయ్యాయి. అతడు తన బంధకాల భారాన్ని భరిస్తున్నాడు. కరవు పీడితమైన ఆ దేశంలో పందులు తప్ప ఇంకెవరూ మిత్రలు లేని స్తితిలో నేల మీద కూర్చోని పందులు తినే పొట్టుతో పొట్ట నింపుకుంటు న్నాడు. తన వద్ద డబ్బున్న కాలంలో అతడి చుట్టు చేరి అతని ఖర్చు పై తిని తాగిన మిత్రుల్లో ఒకడు కూడా ఇప్పుడు అతడితో లేడు. ఆ ల్లరిమూక సమకూర్చిన ఆనందం ఇప్పుడేమయ్యింది. మనస్సాక్షిని చంపుకొని, ఉద్వే గాన్ని అణుచుకొని తాను సంతోషంగానే ఉన్నాని భావించాడు. అయితే ఇప్పుడు డబ్బాంతా అయిపోయి, తీరని ఆకలి బాధతో గర్వం పోయి దీన స్వభావి అయిన నైతికంగా పొట్టివాడై బలహీన చిత్తంతో తనలోని సున్నిత మనోభావాలు నశించి, అతడు మిక్కిలి బీదవాడయ్యాడు. COLTel 160.1

పాపి స్థితికి ఇది ఎంత చక్కని చిత్రీకరణ. తన శరీర్చేల్ని పాప వినోదల్ని విడిచి పెట్టటానికి ఇష్టపడని పాపి, తను చుట్టూ దైవ ప్రేమదీవెనలు ఉన్నా దేవునికి దూరంగా ఉండటానికి కోరుకుంటాడు. కృతజ్ఞత లేని ఈ కుమారుడివలె అతడు దేవుడిచ్చే మేలుల్నీ ఉపకారాల్ని తనకు చెందే హక్కుగా భావిస్తాడు. అవి తనవిగా పరిగణించి కృతజ్ఞతలు తెలపడు. ప్రేమపూర్వక సేవ చెయ్యడు. దేవుని సముఖం నందు కయీను తన ఇంటిని వెదక్కుంటూ వెళ్ళిపోయినట్లు, తప్పిపోయిన కుమారుడు “దూరదేశమునకు ” వెళ్ళినట్లు పాపులు దేవుని మరుపులో సంతోషాన్ని పొందజూస్తున్నారు (రోమా 1:28) COLTel 160.2

పైకి ఎలా కనిపించినా స్వార్ధంతో నిండిన ప్రతీ జీవితం దుర్భరమైన జీవితం. దేవుని విడిచి పెట్టి వేరుగా నివసించటానికి ప్రయత్నించే వ్యక్తి తన ఆస్తిని పాడుచేసుకుంటున్నవాడవుతాడు. అతడు తన విలువైన సంవత్సరాల్ని, మానసిక, అంతరంగిక, ఆత్మ సంబంధిత శక్తుల్ని దుర్వ్యయం చేసి తన్ను తాను నిత్యజీవానికి పనికి రాకుండా దివాల తీయటానికి పనిచేస్తున్నాడు. స్వప్రయోజనం కోసం దేవుని విడిచి పెట్టే మనిషి డబ్బుకి దాసుడు. దేవదూత సహవాసానికి సృష్టి అయిన మనసు ఐహికమైన, పాశవికమైన వ్యసనాలికి సేవ చెయ్యటానికి దిగజారుతుంది. స్వార్ధపరాయణత ఈ దిశగా నడిపిస్తుంది. COLTel 161.1

మీరు అలాంటి మార్గాన్ని ఎన్నుకుంటే మీరు అహారం కాని దాని కోసం డబ్బు వ్యయం చేస్తున్నారని తృప్తినివ్వని దాని కోసం ప్రయాసపడుతున్నారని గ్రహించండి. మీరు మీ భ్రష్టతను గుర్తించే గడియలు వస్తాయి. దూరదేశంలో ఒంటరిగా ఉన్న తరుణంలో మీరు మీ దుస్థితిని గుర్తించి బాధతో నిస్రృహతో “అయ్యే నేనెంత దౌర్బాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును”? అంటూ ప్రశాపిస్తారు. (రోమా 7:24) ప్రవక్త పలికి ఈ మాటల్లో ఉన్నది సార్వత్రిక సత్యవచనం.“వనరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అంజూర వృక్షమువలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలినే నలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును”. యిర్మీ 17:5,6. దేవుడు “చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యని ఉదయింపజేసి, నితీమంతులు మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు”. (మత్త 5:45) అయితే సూర్యుకాంతి నుంచి వర్షం నుంచి మనుషులు తమ్ముతాము బహిస్కరించుకునే శక్తి వారికుంది. అలాగే నీతి సూర్యుడు ప్రకాశించే టప్పుడు అందరి కోసం కృపావర్షం కురిసేటప్పుడు, దేవుని నుంచి వేరవ్వటం ద్వారా మనం ఇంకా “ఎడారిలోని అరుహవృక్షమువలె” ఉండవచ్చు. COLTel 161.2

