క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

25/61

13—ఇద్దరు ఆరాధకులు

ఆధారం : లూకా 18:9-14

తామే నీతిమంతులమని తమ్మునమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు ” క్రీస్తు పరిసయ్యుడు సుంకరిని గూర్చిన ఉపమానం చెప్పాడు. పరిసయ్యుడు దేవాలయానికి ఆరాధనకు వెళ్ళాడు. అతడు వెళ్ళింది తాను పాపినని తనకు క్షమాపణ అవసరమని కాదు. కాని తాను నీతమంతుణ్ణి భావించి మొప్పును పొందాలన్న కోరికతో వెళ్ళాడు. తన ఆరాధన తన్ను దేవునికి సిఫార్సు చేసే సుకృతమని అతడు పరిగణించాడు. అంతేగాక ఆ క్రియ అతడి భక్తిని గూర్చి ప్రజలికి మంచి అభిప్రాయం కలిగిస్తుందని భావించాడు. దేవుని ప్రసన్నత మానవుడి మన్నన రెంటినీ పొందాలని ఆశించాడు. అతడి ఆరాధనకు ప్రేరణ స్వార్ధపరత్వం. COLTel 115.1

అతడు స్వాభిమానం ఆత్మగౌరవంతో నిండి ఉన్నాడు. అతడి వైఖరి అతడి నడక అతడి ప్రార్ధన స్వయం ప్రశంసతో నిండి ఉన్నాయి. “మా దాపునకు రావద్దు ఎడమగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులము” (యెష 65:5) అని చెబుతున్నట్లు అతడు ఇతరులకి దూరంగా నిలచి ‘తనలో తాను” ప్రార్ధిస్తున్నాడు. పూర్తిగా సంతృప్తి చెంది దేవుడు మానవుడు తనను అలాగే పరిగణిస్తారని తలంచాడు. “దేవా, నేను చోరులును అన్యాయస్థులునైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” అన్నాడు. అతడు దేవుని ప్రవర్తనను బట్టి కాక ఇతర మనుషుల ప్రవర్తను బట్టి తన ప్రవర్తనను నిర్ధారించుకున్నాడు. అతడి మనసు దేవునికి దూరమై మానవాళి తట్టు తిరిగింది. అతడి ఆత్మ సంతృప్తి రహస్యం ఇదే. COLTel 115.2

“వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను” అంటూ తన మంచి పనుల్ని గుర్తు తెచ్చుకోవటం మొదలు పెట్టిడు.పరిశయ్యుడు మతం ఆత్మను తాకలేదు. అతడు దైవ భక్తిగల ప్రవర్తతను ప్రేమతోను దయతోను నిండిన హృదయాన్ని ఆశించలేదు. వెలపటి జీవితానికి మాత్రమే సంబంధించిన మతంతో తృప్తి చెందాడు. అతడి నీతి ఆతడిదే- తన సొంత క్రియల ఫలం - మానవ ప్రమాణం ప్రకారం తీర్పునిచ్చేది. COLTel 115.3

ఏ వ్యక్తి తాను నీతిమంతుణ్ణిని భావించి తన్నుతాను నమ్ముకుంటాడో అతడు ఇతరుల్ని తృణీకరిస్తాడు. ఇతరుల్ని బట్టి పరసయ్యుడు తన్న తాను నీతిమంతునిగా ఎలా తీర్పు తీర్చుకున్నాడో అలాగే తనను బట్టి ఇతరులు చెడ్డవారిని తీర్పుతీర్చాడు. తన నీతిని ఇతరుల నీతిని బట్టి అంచాన వేసుకున్నాడు. వారు ఎంత చెడ్డవారైతే వారికి తనకు మధ్య బేధాన్ని బట్ట తాను అంత నీతిమంతుడుగా కనిపించాడు. అతడి స్వనీతి ఆరోపణలు చెయ్యటానికి నడిపించింది. COLTel 116.1

“ఇతర మననుష్యుల్ని” దైవ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించే వారిగా తీర్పు తీర్చాడు. ఈ రకంగా అతడు సహోదరుల పై నిందలు మోసే సాతాను స్వభావాన్ని ప్రదర్శించుకున్నాడు. ఈ స్వభావంతో అతడు దేవునితో సహ నివసించటం అసాధ్యం. అందుకే దైవ దీవెన లేవీ పొందకుండా ఇంటికి తిరిగి వెళ్ళారు. COLTel 116.2

సుంకరి ఇతర ఆరాధకులతో ఆరాధించటానికి ఆలయానికి వెళ్ళాడు. కాని అతడు వారితో కలసి ఆరాధించటానికి ఆ పాత్రుణ్ణి భావించి అందరి ఎడల ఉన్నాడు. దూరంగా నిలబడి “ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ముబాదుకొనుచు “తీవ్ర వేదనతో తీవ్ర ఆత్మ నిరసనతో ప్రార్ధన చేసాడు. COLTel 116.3

