క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

42/61

24—పెండ్లి వస్త్రం లేకుండా

ఆధారము : మత్తయి 22:1-4

పెండ్లి వస్త్రము ఉపమానం తీవ్ర పర్యవసానాలు గల పాఠాన్ని మన ముందుంచుతున్నది. వివాహం మానవత్వం దైవత్వం సంయోగాన్ని సూచిస్తుంది. పెండ్లి వస్త్రం పెండ్లికి హాజరయ్యే అతిధులు పాత్రులుగా గుర్తింపు పొందేందుకు అందరూ కలిగి ఉండాలల్సిన ప్రవర్తన సూచిస్తుంది. COLTel 261.1

గొప్ప విందు ఉపమానంలో ఈ ఉపమానంలో సువార్త ఆహ్వాన న్నందించటం యూద ప్రజలు దాన్ని నిరకరించటం, అన్వజనులికి కృప పిలుపునిష్టం సూచించబడుతున్నాయి. అయితే ఆహ్వానాన్ని నిరకరించే వారికి తీవ్ర పరాభవాన్ని మరింత భయంకర శిక్షను ఈ ఉపమానం సూచిస్తుంది. విందుకి పిలుపు రాజు పంపిన ఆహ్వానం, ఆహ్వానం, ఆజ్ఞాపించే శక్తి గల వ్యక్తి నుంచి వస్తున్నది. అది గొప్ప గౌరవాన్ని ఇస్తుంది. అయినా ఆగౌరవాన్ని అభినందించలేదు. రాజు అధికారిన్ని తృణీకరించటం జరిగింది. గృహ యాజమాని ఆహ్వానం పట్ల ఉదాసీనత చోటు చేసుకోగా, రాజు ఆహ్వానం విషయంలో పరాభవం హత్య చోటుచేసుకున్నాయి. అతడి సేవకుల్ని అవహేళన చేసి, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి చంపారు COLTel 261.2

గృహ యజామానుడి తన ఆహ్వానాన్ని తృణీకరించటాన్ని చూసి దాగి ఉన్న మనషుల్లో ఎవరూ విందులో పాల్గొకూడదని ప్రకటించాడు. కాగా రాజు ఆహ్వానాన్ని నిరాకరించినవారికి ఆయన సముఖము నుంచి విందు నుంచి బహిష్కృతి మాత్రమే కాదు ఇంకా ఎక్కువే జరిగింది. అతడు “తన దండ్లను పంపి, ఆ నరహంతుకులను సంహరించి, వారి పట్టణమును తగులబెట్టించెను”. COLTel 261.3

రెండు ఉపమానాల్నోలు అతిథులతో విందు ఏర్పాటయ్యింది. కాని రెండో దానిలో విందుకు హాజరయ్యే వారందరూ చేయాల్సిన సిద్ధబాటు ఒకటున్నది. ఈ సిద్ధబాటును చేసుకొనవారు బహిస్కరించబడ్డాయి. “రాజు.. చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యెకని చూచి - స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను. అంతట రాజు - వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును” అన్నాడు. COLTel 261.4

విందుకి పిలుపుని క్రీస్తు శిష్యులు ఇచ్చారు. మన రక్షకుడు పన్నెండు మందిని ఆ తరువాత డెబ్బయిమందిని పంపాడు. వారు దేవుని రాజ్యం సమీపంగా ఉందని ప్రజలు మారుమనసు పొంది సువార్తను విశ్వసిం చాల్సిందని బోధిస్తూ వెళ్ళారు. ఆ పిలుపుకు స్పందించిన వారు లేరు. విందుకి హాజరు కావలసినదిగా ఆహ్వానం పొందినవారు రాలేదు. అతడు అనంతరం “ఇదిగో నా విందు సిద్ధపర్చియున్నాను. ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని “చెప్పటానికి తన సేవకుల్ని పంపాడు. క్రీస్తు పునరుత్థానం తర్వత యూదులకు అందించి సందేశం ఇదే. అయితే దేవుని ప్రతిష్ఠిత జనముగా తమ్మును తాము పరిగణించుకునే ఆ జాతి పరిశుద్దాత్మ శక్తి ద్వారా తమకు వచ్చిన సువార్తను నిరాకరించారు. అనేకులు ధీక్కార స్వభావంతో తిరస్కరించారు. ఇతరులు రక్షణ అన్నమాట వినగానే మహిమ ప్రభువుని నిరాకరించినందుకు క్షమాపణ గురించి వినగానే ఆ వర్తమాన ప్రబోధకులపై కారాలు మిరియాలు నూరారు, విరుచుకుపడ్డారు “గొప్ప హింస”కలిగింది.అ.కా 8:1 అనేకమంది పరుషులు స్త్రీలు చెరసాల పాలయ్యారు. ప్రభువు సేవకుల్లో కొందరు స్తెఫను యాకోబు వంటివారు దారుణ హత్యకు గురియ్యారు. COLTel 262.1

