క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

10/61

3—మొదట మొలకను తరువాత వెన్నును

ఆధారం మార్కు 4:26-29

విత్తువాని ఉపమానం ఎన్నో ప్రశ్నల్ని లేవదీసింది. క్రీస్తు లోక రాజ్యాన్ని స్థాపించబోవటం లేదని అక్కడ సమావేశమైన శ్రోతల్లో కొందరు గ్రహించారు. అనేకులు తెలుసుకోవాలని అత్రుతగా ఉన్నారు. వారు తికమకలు పడటం చూసి క్రీస్తు ఇతర సాదృశ్యాలు వినియోగిస్తూ లోక రాజ్యం గురించి వారి ఆలోచనలను మళ్లించి ఆత్మలో దేవునికృప చేసే పని పైకి వారి తలంపుల్ని తిప్పటానికి చూసాడు. COLTel 41.1

“ఒక మనష్యుడు భూమిలో విత్తనము చల్లి, రాత్రంబంగళ్ళు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదటి మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోత కాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను”. COLTel 41.2

“పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని.... కొడవలి పెట్టి కోయును”. సేద్యగాడు ఇంకెవరో కాదు క్రీస్తే. ఆ మా చివరి దినాన భూమి పంటను కోసేవాడు ఆయనే. అయితే విత్తువాడు క్రీస్తు స్థానంలో సేవ చేసేవాడిని సూచిస్తున్నాడు. ఆ విత్తనం “వానికి తెలియని రీతిగా మొలచి” నట్లు సూచించడం జరిగింది. ఇది దైవ కుమారుని విషయంలో వాస్తవం కాదు. క్రీస్తు తన బాధ్యత నిర్వహణలో నిద్రపోడు. ఆయన రాత్రింబంగళ్ళు మొలకువగా ఉంటాడు. విత్తనం ఎలా పెరుగుతుందో ఆయనకు తెలుసు. COLTel 41.3

విత్తనాన్ని గూర్చిన ఉపమానం దేవుడు ప్రకృతిలో పని చేస్తున్నాడని వెల్లడి చేస్తున్నది. మొలకెత్తే నియమం విత్తనంలోనే నిక్షిప్తమై ఉంది. దాన్ని దేవుడు విత్తనంలో పెట్టాడు. అయినా విత్తనానికి దానంతట అదే మొలచే శక్తి లేదు. విత్తనం మొలవటానికి మానవడు నిర్వహించాల్సిన పాత్ర ఉంది. అతడు నేలను సిద్ధపర్చి సారవంతం చేసి విత్తనం చల్లాలి. అతడు పొలాల్ని దున్నాలి. కాని అతడు చెయ్యగలిగిందేమీ లేదు. మానవడు ఈ శక్తి మానవుడి జ్ఞానం ఎంతటినైనా విత్తనాన్ని మొలకెత్తేటట్లు చేయ్యలేవు. మానవడు తన శక్తి మేరకు పనిచేసినా, విత్తటానికి కొయ్యటానికి ఆశ్చర్యకరమైన తన సర్వశక్తికి అనుసంధానపర్చిన ఆ ప్రభువు మీద ఆధారపడాల్సిందే. COLTel 41.4

విత్తనంలో జీవం ఉంది. నేలలో శక్తి ఉంది. అయినా అనంత శక్తి రాత్రింబగళ్లు పనిచేస్తునే గాని విత్తనం ఫలించదు. ఎండిన పొలాలికి తేమ నివ్వటానికి వర్షం కురవాలి, సూర్యుడు వేడినివ్వాలి. మట్టిలో ఉన్న విత్తనానికి విద్యుత్తు సరఫరా అవ్వాలి. సృష్టికర్త పెట్టిన జీవాన్ని ఆయనే సరఫరా చేయగలడు. ప్రతి విత్తనం మొలవడం ప్రతీ మొక్క పెరగటం దేవుని శక్తి వల్లే జరగుతున్నది. COLTel 42.1

