యుగయుగాల ఆకాంక్ష

7/88

6—“మేము ఆయన నక్షత్రము” చూశాం

“రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేల్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి - యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి.” DATel 40.1

తూర్పు జ్ఞానులు తత్వ జ్ఞానులు. వారు పలుకుబడి గల పెద్ద తరగతికి ఆ జాతి ప్రజల్లో మిక్కిలి ధనవంతులు విద్యావంతులు. ప్రజల అజ్ఞాన్నాన్ని సొమ్ము చేసుకున్నవారు వీరిలో చాలామంది ఉన్నారు. రుజువర్తనులు, ప్రకృతిలో వ్యక్తమౌతున్న దైవ కార్యాల్ని అధ్యయం చేసినవారు, తమ విశ్వసనీయతకు జ్ఞానానికి సన్మానం పొందిన వారూ ఉన్నారు. యేసు వద్దకు వచ్చిన జ్ఞానులు ఈ కోవకు చెందినవారు. DATel 40.2

అన్యమత అంధకారంలో దేవుని వెలుగు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది. ఈ జ్ఞానులు ఆకాశనక్షత్రాల్ని అధ్యయనం చేస్తూ వాటి తేజో మార్గాల్లో మర్మాల్ని గ్రహించడానికి చేసిన ప్రయత్నాల్లో వారు సృష్టికర్త మహిమను వీక్షించారు. మరింత స్పష్టమైన జ్ఞానాన్ని అన్వేషిస్తూ వారు హెబ్రీయుల లేఖనాలపై దృష్టి కేంద్రీంకరించారు. తమ సొంత దేశంలోనే ప్రవచన జ్ఞాన నిధులు ఒక దైవ బోధకుడి ఆగమనాన్ని ప్రవచిస్తున్నాయి. ఒకప్పుడు దైవ ప్రవక్త అయినప్పుటికీ బిలాము మాంత్రికులకు చెందినవాడు. ఆతడు పరిశుద్ధాత్మ ప్రేరణవలన ఇశ్రాయేలు ఉజ్వల భవితను మెస్సీయా ఆగమనాన్ని ప్రవచించాడు. అతడి ప్రవచనాలు సాంప్రదాయకంగా శతాబ్దం నుంచి శతాబ్దానికి సంక్రమిస్తూ వచ్చాయి. పాతనిబంధనలో రక్షకుని ఆగమనం మరింత స్పష్టంగా వెల్లడయ్యింది. ఆయన రాకడ సమిపిస్తోంది. లోకమంతా ప్రభువునుగూర్చిన జ్ఞానంతో నిండుతోందని తెలుసుకుని జ్ఞానులు ఉత్సాహభరితులయ్యారు. DATel 40.3

బేల్లెహేము కొండలు దేవుని మహిమతో నిండిన ఆ రాత్రి ఆకాశంలో ఒక విచిత్రమైన వెలుగును జ్ఞానులు చూశారు. ఆ వెలుగు పోయిన అనంతరం ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది. ఆది ఆకాశంలో నిలిచింది. అది స్థిరంగా ఉన్న నక్షత్రం గాని గ్రహంగాని కాదు. ఆ ఘటన వారిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఆ నక్షత్రం దూరంలో ఉన్న దేవదూతల సమూహాం. కాని జ్ఞానులకు అది తెలియలేదు. అయినా ఆ నక్షత్రం తమకు ప్రత్యేక వర్తమానానిస్తోందని భావించారు. యాజకుల్ని తత్వజ్ఞానుల్ని సంప్రదించారు. ప్రాచీన దాఖలాల్ని పరిశోధించారు. బిలాము ప్రవచనం ఇలా చెబుతుంది “నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును.” సంఖ్యా 24:17. ఈ విచిత్ర నక్షత్రం వాగ్దత్త రక్షకునికి ముంగుర్తుగా వచ్చిందా? దేవుడు పంపిన సత్యకాంతిని జ్ఞానులు స్వాగతించారు. ఇప్పుడది వారిపై తేజోవంతమైన కాంతిరేఖల్ని ప్రసరించింది. నూతనంగా జన్మించిన యువరాజును వెదక్కుంటూ వెళ్లాల్సిందిగా కలల ద్వారా వారికి ఆదేశం అందింది. DATel 41.1

దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము “ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక” (హెబ్రీ 11:8) విశ్వాసంతో వెళ్లినట్లు విశ్వాసమూలంగా మేఘ స్తంభాన్ని వెంబడించి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత్త దేశానికి వెళ్లినట్లు ఈ అన్యులు వాగ్రత్త రక్షకుణ్ని కనుగోడానికి బయల్దేరి వెళ్లారు. తూర్పుదేశం విలువైన వస్తువులకు నిలయం. జ్ఞానులు వట్టి చేతులతో బయలుదేరలేదు. గౌరవసూచకంగా రాజులకు ఉన్నతాధికారులకు కానుకలు సమర్పించడం ఆచారం. భూమండలంలోని కుటుంబాలన్ని ఎవరి వలన దీవెనలు శుభాలు పొందనున్నాయో ఆ ప్రభువుకు సమర్పించడానికి జ్ఞానులు తమ దేశంలో లభించే మిక్కిలి విలువైన కానుకలు తీసుకువెళ్లారు. నక్షత్రాన్ని అనుసరించి వెళ్లేందుకు వారు రాత్రిపూట ప్రయాణం చేశారు. సంప్రదాయ సంబంధిత సూక్తులు చెప్పుకుంటూ తాము వెదకు తున్న మెస్సీయాను గూర్చిన ప్రచనాల్ని చర్చించుకుంటూ ఈ ప్రయాణికులు ప్రయాణం సాగించారు. విశ్రాంతి తీసుకోవడానికి ఆగినప్పుడల్లా ప్రవచనాల్ని పరిశోధించారు. తమను నడిపిస్తున్నది దేవుడేనన్న దృఢనమ్మకం వారికి ఏర్పడింది. బహిర్గతమైన గుర్తుగా వారి ముందు నక్షత్రం ఉండగా వారికి అంతర్గతంగా పరిశుద్ధాత్మ నిదర్శనంకూడా ఉంది. పరిశుద్ధాత్మ వారి విశ్వాసాన్ని పటిష్టపర్చి వారిలో నిరీక్షణను రేకెత్తించాడు. అది దీర్ఘ ప్రయాణ మైనప్పటికీ వారికి ఎంతో ఆనందాన్నిచ్చింది. DATel 41.2

వారు ఇశ్రాయేలు దేశం చేరుకున్నారు. ఒలీవల పర్వతం దిగుతున్నప్పుడు వారి ముందు యెరూషలేము ఉంది. వారిని అంతవరకు నడిపించిన నక్షత్రం దేవాలయం మిద నిలిచి కొంత సేపు అయిన తర్వాత అదృశ్యమయింది. ఆతృతగా అడుగులు వేసుకుంటూ మెస్సీయా జననాన్ని అందరూ ఆనందంగా స్తుతిస్తారని భావిస్తూ సాగారు. అయితే వారి వాకబు వ్యర్ధమైయ్యింది. పరిశుద్ద పట్టణంలో ప్రవేశించి వారు దేవాలయానికి వెళ్లారు. కొత్తగా జన్మించిన రాజు గురించి అక్కడి వాళ్లకు తెలియపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది. వారి ప్రశ్నలు ఆనందాన్ని కలిగించడం లేదు. చెప్పాలంటే ఆ ప్రశ్నలు వారికి ఆశ్చర్యం ద్వేషభావం కలిగించాయి. DATel 42.1