ఈవిధంగా యూద ప్రజలు దేవుని కృపను నిరాకరించారు. ఫలితాన్ని క్రీస్తు ఈ ఉపమానంలో చెప్పాడు. రాజు తన “దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణమును తగల బెట్టించెను”. ప్రకటితమైన తీర్పు యెరూషలేము విధ్వంసములోను, యూదు ప్రజలు ఆయా భూబాగాలికి చెదరగొట్టబడటంలోను నెరవేరింది. COLTel 262.2

విందుకు మూడో పిలుపు అన్యజనులకి సువార్తను అందించటాన్ని సూచిస్తుంది. రాజన్నాడు “పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రుల కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని పెండ్లి విందుకు పిలువుడి”. COLTel 262.3

రాజమార్గాలకు వెళ్ళిన సేవకులు “చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనిపించిన వారందిరిని పోగు చేసిరి”. అది మిశ్రమ సమూహం. అందులో కొందరికి విందు యజమానిపట్ల ఉన్న అభిమానం కన్నా ఎక్కువేమికాదు. ముందు ఆహ్వానించబడ్డ తరగతి వారు రాజు విందుకు హాజరవ్వాటానికి గాను లౌకికమైన ప్రయోజనాన్ని త్యాగం చెయ్యలేమని భావించారు. వారు విందు పదార్థాన్ని భుజించటానికి వచ్చేరేగాని రాజును గౌరవించి కాదు. COLTel 263.1

అతిథుల్ని చూడటానికి రాజు లోపలికి వచ్చినప్పుడు అందరి వాస్తవిక ప్రవర్తన వెల్లడయ్యింది. విందుకు వచ్చిన అతిథులందరికి పెండ్లి వస్త్రం ఇవ్వటం జరిగింది. ఈ వస్త్రం రాజు ఇచ్చిన కానుక. ఆవస్త్రాన్ని ధరించటం ద్వారా అతిథులు విందు యాజమాని పట్ల తమ గౌరవాన్ని ప్రదర్శించారు. అయితే ఒక అతిథి తన సామాన్య పౌరుడి దుస్తులు ధరించి విందుకు వచ్చాడు. అతడు రాజు కోరిన సిద్ధపాటు విస్మరించాడు. ఎంతో ఖర్చు పెట్టి తమ కోసం తయారు చేసిన వ స్త్రం ధరించడం అతడికి చిన్నతనమని పించింది. ఈ రీతిగా అతడు తన రాజుని పరాభవించాడు. “పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితిని” అన్నరాజు ప్రశ్నకు అతడు జవాబు చెప్పలేకపోయాడు. అతడు ఆత్మ నిందితుడుగా నిలబడ్డాడు. అప్పుడు రాజు “వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసి వేయుడి” అన్నాడు. COLTel 263.2

విందులో రాజు అతిధుల్ని పరీక్షించటం తీర్పు దృశ్యాన్ని సూచిస్తున్నది. సువార్త విందులో ఉన్న అతిధులు దేవుని సేవ చేస్తున్నట్లు చెప్పుకునే వ్యక్తుల్ని. జీవ గ్రంథములో తమ పేర్లున్న వ్యక్తుల్ని సూచిస్తున్నారు. అయితే క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారందరూ యధార్ధ శిష్యులు కారు. చివరి ప్రతిఫలం ఇవ్వకముందు, నీతిమంతుల వారసత్వంలో పాలు పంచుకోవటానికి ఎవరు పాత్రులో నిర్ణయించటం జరగాలి. ఈ నిర్ణయం క్రీస్తు రెండో రాకకు ముందు జరగాలి. ఎందుచేతనంటే ఆయన వచ్చేటప్పుడు ప్రతిఫలాన్ని తనతో తెస్తాడు. “వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపర్చిన జీతము” తెస్తానంటున్నాడు. ప్రక 22:12 కనుక ఆయన రాకముందు ప్రతీ మనిషి పని స్వభావం నిర్ణయించటం జరగుతుంది. క్రీస్తు అనుచరుల్లో ప్రతివారికి తమ తమ క్రియల చొప్పున ప్రతిఫలం నిర్ణయమై ఉంటుంది. COLTel 263.3