“భూమి మొలక మొలిపించునట్లుగా తోటలో విత్తబడిన వాటికి అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును”. యెష 61:11 ప్రకృతి విత్తటం సంబంధమైన ఎలాగో ఆధ్యాత్మిక సంబంధమైన విత్తటంలోనూ అలాగే. సత్య ప్రభోదకుడు హృదయమనే నేలను సిద్ధపర్చటానికి ప్రయత్నించాలి. విత్తనం చాల్లాలి. అయితే జీవాన్ని ఉత్పత్తి చేసే శక్తి దేవుని వద్ద నుండి వస్తుంది. మానవ కృషికి ఒక పరిమితి ఉంది. దానికి మించి అది వ్యర్ధం. మనం వాక్యం బోధించాల్సి ఉండగా ఆత్మను ఉజ్జీవింపజేసి నీతిని స్తోత్రాన్ని పుట్టించే శక్తి మనకు లేదు. వాక్యం బోధించటంలో మానవ శక్తిని మించిన శక్తి పనిచేస్తూ ఉండాలి. ఆత్మను నిత్యజీవానికి నవీనం చేయ్యటానికి దేవుని ఆత్మ ద్వారా మాత్రమే వాక్యం సజీవం శక్తిమంతం అవుతుంది. క్రీస్తు తన శిష్యులకు ఈ విషయాన్ని నొక్కి చెప్పటానికి ప్రయత్నించాడు. తమ పరిచర్యలు తమకు జయం సమకూర్చేది తమలో ఉన్నది తనకున్నది ఏది కాదని తన వాక్యానికి సమర్ధతనిచ్చేది అద్భుతాలు చేసే తన శక్తి అని బోధించాడు. COLTel 42.2

విత్తువాడు చేసే పని విశ్వాసం నిర్వహించే పని. విత్తనం మొలకెత్తటం పెరగటంలోని మర్మాన్ని అతడు అవగాహన చేసుకోలేడు. కాని మొక్కలు పెరగటానికి వృద్ధి చెందటానికి దేవుడు వినియోగించే సాధనాల పై అతడికి నమ్మకముంది. తన విత్తనాల్ని భూమిలో చల్లటంలో అతడు తన కుటుంబానికి ఆహారం సమకూర్చే విలువైన ధాన్యాన్ని పారేస్తున్నట్లు కనిపిస్తుంది. కాని అతడు ప్రస్తుత ప్రయోజనాన్ని భవిష్యత్తులో పెద్ద లాభం పొందటానికి వదులకుంటున్నాడు. అనేక రెట్లు పంటకోస్తానన్న అశాభావంతో అతడు విత్తనాలు చల్లుతాడు. అలాగే క్రీస్తు సేవకులు తాము విత్తే విత్తనం నుంచి పంటను ఆశించి సేవ చేయ్యాలి. COLTel 43.1

మంచి విత్తనం చల్లని, స్వార్ధ పూరిత, ఐహిక హృదయంలో ఎవరు గుర్తించకుండా, వేర్లు తొడుగుతుందన్న నిదర్శనం లేకుండా కొంతకాలం పడి ఉండవచ్చు. కాని అనంతరము ఆత్మపై పరిశుద్దాత్మ ఊపిరి ఊదగా భూమిలో దాగి ఉన్న విత్తనం మొలకెత్తి చివరికి దేవుని మహిమపర్చే లాభాలు ఫలిస్తుంది. మన జీవిత కర్తవ్యంలో అది సఫలమౌతుందో ఇది సఫలమౌ తుందో మనం ఎరుగం.ఇది మనం పరిష్కరించాల్సిన సమస్య కాదు! మన పనిని మనం చేసి ఫలితాల్ని ప్రభువుకి విడిచి పెట్టాలి. “ఉదయమందు విత్తనమును విత్తుము,. అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము”యెషయా 11:6 “భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోత కాలమును... ఉండకమానవు” అని దేవుని మహా నిబంధన ప్రకటిస్తున్నది. అది 8:22ఈ వాగ్దానంపై నమ్మకముంచి వ్యవసాయదారుడు దున్నుతాడు విత్తువాడు. “అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్పలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును ” (యెష 55:1) అన్న వాగ్దానాన్ని విశ్వసించి ఆధ్మాత్మిక విత్తటంలో మనం విశ్వాసంతో పనిచేయ్యాలి. “పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోయి విత్తువాడు సంతోష గానము చేయుచూ పనలు మోసికొనివచ్చును.” కీర్తన 126:6 COLTel 43.2