తనను విడిచి పెట్టి వెళ్ళిపోవానికి ఎంపిక చేసుకున్న వ్యక్తి కోసం దేవుని ప్రేమ పరితపిస్తుంది. ఆ వ్యక్తిని తండ్రి గృహానికి తీసుకురావటానికి ప్రభావాలు పనిచెయ్యటానికి ఏర్పాటు చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన దుర్భరస్థతిలో ‘బుద్ది తెచ్చుకున్నాడు”సాతాను అతడి మీద ప్రయోగిం చిన మోసపూరిత శక్తి నిర్వీర్యమయ్యింది. తనకు కలిగిన శ్రమంతా తన బుద్దిహీనత వల్ల సంభవించిందని గ్రహించాడు. “నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ అకిలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు”వెళ్తానని నిశ్చయించుకున్నాడు. తన పరిస్థితి దయనీయంగా ఉన్నా తన తండ్రి ప్రేమ నిశ్చయతతో తప్పిపోయిన ఆ కుమారుడి నీరక్షణ నిలిచింది.ఆ ప్రేమఅతణ్ణి తన తండ్రి వద్దకు లాగుతున్నది. అలాగే దేవుని ప్రేమను గూర్చిన నమ్మకం పాపిని దేవుని వద్దకు తిరిగిరావడానికి బలవంత పెడుతుంది. “దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నన్ను ప్రేరేపించుచున్నది. “రోమా 2:4ప్రమాదంలో ఉన్న ప్రతీ ఆత్మ చుట్టు కృప కనికరాలతో కూడిన దైవ ప్రేమ అనే బంగారు గొలుసు బంధించి ఉంటుంది. ప్రుభువిలా అంటున్నాడుమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు చున్నాను.కనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను యిర్మీ31:3 COLTel 162.1

కుమారుడు తన అపరాధాన్ని ఒప్పుకోవాలని తీర్మానించుకున్నాడు. తండ్రి వద్దకు వెళ్ళి ‘నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని, ఇక మీదట నీకుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను”.కాని “నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము”అని చెప్పాలనకున్నాడు. తన తండ్రి ప్రేమ గూర్చి తన అభిప్రాయం ఎంత సంకుచితముగా ఉందో కనపర్చుకుంటూ. ఆ యువకుడు పందుల మందను పొట్టును విడిచి పెట్టి ఇంటి దారి పట్టాడు. వణకుతూ, బలహీనత వల్ల ఆకలి వల్ల తూలుతూ తన ప్రయాణం సాగించాడు. అతడు చినిగిపోయిన బట్టలు ధరించాడు. అయితే తన దుస్థితి అతడి గర్వాన్ని జయించింది. ఎక్కడ ఒకప్పుడు తాను కుమారుడుగా ఉన్నాడో అక్కడ సేవకుడుగా పనిచెయ్యనివ్వమని ఆర్దించటానికి వడివడిగా నడుస్తున్నాడు. COLTel 162.2

తన తండ్రి ఇంటి గుమ్మములో నుంచి ఉత్సాహంగా ఉల్లాసంగా వెళ్ళిపోయిన ఆ యువకుడికి తాను విడిచి వెళ్ళిన హృదయ వేదననను తన్ను గురించిన ఆశను గూర్చి ఏమి తెలియదు. స్నేహితులతో కలసి నాట్యం చేసి విందులు అరగించినప్పుడు తన గృహన్ని అలముకున్న దు:ఖచాయల గురించి అతడికి తెలియదు. ఇప్పుడు అతడు తన ఇంటి దిశగా భారంగా ఆయాసంతో నడుస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తన రాకకు వేచి ఉన్నాడని ఎరుగడు. అతడింకా “దూరంగా ఉన్నప్పుడు” తండ్రి అతణ్ణి చూసాడు. ప్రేమ త్వరగా గుర్తుపడుతుంది. సంవత్సరాల పాప జీవితం వల్ల కలిగిన భ్రష్టత కుమారుణ్ని తండ్రి దృష్టి నుంచి దాచలేకపోయింది. తండ్రి “వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడ మీదపడి అతణ్ణి కౌగలించుకున్నాడు. COLTel 163.1