భూమి పై మనుషులు ఇంకా నివసిస్తుండగానే పరలోక ఆస్థానంలో పరిశోధక తీర్పు జరుగుతుంది. ఆయన అనుచరుగా చెప్పుకునే వారి జీవితాలు పరిశీలనకు దేవుని ముందుకి వస్తాయి. పరలోక గ్రంథాల్లోని దాఖలాల ప్రకారం అందరి జీవితాల్ని పరీక్షించం జరుగుతుంది. తమ తమ క్రియ ప్రకారం ప్రతీవారి భవిష్యత్తు నిర్ణయించటం జరుగుతుంది. COLTel 264.1

ఉపమానంలోని పెండ్లి వస్త్రం క్రీస్తు యధార్ధ అనుచరులు కలిగి ఉ ండే పవిత్ర నిష్కళంక ప్రవర్తనను సూచిస్తుంది. అని “ఆమె ధరించు కొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు” (ప్రక19:8) “కళంకమైనను ముడతయైనను” లేనివి (ఎఫె 5:27) వాటిని ప్రభువు సంఘానికి ఇస్తాడు. ఆ సన్నపు నారబట్టలు “పరిశుద్దుల నీతి అంటే ఆయన్ని తమ స్వరక్షకుడుగా స్వీకరించే వారందరికి విశ్వాసం ద్వారా అనుగ్రహింపబడే క్రీస్తు నీతి, ఆయన నిష్కళంక ప్రవర్తన. COLTel 264.2

మన మొదటి తల్లితండ్రుల్ని దేవుడు పరిశుద్ద ఏదెనులో పెట్టినప్పుడు వారు అమాయకత్వాన్ని సూచిన తెల్లిని వస్త్రాన్ని ధరించారు. వారు దేవుని చిత్తానికి అనుగుణంగా నివసించారు. తమ పూర్ణ హృదయముతో పరలోక తండ్రిని ప్రేమించారు. చక్కని, సున్నితమైన దివ్యకాంతి ఆ పరిశుద్ధ జంటను ఆవరించింది. ఈ నీతి వస్త్రం వారి పరలోక నిష్కళంక ఆధ్యాత్మిక వస్త్రాలకు సంకేతం వారు దేవునికి నమ్మకంగా ఉండి ఉంటే ఆ దివ్యకాంతి వారిని ఆవరిస్తే కొనసాగేది. అయితే పాపం ప్రవేశించినప్పుడు దేవునితో వారి సంబంధం తెగిపోయింది. వారిని ఆవరించిన వెలుగు వెళ్ళిపోయింది. దిగంబరులై సిగ్గుతో నిండినవారు ఆ పరిశుద్ద వస్త్రాల సాథనే అంజూరపు ఆకుల్ని కట్టుకుని వాటిని కచ్చాడాలుగా ధరించారు. COLTel 264.3

ఆదామవ్వల అవిధేయత నాటి నుంచి దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్ర మించేవారు ఇదే పని చేస్తున్నారు. తమ అతిక్రమం కలిగించే దిగంబరత్వాన్ని కప్పిపుచ్చుకోవటానికి వారు అంజూరపు ఆకుల్ని కుట్టుకొని కచ్చడాలుగా ధరిస్తున్నారు.వారు తమ సొంతవస్త్రాలు ధరిస్తున్నారు.తమ పను లతో తమ పాపాల్ని కప్పిపుచ్చుకొని దేవునికి హితులుగా ఉండ జూస్తున్నారు. COLTel 264.4

అయితే ఇది వారు చెయ్యలేని పని. పొగొట్టుకున్న నీతి వస్త్రం వెలితిని మానవుడి కృత్యం ఏది పూరించలేదు. గొర్రెపిల్ల పెండ్లి విందులో క్రీస్తుతో కలసి కూర్చునేవారు ఆంజూరపు ఆకుల్ని గాని లౌకిక పౌరుడి దుస్తుల్ని గాని ధరించలేదు. COLTel 265.1

క్రీస్తు ఇచ్చే వస్త్రం మాత్రమే దేవుని సముఖంలో నిలవటానికి మనల్ని పాత్రుల్ని చేస్తుంది. పశ్చాత్తాపపడే విశ్వసించే ప్రతీ ఆత్మపై ఈ వస్త్రాన్ని అనగా తన సొంత నీతి వస్త్రాన్ని క్రీస్తు కప్పుతాడు. “నీ దిసమొల సిగ్గు కనపడుకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమలను కొనుమని.... నీకు బుద్ది చెప్పుచున్నాను” అని ఆయనంటున్నాడు. ప్రక 3:18 COLTel 265.2