తాను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని తాను పాపిని కళంకితుణ్ణి అని గుర్తించాడు. తన చుట్టు ఉన్నవారు సయితం తన పట్ల దయచూపరని, వారు తానంటే ద్వేషంతో నిండి ఉన్నారని అతడు ఎరుగును. తన్ను దేవునికి సిఫార్సు చేయ్యటానికి తనలో మంచి ఏమి లేదని అతడికి తెలుసు. కనుక ఆధైర్యంతో నిస్పృహతో దుంఖిస్తూ, “దేవా, పాపినైన నన్ను కరుణించుము” అన్నాడు. తన్ను తాను ఇతరుల్తో పోల్చుకోలేదు. అపరాధ భావనతో కుమిలిపోతూ దేవుని సముఖంలో ఒంటరిగా ఉన్నట్లు నిలబడి ఉన్నాడు. అతడి ఒకే ఒక కోరిక పాప క్షమాపణ, సమాధానం అతడ్ని ఒకే ఒక మొర దేవుని కృపకోసం, అతణ్ణి దేవుడు దీవించాడు. “అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను”. అనిక్రీస్తు చెప్పాడు. COLTel 116.4

పరిసయ్యుడు సుంకరి దేవున్ని ఆరాధించటానికి వచ్చే రెండు తరగతుల ప్రజల్ని సూచిస్తున్నారు. వారి మొట్టమొదటి ఇద్దరు ప్రతినిధుల్ని లోకంలో జన్మించిన మొట్టమొదటి ఇద్దరు పిల్లల్లో కనుగొనవచ్చు. కయీను తాను నీతిమంతుణ్ణిని భావిచాడు. అతడు కేవలం కృతజ్ఞతర్పణతోనే దేవుని వద్దకు వచ్చాడు. తన పాపాన్ని ఒప్పుకోలేదు. కృప అవసరాన్ని గుర్తించలేదు. COLTel 117.1

కాని హేబేలు దేవుని గొర్రెపిల్ల రక్తాన్ని సూచించే రక్తంతో వచ్చాడు. తాను నశించిన వాడినని ఒప్పుకుంటూ పాపిగా వచ్చాడు. తనకు పొందే అర్హతలేని దేవుని ప్రేమే అతడి ఒకే ఆశ. దేవుడు అతడి అర్పణను గౌవరించాడు. కయీనుపట్ల అతడి అర్పణపట్ల ఆయన సముఖుడు కాలేదు. మనలేమిని గూర్చిన సృహ, మన ఆధ్యాత్మిక పేదరికం, పాపం గుర్తింపు ఇవి దేవుడు మనల్ని అంగీకరించటానికి మొదటి షరతు. “ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది”. మత్తయి 5:3 COLTel 117.2

పరిసయ్యుడు సుంకరి సూచించిన రెండు తరగతుల్నుంచీ అపొస్తలు డైన పేతురు చరిత్రలో ఒక పాఠం ఉంది. తన శిష్యరికం తొలినాళ్ళలో తాను బలంగా ఉన్నానని పేతురనుకున్నాడు. పరిసయ్యుడిలా తన సొంత అంచనా ప్రకారం అతడు “ఇతర మనుషులు వలె” లేడు.తన అప్పగింతరాత్రి “మీరందరు (నన్ను గుర్తించి ఈ రాత్రి) అభ్యంతర పడెదరు” అంటూ శిష్యుల్ని క్రీస్తు హెచ్చరించినప్పుడు. “అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను” అని పేతురు ధీమాగా జావాబిచ్చాడు. మార్కు 14:27,29 పేతురు తనకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎరుగడు. COLTel 117.3

ఆత్మ విశ్వాసం అతణ్ణి తప్పుదారి పట్టించిది. శోధనను జయించగలనను కున్నాడు. అనుకున్న కొన్ని గంటల్లోపే పరీక్ష వచ్చింది. శపిస్తూ ఒట్టు పెడుతూ ప్రభువు నెరగని బొంకాడు. కోడికూత క్రీస్తు మాటల్ని జ్ఞాపకం చేసినపుడు, తాను చేసిన పనికి దిగ్ర్భాంతి చెంది అవాక్కై తన ప్రభువు వంక చూసాడు. ఆ నిముషంలోనే క్రీస్తు పేతురు వంక చూసాడు. ఆ చూపులో పేతురు పట్ల దయ ప్రేమ మిళితమై ఉన్నాయి. పేతురు తన ఉనికి తాను అవగాహన చేసుకున్నాడు. బయటికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా రోధించాడు. క్రీస్తు చూసిన ఆ చూపు పేతురు హృదయాన్ని బద్దలు కొట్టింది. పేతురు జీవితం మలుపు తిరిగింది. తన పాపం నిమిత్తం ప్రగాఢ పశ్చాత్తాపం పొందాడు. సుంకరిలా విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపపడ్డాడు. సుంకరిలాగే కృపను కూడా పొందాడు క్రీస్తు చూసిన చూపు అతడికి క్షమాపణ హామినిచ్చింది. COLTel 117.4