కుమారుడి దుస్థితిని చినిగిపోయిన బట్టల్నీ ఎవరు వేలెత్తి చూపి అపహసించటం తండ్రి సహించడు. తన సొంత భుజాలపై ఉన్న విలువైన పైవస్త్రం తీసికుమారుడకి కప్పాడు. ఆ యువకుడు వెక్కి వెక్కి ఏడుస్తూ పశ్చాత్తాపాన్ని తండ్రికి ఇలా వెలిబుచ్చాడు. “తండ్రీ నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని. ఇకమీదట నీకుమారుడ నని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను'. తండ్రి అతణ్నీ తన సందిట్లో గట్టిగా పట్టుకొని ఇంటిలోకి తీసుకువెళ్ళాడు పనివాడిగా తన్ను పెట్టుకోమని ఆర్దించటానికి అతడికి అవకాశం దొరకలేదు. అతడు కుమారుడు. అతడు ఆ గృహం ఇవ్వగల గౌరవం పొందటానికి అర్హుడు. అక్కడ వేచి ఉన్న పురుషులు స్త్రీలు అతణ్ని గౌరవించి అతడికి సేవలందించేవారు. తండ్రి సేవకుల్ని పిలిచి ఇలా ఆదేశించాడు. “ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్వని దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషించుదుము. ఈ నాకుమారుడు చనిపోయి మరల బ్రతికెనను. తప్పిపోయి దొరకెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి” అలజడి అందోళనలో నిండిన తన యౌవనంలో తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని కఠినుడు, కర్కోటముగా పరిగణించేవాడు. COLTel 163.2

ఇప్పుడు ఆ అభిప్రాయం ఎంతగా మారిపోయింది! సాతానువల్ల వంచితులైన వారు దేవున్ని కఠినుడుగా కర్కొటకుడుగా పరిగణిస్తారు. తప్పు పట్టాటానికి దండించటానికే కాచుకొని ఉన్నట్లు. చట్టపరమైన సాకు ఉన్నంతకాలము పాపుల్ని చేర్చుకోవటానికి సమ్మతించనివాడు అని అయన్ని పరిగణిస్తారు. ఆయన ధర్మశాస్త్రం మనుషుల సంతోషాన్ని పరిమితం చేస్తుందని అది తాము సంతోషంగా తోసిపుచ్చాల్సిన భారమని భావిస్తారు. కాని క్రీస్తు ప్రేమ ఎవరి కళ్ళు తెరుస్తుందో అతడు దేవున్ని ప్రేమా సంపూర్ణడుగా చూస్తారు. ఆయన నిరంతము కర్కశుడుగా కాక పశ్చాత్తాపపడ్డ తనకుమారుణ్ణి కౌగిలించుకోవటానికి తహతహలాడుతున్న తండ్రిలా కనిపిస్తాడు. పాపి కీర్తనకారుడితో గళం కలిపి “తండ్రి తన కుమారుని యెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును” అంటూ ఆశ్చర్యపడతాడు. కీర్త 103:13. COLTel 164.1

ఉపమానంలో నిందారోపణ లేదు. తప్పిపోయిన అతడి చెడుమార్గాల గురించివిమర్శ లేదు.గతాన్ని క్షమించటం.మరిచిపోవటంతుడిచి వెయ్యటం జరిగిందని కుమారుడు భావించాడు. అలాగే దేవుడు పాపితో “మంచు విడిపోవునుట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలుగు నట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను” అని చెబుతాడు. యెష 44:22 ‘నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసికొనను యిర్మీ 31:34, భక్తిహనులుతమమార్గమును విడువవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును”,.యెష 55:9”ఆకాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడ కుండును. యూదా పాపములు వెదకినను అవి దొరకవు”. యిర్మీ 50:20 COLTel 164.2