పరలోక మగ్గాల పై నేసిన ఈ వస్త్రంలో మానవ యోచన తాలూకు ఒక్క నూలు పోగు కూడా లేదు. క్రీస్తు మానవుడుగా నివసించినప్పుడు పరిపూర్ణ ప్రవర్తనను నిర్మించుకున్నాడు. ఈ ప్రవర్తనను ఆయన మనకి స్తానంటున్నాడు. మన“నీతిక్రియలన్నియు మురికి గుడ్డవలెనాయెను”. యెష 64:6 మనంతట మనం మనకై మనం చేయగలిగినందంతా పాపం వలన అపవిత్రమౌతుంది.“పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్య క్షమాయెను...ఆయనయందు ఏ పాపము లేదు. 8పాపం “అజ్ఞాతి క్రమము”గా నిర్వచించబడుతుంది. 1 యోహా 3:5,4 అయితే ధర్మాశాస్త్రం విధించే ప్రతి వీధికి క్రీస్తు విధేయుడయ్యాడు “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది” అని క్రీస్తు తన్న గూర్చి తాను చెప్పాడు. (కీర్తన 40:8) లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో “నేను నా తండ్రి ఆజ్ఞలను” గైకొన్నాను. అన్నాడు (యోహా 15:10) ప్రతీ మానవుడు దేవుని ఆజ్ఞల్ని ఆచరించటం సాధ్యమని ఆయన తన పరిపూర్ణ విధేయత ద్వారా చూపించాడు. మనల్ని మనం క్రీస్తుకి సమర్పించుకున్నప్పుడు మన హృదయం ఆయన హృదయంతో ఏకమౌతుంది. మన చిత్తం ఆయన చిత్తంతో కలిసిపోతుంది. మన మనసు ఆయన మనసుతో ఒకటమవుతుంది. మన తలంపుల్ని ఆయన చెరపడ్డాడు. మనం ఆయన జీవించినట్లు జీవిస్తాం. ఆయన నీతి వస్త్రం ధరించటమంటే అర్ధం ఇదే. అప్పుడు ప్రభువు మన వంక చూసినప్పుడు అంజూరపు ఆకుల కచ్చడాల్ని కాదు. పాపం దిగంబరత్వాన్నీ వైకల్యాన్ని కాదు. ఆయన నీతి వస్త్రాన్ని యెహోవా ధర్మశాస్త్రానికి సంపూర్ణ విధేయతను చూస్తాడు. COLTel 265.3

వివాహ విందులోని అతిధుల్ని రాజు పరీక్షించాడు. అతడి షరతులికి విధేయులై పెండ్లి వస్త్రాన్ని ధరించనివారు మాత్రమే అంగీకరిచబడ్డారు. సువార్త విందులోని అతిధుల విషయంలోను ఇదే జరుగుతుంది. అందరూ ఆ మహారాజు పరీక్షలో నెగ్గాలి. క్రీస్తు నీతి వస్త్రాన్ని ధరించినవారు మాత్రమే అంగీకరిచబడతారు. నీతి అంటే మంచి చెయ్యటం. అందరూ తమ తమ క్రియల చొప్పున తీర్పు పొందుతారు. మన క్రియలే మన ప్రవర్తనను వెల్లడి చేస్తాయి. విశ్వాసం నిజమయ్యిందో కాదో క్రియలు సూచిస్తాయి. COLTel 266.1

మనం యేసు వంచకుడు కాడని, బైబిలు మతం చమత్కారంగా కల్పించిన కధ కాదని నమ్మటం చాలదు. ఆకాశం క్రింద యేసు నామాన మాత్రమే మానవుడు రక్షణ పొందగలడని మనం నమ్మవచ్చు. అయినా విశ్వాసం ద్వారా ఆయన్ని వ్యక్తిగత రక్షకునిగా మనం స్వీకరించకపోవచ్చు సత్య సిద్ధాంతాన్ని నమ్మటంమాత్రమే చాలదు. క్రీస్తుని విశ్వసిస్తున్నాట్లు చెప్పటం సంఘ పుస్తకాల్లో మన పేర్లు ఎక్కించుకోవటం మాత్రమే చాలదు. “ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మనయందు నిలిచి యున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలిసికొను చున్నాము.”“మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము”. 1 యోహా 3:24 2:3 మారు మనస్సుకి ఇదే నిజమైన నిదర్శనం. మనం ఏమి చెప్పుకున్నా నీతి కార్యాలలో క్రీస్తుని ప్రదర్శించకపోతే అదంతా వ్యర్ధం. COLTel 266.2

సత్యాన్ని హృదయంలో నాటుకోవాల్సి ఉంది. సత్యమే మనసును నియంత్రించి అనురాగాలు మక్కువలు ఇష్టాల్ని క్రమబద్దీకరించాల్సి ఉంది. ప్రవర్తన యావత్తు దైవ వాక్కులతో ముద్రితం కావాలి. దైవ వాక్యంలోని ప్రతీ పొల్లు ప్రతీ సున్న దిన దిన అక్షరాలు కావాలి. COLTel 266.3