అతడి విశ్వాసం ఇకలేదు. గతంలాగా ప్రగల్బాలు పలకటం ఇకలేదు. తన పునరుత్థానం అనంతరం క్రీస్తు పేతుర్ని మూడుసార్లు పరీక్షించాడు. “యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా”? అని అడుగగా పేతురు తన్ను తాను తన ససూదరులకన్నా ఓ మెట్టు పైన పెట్టుకోలేదు. తన హృదయాన్ని చదవగల ప్రభువుకే విజ్ఞప్తి చేసుకున్నాడు. “ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు. నిన్ను ప్రేమించుచ్నునని నీవే యెరుగుదవు” అని సమాధానం ఇచ్చాడు. యోహా 21:15, 17. COLTel 118.1

అప్పుడు అతడికి తన కర్తవ్యాన్నివ్వటం జరిగింది. తనకు ఇంతకు ముందున్న పనికన్న విశాలం, సున్నితం అయిన పనిని నియమించటం జరిగింది. గొర్రెల్లి గొర్రెపిల్లల్ని మేపవలసినదిగా క్రీస్తు పేతుర్ని ఆదేశించాడు. ఏ ఆత్మల కోసం క్రీస్తు తన ప్రాణం పెట్టాడో వాటిని గూర్చిన గృహ నిర్వాహకత్వాన్ని ఇలా అప్పగించటంలో పేతురికి తన పునరుద్ధరణ నిమిత్తం బలమైన నిదర్శనం ఇచ్చాడు. ఒకప్పుడు, నిలకడలేని, డంబాలు పలికిన, ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉన్న శిష్యుడు ఇప్పుడు నెమ్మదిపరుడు విరిగి నలిగి హృదయం గలవాడు అయ్యాడు. ఇక నుండి అతడు ఆత్మ నిరసన ఆత్మ త్యాగం మార్గాన ప్రభువుని వెంబడించాడు. అతడు క్రీస్తు శ్రమల్లో పాలుపంచుకున్నాడు. క్రీస్తు తన మహిమా సింహాసనం పై కూర్చునప్పుడు, పేతురు ఆయన మహిమలో పాలిభాగస్తుడవుతాడు. COLTel 118.2

పేతురు పడిపోవటానికి, పరిసయ్యుడు దేవునితో సహవాసాన్ని కోల్పోవటానికి దారి తీసిన దుష్టత నేడు అనేకులను నాశనం చేస్తుంది. గర్వం దేవునికి ఎంతో హేయం. అది మానవాత్మకు ప్రమాదకరం. పాపాల న్నిటిలోను గర్వంఘోరమైంది. దాని నివారణ కష్టసాధ్యం. COLTel 118.3

పేతురు పతనం అప్పటికప్పుడు సంభవించింది కాదు. అది క్రమ క్రమంగా జరిగింది. తాను రక్షించబడ్డాను అన్న నమ్మకానికి ఆత్మ విశ్వాసం అతన్ని నడిపించింది. అతడు అంచెలంచెలుగా దిగజారి తుదకు తన ప్రభువుని ప్రభువుని ఎరగనని బొంకాడు. COLTel 119.1

ఆత్మ విశ్వాసం పెంచుకోవటం క్షేమం కాదు. లేక ఈ లోకంలో మేము శోధనకు లొంగం అనుకోవటం క్షేమం కాదు. రక్షకుణ్ణి అంగీకరించే వారిని వారి విశ్వాసం ఎంత పటిష్టమైందో తాము రక్షించబడ్డామని చెప్పటానికి గాని రక్షించబడ్డట్లు భావించటానికి గాని నడిపించకూడదు. ఇది తప్పుదారి పట్టించటమౌతుంది. నిరీక్షించటం విశ్వసించటం ప్రతివారికి నేర్పించాలి. మనల్ని మనం క్రీస్తుకి అంకితం చేసుకొని ఆయన మనల్ని అంగీకరంచాడని ఎరిగినప్పుడు సయితం, మనం శోధనలో పడటానికి అవకాశముంది. దైవ వాక్యం “అనేకులు తమ్మును శుద్ధిపర్చుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు” దాని 12:10 శోధనకు తట్టుకుని నిలిచినవాడు మాత్రమే జీవకిరీటం అందుకుంటాడు (యాకోబు 1:12) COLTel 119.2

