క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

16/61

దాచబడ్డ తీరు

సువార్తను దాచబడ్డ ధనరాశులుగా సూచించటం జరుగుతుంది. తమ దృష్టిలో తాము జ్ఞానులమని పరిగణించుకునేవారు, వ్యర్థ తత్వ భోదన వల్ల ఉప్పొంగి విర్రవీగేవారు రక్షణ ప్రణాళిక రమ్యతను శక్తిని మర్మాన్ని గ్రహించలేరు. దాచబడ్డ ఈ వాక్య ధనాన్ని అనేకులు కళ్ళుండి చూడరు. చెవులుండి వినరు, జ్ఞానముండి గ్రహించరు. COLTel 74.2

ధనం దాచి ఉంచిన స్థలం పై ఒక మనిషి నడిచి వెళ్ళవచ్చు. బాగా అలసి ఉన్న తరుణంలో అతడు కింద వేళలో ధనం దాచబడి ఉన్న చెట్లు మొదలు వద్ద కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. యూదుల విషయంలో ఇలాగే జరిగింది. బంగారు విధుల్ని అప్పగించినట్లు దేవుడు హెబ్రీ ప్రజలకి సత్యాన్ని అప్పగించాడు. యూదు మత వ్యవస్థను దేవుని సమ్మతితో క్రీస్తేకము స్థాపించాడు. విమోచన మహత్తర సత్యాల్ని ఛాయా రూపకాలు చిహ్నాల ద్వారా వ్యక్తం చెయ్యటం జరిగింది. అయినా ఆ ఛాయా రూపకాలు చిహ్నాలు ఎవర్ని సూచించాయో ఆ క్రీస్తు వచ్చినపుడు ఆయన్ని యూదులు గుర్తించలేదు. వారి చేతుల్లో దేవుని వాక్యం ఉన్నది. కాని తరతరాలుగా వస్తున్న సాంప్రదాయలు లేఖనాలకి మానవులు చెబుతున్న వాఖ్యానాలు క్రీస్తును గూర్చిన సత్యాన్ని మరుగుపర్చాయి. పరిశుద్ధ లేఖనాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని వారు గ్రహించలేకపోయారు. సమస్త జ్ఞాన ధానాగారం తెరచే ఉంది గాని అది వారికి తెలియదు. COLTel 74.3

దేవుడు తన సత్యాన్ని మనుషులికి కనిపించకుండా దాచడు. తమ సొంత కార్యాల వల్ల వారు దాన్ని చూడలేకపోతున్నారు. మెస్సీయాను తానేనని క్రీస్తు యూదులికి కోకొల్లలుగా నిదరన్ననాన్నిచ్చాడు. అయితే ఆయన భోదన వారి జీవితాల్లో నిర్దిష్టమైన మార్పును కోరింది క్రీస్తుని స్వీకరించినట్లయితే తమ నీతి సూత్రాల్ని సంప్రదాయాల్ని తమ స్వార్ధ భక్తిహీన ఆచారాల్ని విడిచి పెట్టాల్సి వస్తుందని వారు గ్రహించారు. మార్పులేని, నిత్య సత్యాన్ని అంగీకరించటానికి గొప్ప త్యాగం అవసరమయ్యింది. కనుక క్రీస్తు పై విశ్వాసం స్థాపించటానికి దేవుడిచ్చిన తిరుగులేని నిదర్శనాన్ని వారు తోసి పుచ్చారు. పాత నిబంధన లేఖనాల్ని విశ్వసిస్తున్నట్లు వారు చెప్పుకున్నారు. అయినా క్రీస్తు జీవితానికి ఆయన ప్రవర్తనకు సంబంధించి అందులో ఉన్న సాక్ష్యాన్ని నిరాకరించారు. క్రైస్తవులు కాకూడదని అయితే తమ పూర్వాభిప్రాయాల్ని విడిచి పెట్టాల్సి వస్తుందని భావించి, తమకు మారుమనసు కలుగుతుందేమోనని భయపడ్డారు. మార్గం, సత్యం, జీవం అయిన సువార్త ఐశ్వర్యం వారి మధ్యనే ఉన్నది. కాని దేవుడు ఇవ్వగల ఆ అత్యుత్తమ వరాన్ని వారు విసర్జించారు. COLTel 75.1

“అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసుముంచిరి. గాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోనలేదు” అని చదువుతున్నాం యోహా 12:42 వారు విశ్వసించారు. యేసు దేవుని కుమారుడని నమ్మారు. కాని ఆయన్ని అంగీకరించడం వారి ఆశలకు ఆకాంక్షలకు అనుకూలంగా లేదు. పరలోక ధనాన్ని సంపాదించగలిగే విశ్వాసం వారికి లేదు. వారు లోక భాగ్యాన్ని వెదకుతున్నారు. COLTel 75.2

మనుషులు నేడు ఐహిక సిరుల కోసం ఆత్రంగా వెదకుతున్నాడు. వారి మనసులు స్వార్ధ కొర్కెలు అత్యాశతో కూడిన ఆలోచనలతో నిండి ఉన్నాయి. లోక సపందల కోసం గౌరవం, అధికారం కోసం వారు మనుష్యులు సూక్తులు సంప్రదాయాలు నిబంధనల్ని దైవ శాసనాలకి పైగా ఉంచుతున్నారు. వారికి ఆయన వాక్య సిరులు కనిపించవు. వారికి కనపడుకుండా దాచబడ్డాయి. COLTel 75.3

“ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని అతనికి వెడ్డితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు”.1 కొరి. 2:14 COLTel 76.1

“మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగు చేయబడియున్నది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడు నిమిత్తము, ఈ యుగ సంబంధమైనదేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను”. 2 కొరి 4 శ3,4 COLTel 76.2