దైవ స్వభావంలో ఏ వ్యక్తి పౌలు పొందుతాడో అతడు దేవుని నీతి ప్రామణమైన ఆయన ధర్మశాస్త్రాన్నికి అనుగుణంగా నివసిస్తాడు. ఈ నియామాన్ని బట్టే ఆయన మనషుల క్రియల్ని కొలుస్తాడు. తీర్పులో ప్రవర్తన పరీక్షకు కొలమానం ఇదే. COLTel 266.4

క్రీస్తు మరణం ధర్మశాస్త్రాన్ని రద్దు చేసిందని చెప్పేవారు అనేకమంది. అయితే ఇలా అనటంలో వారు క్రీస్తు మాటల్ని ఖండిస్తున్నారు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెవరేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోతేగాని ధర్మశాస్త్రమంతుయు నెరవేరు వరకు దాని నుండి యొక పొల్లయునను ఒక సున్నయైనను తప్పిపోదు.” మత్త 5:17,18 మానవుడు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యటానికి క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. ధర్మశాస్త్రాన్ని మార్చటం గాని రద్దు చెయ్యటం గాని సాధ్యపడి ఉంటే క్రీస్తు మరణించటం అవసరమయ్యేది కాదు. భూమిపై ఆయన జీవించిన జీవితంలో ఆయన దైవ ధర్మశాస్త్రాన్ని ఘనపర్చి ఆచరించాడు. తన మరణం ద్వారా దాన్ని స్థిరపర్చాడు. ఆయన తన ప్రాణాల్ని బలిగా ఇచ్చింది. దైవ ధర్మశాస్త్రాన్ని నాశనం చెయ్యటానికో లేక ఆ ప్రమాణాన్ని తగ్గించటానికో కాదు కాని న్యాయాన్ని కొనసాగించటానికి ధర్మశాస్త్ర మార్పులేనిదని చూపించటానికి అది నిత్యం చెక్కుచెదరకుండా నిలవటానికి ఆయన మరణించాడు. COLTel 267.1

దేవుని ఆజ్ఞల్ని ఆచరించటం మానవులికి ఆసాధ్యమని సాతను వాదించేవాడు. నిజమే మన స్వశక్తితో మనం ఆల్ని ఆచరించలేం. క్రీస్తు లోకానికి మానవ రూపంలో వచ్చాడు. దేవత్వంలో మానవత్వం కలసినప్పుడు దేవుని ఆజ్ఞల్లో ప్రతి దాన్ని ఆచరించటం సాధ్యమని తన పరిపూర్ణ విధేయత ద్వారా ఆయన నిరూపించాడు. COLTel 267.2

“తన్ను ఎందరంగికరించారో వారందరికి, అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను”.యోహా 1:12 ఈ శక్తి మానవ సాధనం కాదు. అది దేవుని శక్తి. ఒక ఆత్మ క్రీస్తును స్వీకరించినప్పుడు క్రీస్తు జీవితాన్ని జీవించటానికి శక్తిని పొందుతాడు. COLTel 267.3

దేవుడు తన బిడ్డలు పరిపూర్ణులు కావాలని కోరుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రం ఆయన ప్రవర్తనకు నకలు. అది సమస్త ప్రవర్తనకు ప్రామాణికం. తన రాజ్యంలో ఎలాంటి ప్రజలుండాలని దేవుడు కోరుతున్నాడన్న విషయమై ఎలాంటి పొరపాటు లేకుండదేందుకు ఈ అనంత పరిపూర్ణ ప్రమాణాన్ని దేవుడు అందరికి సమర్పిస్తున్నాడు. లోకంలో క్రీస్తు జీవితం దేవుని ధర్మశాస్త్రానికి పరిపూర్ణ వివరణ. దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు ప్రవర్తనలో క్రీస్తు పోలికను సంతరించుకున్నప్పుడు వారు దేవుని ఆజ్ఞలకు విధేయులై నివసిస్తారు. అప్పుడు పరలోక కుటుంబములో సభ్యులుగా ఉండటానికి ప్రభువు వారిని నమ్మగులుగుతాడు. మహిమాన్వితమైన క్రీస్తు నీతిశాస్త్రాన్ని ధరించి వారికి రాజు విందులో స్థానం ఉంటుంది. రక్తంతో కడగబడిన జనసమూహాన్ని కలవటానికి వారికి హక్కు ఉంటుంది. COLTel 267.4