యాజకులు సంప్రదాయాల్ని విశ్లేషిస్తోన్నారు. వారు తమ మతాన్ని తమ భక్తి ప్రపత్తుల్ని ఉగ్గడించి గ్రీకుల్ని రోమియుల్ని అన్యులుగాను అందరికన్నా ఎక్కువ పాపులుగాను ఖండిస్తోన్నారు. జ్ఞానులు విగ్రహారాధకులు కారు. దైవారాధకలమని చెప్పుకునే వారికన్నా దేవుని దృష్టిలో వారు ఉన్నతంగా నిలిచి ఉన్నారు. అయినా యూదులు వారిని అన్యజనులుగా పరిగణిస్తున్నారు. పరిశుద్ధ లేఖనాల పరిరక్షకులుగా నియమితులైన వారు కూడా జ్ఞానుల ప్రశ్నలకు సానుభూతిగా స్పందించలేదు. DATel 42.2

జ్ఞానుల రాకను గురించి యోరూషలేము అంతటా ప్రచారమయ్యింది. వారు వచ్చిన విచిత్ర కార్యం సందర్భంగా ప్రజల్లో ఉద్రేకోత్సాహాలు చోటు చేసుకున్నాయి. ఆ వార్త హేరోదు రాజభవనానికి చేరింది. యుక్తిపరుడైన ఈ ఎదోమీయుడు తనకో ప్రత్యర్ధి జన్మించాడన్న వార్త విని ఉలిక్కిపడ్డాడు. సింహాసనం సంపాదించడానికి అతడు లెక్కకు మించిన హత్యలు చేశాడు. విదేశీయుడు కావడంతో పాలిత ప్రజలు అతణ్ని ద్వేషించారు. రోమా అభిమానమే అతడికి భద్రత. అయితే ఈ కొత్త యువరాజు హక్కు మరింత ఉన్నతమైంది. ఆయన రాజ్యపాలనకు పుట్టాడు. DATel 42.3

యాజకులు ఈ పరదేశులతో కలసి ప్రజలలో అలజడిరేపి తనను గద్దె దించటానికి కుట్ర చేస్తున్నారని హేరోదు అనుమానించాడు. కాని తన అనుమానాన్ని కప్పిపుచ్చుకుని వారి ఎత్తుడగల్ని తన యుక్తితో చిత్తు చెయ్యాలనుకున్నాడు. ప్రధానమైన యాజకుల్ని శాస్త్రుల్ని పిలిపించి మెస్సీయా జన్న స్థలాన్ని గూర్చి తమ పరిశుద్ధ గ్రంథాలు ఏంచెబుతోన్నాయని ప్రశ్నించాడు. DATel 43.1

పరదేశుల విజ్ఞప్తి మేరకు ఈ సింహాసన దొంగ మనవి యూదు ప్రబోధకుల ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టింది. వారు ప్రవచన గ్రంథాల్ని ఉదాసీనంగా తిరగవేయడం అనుమానుస్తుడైన ఆ నియంతకు ఆగ్రహం పుట్టించింది. గ్రంథాలు జాగ్రత్తగా పరిశోధించి తమకు రానున్న రాజు జన్మస్థలాన్ని ప్రకటించాల్సిందిగా గొప్ప అధికారంతో రాజు వారికి ఆజ్ఞాపించాడు. ” అందుకు వారు - యూదయ బేబ్లె హేములోనే; ఏలయనగా DATel 43.2

యూదయ దేశపు బేల్లె హేమా
నీవు యూదా ప్రధానులలో
ఎంతమాత్రమును అల్పమైనదానవుకావు;
ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి
నీలోనుండి వచ్చును.
అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి.”
DATel 43.3

హేరోదు ఇప్పుడు జ్ఞానుల్ని ఓ ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించాడు. అతడి హృదయంలో ఆగ్రహాం భయం తుపానులా చెలరేగుతున్నాయి. కాని పైకి ప్రశాంతంగా కనిపిస్తూ ఆ పరదేశుల్ని మర్యాదగా స్వీకరించాడు. తమకు నక్షత్రం ఎప్పుడు కనిపించిందని వారిని ప్రశ్నించి క్రీస్తు జనన వార్తకు సంతోషిస్తున్నట్లు చెప్పాడు. తన సందర్శకుల్ని ఇలా ఆదేశించాడు, “మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానమును తెండి” అని బేల్లెహేముకు వెళ్ళడానికి వారిని పంపివేశాడు. DATel 43.4