క్రీస్తుని అంగీకరించి తమ మొదటి నమ్మకంలో నేను రక్షణ పొందాను అనేవారు తమ్మును తాము నమ్ముకునే ప్రమాదంలో ఉన్నారు. వారు తమ బలహీనతల్ని నిత్యం దైవశక్తిని పొందాల్సిన అవసరాన్ని విస్మరిస్తారు. సాతాను ఎత్తుగడలకు సిద్ధంగా ఉండరు. శోధన వచ్చినప్పుడు అనేకులు పేతురువల్లే పాపంలో లోతుగా కూరుకుపోతారు. వారికి ఈ హితవు వస్తున్నది, ” తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను “. 1 కొరింథి 10:12 మనల్ని మనం నమ్ముకోకుండా నిత్యం క్రీస్తు మీద ఆధారపడటంలోనే మనకు క్షేమముంది. COLTel 119.3

పేతురు తన సొంత ప్రవర్తన లోపాన్ని, తనకు క్రీస్తు శక్తి, కృప అవసరమున్న విషయాన్ని తెలుసుకోవటం అవసరమయ్యింది. ప్రభువు అతని శోధన నుంచి కాపాడలేకపోయాడు గాని అపజయం నుంచి కాపాడాడు. పేతురు క్రీస్తు హెచ్చరికను పాటించి ఉంటే మెళుకవగా ఉ ండి ప్రార్ధించేవాడు. తన పాదాలు తొట్రిల్లాతాయేమోనన్న భయంతోను వణుకుతోను ఆచితూచి నడుచుకునేవాడు. సాతాను జయం పొందకుండా ఉండేందుకు దేవుని చేయూత పొందేవాడు. COLTel 119.4

పేతురు పతనం స్వయం సమృద్ధత వల్ల సంబశించింది. అతడి పాపాలు పశ్చాత్తాపం ద్వారా అవమానం ద్వారా మళ్ళీ స్థిరపడ్డాయి. పేతురు అనుభవం దాఖలాలో పశ్చాత్తాపపడే ప్రతీ పాపికి ప్రోత్సాహం లభిస్తుంది. పేతురు ఘోరపాపం చేసినా, దేవుడతణ్ణి విడిచి పెట్టలేదు. ” నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని” అన్న క్రీస్తు మాటలు అతడి హృదయం మీద ముద్రించబడ్డాయి (లూకా 22:32) హృదయ వేదనతో కూడిన అతడి పశ్చాత్తాపంలో క్రీస్తు చేసిన ఈ ప్రార్ధన. ప్రేమతోను దయతోను ఆయన చూసిన చూపు జ్ఞాపకం అతడిలో నిరీక్షణ రగిలించాయి. తన పునరుత్థానం తరువాత క్రీస్తు పేతురుని జ్ఞాపకం చేసుకొని క్రీస్తుని అందించటానికి దేవదూతకు ఈ వర్తమానం ఇచ్చాడు. “ఊరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడి” మార్కు 16:9 పాపం క్షమించే రక్షకడు పేతురు పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. COLTel 120.1

పేతురుని రక్షించటానికి అందించిన కనికరమే శోధనకు లోనైన పవిత్ర ఆత్మను అందించటం జరుగుతుంది. మనుషుల్ని పాపంలోకి నడిపించి ఆ తరువాత వారిని నిస్సహయులుగా, క్షమాపణ అర్ధించటానికి భయంతో వణుకుతూ ఉండేటట్లు చేయడం సాతాను ప్రత్యేక పథకం. అయితే “జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధానపడవలెను. వారు నాతో సమాధాననపడవలెను” అని దేవుడన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? (యోష 27:5) మన బలహీనతల్ని అధిగమించటానికి ప్రతీ ఏర్పాటు జరిగింది.క్రీస్తు వద్దకు రావటానికి మనకు ప్రతీ ప్రోత్సహామూ ఇవ్వటం జరుగుతున్నది. COLTel 120.2

దేవుని స్వాసాన్ని తిరిగి కొనటానికి మానవుడికి మరో అవకాశం ఇవ్వటానికి క్రీస్తు తన ప్రాణాన్నిచ్చాడు. “ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము హెబ్రీలు జీవించుచున్నాడు”. హెబ్రీ 7:25 తన నిష్కళంక జీవితం, తన విధేయత కల్వరి పై తన మరణం ద్వారా క్రీస్తు నశించిన మానవాళి పక్షంగా విజ్ఞాపన చేసాడు. ఇప్పుడు మన రక్షణకర్త కేవలం వినతిదారుగా గాక విజయాన్ని సాధించిన విజేతగా మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన అర్పణ పూర్తి అయ్యింది మన విజ్ఞాపకుడుగా నిష్కళంకమైన తన నీతి ప్రవర్తన ప్రజల ప్రార్ధనలు, ఒప్పుకోళ్ళు, కృతజ్ఞలతో నిండినధూపార్తి పట్టుకొని దేవుని ముందు నిలిచి, తాను ఏర్పాటు చేసుకున్న సేవను నిర్వహిస్తాడు. పరమిళిస్తున్న ఆయన నీతితో కలసి ఇది దేవుని వద్దకు ఇంపైన వాసనగా ఈ అర్పణ పూర్తి ఆమోదం పొందుతుంది. క్షమాపణ అతిక్రమాలన్నిటిని కప్పివేస్తుంది. COLTel 121.1