పెండ్లి వస్త్రం లేకుండా విందుకు వచ్చిన వ్యక్తి నేడు ప్రపంచంలో ఉన్న అనేకుల పరిస్థితిని సూచిస్తున్నాడు. వారు క్రైస్తవులమని చెప్పుకుంటారు. సువార్త దీవెనలు ఆధిక్యతలు కావాలంటారు. అయినా ప్రవర్తనలో మార్పు అవసరాన్ని గుర్తించరు. వారు ఎన్నడూ పాపం నివిత్తం పశ్చాత్తాపపడరు. క్రీస్తు తమకు అవసరమని గుర్తించదు. క్రీస్తు విశ్వాసాన్ని కనపర్చరు. పారంపర్యమైన లేక నేర్చకున్న దుష్ప్రవర్తనను ప్రవృత్తులను జయించరు. అయినా తాము మంచివారమని భావిస్తూ క్రీస్తు పై నమ్మక ముంచే బదులు తమ మంచితనం పై తమ యోగ్యతలపై ఆధారపడి ఉ ంటారు. వాక్యం వినేవారు మాత్రమే అయినవారు విందుకు వస్తారు. కాని వారు పెండ్లి వస్త్రం ధరించరు. క్రైస్తవులుగా చెప్పుకునే అనేకమంది మానవ నీతివాదులు మాత్రమే. క్రీస్తుని లోకానికి చూపించటం ద్వారా ఆయన్ని ఘనపర్చేందుకు తమకు శక్తినిచ్చే ఒక వరాన్ని వారు నిరాకరిస్తున్నారు. పరిశుద్దాత్మ సేవ వారికి ఆశ్చర్యకర్యంగా ఉంటుంది. వారు వాక్యానుసార్లు కారు. లోకంలో ఉన్నవారి నుంచి క్రీస్తుతో ఉన్నవారు వేరు చేసే పరలోక నియామలు దాదాపు గుర్తు తెలియని రీతిగా మారిపోయాయి. క్రీస్తు నామమాత్రపు అనుచరులు ఇక ఏమాత్రం ప్రత్యేకమైన, ప్రతిష్టతమైన ప్రజలు కారు. విభజన రేఖ అస్పష్టంగా ఉంది. ఆ ప్రజలులోకానికి, లోకా చారాలికి, సంప్రదాయాలికి, స్వార్ధశలకి దాసులవుతున్నారు. ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి లోకంల సంఘం వద్దకు వెళ్ళాల్సిందిపోయి, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటానికి సంఘం లోకం వద్దకు వెళ్తుంది దినదినం సంఘం లోక పద్దుతులు, ఆచారాలు సంప్రదాయల్లోకి పరిణామం చెందుతున్నది. వీరంతా క్రీస్తు ఆత్మత్యాగ జీవితం జీవించటానికి ససేమిరా అంటూ క్రీస్తు మరణం ద్వారా రక్షణ పొందటానికి ఎదురు చూస్తున్నారు. వారు ఉచిత కృపాసిరులను ప్రస్తుతించి నీతిలా కనిపించే వస్త్రంతో తమ్మును తాము కప్పుకొని, తమ ప్రవర్తనలో లోపాల్ని కప్పిపుచ్చుకోవటానికి చూస్తారు. అయితే దేవుని ఆ మహాదిన వారి ప్రయత్నాలు ఫలించవు. COLTel 268.1

విడిచి పెట్టని ఒక్క పాపాన్ని కూడా క్రీస్తు నీతి కప్పదు. ఒక మనిషి హృదయంలో ధర్మశాస్త్రాన్ని మీరవచ్చు. అయినా అతడు బయటికి కనిపించే ఏ అతిక్రమమమూ చెయ్యకపోతే అతణ్ణి లోకం గొప్ప భక్తుడిగా కొనియాడుతుంది. కాగా దైవ ధర్మశాస్త్రం హృదయరహస్యల్ని చూస్తుంది.. ప్రతీ క్రియకూ దాన్ని నడిపించి ఉద్దేశాల పై తీర్పు వస్తుంది. దేవుని ధర్మశాస్త్ర నియామల ప్రకారం ఏది ఉంటుందో అది మాత్రమే తీర్పులో నిలుస్తుంది. COLTel 269.1