పశ్చాత్తాపపడే పాపుల్ని చేర్చుకోవాటానికి దేవుడు సంసిద్ధముగా ఉన్నా డనటానికి ఇది ఎంత చక్కని హామీ ! పాఠకా, మీరు మీ సొంత మార్గాన్ని ఎంపకి చేసుకున్నారా! మీరు దేవున్ని విడిచి పెట్టి దూరంగా వెళ్లిపోయారా? అతిక్రమ ఫలాన్ని అరగించటానికి ప్రయత్నించి అది మీ నోటిలో బూడిదగా ఉన్నట్టు కనుగొన్నారా? ఇప్పుడు మీ ఆస్తి ఆరిపోయింది. మీ జీవిత ప్రణాళికలికి ఆటంకాలు ఏర్పడ్డాయి. మీ నిరీక్షణలు నశించాయి. మీరు నిర్జన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని ఉన్నారా? మీ హృదయంతో చాలా కాలంగా మాట్లాడుతున్న స్వరం మీరు లెక్క చెయ్యకుండా తోసిపుచ్చుతూ వస్తున్న ఆ స్వరం, స్పష్టమైన ఈ మాటలతో మీ వద్దకు వస్తుంది. “ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి”. మీకా 2:10 మీ తండ్రి గృహానికి తిరగి వెళ్ళండి” నేను నిన్ను విమోచించియున్నానుని. నా యొద్దకు మళ్ళుకొనుము”. అంటూ ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. యెష 44:22 COLTel 165.1

మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకునే వరకు ; మీరు దేవుని వద్దకు రాగలిగినంత మంచివారయ్యేవరకు క్రీస్తుకి దూరంగా ఉండండి అంటూ శత్రువు ఇచ్చే సలహాను వినకండి. అప్పటి వరకు వేచి ఉంటే మీరు ఎప్పటికీరారు. సాతాను మీ మురికి వస్త్రాల్ని చూపిస్తుంటే ” నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయును” అన్న క్రీస్తు వాగ్దానాన్ని పునరుద్దరించండి (యోహా 6:37) యేసు క్రీస్తు రక్తం సమస్త పాపాన్ని కడుగుతుందని శుత్రువుకి చెప్పుడి. “హెస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగానుండునట్లు నీవు నన్ను కడుగుము” (కీర్త 51:7) అంటూ దావీదు ప్రార్ధించినట్లు మీరు ప్రార్ధించండి. COLTel 165.2

” యెహోవా మీకు దొరకు కాలమందున ఆయనను వెదకుడి,. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గము విడువవలెను దుషులు తమతలంపులను మానవలెను మీరు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారియందు జాలిపుడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును”. యెష 55:6,7 COLTel 165.3

లేచీ మీ తండ్రి వద్దకు వెళ్ళండి. మీరు ఇంకా దూరంగా ఉండగానే ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడు. మీరు పశ్చాత్తాపంతో ఆయన దిశలో ఒక్క అడుగు వేస్తే తన అనంత ప్రేమా హస్తాల్లో మిమ్మల్ని బంధించటానికి ఆయన వడివిడిగా వస్తాడు. ఆయన చెవి పశ్చాత్తాపం పొందిన ఆత్మ మొర వినటానికి సిద్ధంగా ఉంటుంది. ఆయన్ని చేరటానికి హృదయం మొదటిసారి చేసిన ప్రయత్నం ఆయనకు తెలుసు. ఒక్క ప్రార్ధన చెయ్యటం అది ఎంత తడబడూ చేసిన ప్రార్ధనైనా, ఒక్క కన్నీటి బొట్టు కార్చటం. అది ఎంత రహస్య దు: ఖమైనా, దేవుని పట్ల ఒక్క కోరికను మనసులో ఉంచుకోవటం అది ఎంత బలహీనమైన కోరికైనా దాన్ని కలవలటానికి దేవుని ఆత్మ ముందుకి వెళ్లటం ఎన్నడూ జరగదు. ప్రార్ధనను ఉచ్చరించక ముందే లేక హృదయ వాంఛను బయలుపర్చక ముందే క్రీస్తు నుంచి వచ్చే కృప ఆత్మపై పనిచేసే కృపను కలవటానికి ముందుకి వస్తుంది. COLTel 166.1