మన ప్రత్యామ్నాయంగాను పూట కాపుగాను ఉంటానని క్రీస్తు వాగ్దానం చేసాడు. ఆయన ఎవర్నీ ఆశ్రద్ధ చెయ్యడు. ఎవరు మానవులు నిత్యానాశనానికి గురి అవ్వటం చూడలేక వారి పక్షంగా తన్ను తాను బలిగా అర్పించుకోవటానికి పూనుకున్నారో ఆ ప్రభువు, తన్నుతాను రక్షించుకోలేనని గుర్తించే ప్రతీ ఆత్మపై దయ కనికరాలు చూపిస్తారు. COLTel 121.2

భయంతో వణుకుతున్న వినతి చేస్తున్న వారిని ఆయన ఆదరించకుండా ఉండడు. తన ప్రాయశ్చిత్తం ద్వారా మానవుడికి విస్తారమైన నైతిక శక్తి నిధిని సమకూర్చిన ఆయన ఆ శక్తి మన పక్షంగా వినియోగిస్తాడు. మన పాపాల్ని దు:ఖాల్ని మనం ఆయన పాదల వద్దకు తీసుకువెళ్ళవచ్చు. ఎందు చేతనంటే ఆయన మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు.ఆయన ప్రతీ చూపు ఆయన ప్రతీ మాట మన విశ్వాసానికి ఆహ్వానం పలుకుతున్నవి. ఆయన మనప్రవర్తనల్ని తన చిత్త ప్రకారం తీర్చిదిద్దుతాడు. సామాన్య విశ్వాసంతో క్రీస్తు పై ఆధారపడిన ఒక్క ఆత్మను జయించటానికి సాతాను తాలూకు సర్వ సైన్యానికి శక్తి లేదు. “సొమ్ముసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే.శక్తి హీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే”యోష 40:29 COLTel 121.3

“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును”. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు..పోయిన నీ దోషము ఒప్పు కొనుము”. “మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత తీసివేసెదను”. 1 యోహా 1:9; యిర్మీ 3:13; యెహె 36:25 COLTel 122.1

క్షమాపణ పొంది సమాధానం కలిగి ఉండకముందు మనకు విరగినలిగిన హృదయాన్నిచ్చే జ్ఞానం అవసరం. పరిసయ్యుడికి తాను పాపినన్న గుర్తింపు కలగలేదు. పరిశుద్దాత్మ అతడిలో పనిచెయ్య లేకపోయాడు. అతడి ఆత్మ స్వనీతి కవచం కప్పుకుని ఉండటంతో, గురి తప్పకుండా దేవదూత సంధించిన,పదునైన దేవుని బాణాలు లోపలికి దూసుకువెళ్ళలేకపోయాయి. తాను పాపినని తెలిసినవాణ్ణి మాత్రమే క్రీస్తు రక్షించగలుగుతాడు. “చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును” ఆయన వచ్చాడు. లూకా 4:18 కాగా “ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కం లేదు” లూక 5:31 మనం మన వాస్తవిక పరిస్థితిని గ్రహించాలి. గ్రహించకపోతే క్రీస్తు సహాయం అవసరమని గుర్తించటం మన అపాయముందని గ్రహించాలి. గ్రహించకపోతే ఆశ్రయం కోసం పరుగెత్తం. మన గాయాల బాధను మనం అనుభవించాలి. అప్పుడు స్వస్థతను కోరతాం. COLTel 122.2

ప్రభువిలా అంటున్నాడు. ‘నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునైయున్నానని యెరగక- నేను ధనవంతుడను, ధనవృద్ది చేసియున్నాను. నాకేమియు కొదువలేదని చెప్పుచున్నావు. నీవు ధనవృద్ది చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగనుట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ది చెప్పుచున్నాను” ప్రక 3:17,18 పుటం వేసిన బంగారం ప్రేమ మూలంగా పనిచేసే విశ్వాసం. ఇదే మనకు దేవునితో సామరస్యం కూర్చుతుంది. మనం ఆమోఘ క్రియాశీలులుం కావచ్చు. చాలా మంచి పని చేయవచ్చు. కాని ప్రేమ లేకుండా, క్రీస్తు హృదయంలోని ప్రేమవంటి ప్రేమ లేకుండా, మనం పరలోక కటుంబ సభ్యులం కాలేం. COLTel 122.3