యెరూషలేములోని యాజకులు పెద్దలు క్రీస్తు జననం విషయంలో తాము నటిస్తున్నంత అజ్ఞానులు కారు. గొర్రెల కాపురులు జ్ఞానులు తెచ్చిన వార్తల్ని విశ్వసించిడం జరిగితే అవి యాజకులు రబ్బీల అధికారాన్ని విశ్వస నీయతను దెబ్బతీసేవి. తామే దేవుడిచ్చి సత్యాన్ని విశదీకరించగలవారమంటూ వారు చెప్పుకొనేది అబద్ధమని తేలేది. ఈ ఉద్దండ గురువులు ఒక మెట్టు దిగివచ్చి తాము అన్యులుగా వ్యవహరించే వీరి ఉపదేశం పొందరు. దేవుడు తమను పక్కన పెట్టి అజ్ఞానులైన కాపరులకు సున్నతి లేని అన్యజనులకూ ఆ వార్త తెలపడం వాస్తవం కాదన్నారు. హేరోదు రాజును యెరూషలేము ప్రజల్ని ఉత్సాహంతో నింపుతున్న నివేదికల పట్ల ద్వేషం ధిక్కారం ప్రదర్శించాలని వారు నిశ్చయించికున్నారు. ఈ వార్తలు నిజమో కాదో తెలుసుకోడానికి వారు బేత్లో హేముకి వెళ్లడానికి కూడా ఇష్టపడలేదు. యేసు విషయమై ఆసక్తి మతమౌఢ్యంతో కూడిన ఉద్వేగమేనని వారు ప్రజల్ని నమ్మించారు. యాజకులు రబ్బీలు క్రీస్తును తిరస్కరించడం ఇక్కడ ప్రారంభమయ్యింది. ఇక్కడ నుంచి వారి అహంకారం మంకుతనం పెరిగి రక్షకుని పట్ల స్థిరమైన ద్వేషంగా మారింది. దేవుడు అన్యజనులకు తలుపు తెరుస్తుంటే యూదులు తమకు తెరచి ఉన్న తలుపును మూసుకుంటున్నారు. DATel 44.1

జ్ఞానులు యెరూషలేము నుంచి వెళ్లిపోయారు. వారితో ఎవరూ వెళ్లలేదు. వారు ఆ పట్టణ గుమ్మాలు దాటుతున్నప్పుడు చీకటి పడుతోంది. కాని నక్షత్రం మళ్లీ కనిపించడంతో వారి ఆనందానికి అంతులేదు. అది వారిని బేల్లె హేముకు నడిపించింది. యేసు జన్మకు సంబంధించి కాపరులకు తెలిసిన దీన పరిస్థితులు సమాచారం జ్ఞానులకు తెలియదు. దీర్ఘ ప్రయాణానంతరం యూదు నాయకుల వద్దకు వెళ్ళగా వారు చూపిన ఉదాసీతకు జ్ఞానులు నిరాశ చెందారు. యెరూషలేములో ప్రవేశించినప్పుడు వారికున్న విశ్వాసం వారు యెరూషలేము నుంచి వెళ్లపోయినప్పుడు లేదు. బేల్లె హేములో కొత్తగా జన్మించిన రాజుకు రాజ భటులు కావలికాయడం వారికి కనిపించలేదు. లోకంలో ఖ్యాతిగాంచిన వారెవ్యరూ ఆయన పక్కలేరు. ఆయన తలిదండ్రులు విద్యలేని పేద శ్రామికులు. వారే ఆయనకు భటులు. “యాకోబు గొత్రపు వారిని ఉద్దరించు” వాడని “ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించు” వాడని “అన్యజనులకు వెలుగైయున్నవాడు భూదిగంతములవరకు ... రక్షణకు సాధన”మైనవాడు అని ఎవరిని గురించి రాయడం జరిగిందో ఆయన ఈయన అయి ఉంటాడా అన్న సందేహం కలిగింది. యెషయా 4:6. DATel 44.2