విత్తనం మొలకెత్తటం ఆధ్మాత్మిక జీవితారంభాన్ని సూచిస్తున్నది. మొక్క పెరుగుదల క్రైస్తవ పెరుగుదలకు చక్కని ప్రకృతిలో ఎలాగు కృప ప్రతిరూపం విలీనం అలాగే. పెరుగుదల లేకుండా జీవం సాధ్యం కాదు. మొక్క పెరగాలి లేకుంటే లేదా చావాలి. మొక్క పెరుగుదల కనిపించకుండా నెమ్మదిగా గాని నిత్యం కొనసాగేటట్లు క్రైస్తవ జీవిత పెరుగుదల కొనసాగాలి. పెరుగుదల ప్రతీ స్థాయిలోను మన జీవితం పరిపూర్ణంగా ఉండవచ్చు. అయినా మనపట్ల దేవుని సంకల్పం నెరవేరితే మనం నిత్యం వృద్ధి చెందుతాం.పరిశుద్దీకరణ జీవితకాలమంతా కొనసాగే క్రియ. మన అవకాశాలు పెరిగే కొద్ది మన అనుభవం విస్తృతమవుతుంది. మన జ్ఞానం వృద్ధి చెందుతుంది. బాధ్యత వహించటానికి మనం శక్తిమంతువులతాం. మన పరిమితి మన ఆదిక్యత నిష్పత్తిలో ఉంటుంది. COLTel 44.1

తన ప్రాణం నిలుపుకోవటటానికి తనలో దేవుడు సమకూర్చిన దాన్ని స్వీకరించటం ద్వారా మొక్క పెరుగుతుంది. భూమిలోకి వేరులు తన్నుతుంది. సూర్యరశ్మిని మంచును వర్షాన్ని తీసుకుంటుంది. ప్రాణన్నిచ్చే పదార్థాల్ని గాలి నుండి పొందుతుంది. ఆ రీతిగానే క్రైస్తవుడు దేవుడు సమకూర్చిన సాధనాల సహకారంతో పెరుగుదల సంపాధించాల్సి ఉన్నాడు. మన అసహాయతను గుర్తుంచుకొని మనకు కలిగే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి అనుభవాన్ని సంపాదించుకోవాలి. మొక్క వేరులు నేలలోకి లోతుగా వెళ్లిన మాదిరిగానే మనం క్రీస్తులో లోతుగా వేరుపారాలి. మొక్క సూర్యరశ్మిని, మంచును, వర్షాధారాల్ని స్వీకరించేటట్లు మన హృదయం పరిశుద్దాత్మకు తెరవాలి. ఈ పని “శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను” జెక 4:6 COLTel 44.2

మనం మన మనసుల్ని క్రీస్తు పై నిలిపితే “వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హో షే 6:3 నీతి సూర్యుడుగా ఆయన “రెక్కలు ఆరోగ్యము కలుగజేయును” ఆయన మనపై ఉదయిస్తాడు. మలా 4:2 “తామరపుష్పము పెరుగునట్లు” పెరుగుతాం. మనం “ధాన్యము వలె... తిరిగి” మొలుస్తాం. హోషే 14:5,7. మన వ్యక్తిగత రక్షకుడుగా నిత్యం క్రీస్తు మీద ఆధారపడటం ద్వారా మన శిరస్సు అయిన ఆయనలా అన్ని విషయాల్లో ను పెరుగుతూ ఉంటాము. COLTel 44.3