ఏ మనుష్యుడూ తన పొరపాట్లును తాను చూడలేడు. “హృదయము అన్నిటికంటే మోసకరమైనది . అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు”? యిర్మీ 17:9 పెదవులు ఆత్మ విషయమైన దీనత్వాన్ని ప్రకటించవచ్చు. కాని దాన్ని హృదయంగుర్తించదు. దీన స్వభావం గురించి దేవునితో మాట్లాడుతున్నప్పుడు, హృదయం ఉన్నతమైన తన అణకువ గురించి, తన సమున్నత నీతి అతిశయముతో పొంగిపోవచ్చు. మనల్ని గురించి మనం యదార్ధంగా తెలుసుకునే ఏకైక మార్గం మనం క్రీస్తుని వీక్షించటం, మనుషులు స్వనీతితో ఉప్పొంగి పోవటానికి కారణం వారు క్రీస్తుని ఎరుగకపోవటమే. COLTel 123.1

మనం ఆయన పవిత్రతను ఔన్నత్యాన్ని గూర్చి ఆలోచించినప్పుడు మన బలహీనతల్ని, పేదరికాన్ని, లోపాల్ని అవి ఉన్నతరీతిగానే చూస్తాం. తక్కిన వారివలె మనల్ని మనం నశించిన వారంగా నిరీక్షణ లేనివారంగా స్వనీతి వస్త్రాలు ధరించినవారంగా చూసుకుంటాం. మనం రక్షించడబటం జరిగితే అది మన మంచితనాన్ని బట్టి కాదు. గాని అరమైన క్రీస్తు కృప మూలంగానేనని మనం తెలుసుకుంటాం. COLTel 123.2

సుంకరిప్రార్ధనను దేవుడు విన్నాడు కారణమేంటంటే అతడు సర్వశక్తుని మీద ఆధారపడటాన్ని సూచించిది. స్వయం సుంకరికి సిగ్గుగా కనిపించింది. దేవున్ని అన్వేషించే వారందరికీ స్వయం అలాగే కనిపించాలి. లేమిలో ఉన్న వినతిదారుడు విశ్వాసమూలంగా ఆ ఆత్మవిశ్వాసాన్ని సృజించే విశ్వాసం - అనంత శక్తిని ఆశ్రయించాలి. COLTel 123.3

సామన్య నిరాడంబర విశ్వాసానికి, సంపూర్ణ స్వార్ధ త్యాగానికి వెలపటి ఆచారాలేవి ప్రత్యామ్నాయాలు కావు. అయితే ఏ వ్యక్తి స్వార్ధాన్ని తీసివేసుకోలేడు. పనిని పూర్తి చెయ్యటానికి క్రీస్తుకి ఆమోదం మాత్రమే తెలపగలం. అంతట ఆత్మ మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి. ప్రభువా నా హృదయాన్ని తీసుకో. దాన్ని నేను నీకివ్వలేను. అది నీ ఆస్తి. దాన్ని శుద్ధంగా ఉంచు. దాన్ని నేను నీకోసం స్వచ్చంగా ఉంచలేను. నాలో స్వార్ధం, బలహీన, క్రీస్తుని పోలికలేని స్పూర్తి ఉన్నా నన్ను రక్షించు, నన్ను మూసపోసి రూపుదిద్ది పవిత్రం పరిశుద్ధం అయిన వాతావరణంలోకి లేపి అక్కడ బలీయమైన నీ ప్రేమా ప్రవాహం నా ఆత్మ ద్వారా ప్రవహింపజెయ్యి. COLTel 123.4

క్రైస్తవ జీవిత ప్రారంభంలోనే కాదు పరలోకం దిశలో వేసే ప్రతి అడుగు నా ఈ స్వార్ధ పరిత్యాగం జరగాల్సి ఉంది. మన సత్కక్రియలన్నీ మన వెలపల నుంచి వచ్చే శక్తి మీద ఆధారపడి ఉంటాయి. కనుక హృదయం నిత్యం దేవునితో సంబంధం కలిగి ఉండటం అవసరం. గతం పాపాల్ని ఒప్పుకుంటూ దేవుని ముందు దీనంగా ఉండటం అవసరం. నిత్యం స్వార్ద పరిత్యాగం ద్వారా క్రీస్తు పై ఆధాపడటం ద్వారా మాత్రమే మనం క్షేమంగా నడపగలుగుతాం. COLTel 124.1

మనం యేసుకు ఎంత దగ్గరగా వచ్చి ఆయన పవిత్ర ప్రవర్తన ఎంత స్పష్టంగా గ్రహించగలిగితే, పాపం తాలూకు నీచత్వాన్ని అంత స్పష్టంగా గ్రహించి అంత తక్కువగా మనల్ని మనం హెచ్చించుకోవటానికి చూస్తాం. దేవునిచే పరిశుద్ధులుగా గుర్తింపు పొందేవారు. తమ మంచితనాన్ని ప్రదర్శించుకోవటంలో చిట్టచివర ఉంటారు. అపొస్తలుడైన పేతురు క్రీస్తుకి నమ్మకమైన సేవకుడయ్యాడు. అతడు దివ్యజ్ఞానంతోను శక్తితోను గౌరవించబడ్డాడు. COLTel 124.2