“వారు... యింటిలోనికి వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి.” ఆయన దీన ఆకారం కింద దేవత్వం ఉనికిని వారు గుర్తించారు. ఆయనను రక్షకుడుగా గుర్తించి తమ హృదయాల్ని ఆయనకు సమర్పించారు. ఆనాదట “బంగారమును సాంబ్రాణిని బోళమును” కానుకలుగా ఆయనకు అర్పించారు. వారి విశ్వాసం ఎంత గొప్పది! తూర్పు జ్ఞానుల విషయంలో, అనంతరం రోమా శతాధిపతి విషయంలోలాగ “ఇశ్రాయేలులో నెవనికైనను నే నింత విశ్వాసమున్నట్టు చూడలేదు” అని చెప్పవచ్చు. మత్తయి 8:10. DATel 45.1

యేసు విషయంలో హేరోదు దుస్తంత్రాన్ని జానులు పసికట్టలేదు. వచ్చిన పని ముగిసిన తర్వాత యెరూషలేముకు తిరిగి వెళ్లడానికి సన్నద్ధమయ్యారు. తమ విజయాన్ని గూర్చి హేరోదుకు చెప్పడానికి వెళ్లాలనుకున్నారు. అయితే అతనితో ఇక ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని ఒక కలలో దేవుడు వారిని హెచ్చరించాడు. యెరూషలేముకు వెళ్లకుండా వేరేమార్గాన వారు తమ గృహాలకు వెళ్లిపోయారు. DATel 45.2

అలాగే మరియతోను శిశువుతోను కలిసి యోసేపును ఐగుప్తుకి పారిపోవలసిందిగా దేవుడు హెచ్చరించాడు. దేవుని దూత ఇలా అన్నాడు, “హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక.... నేను నీతో తెలియజెప్పువరకు అక్కడే యుండుము. ” ఆ ప్రకారమే మరింత భద్రతకోసం వారు రాత్రిపూట ప్రయాణమై వెంటనే ఐగుప్తుకు వెళ్లాడు. DATel 45.3

తన కుమారుడి జనన వార్తను జ్ఞానుల ద్వారా దేవుడు యూదు జాతి దృష్టికి తెచ్చాడు. యెరూషలేములో వారు వాకబు చేయడం, ప్రజల్లో ఆసక్తి కలగడం, హేరోదులో ఈర్య పుట్టడం, అది యాజకులు రబ్బీలపైకి ఒత్తిడి తేవడం - ఇవన్నీ మెస్సీయాను గూర్చిన ప్రవచనాల పైన, ఇప్పుడు చోటుచేసుకున్న మహత్తర సంఘటన పైన ప్రజల దృష్టిని నిలిపాయి. DATel 45.4

దేవుని సత్యకాంతిని కనపడకుండా మూసివేయడానికి సాతాను కృతనిశ్చయుడై ఉన్నాడు. రక్షకుణ్ని నాశనం చెయ్యడానికి తన శక్తియుక్తుల్ని వినియోగించాడు. అయితే ఎన్నడూ కునుకని నిద్రించని దేవుడు తన ప్రియకుమారుణ్ని కాపాడూ వచ్చాడు. ఇశ్రాయేలుకు మన్నాను కురిపించినవాడు, కరవుకాలంలో ఏలీయాను పోషించినవాడు, మరియకు యేసుకు అన్యదేశంలో ఆశ్రయం కల్పించాడు. ఒక అన్యదేశం నుంచి వచ్చిన జ్ఞానులు కానుకల ద్వారా ఐగుప్తు ప్రయాణానికి, ఆ పరాయి దేశంలో వారు ఉండడానికి అవసరమైన ద్రవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. DATel 46.1