గోధుమ “మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత ముదురు గింజలను” పెంపోదింస్తుంది. విత్తనం విత్తటంలోను మొక్కను పెంచటంలోను వ్యవసాయదారుడి ఉద్దేశ్యం ధాన్యాన్ని ఉత్పత్తి చెయ్యటం. ఆకలిగా ఉన్నవారికి ఆహారం ఇవ్వాలని భవిష్యత్తులో పంటకు విత్తనాలు సమకూర్చుకోవాలని అతడు ఆకాంక్షిస్తాడు. అలాగే పరలోక వ్యవసాయకుడు తన పరిచర్యకు తన త్యాగానికి ప్రతిఫలం కోసం ఎదురు చూస్తాడు. మనుష్యుల హృదయాల్లో తన రూపాన్ని పునరుత్పత్తి చెయ్యటానికి క్రీస్తు పాటుపడుతున్నాడు. క్రైస్తవ జీవిత లక్ష్యం ఫలాలు ఫలించటం. అంటే క్రీస్తు ప్రవర్తనను విశ్వాసిలో పునరుత్పత్తి చేయ్యటం, తద్వారా ఆ ప్రవర్తన ఇతరుల్లో పునరుత్పత్తి కావటం. COLTel 45.1

మొక్క మొలకెత్తి పెరిగి పంట పండటం తన కోసం కాదు. కాని “విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ” ఇవ్వటానికి యెష 55:10 అలాగే ఎవరు తమ కోసమే తాము నివసించకూడదు. క్రైస్తవుడు ఇతర ఆత్మల రక్షణ నిమిత్తం లోకంలో క్రీస్తుకి రాయబారిగా ఉన్నాడు. COLTel 45.2

స్వార్ధ ప్రయోజనమే తన లోకంగా ఉన్న జీవితంలో పెరుగుదల గాని ఫలాలు ఫలించడం గాని ఉండదు. మీరు క్రీస్తును మీ వ్యక్తిగత రక్షకుడుగా స్వీకరించినట్లయితే మిమ్మల్ని మీరు మర్చిపోయి ఇతరులికి చెయ్యూతన్వివటానికి ప్రయత్నించాలి. క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడాలి. ఆయన దయాళుత్వం గురించి ఇతరులకి చెప్పాలి. ప్రతి విధిని నిర్వర్తించాలి. ఆత్మల విషయమై హృదయ భారం కలిగి ఉండాలి. నశించిన ఆత్మల్ని రక్షించటానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. మీరు క్రీస్తు ఆత్మను పొందే కొద్ది ఇతరుల పట్ల స్వార్ధరహిత ప్రేమ, సేవా స్పూర్తి మీరు పెరుగుతారు ఫలాలు ఫలిస్తారు. పరిశుద్దాత్మ చెందిన కృపలు మీ ప్రవర్తనలో పరిణితి చెందుతాయి. మీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. మీ నమ్మకాలు ప్రగాఢమౌతాయి. మీ ప్రేమ పరిపూర్ణమౌతుంది. పవిత్రమైన, ఉదాత్తమైన యోగ్యమైన అన్ని విషయాల్లోను మీరు క్రీస్తును పోలి ఉంటారు. COLTel 45.3

“ఆత్మ ఫలమేమనగా, ప్రేమ సంతోషము, సమాధానము దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము,. విశ్వాసము, సాత్వికము ఆశనిగ్రహాము|| గలతి 5:22,23 ఈ ఫలములు ఎన్నటికి నశించవు గాని దాని వంటి గుణాల పంటనే పండి నిత్య జీవానికి నడిపిస్తుంది. COLTel 46.1

‘పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టిన కోత కోయును”. తన సంఘములో తన రూపం ప్రదర్శితమవ్వటానికి క్రీస్తు ఆశతో ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు ప్రవర్తన తన ప్రజల్లో సంపూర్ణంగా పునరుత్పత్తి అయినప్పుడు వారిని తన ప్రజలుగా పొందటానికి ఆయన వస్తాడు. COLTel 46.2

మన ప్రభువైన యేసు క్రీస్తు రాకకు ఎదరు చూడటమే కాదు దాన్ని వేగవంతం చేయడం ప్రతీ క్రైస్తవుడికి ఉన్న ఆధిక్యత (2 పేతు 3:2 మర్జిన్) ఆయన నామం ధరించిన వారందరూ ఆయనకు మహిమ కలిగే రీతిగా ఫలాలు ఫలిస్తుంటే ఎంత త్వరగా సువార్త విత్తనం విత్తటం జరుగుతుంది. చివరి పంట త్వరగా పక్వమౌతుంది. ప్రశస్తమైన పంటను సమకూర్చటానికి క్రీస్తు వస్తాడు. COLTel 46.3