పాపం వల్ల మైలపడ్డ మీ వస్త్రానిల్ని మీ పరలోకపు తండ్రి మీ ఒంటి మీద నుండి తీసివేస్తాడు. జెకర్యాకు వచ్చిన ఉపమానరూపక ప్రవచనంలో ప్రభువు దూత ముందు మైలబట్టతో నిలబబడిన ప్రధాన యాజకుడైన యెహెూషువ పాపాన్ని సూచిస్తున్నాడు. ప్రభువిలా అన్నాడు. “ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నీ దోషమున పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిచుచున్నాను అని సెలవిచ్చెను.. వారు అతని తలమీద తెల్లని పాగా పెట్ట వస్త్రములతో అతనిని అలంకరించిరి.” జెక 3:45 అలాగే ప్రభువు మీకు “రక్షణ వస్త్రములను ” ధరింపజేసి “నీతి అనుపై బట్ట” తో మిమ్మల్ని కప్పుతాడు. యెష 61:10 ” గొట్టెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది”. కీర్త 68:13 COLTel 166.2

ఆయన మిమ్మల్నివిందుశాలకు తీసుకువెళ్తాడు. తన ప్రేమను మీ మీద ద్వజంగా ఎత్తుతాడు (పరమ గీ. 2:4) “నా మార్గములో నడుచుచు నేను నీ కప్పగించిన వాటిని భద్రముగా గైకొనిన యెడల నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును” - ఆయన సింహాసనము చుట్టు ఉండే పరిశుద్ధ దూతలనడుమ (జెక 3:7) COLTel 166.3

“పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించనట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును” యెష 62:5 “ఆయన మిమ్ములను రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును” జెఫ 3:17. “ఈ నాకుమారుడు చనిపోయి మరల బ్రతికెను. తప్పిపోయి దొరికెను” అన్న తండ్రి సంతోషానందాలలో పరలోక భూలోకాలు ఏకమౌతాయి. COLTel 167.1

ఇంతవరకు రక్షకుని ఉపమానంలోని ఆనంద దృశ్యంలో అపశ్రుతి ఎక్కడాలేవు. కాని క్రీస్తు ఇప్పుడు మరొక ఘట్టాన్ని ప్రవేశ పెడుతున్నాడు. “తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పెద్దకుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలము నుండి) వచ్చును. ఇంటి వరకు రాగా వాధ్యములును నాట్యమను జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో - నీతమ్ముడు వచ్చియున్నాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను.అయితే అతడు కోపముతో లోపలికి వెళ్ళనొల్లకపోయెను”. ఈ అన్న, తండ్రి ఆందోళనను పంచుకోలేదు తప్పి పోయిన అతడి కోసం ఎదురు చూడలేదు.కనుక ఆ సంచారి తిరిగి రాకతో తండ్రికి కలిగిన సంతోషంలో పాలుపంచుకోలేదు ఆనందోత్సాహలు ధ్వనులు అతడి హృదయంలో సంతోషం పుట్టించలేదు. ఆ పండుగ వాతావారణానికి కారణం ఏమిటని ఒక సేవకున్ని అడిగాడు. అతడి జవాబు అన్నలో ఈర్ష్య పుట్టించింది. తప్పిపోయి తిరిగి వచ్చిన సోదరుణ్ని స్వాగతించటానికి లోపలకి వెళ్ళలేదు. తమ్ముడికి చూపిన అభిమానం తనకు అవమానంగా పరిగణించాడు. COLTel 167.2

అతణ్ణి సమాధానర్చటానికి తండ్రి బయటికి వచ్చినప్పుడు అతడి గర్వం దుష్టస్వభావం బయటపడ్డాయి. తండ్రి ఇంట తన జీవితం ఫలితం లేని చాకిరిగా పరిగణించి, తిరిగి వచ్చిన తన కుమారుడి పట్ల తండ్రి చూపిస్తున్న అనురాగాన్ని తన పట్ల చూపటం లేదని భావించాడు. తన సేవకుమారుడి సేవకన్నా సేవకుడి పరిచర్యగా ఉన్నదని స్పష్టం చేసాడు. తండ్రి సముఖంలో ఆనందంగా ఉండాల్సి సమయంలో జాగరూకత, క్రమబద్దతతో కూడిన తన జీవితం నుంచి చేకూరే లాభం పై అతడి మనసు నిమగ్నమై ఉంది. ఇందుకోసమే తాను పాపభోగాలు వడిచి పెట్టుకన్నట్లు అతడి మాటలు సూచించాయి. ఇప్పుడు ఈ సోదరుడు తండ్రి వరాల్లో భాగం పంచుకుంటే తనకు అన్యాయం జరుగుతుందని పెద్దకుమారుడు భావించాడు. తానేగాని తన తండ్రి స్థానంలో ఉంటే తప్పిపోయిన ఆ కుమారుణ్ణి చేర్చుకునేవాణ్ని కానని స్పష్టంగా చూపించాడు. అతణ్ణి తమ్ముడుగా కూడా గుర్తించకుండా “నీ కుమారుడు” అంటూ తండ్రితో నిరాసక్తంగా ప్రస్తావించాడు. COLTel 167.3