దేవుడు ప్రేమస్వరూపి ఆప్రేమను క్రీస్తుని ఇష్టంలో కనపర్చాడు. “విశ్వసించు ప్రతివాడు ను నశింపక నిత్యజీవము పొందునట్లు ” తన అద్వితీయ కుమారుని” అనుగ్రహించినప్పుడు (యోహాను 3:16) ఆయన పరలోకలమంతటిని ధార పోశాడు. మన శత్రువు మనల్ని ప్రతిఘటించ కుండేందుకు లేక జయించకుండేందుకు పరలోకం నుంచి మనం శక్తిని సామార్థ్యాన్ని పొందవచ్చు. అయితే దేవుని ప్రేమ పాపాన్ని క్షమించటానికి ఆయన్ని నడిపించదు. సాతానులోని పాపాన్ని ఆయన క్షమించలేదు. ఆదాములోని పాపాన్ని లేక కయీనులోని పాపాన్ని ఆయన క్షమించలేదు. ఏ మానవుడిలోని పాపాన్ని ఆయన క్షమించడు. ఆయన మన పాపాల్ని ఉపేక్షించడు లేక మన ప్రవర్తన లోపాల్ని చూసి చూడనట్లుండదు మనం తన నామంలో జయించటానికి ఆయన కనిపెడతున్నాడు. COLTel 269.2

క్రీస్తు ఇచ్చే నీతిని తిరస్కరించేవారు తమను దేవుని కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దే గుణగుణాల్ని నిరకరిస్తున్నారు. పెండ్లి విందులో స్థానం కోసం ఏదిమాత్రమే తమకు యోగ్యతను ఇస్తుందో దాన్ని వారు నిరాకరిస్తున్నారు. COLTel 269.3

ఉపమానంలో ” పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివి”? అని రాజు ప్రశ్నించినప్పుడు, ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ఆ మహా తీర్పునాడు ఇదే జరుగుతుంది. మనుషులు ఇప్పుడు తమ ప్రవర్తన లోపాల్ని ఉపే క్షించవచ్చు ఆదినాన వారు ఏసాకూ చెప్పలేరు. COLTel 269.4

ఈ తరంలోని నామమాత్రపు క్రైస్తవ సంఘాల్ని అతిగా ఘనపర్చటం, అవి గొప్ప అధిక్యతలు పొందటం జరుగుతుంది. ప్రభువు మనకు మరింత ప్రకాశకమానమైన వెలుగులో వెల్లడువతున్నాడు. దేవుని ప్రాచీన ప్రజల తరుణాలు అధిక్యతల కన్నా మన తరుణాలు అధిక్యతలు ఎక్కువ. ఇశ్రాయేలు ప్రజలికి దేవుడిచ్చిన వెలుగు మాత్రమే గాక క్రీస్తు ద్వారా వచ్చిన మహా రక్షణను గూర్చి మరింత నిదర్శనం మనకున్నది. యూదులికి సూచనలు చిహ్నాలుగా ఉన్నది మనకు వాస్తవ రూపంలో ఉన్నది. వారికి పాత నిబంధన చరిత్ర ఉంది. మనకు అదీ ఇంకా కొత్త నిబంధన కూడా ఉన్నాయి. లోకానికి వచ్చిన రక్షకుణ్ణి గురించి, సిలువ వేయబడ్డ రక్షకుణ్ణి గురించి పునరుత్థానుడైన రక్షకుణ్ణి గురించి తెరవబడ్డ యోసేపు సమాది గురించి “పునరుత్థానమును జీవమును నేనే” అన్న రక్షకుణ్ణి గురించిన నిశ్చయత మనకున్నది. క్రీస్తును గూర్చి ఆయన ప్రేమను గూర్చి మన జ్ఞానంలో దేవుని రాజ్యం మన మధ్యనే ఉంది. ప్రసంగాల్నోలు పాటల్నోలు క్రీస్తు మనకు వెల్లడయ్యాడు. ఆధ్యాత్మిక విందు సమృద్ధిగా ఏర్పాటైన మన ముందున్నది. గొప్ప మూల్యం చెల్లించి ఏర్పాటు చేసిన పెండ్లి వస్త్రం ప్రతీ ఆత్మకు ఉచితంగా వస్తుంది. క్రీస్తు నీతిని, విశ్వాసమూలంగా నీతిమంతులుగా తీర్పు పొందాన్ని దేవుని వాక్యంలోని సమున్నతమైన, ప్రశస్తమైన వాగ్దానాల్ని క్రీస్తు ద్వారా తండ్రి సముఖంలోకి ప్రవేశాన్ని పరిశుద్దుత్మా ఆదరణను, దేవుని రాజ్యంలో నిత్య జీవి నిశ్చయతను గూర్చిన సత్యాల్ని దేవుని సేవకులు మనకు అందించారు. ఆ గొప్ప పరలోక విందును ఏర్పాటు చెయ్యటంలో తాను చేసిన దానికన్నా దేవుడు మనకింకేమి చెయ్యగలడు? COLTel 270.1