రక్షకుడికి స్వాగతం పలికిన వారిలో జ్ఞానులు ప్రధములు. వారి కానుక ఆయన పాదాల వద్ద పెట్టిన మొదటి కానుక. ఆ అర్పణ ద్వారా పరిచర్య చెయ్యడానికి వారికి కలిగిన అవకాశం అపూర్వం. ప్రేమించే హృదయం సమర్పించే కానుకను గౌరవించడానికి దేవుడు ఆనందిస్తాడు. ఆయన సేవలో దానికి గొప్ప సామర్థ్యాన్నిస్తాడు. మనం మన హృదయాల్ని యేసుకు సమర్పించుకుంటే మన కానుకల్ని కూడా ఆయన వద్దకు తెస్తాం. మన బంగారాన్ని మన వెండిని మిక్కిలి విలువైన మన లౌకిక సంపదల్ని ఉన్నతమైన మన మానసిక, ఆధ్యాత్మిక వరాల్ని మనల్ని ప్రేమించి మనకోసం తన్నుతాను అర్పించుకున్న ఆ ప్రభువుకి సమర్పిస్తాం. DATel 46.2

జ్ఞానుల తిరిగి రాకకు హేరోదు యెరూషలేములో ఆశగా ఎదురుచూస్తున్నాడు. కాలం గడిచి పోతున్నా వారు రాకపోవడంతో అతడిలో సందేహాలు సంశయాలు పుట్టుకొచ్చాయి. మెస్సీయా జన్మస్థలాన్ని సూచించడానికి రబ్బీల అయిష్టత తన దురాలోచనను వారు పసిగట్టినట్లు, అందుకే జ్ఞానులు తనను తప్పించుకుని వెళ్లిపోయినట్లు ఊహించుకున్నాడు. అది గుర్తుకు తెచ్చుకుని ఉగ్రుడయ్యాడు. యుక్తి పరాజయం పొందింది. ఒక్క దండోపాయమే మిగిలింది. ఈ చిన్నారి రాజును ఒక సాదృశ్యం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు హేరోదు. సింహాసనం మీద ఒక రాజును కూర్చోపెట్టడానికి చేసే ప్రయత్నంలో తమకేమి జరుగుతుందో అహంకారులైన యూదులు గుర్తించాలన్నది అతడి భావన. DATel 46.3

రెండేళ్లలోపు వయసుగల పిల్లల్ని చంపడానికి ఆదేశాలతో సైనికుల్ని బేబ్లె హేముకి వెంటనే పంపాడు. దావీదు పట్టణంలోని ప్రశాంతమైన గృహాలు ఆ భయంకర ఊచకోతను వీక్షించాయి. దీనికి ఆరువందల సంవత్సరాలు ముందే ప్రవక్తకు ఈ దృశ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. “రోమాలో అంగలార్పు వినబడెను. ఏడ్పును మహరోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పుపొందనొల్లక యుండెను.” DATel 46.4

ఈ విపత్తు యూదులు చేజేతుల చేసుకున్నదే. వారు దేవుని ముందు నమ్మకంగాను వినయమనసుతోను నడుచుకున్నట్లయితే రాజు ఆగ్రహం తమకు హని కలిగించకుండా దేవుడు చక్రం తిప్పేవాడు. అయితే వారు తమ పాపాల కారణంగా దేవునికి దూరమయ్యారు. తమకు కాపుదల నిచ్చే ఒకే ఒక సాధనమైన పరిశుద్ధాత్మను వారు నిరాకరించారు. దేవుని చిత్నాన్ని అనుసరించాలన్న కోరికతో లేఖనాల్ని పఠించలేదు. తమ్మును ఘనపర్చి తక్కిన జాతుల ప్రజలందరినీ దేవుడు తృణీకరించాడని తాము భాష్యం చెప్పుకోగల ప్రవచనాల కోసం వారు అన్వేషణ జరిపారు. మెస్సీయా రాజుగా వచ్చి తన శత్రువుల్ని జయించి తన ఉగ్రతతో అన్యులను అణగదొక్కుతాడని వారు హెచ్చులు చెప్పారు. ఈ విధంగా వారు తమ పరిపాలకుల్లో ద్వేషం పుట్టించారు. క్రీస్తు సేవను గురించి దుష్ప్రచారం ద్వారా రక్షకుణ్ని నాశనం చెయ్యాలన్నది సాతాను ఎత్తుగడ. ఈ కార్యం నెరవేరకపోగా అది తిరిగి వారి మీదకే వచ్చింది. DATel 47.1