అయినా తండ్రి అతడిపట్ల ప్రేమతో వ్యవహరించాడు. అప్పుడతడు “కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు; నావన్నియు నీవి” అన్నాడు. నీ తమ్ముడు భ్రష్టుడై తిరిగిన సంవత్సరాలన్నీ నాతో సహవాసంలో గడిపే అధిక్యత నీకు లేదా? తన పిల్లలు సుఖసౌక్యాలకు దోహదపడే సమస్తం వారికి సమకూర్చటం జరిగింది. కుమారుడు లాభం లేదా ప్రతిఫలం సమస్యను ప్రస్తావించాల్సిన అవసరంలేదు. “నావన్నియు నీవి” నీవు నా ప్రేమను విశ్వసించి ధారాళంగా వచ్చే వరాల్ని స్వీకరించటం అవసరం. ఒక కుమారుడు కొంతకాలము కుటుంబముతో సంబంధము లేకుండా తండ్రి ప్రేమను అనుభవించకుండా ఉన్నాడు. ఇప్పుడు తిరిగివచ్చాడు. కనుక ఆనందం వెల్లువై ఆందోళన కలిగించే ప్రతీ ఆలోచనని తుడిచి వేసింది.” “నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. తప్పిపోయి దొరికెను”. COLTel 168.1

అన్న తన దుర్బుద్ధిని, కృతజ్ఞతలేని స్వభావాన్ని గ్రహించాడా? తమ్ముడు? దుషతాలు చేసినప్పటికి, అతడు తన తమ్ముడన్న విషయాన్ని చూడగలిగాడా? తన అసూయనిమిత్తం హృదయ కాఠిన్యం నిమిత్తం అన్న పశ్చత్తాపపడ్డాడా? ఈ విషయమై క్రీస్తు ఏమి చెప్పలేదు. మౌనంగా ఉండి పోయాడు. ఎందుకంటే ఆ ఉపమానం ఇంకా జరుగుతూనే ఉంది. దాని ఫలితం ఎలాగుండాలో శ్రోతలే నిర్ణయించాల్సి ఉంది,. COLTel 168.2

పెద్దకుమారుడు క్రీస్తు దినాల్లో పశ్చాత్తాపం లేని యూదులికి ప్రతీక, తాము ద్వేషించే వారిని సుంకరులుగాను, పాపులుగాను పరిగణిస్తూ ప్రతీ యుగంలోను నివసించే పరిసయ్యులికి కూడా ప్రతీక. దుర్మార్గతలో అతిగి లేనందుకు వార స్వనీతితో నిండి ఉంటారు. ఆ ఆక్షేపకుల్ని క్రీస్తు వారి పంధాలోనే ఎదుర్కున్నాడు ఉపమానంలోని పెద్దకుమారుడిల దేవుని వద్ద నండి వారు ప్రత్యేక హక్కులు ఆధిపత్యాలు పొందారు. దేవుని గృహంలో తాము కుమారులమని చెప్పుకున్నారు. కాని వారి స్వభావం కూలివారి స్వభావం వంటిది. వారు పని చెయ్యటానికి ప్రేమ కాదు మూలం ప్రతిఫల నిరీక్షణ. వారి దృష్టిలో దేవుడుకర్కొటకుడైన యజామాని. క్రీస్తు తన కృపావరాన్ని రబ్బీలు తమ కృషి ద్వారాను తపోబలం ద్వారాను సంపాదించటానికి నీరక్షించన వరం - ఉచితంగా పొందాల్సిందిగా సుంకరుల్ని పాపుల్ని ఆహ్వానించటం చూసి ఆక్రోశించారు. తండ్రి హృదయాన్ని ఆనందంతో నింపిన తప్పిపోయిన కుమారుడి తిరిగి రాక వారి మనసుల్ని అసూయతో నింపింది. COLTel 168.3