మాకు ఆజ్ఞాపించిన పరిచర్యను మేము నిర్వర్తించాం. అని పరిచార చేసే దూతలు పరలోకంలో చెప్పటం జరుగుతుంది. మేము దుష్టదూతల సైన్యాన్ని వెనక్కు నెట్టివేశాం. మానవుల ఆత్మల్లోకి ప్రకాశాన్ని వెలుగును పంపి యేసులో దేవుని ప్రేమ జ్ఞాపకాన్ని పునరుజ్జీవింపచేసాం. వారి దృష్టి క్రీస్తు సిలువ మీద నిలిపాం. దేవుని కుమారుణ్ణి సిలువ వేసిన పాపం తాలూకు స్పృహ వారి మనసుల్ని తీవ్రంగా కదిలించింది. వారికి తమ పాప స్పృహ వారి మనసుల్ని తీవ్రంగా కదిలించింది. వారికి తమ పాప స్పృహ కలిగింది. మారు మనస్సు దిశలో తాము వేయవాల్సిన అడుగుల్ని గ్రహించారు. వారుసువార్త శక్తిని అనుభవపర్వకంగా గ్రహించారు. దేవుని ప్రేమా మాధుర్యాన్ని రుచి చూచిన వారి హృదయాలు ప్రేమతో నిండాయి. వారు క్రీస్తు ప్రవర్తన సౌందర్యాన్ని చూసారు. అనేకుల విషయంలో అది వ్యర్ధమయ్యింది. వారు తమ అభ్యాసాల్ని ప్రవర్తనను వదులుకోవటానికి సిద్ధంగా లేరు. పరలోక వస్త్రాలు ధరించటానికి వారు తమ లౌకిక వస్త్రాలు తీసు వేయటానికి సమ్మతంగా లేదు. వారి హృదయాలు దురాశతోనిండి ఉన్నాయి. వారు దేవుని కన్నా తమ లోక స్నేహాల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. COLTel 270.2

అంతిమ తీర్మానం జరిగే దినం గంభీరంగా ఉంటుంది. ప్రావచనిక దర్మశనంలో అపొస్తలుడగు యోహాను దాన్ని ఇలా వర్ణిస్తున్నాడు: “ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని. భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను.వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడి యుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను.మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి “. ప్రక 20:11, 12. COLTel 271.1

ఆ దినానమనుషులు నిత్యత్వంలో ముఖాముఖి నిలబడినప్పుడు గతం విషాదభరితంగా ఉంటుంది. యావజ్జీవితం యాధాతథంగా ప్రత్యక్షమౌతుంది. లోక వినోదాలు, సిరిసంపదలు, గౌరవ ప్రతిష్టలు, అప్పుడు ముఖ్యంగా కనిపించవు. తాము తృణీకరించిన నీతి మాత్రమే విలువగలదని మనుషులు అప్పుడు గ్రహిస్తారు. తాము సాతాను మోసాలు ఆకర్షణలకు లోనై తమ ప్రవర్తనల్ని ఏర్పర్చుకున్నామని గ్రహిస్తారు. వారు ఎన్నుకునే వస్త్రాలు ఆ ప్రథమ భ్రష్టుడికి విశ్వసనీయతను ప్రకటించే బెడ్జి అప్పుడు వారు తమ ఎంపిక పర్యవసానాన్ని చూస్తారు. దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించటమంటే ఏంటో తెలుసుకుంటారు. COLTel 271.2

నిత్యత్వానికి సిద్ధపడటానికి భవిష్యత్తులో కృపకాలం ఉండదు. ఈ జీవితంలోనే మనం క్రీస్తు. నీతి వస్త్రాన్ని ధరించాలి. తన ఆజ్ఞలకు విధేయులై నివసించే వారి కోసం యేసు సిద్ధం చేస్తున్న గృహానికి తగిన ప్రవర్తనల్ని నిర్మించుకోవటానికి ఇదే మనకున్న ఒకే అవకాశం. COLTel 272.1

మన కృపకాల దినాలు వేగంగా ముగింపుకి వస్తున్నాయి. అంతం సమీపంలో ఉంది. “మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము ఆకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్లు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుండి.”అన్న హెచ్చరిక మనకు వస్తున్నది. లూకా 21:34 అది వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండేందుకు జాగ్రత్తపడండి. రాజు విందులో మీరు పెండ్లి వస్త్రం లేకుండా ఉండకుండేటట్లు జాగ్రత్త పడండి. COLTel 272.2

“మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.“తాను దిగంబరుడుగా సంచిరించు చున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉ ండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు'. మత్త 24:44; ప్రక 16:15 COLTel 272.3