హేరోదు పరిపాలనను మసగబార్చిన చివరి దురంతాల్లో ఈ క్రూర చర్య ఒకటి. అమాయకులైన చిన్నారుల ఊచకోత అనంతరం అతడు ఎవరూ ఆపడానికి వీలులేని రీతిగా తనమీదికి వచ్చిన నాశనానికి తల వంచాల్సి వచ్చింది. అతడు భయంకర మరణం మరణించాడు. DATel 47.2

ఇంకా ఐగుప్తులోనే ఉన్న యోసేపు దేవుని దూత ఆదేశం మేరకు ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చాడు. దావీదు సింహాసనానికి వారసుడుగా యేసును దృష్టిలో ఉంచుకుని యోసేపు బేబ్లె హేములో స్థిరపడ్డాలనుకున్నాడు. కాని అర్కెలాయు తన తండ్రి హేరోదు స్థానంలో యూదయదేశాన్ని పరిపాలిస్తున్నాడని తెలసుకుని క్రీస్తుకు వ్యతిరేకంగా తండ్రి పథకాన్ని కుమారుడు అమలు పర్చుతాడేమోనని భయపడ్డాడు. హేరోదు కుమారులందరిలోను అర్కెలాయు తన ప్రవర్తన విషయంలో తండ్రిని తలపించాడు. అతడు తండ్రి సింహాసనానికి వచ్చినప్పుడు యెరూషలేములో అల్లర్లు చెలరేగాయి. వేలాది మంది యూదుల్ని రోమా సైనికులు హతమార్చారు. DATel 47.3

యోసేపును మళ్లీ సురక్షితమైన స్థలానికి దేవుడు నడిపించాడు. యోసేపు తన పూర్వస్థలమైన నజరేతుకు తిరిగి వచ్చాడు. “ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు” యోసేపు తన పూర్వస్థలమైన నజరేతుకు తిరిగి వచ్చాడు. గలిలయ హేరోదు కుమారుల్లో ఒకటి ఆధీనంలో ఉంది. కాని అక్కడ యూదయలో కన్నా ఎక్కువ మంది విదేశ నివాసులున్నారు. కనుక ప్రత్యేకించి యూదులకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి తక్కువగా ఉండడంతో వారి హక్కుల అంశం అధికార గణంలో ఈర్యాద్వేషాలు పుట్టించి ఉండకపోవచ్చు. DATel 48.1

రక్షకుడు లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు లభించిన సత్కారం ఇలాంటిది. శిశువుగా ఉన్న విమోచకునికి విశ్రమించడానికి స్థలం లేదు. ఆయనకు క్షేమం లేదు. దేవుని ప్రియతమ కుమారుడు మానవ రక్షణ కృషిలో నిమగ్నుడై ఉన్నప్పుడు సైతం వారి నడుమ తన కుమారుణ్ని ఉంచలేకపోయాడు. వారిని నమ్మలేకపోయాడు. భూమిపై తన కర్తవ్యాన్ని ముగించి తాను రక్షించవచ్చిన మనుషుల చేతిలో మరణించేంత వరకు క్రీస్తు వెంట ఉండి ఆయనను కాపాడాల్సిందిగా దేవుడు తన దూతల్ని ఆదేశించాడు. DATel 48.2