క్రీస్తు సంఘాన్ని బలో పేతం చెయ్యటంలో అతడు క్రియాశీలక పాత్ర పోషించాడు. అయితే తనకు కలిగిన భయంకర అవమానకర అనుభవాన్ని పేతురు ఎన్నడూ మర్చిపోలేదు. అతడి పాపం క్షమించబడింది. అయినా తన పతనానికి కారణమైన ప్రవర్తన బలహీనతను జయించటానికి క్రీస్తు కృప మాత్రమే సహాయపడతుందని అతడికి బాగా తెలుసు. అతిశయించటానికి తనలో ఏమీ లేదని తెలుసుకున్నాడు. COLTel 124.3

అపొస్తలులుగాని ప్రవక్తలు గాని తాము పాపరహితులమని చెప్పలేదు. దేవునికి అతిసమీపంగా నివసించిన మనుషులు, తెలిసి తప్పు చెయ్యటం కన్నా తమ ప్రాణాన్నే త్యాగం చెయ్యటానికి సిద్ధంగా ఉండే మనుష్యులు దివ్యజ్ఞానాన్ని శక్తిని ఇచ్చి దేవుడు గౌరవించిన మనుషులు తమది పాప స్వభావమని ఒప్పుకున్నారు. వారు మానవమాతృల పై నమ్మకం పెట్టుకోలేదు. తమకు సొంత నీతి ఉన్నట్లు చెప్పుకోలేదు. వారు పూర్తిగా క్రీస్తు నీతిని నమ్ముకున్నారు. క్రీస్తుని వీక్షించిన వారందరూ ఇలాగే ప్రవర్తిస్తారు. COLTel 124.4

క్రైస్తవానుభవంలో ప్రతి ముందడుగు వద్ద మన పశ్చాత్తాపం ప్రగాఢ మౌతుంది. ప్రభువు ఎవరి పాపాలు క్షమించాడో వారితో, ఆయన ఎవర్ని తన బిడ్డలుగా గుర్తిస్తాడో వారితో ఆయన ఇలా అంటున్నాడు. “అప్పుడు మీరు మీ దుష్ప్రప్రవర్తనను మీరు చేసిన క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయ క్రియలను బట్టియు మిమ్మును మీరు ఆసహ్యించుకొందురు”. యెహె 36:31 మళ్ళీ ఆయన ఇలా అంటున్నాడు. “నేను యెహోవానని నీవు తెలిసికొను నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంత నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు” యెహె 16:62,63 అప్పుడు మన పెదవులు ఆత్మస్తుతి చేయవు. COLTel 125.1

క్రీస్తు మాత్రమే మన సమృద్ధి అని మనం తెలుసుకుంటాం అపొస్తలుడు శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును”. రోమా 7:18.“అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరిదేనియందును అతిశయించుట నాకు దూరమగును గాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడియున్నాము”.గల 6:14 COLTel 125.2

ఈ అనుభవానికి అనుగుణంగా ఈ ఆదేశం వస్తున్నది. “భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే”. ఫిలి 2:12,13. దేవుడు తన వాగ్దానాల్ని నెరవేర్చలేడని, ఆయన ఓర్పు సన్నగిల్లుతందని లేక ఆయన కృప కొరవడుతుందని మీరు భయపడాల్సిం దని దేవుడు ఆదేశించటంలేదు.మీ చిత్తం క్రీస్తు చిత్తానికి లొంగి ఉండదని, మీ అనువంశిక గుణలక్షణాలు, నేర్చుకున్న అలవాట్లు మిమ్మల్ని అదుపు చేస్తాయోమోనని భయపడండి. “మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే”. మీ ఆత్మకూ ఆగొప్ప కార్యకర్తకూ మధ్య స్వార్ధం ప్రవేశిస్తుందేమోనని భయపడండి, దేవుడు మీ ద్వారా సాధించాలని కోరుకుంటున్న ఉద్దేశాన్ని మొండివైఖరి మసకబార్చుతుందోమేనని భయపడండి. స్వీయ శక్తిని నమ్ముకోవటానికి భయపడండి. మీ చేతిని క్రీస్తు చేతిలో నుంచి వెనక్కి తీసుకొని జీవిత మార్గాన ఆయన సముఖం లేకుండా నడవటానికి ప్రయత్నించటానికి భయపడండి. COLTel 125.3