ఉపమానంలో కుమారుడితో తండ్రి విజ్ఞాపన చెయ్యటం పరిసయ్యులతో దేవుడు చేసిన విజ్ఞాపనకు సూచిక. ‘నావన్నియు నీవి” జీతంగా కాదు ఒక వరంగా తప్పిపోయిన కుమారుడిలా మీరు అర్హులు కాని తండ్రి ప్రేమను కానుకాగా మాత్రమే పొందగలరు. COLTel 169.1

స్వనీతి మనుషుల్ని దేవుని గురించి తప్పుడు అభిప్రాయం ఇవ్వటానికే కాదు. తమ సహోదరుల పట్ల ఉదాసీనం ఉంటూ వారిని తప్పు పటాటానికి నడిపిస్తుంది. స్వార్ధం. అసూయతో నిండిన పెద్దకుమారుడు తన తమ్ముడిపై నిఘా వెయ్యటానికి సిద్ధమయ్యాడు. అతడి ప్రతీ చర్యనూ తప్పు పట్ల, స్వల్ప లోపాకుల నిందలు మోపేవాడు. ఇలా క్షమించని తన స్వభావాన్ని సమర్ధించుకునేవాడు. అనేకులు ఇదే పని చేస్తున్నారు. ఆత్మ వరదవంటి శోధనలో కొట్టుమిట్టాడుతుండగా వారు, మొండిగా, బింకంగా నిలబడి ఫిర్యాదులు నిందారోపణలు చేస్తారు. తాము దేవుని బిడ్డలమని వారు చెప్పుకోవచ్చు. కానివారు ప్రదర్శించే స్వభావం సాతాను సంబంధమైనది. ఈ నేరారోపకులు సహోదర్లు పట్ల తమ వైఖరి వల్ల దేవుడు తన ముఖ ప్రకాశాన్ని కనపర్చలేని తావులో తమ్మునుతాము నిలుపుకుంటారు. COLTel 169.2

అనేకులు ఇలా ప్రశ్నిస్తున్నారు. “ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును ? వేల కొలది పొట్టేళ్ళను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు?” మికా 6:6-8 COLTel 170.1

“దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకాలు తీయుటకు బాధింపబడినవారిని విడిపించుటయు.. నీరక్తసంబంధికి ముఖము తప్పించుకొనుకుండుటయు’ - ఇదే దేవుడు ఎన్నుకున్న సేవ. యెష 58:67, మీ పరలోకపు తండ్రి ప్రేమ వల్లనే రక్షించబడడ్డ పాపినని మీరు గ్రహించినప్పుడు,పాపంలో బాధపడుతున్న ఇతరుల పట్ల మీకు దయకలుగుతుంది. దు:ఖాన్ని పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు మీరు ఎటువంటి అసూయతోను, నిందతోను ఎదుర్కొరు. మీ హృదయాల్లోని స్వార్ధమనే మంచుగడ్డ కరిగినప్పుడు మీరు దేవుని సానుభూతిని నశించిన ఆత్మల్ని రక్షించటంలో ఆయన పొందే ఆనందాన్ని ఆయనతో పంచుకుంటారు. COLTel 170.2

నీవు దేవుని బిడ్డనని చెప్పుకుంటావు. అది నిజమైతే “ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి” బతికినవాడు “తప్పిపోయి” దొరికినవాడు. అతి దగ్గర బాంధవ్యంతో నీతో అతడు బంధించడ్డాడు. ఎందుకంటే దేవుడు అతణ్ణి ఒక కుమారుడిగా గుర్తిస్తున్నాడు. అతడితో నీకు సంబంధం లేదంటే కుటుంబములో నీవు ఒక పనివాడవే. దేవుని కుటుంబములో ఒక బిడ్డవు కావు. తప్పిపోయి దొరికినవాణ్ణి స్వాగతించటంలో నీవు పాలు పొందటానికి ఇష్టపడకపోయినా సంతోషం కొనసాగుతూనే ఉంటుంది. తిరిగి వచ్చినవాడికి తండ్రి ఒక్క తండ్రి పనిలో తన స్థానం ఉంటుంది. ఎవరు ఎక్కువ క్షమించబడతాడో అతడు ఎక్కువ ప్రేమిస్తాడు. అయితే నీవు బయట ఉన్న చీకటిలో ఉంటావు. ఎందుకంటే “దేవుడు ప్రేమా స్వరూపి; ప్రేమలేనివాడు దేవుని ఎరుగుడు”. 1 యహా 4:8 COLTel 170.3