గర్వం స్వయం సమృద్ధిని ప్రోత్సహించే సమస్తాన్ని మనం విసర్జించాలి. పొగడ్తను ప్రశంసను ఇవ్వటంలో గాని పొందటంలో గాని మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ స్తుతి సాతాను చేసేపని అతడు ముఖస్తుతి నిందారోపణ, ఖండన అదే పనిగా చేస్తాడు. ఇలా ఆత్మను నాశనం చెయ్యటానికి చూస్తాడు. మనుషుల్ని పొగడేవారు సాతాను ప్రతినిధులు, క్రీస్తు పనిచేసే సేవకులు తమ్మును తాము స్తుతించుకోకుండా జాగ్రత్తపడాలి. స్వార్ధం దృష్టికి రాకుండా చూసుకోవలి. క్రీస్తును మాత్రమే స్తుతించాలి. ఘనపర్చాలి. “మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాని” పై (ప్రక 1:6) ప్రతీ నేత్రం, ప్రతీ హృదయం నుంచి స్తుతి కేంద్రీకృతమౌనుగాక. COLTel 126.1

ఏ జీవితంలో దైవభీతి ఉంటుందో అది చింత విచారాల జీవితంగా పరణమించదు. క్రీస్తు లేని జీవితమే ముఖములో విచారం నింపుతుంది. ఆ జీవితం దుంఖమయమౌతుంది. ఆత్మాభిమానం స్వార్ద ప్రేమతో నిండినవారు క్రీస్తుతో సజీవమైన, వ్యక్తిగతమైన ఐక్యత అవసరాన్ని గుర్తించరు. క్రీస్తు అనే బండ మీద పడిన హృదయం తన సంపూర్ణతను గురించి అతిశయిస్తుంది. మనుష్యులు హుందాతనం గల మతాన్ని కోరుకుంటారు. తమ గుణ లక్షణాలకు సరిపోయేంత విశాలమైన మార్గములో నడవాలని అభిలషిస్తారు. తమ స్వార్ధ ప్రేమ, ప్రజాదరణ పొగడ్త పట్ల వారి మక్కువ. వారి హృదయాల్లో నుంచి రక్షకుణ్ని మినహా యిస్తాయి. ఆయన లేకపోవటమే వారి చింతలకు దు:ఖానికి కారణం. అయితే ఆత్మలో క్రీస్తు నివసిస్తుంటే ఆనందం ఊటలా ఊరుతుంది. ఎందుకంటే ఆయన్ని స్వీకరించేవారందరికి దైవ వాక్యంలోని మూలపదం ఆనందించటం. COLTel 126.2

“పరిశుద్దుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నేను మ హెన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీనమనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను”. యెష 57:15. COLTel 127.1

మోషే బండ సందులో దిగి ఉన్నప్పుడే దేవుని మహిమను చూసాడు. మనం బండలో దిగి ఉన్నప్పుడే క్రీస్తు మనల్ని గాయపడ్డ తన చేతితో కప్పుతాడు. ప్రభువు తన సేవకులకు ఏమి చెప్పుతాడో మనం వినగలుగుతం. తన్నుతాను మోషేకి కనపర్చుకున్నలాగ దేవుడు “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై... వేయి వేల మందికి కృప చూపుచు, దోషమును అపరాధమును పాపమున క్షమించుచు”మనకు కూడా కనిపిస్తాడు. నిర్గ 34:65 COLTel 127.2

విమోచన కృషిలో మానవుడి ఊహకందని పరిణామాలు ఇమిడి ఉన్నాయి. “దేవుడు ప్రేమించువారి కొరకు ఏమి స్థిరపరచెనో అవి కంటికి కనపడలేదు. చెవికి వినపడలేదు. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు”.1 కొరి 2:9 క్రీస్తు శక్తి వల్ల పాపి ఎత్తబడి ఉన్న సిలువను సమీపించి దాని ముందు సాగిలపడినప్పుడు. ఒక నూతన సృష్టిచోటు చేసుకుంటుంది. అతడు ఒక నూతన హృదయం పొందుతాడు. అతడు క్రీస్తులో ఒక నూతనజీవి అవుతాడు.అతడికి పరిశుద్ధత ఇవ్వాల్సిందే “యేసు నందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడు” దేవుడే. రోమా 8:30 పాపం వల్ల గొప్ప అవమానం భ్రష్టత సంభవించినా విమోచక ప్రేమ ద్వారా మనం పొందబోయే గౌరవం ఔన్నత్యం ఇంకెంతో ఉన్నతంగా ఉంటాయి. దైవ స్వరూపాన్ని సాధించటానిక కృషి చేసే మనుషులికి దేవుడు పరలోక ఐశ్వర్యం ఇస్తాడు. అది సమున్నత శక్తి. అది ఎన్నడూ పడిపోని దేవ దూతలకన్నా ఉన్నత స్థానంలో వారిని పెడుతుంది. COLTel 127.3

“ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపడినవాడును జనులకు అసహ్యుడును..... సెలవిచ్చుచున్నాడు... యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశు ద్రదేవుడు నిన్ను ఏర్పరచుకొననెనియు రాజులు గ్రహించి లేరు'. యెష 49:7. COLTel 128.1

“తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును”. COLTel 128.2